Tuesday, 14 April 2015

I love thee

Oh parents oh teachers
Oh almighty I love thee
Like  Jai Hind loves Netaji
Khadi loves Ghandiji
Perfumes love to be breezy

Oh parents I love thee
I love thee and I love thee
You are to give me good treatment
You are to give me good schooling
You are to give me things I need
I owe you I owe indeed 

Oh teachers I love thee
I love thee and I love thee
You are to teach me good habits
You are to improve my knowledge
You are to elevate  my status
Bloom and glow as red lotus

Oh almighty I love  thee
I love thee and I love thee
God is love and love is God
We peas and beans you are the pod
We are the gloom and you are the glow
You are with us in wale and woe 

Oh my readers you are elite
If some thing good did I recite
And could you find any words worth
Just like tasty milk shakes pear
Not me but he is the gold smith
Who lives in me you and all

C. Rama Mohan Rao

Wednesday, 1 April 2015

Christian Conversions

Kiran Mva : I did some extensive study in and around EG Dist to find out the reasons for the conversion:


1. Mostly it is motivated by the amounts. One of my friends relative who happens to be a pastor explains that there is an 

amount of commission for the pastors to convert folks. Depends on the caste and the social status of the persons getting 

converted. Varies from 10,000 to as high as 5Lakh. 5 Lakh for brahmin and a brahmin gets the opportunity to lead a 

church and become pastor. Its a pure commission chain business like amway.

2. There are some people getting converted as they want a recognition of their own. Ive seen churches like "raju gari 

church", "shetti gaari church" and "naidu gari church". They get some amounts for maintaining and sustaining churches.


3. When someone in their clan gets converted and get some freebies, it motivates other people in their relations to try it 

out. There is no principle here, just sheer peer pressure.


4. There are certain stupid ways of mesmerizing and hypnotizing people, where they target poor and laggard students and 

tell them that their path is something different and show them all that could be achieved by conversion.


5. There is another very cinematic mode of conversion, where the christian doctors visit villages etc...and blow up simple 

ailments like fever to disproportionate levels through their medicines, send them to christian hospitals in towns and take it 

to peaks in ICU where certain fathers and pastors try to come and console them and finally one fine day cure it 

miraculously on the name of jesus and slowly convert them.


6. Free food for all people during their congregations


7. Some people are attracted by the health suvartha sabhas where they demonstrate animated ways of some incurable 

diseases being cured and they want to try themselves.


8. Other weird reason is that they give them free suit and boot which they would never wear and they say they are equal 

to anyone. 

9. They explain that Hinduism has caste system and there is only one god for them and the worst thing is that they cook 

up some shlokas telling that Vedas tell that Jesus is the god.

Tuesday, 31 March 2015

తెలుగు -- తెగులు

తెలుగు -- తెగులు 

01/04/15
ఈ రోజు vvs శర్మ గారు ఒక చిన్న మాట - సామవేదం వారి నోట వచ్చినది ప్రకటించినారు.
దానికి వారి మాటలు , నామాటలు జోడించి ఈ క్రింద ప్రచురించు చున్నాను.
ప్రశ్న : "గురువుగారు! అచ్చ తెలుగంటే ఏమిటి?"
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు : "ఇప్పటి తెలుగు వారికి అర్థంకానిది నాయనా!"
vvs శర్మ గారి మాట : తమిళులు రైల్లో పక్కవారికి తమిళం వస్తుందని తమిళంలో పలకరిస్తారు. తెలుగు వాళ్ళు పక్కవాళ్ళకి రాదు 
అని ఊహించుకుంటారు.మద్రాసులో అరవం నేర్చుకున్నారు, హైద్రాబాదు వెళ్ళి నాలుగు ఉర్దూ పదాలు నేర్చుకున్నారు. 
కాన్వెంటుకి వెళ్ళి బట్లరు ముక్కలు ఒంట పట్టించుకున్నారు. సినిమాలుచూచి సుత్తి, కేక, కొత్త జాతీయాలు సృష్ణ్టించారు. ఆత్మ 
న్యూనతాభావం (inferiority complex) అనుకుంటాను. ఆత్మ విశ్వాసం ఉండాలి. భాషపై అభిమానం ఉండాలి. ఇవి ఇంట్లో నేర్పాలి.
నాలుగు నా మాటలు : శర్మగార్లుభయులు చెప్పిన మాటలు అక్షర సత్యములు. కర్నాటక,తమిళనాడు, కేరళ రాష్ట్రములలోవారి 
వారిమాతృభాష తప్పనిసరి. మనపూర్వులు కొందరు తమ పేరుపలుకుబడి కొరకు కంకణము మరీ వాడుకభాష అన్న పేరుతో 
ఈభాషను నాశనముచేయుటకు నాంది పలికినారు. vvs శర్మగారుచెప్పినట్లుగా దిశానిర్దేశము లేని యువత తాము మాట్లాడేదే 
తెలుగన్నభ్రమలోపడినారు. తప్పుఒకరిదికాదు. కానీ మహా పండితులైవుండికూడా తెలుగు వినాశనమునకు కట్టుకొని మరీ 
వాడుక భాష అన్న విషబీజము నాటిన వారిని తెలుగునాడు క్షమించుతుందో లేదో చదువరులవితరణకు వదులుచున్నాను.
అసలు ఈ తెలుగు పదాలకు అర్థముతెలిసిన వారు బహు తక్కువ అని నా అభిప్రాయము తుుటుము, గమి, అన్నవి
గుంపునకు పేర్లు. వేలిచెనుఅంటే వేడల గొ్ట్టెేను అని అర్థము. 
తెక్కలికాడు అంటేదొంగ అనిఅర్థము. వదచక్కేలిక అంటేకుబేరుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మ, సోకుదయ్యము అంటే గాలి, పక్కిడాల 
వేల్పు అంటే విష్ణువు, పాపతాల్పు అంటే శివుడు,. ఈవిధంగా ఈ కాలము వారికి అర్థము కాని ఎన్ని పదములైనా చెప్పవచ్చును.
ఇదీఅచ్చ తెలుగు. మరి తత్సమశబ్దములతో కూడిన తెలుగు తెలుసునా అంటే అదీ అంతంతే. ఇక తత్సమ శబ్దముల విషయానికి 
వస్తే లేలిహాన, జిహ్మగ అన్నవి పాములకున్నఅనేకమయిన పేర్లలో రెండు మాత్రమే.
ఈస్థితిలో నన్నయ , తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథ, పెద్దన మొదలయిన మహానుభావుల గ్రంథాలు తాకుటకుకూడాయోగ్యతలేని 
దయనీయమైన పరిస్థితిమనది.

ఏమిచేస్తాము. గొరగంగా మిగిలింది జుట్టు.

ఏనాటి అగ్రహారమొ
మా నాటికి మాన్యమాయె మాపని దీరన్
మీ నాటి మాన్యమాయెను
నానాటికి తీసి కట్టు నాగం భొట్టు

దారీ తెన్నులేనేలేక ఈ తీరాయెనా ...

Sastry Kv గురువు గారు అనుమతిస్తే వారి విశ్లేషణకు ఇష్టత తెలిపినా తెలుగు రాని తెలుగువాడిగా బాధ కలుగుతోంది. ఇన్నాళ్లూ నాకు 

తెలుగు బాగానే వచ్చని, శ్రీమద్భాగవతం, శ్రీ మహా భారతం లలోని పద్యాలను అర్ధం చేసుకుని ఆస్వాదించగలుగుతున్నానని భావిస్తున్న 

నాకు ఆ ప్రతిభ నాది కాదని, అంత తేలిక భాషలో రాసిన ఆ మహానుభావులదని తెలుసుకున్నాను. ధన్యవాదములు. మరి నాలాగ ఎందరో! 

ఐతే దీనికి పరిష్కారం ఏంటి?

శాస్త్రి వ్రాసిన మాటలలో అంతర్లీనమైన బాధ కనిపిస్తూ వుంది. ఎందుకో నాకు ఆ మూడు పంక్తులు చదివినందుకే మనసు ద్రవించి నాకు తోచిన 

నాలుగు మాటలు వ్రాస్తున్నాను. వాస్తవానికి నేను తెలుగులో poor ఆంధ్రము లో weak . ఈ చిన్న వాక్యములో కూడా రెండు ఆంగ్ల 

పదాలను వాడవలసి వచ్చింది. అసలు విషయానికి వస్తే నేను ఏ భాషా ప్రత్యేకముగా చదువలేదు. మల్లెలు కట్టిన దారానికి కూడా 

మంచివాసన అబ్బినట్లు నా బాల్యములో నేనున్న వీధిలో గొప్ప పండితులు వుండేవారు. వాళ్ళు ' ఏమిరా బాగున్నావా' అన్నా నాలోపల 

ఎదో ఆనందము కలిగేది. బహుశ వారి మేని నంటిన గాలి కాస్త నాకూ సోకిందేమో ! నేను 5 వ తరగతి వరకు పాఠశాలకు పోయిన  పాపాన 

పోలేదు. ఇంట్లో తల్లిలేని నాకు మా అమ్మమ్మే అమరము త్రికాండలలో  ప్రథమ కాండ మాత్రమె, ఆంద్ర నామ సంగ్రహము చదివింప  జేసేది. ఆ 

 పునాది తప్పించి నేను ప్రత్యేకముగా ఏ భాషా చదువలేదు. ఈ రోజు పాండిత్యము లేకపోయినా  నా ఆలోచనలకు అక్షర రూపము కల్పించే 

సామర్థ్యము వచ్చింది . తెలుగు కాకుండా ఐదు భాషలు  మాట్లాడ గలను. మూడు భాషలు వ్రాయగలను, నాలుగు భాషలు చదువగలను. 

ఆంగ్లములో అంతో ఇంతో ఎంతో కొంత కవిత్వము కూడా వ్రాయగలను. దయతో దీనిని స్వోత్కర్షగా భావించవద్దు. అది నా మాత్రు భాష 

గొప్పదనము.అంతయు పరమేశ్వరానుగ్రహము. నడవడి అన్నింటికీ ముఖ్యము. దానిని సాధించితే దేనినైనా సాధించవచ్చు. 


 మన గురుకులాలలో శిక్ష, విద్య అన్న రెండు భాగాలు ఉండేవి. క్రమశిక్షణ కూడా శిక్షలో ఒక భాగమే ! అసలివి మన దేశీయ విద్యా విధాన 

రథమునకు రెండు చక్రములు. T.B. మెకాలే ఇదేవిషయమే తన నివేదికలో బ్రిటీషు పార్లమెంటుకు నివేదించినాడు. శిక్ష, విద్య, 

గురుకులాలను నిర్మూలించి ఆంగ్లపాఠశాలాలను ఏర్పాటుచేయించుటలో కృతకృత్యుడైనాడు. వారికి తోడు నీడై , విలియం బెంటింక్ కు అంతే 

వాసియై మన రాజారామమోహన్ రాయ్ గారు కూడా నిలిచినారని చదివియుండినాను. అటువంటి వారి యనుగ్రహముతో మన భాషకు 

తల్లియైన సంస్కృతాన్ని ఆనాడు , మనతల్లియైన తెలుగును ఈనాడు సజీవ సమాధి చేసి చేతులు దులుపుకోన్నాము.

ఈకాలము పిల్లలకు daddy కి good morning చెప్పు. aunty కి ta ta చెప్పు . one,two, three చెప్పు ఉదయము లేస్తూనే 

చెప్పించేవి ఇవి. ఇందులో 'చెప్పు'లు తప్ప మిగిలిన  దానిలో ఎంత తెలుగు వుందో చెప్పేవారికే తెలియాలి. మనము  విచక్షణా రహితులమై 

ఎంత భావదాస్యానికి లోనవుతూవున్నామో చూడండి. US and UK are developed countries అని మనము వినియుంటాము. 

past participle అయిన developed తీసుకొన్నప్పుడు, అవి, ఎదుగుదల కారణాంతరములచే నిలిచి పోబడిన దేశములుగా 

భావించవలసి వస్తుంది. put పుట్ అయితే  but బట్  ఎందుకయ్యింది. నైఫ్ అని ఆంగ్లములో వ్రాస్తే knife వ్రాయవలె. మరి k ఎందుకో ! 

ఇటువంటివి ఆ భాషలో కోకొల్లలు.దక్షిణాది భాషలకు ద్రావిడశబ్దము తగిలించుటే కృతకముు. ప్రపంచభాష ఏదయినా సంస్కృత జన్యమేనని 

చంద్రశేఖరయతీంద్రులవారి మాట. వారి పాండిత్యము అపారము. వారొకఅనర్ఘ రత్నము. మరిమనము వారిని నమ్మము. తన మాతృభాష 

యైన తమిళము కూడా సంస్కృతజన్యమేనని నొక్కి వక్కాణించిన మహనీయులు వారు. వారికి స్వపర భేదములుండవుగదా! మనకు 

క్రిస్టియన్మిషనరీకి చెందిన కాల్డ్వెల్ మాట శిరౌధార్యము. ఆతడు కేవలము క్రైస్తవము ప్రాకజేయుటకు సృష్టించిన పదమది. ఆర్యద్రావిడసృష్టి 

చేసిన వారిలో వారు ప్రముఖులు. చెన్నపట్టణమునకు సెయింట్ థామస్ వచ్చినాదన్న కల్పిత గాధను సృష్టించి, అకుంఠితమైన భారత 

దేశమునుండి, తమిళులను, ద్రావిడ భాషలన్న పేరుతో దక్షిణాది భాషలను ,వానిని మాతృభాషలుగా గల్గిన దాక్షిణాత్యులను విభజించి 

పుణ్యము మూట కట్టుకొన్నారు. పొరుగింటి పుల్లగూర ఎట్లయినా రుచి ఎక్కువ కదా !  వారి భావానువర్తులై దేవనాయాగం వంటి 

అవకాశవాదులు 1969 లో క్రైస్తవము పుచ్చుకొని అసలు మన సనాతన ధర్మమే అబద్ధాల పుట్ట అనీ, తిరువళ్వారు సెయింట్ థామస్ వద్ద 

క్రైస్తవ తీర్థము పుచ్చుకోన్నాడని 'Was Tiruvalluvar A Christian' అన్న పుస్తకము రచించి పుణ్యము కట్టుకొన్నాడు. ఈ పుస్తకాన్ని 

ఏకంగా నాటి DMK ముఖ్యమంత్రిగారే  ఆవిష్కరించినారు. ఈ విధముగా ఒకటిగా వున్న గొలుసు లంకెలను త్రుంచి మనలను విభజించి, 

ఒకవేళ మతము మారకున్నా, మనలను తమ మతమునకు దగ్గరజేసుకొన్నారు.

నేడు మన పరిస్థితి ఏమిటంటే మన భాష పై మనకు గౌరవము లేదు, మన ధర్మము గొప్పదనమేమిటో మనకు తెలియదు. మన సంస్కృతి 

మనకందుబాటులో లేదు. కారణం మనకు తెలుగు రాదు. మనకు  వేములవాడ భీమన లోని  ఉద్దండ లీల, నన్నయలోని ఉభయ వాక్ప్రౌఢి, 

తిక్కనలోని  ఔచిత్య భావ పదబంధం, ఎర్రాప్రెగ్గడలోని  ఉక్తి వైచిత్రి  శ్రీనాథుని సీసపద్యములు, పోతన అనుప్రాసాయుతమైన అద్భుత కవితా 

శైలి, నాచన సోముని నవీన గుణ తత్వము అన్నీ ఈనాడు గాలికి ఎగిరిపోయిన ఎండుటాకులే. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ 

వ్యూహం మనకు పరబ్రహ్మ పదార్థమే ! తెలుగంటే ఏమిటో తెలియని తెలుగుజాతికి వారసులము మనము. 


మరి ఇప్పుడు మన కర్తవ్యమేమిటి?

కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. 

తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా 

అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక 

సంపదకి దూరం కావటమే. పునాది లేని భవనము అంటే కేవలము రాళ్ళు సున్నమే అన్నది గ్రహించగలిగితే తెలుగునకు ఒక 100 

సంవత్సరాల పిమ్మటనైనా తెలుగునకు పునర్వైభవము తేగలుగుతామేమో !


ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ 

అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, 

చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా?తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు 

సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. అందుకే 'తెనుగు తేనె 

ఊట తేటరా గమనించు రామమోహనుక్తి రమ్య సూక్తి' అని వ్రాసుకొన్నాను.


మనము ఇకనైనా కళ్ళు తెరిచి పిల్లలను క్రెచ్చి, ప్రీకేజీ, ఎల్కేజీ, యుకేజీ, అనిచదివించకుండా ఓపికతో లేక ఓపికచేసుకొని తల్లిదండ్రులు 

'అమరము' 'ఆంధ్రనామ సంగ్రహము' నేర్పించితే ఒకఏడాది తరువాత మెల్లమెల్లగా చిన్నచిన్నశతకాలు, రుక్మిీణీకల్యాణము, 

గజేంద్రమోక్షము, ప్రహ్లాద చరిత్రము, విదురనీతి వంటి ఘట్టాలు నేర్పించితే వారు ప్రపంచములోనిఏ భాషనైనానేర్వగలరు.

స్వస్తి.



































Wednesday, 25 March 2015

నా మాట (చి.కుం.సౌ. లక్ష్మి కొరకు ఆమె మాటల్లో)

ఇక్కడ చేరిన పెద్దలకు నమస్కారం సోదరీ సోదరులకు స్వాగతం చిరంజీవులకు ఆశీర్వాదం.
అదో మైకు అంటే ఇదో బ్రేకు అనే మనస్తత్వము నాది. దానికితోడూ వేదికనలంకరించిన వారంతా లబ్ధ ప్రతిష్ఠులు, నాకు మార్గ దర్శకులు మరియు దిశా నిర్దేశకులు. వారి ముందు నేను మాట్లాడుట ఫ్లడ్ లైట్ వెలుతురులో టార్చ్ లైట్ వేసినట్లుంటుంది. కానీ నన్ను మాట్లాడమని ప్రోత్సహించిందే వారు. పెద్దలమాట తలదాల్చి మైకు ముందుకొస్తున్నాను . మైకు మైకం లో తప్పులేవయినా మాట్లాడితే పెద్దలను క్షమింప గోరుకొంటున్నాను.
నేడెంతో సుదినం. కలలు అందరూ కంటారు. ఇదే కలే కంటాను అనేవాళ్ళు కొందరుంటారు. జీవితమంతా దానికై శ్రమించి బహు కొద్దిమంది సాకారం చేసుకొంటారు.
కృతజ్ఞత అన్నది (గ్రాటిట్యూడ్ అంటారు ఇంగ్లీషులో ) ఒక గొప్పగుణము. 7th claas కు వస్తే 6th సిలబస్ మరచి పో అనే ఈ కాలములో ఎంత ఎదిగినా తన మూలాలు మరువని, కృతజ్ఞత విడువని మావారు నాకాదర్శము.
అన్నదమ్ములగు కోటిరెడ్డి, సుబ్బారెడ్డి గార్లలో లో తమ్ముడైన తనభర్త  నిజంగానే ఒక రామునికి లక్ష్మణుడై , నందిగల సంసారమనే తోటకు కంచెయై , పంటచేనును కాపాడే మంచెయై , అందమైన చిత్రానికి కుంచె యై,మంచికి మారుపేరయిన తన భర్త స్వర్గస్థుడైతే తన బావగారిని తోడికోడలును తల్లిదండ్రులకంటే తక్కువగా భావించక తానూ పడిన కష్టములోనే సుఖము చూసుకొన్న దేవత మా 'అమ్మమ్మ' శేషమ్మ . (ఆమ్మమ్మ అని పిలువడము నా అలవాటు ) మా వారైతే ఏకంగా ఆవిడను అమ్మ అని తప్పించి నాన్నమ్మా అని కూడా పిలువరు. పెద్దగా చదువుకోకున్నా కష్టపడే కాయము ఇంటి యొక్క శ్రేయము ఆమె ధ్యేయముగా పదునైన తెలివితేటలతో బావ గారి పిల్లలను, వారి పిల్లలను, తన పిల్లలను అందరినీ అక్కున చేర్చుకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళు, అబ్బాయిల చదువులు అన్నీ 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు' 
విధముగా సక్రమముగా చేసిన స్వయంసిద్ధ ఆమె. స్వయంసిద్ధ అంటే గురువు అవసరము లేకనే తాను జీవితమునుండి పాఠాలు నేర్చుకొని రాణించిన నేర్పరి. మా వారి తండ్రి గారు అంటే మా మామగారిని వ్యవసాయములో వుంచి, తన పర అన్న తారతమ్యము లేకుండా, భూములను కాపాడజేసింది. తన కుమారుడైన , మా వెంకటరెడ్డి మామగారిని డాక్టరును జేసి, పెద్ద పారిశ్రామిక వేత్తగా చేసి  తన తరువాత మాకు నీడనిచ్చే చెట్టుగా తీర్చి దిద్దింది. మా వారిని సాకి ఆ కాలానికే PG చేయించి ఒక పెద్ద పారిశ్రామిక వేత్తగా తయారు చేసింది . పెద్దలు పెట్టిన 'శేషమ్మ' అన్న పేరు ఆమె సార్థకము చేసుకొంది.అదెట్లంటే 'మొత్తము ఈ భూమినే మోసేది శేషుడని' కదా చదివినాము. ఈవిడ కూడా మా వంశానికి శేషుడై శత్రువులు దరికి రాకుండా కాపాడింది. ఆ తల్లికి జోహారు.
ఇక నాలుగు మాటలు మా అత్త గారయిన అక్కమ్మ గారిని గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంటికి దీపం ఇల్లాలే ' అన్న మాటను అక్షరసత్యం చేసిన వ్యక్తి ఆవిడ. మావారితో నాకు పెళ్ళయినది మొదలు ఆవిడ బ్రతికినంతకాలము  అక్క గానూ అమ్మగానూ నన్ను చూసుకొందేగానీ అత్తగా ఎన్నడూ చూసిన పాపాన పోయినదిలేదు. అందుకే ఆమెకు అక్కమ్మ అన్న పేరు పెట్టినారేమో ! ఆమె ఆరోగ్యముకోరకు మావారు ఎంత ఖర్చు చేసినా ఇంకా ఏమైనా చేయమనేదానిని. ఆమె నీడలో ఇంకా వుండే అదృష్టము నాకు లేకపోయింది.
అటువంటి నిస్వార్థ జీవుల పెరుతో ఒక TRUST ను ఏర్పాటు చేసి తెలివయిన పేద పిల్లలకు సహాయము చేయ నడుము బిగించిన మా శ్రీవారు అత్యంత ప్రశంసనీయులు. భగవంతుడు ఈ ట్రస్టును దిన దిన ప్రవర్ధమానమై సంఘమునకు ప్రయోజనకరమై, చురుకైన పేదవిద్యార్థుల పాలిటి వరమై, చిరమై వర్ధిల్ల జేస్తాడు.  ఎందుకంటే మంచికి దేవుని అండ ఎప్పుడూ వుంటుంది కదా !
ఇక మా పాఠశాల - విద్య ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుతాను.

అదిగోనండీ అదియే మాబడి 
చదువుల తల్లికి నిర్మించిన గుడి 
నేర్పును మాకది చక్కని నడవడి 
కాదది బడి మా తల్లి యొడి 

అమ్మా నాన్నల పెట్టక ఆరడి 
చేయక ఎప్పుడు మాటల గారడి
బడికి పోయెదము రోజూ వడివడి
నిలువమెప్పుడూ అడుగులు తడబడి

గురు వచనములకు కట్టుబడి
పాఠము విందుము చేయక సవ్వడి
పోకుండా మేమెప్పటికీ చెడి
కాచేవారలు సురలు సుడీ

ఇది మాకత్యంత ఆప్తులు గౌరవనీయులు అయిన చెరుకు రామమోహన్ రావు గారు బడిని గురించి వ్రాసిన గేయము ఇది. విద్యార్థుల లేత హృదయాలలో ఈ భావన కలిగించుటే మా పాఠశాల ఆశయము. విద్య శిక్షలు విద్యార్థి భవిష్యత్తు అనే బండికి రెండు చక్రాలు. శిక్ష లేని విద్య తావిలేని పూవే.విద్య లేని శిక్ష చంద్రుడు లేని రాత్రే . ఈ రెంటినీ సమన్వయ పరచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాట వేయుటే మా లక్ష్యము. 

ఇంతకు మించి చెప్పడము నా శక్తికి మించిన పని అవుతుంది. అందుకని నాకు ఈ అవకాశామునిచ్చిన పెద్దలకు నమస్కరించి విరమించుకొను చున్నాను.