Tuesday, 15 September 2015

హేరంబా --- వందే వందే గజాననా

హేరంబా
హేరంబా యని ఆలపించెదను
అంబా సుత ఆరంభామునే
అక్షరమౌ నీ భిక్ష కొరకు
సంరక్షక చక్షుర్వీక్షణమ్మునకు
మనసేమో మరి మరిగే నీరది
నిలకడ లేకయే నీల్గుచున్నది
చిత్రమైన నీ చేతి చలువతో
చిత్తము నీపై చిత్తగించుమా            ||హేరంబా||
ఆగమ యోగామవేమో ఎరుగను
రాగభోగ సంరక్తుడను
నీపై రాగము నీ భోగమె, నా
కిహపర సాధనమిక ఇభవక్త్రా         ||హేరంబా||

వందే వందే గజాననా

వందే వందే గజాననా
గౌరీ ప్రియసుత గజాననా
హారతిగొని మాకలుషమెల్లను
హరియించుమయా హరుతనయా       || వందే వందే గజాననా ||

సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతిన్తుమయా             || వందే వందే గజాననా ||                                    

మాతా పితరుల పాద సేవలో
మహిమమను నాదే చూపిటివి
జగతినేల్ల కాదు శీఘ్రగమనమున
చుట్టి కొమరుని ఓడగొట్టితివి                || వందే వందే గజాననా ||

కార్య నిరతి కర్తవ్య దీక్షలో
కలకాలము మము నిలుపుమయా
గరికే పోచల గంపెడు ఆకుల
పూజలందుకొని భువిని బ్రోవుమా        || వందే వందే గజాననా ||

ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా           || వందే వందే గజాననా ||


Sunday, 13 September 2015

చాటువు - అణోరణీయాన్ మహతోమహీయాన్

 అణోరణీయాన్ మహతోమహీయాన్
“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,
హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” 
హాస్యానికి
ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార
భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి
ఆనందించండి.

“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”
పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.
మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం - - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. చూసారా! కాళిదాస కవితావైభావం. మరొక్కసారి పైశ్లోకం చదివి ఆనందించండి.

Wednesday, 9 September 2015

Health Benefits of Ragi or Finger Millet

Finger millet  also known as Ragi in India is one of the important cereals which occupies the highest area under cultivation among the small millets. The state of Karnataka is the largest producer of ragi in India. Ragi is a crop which can withstand severe drought conditions and can be easily grown throughout the year.

Nutritionally, when ragi is used as a whole grain, it is higher in protein and minerals in comparison to all other cereals and millets. It is a remarkable source of protein, making it perfect for vegetarian diets.

Finger millet contains important amino acids viz., isoleucine, leucine, methionine and phenyl alanine which are not present in other starchy meals. It has the highest amount of calcium (344 mg %) and potassium (408 mg %). Ragi is a great source of iron making it beneficial for individuals with low hemoglobin levels.

Millets also contains B vitamins, especially niacin, B6 and folic acid. Some of the health benefits of ragi are attributed to its polyphenol and dietary fiber contents. Due to its high content of polyphenols and dietary fiber ragi exhibits anti-diabetic and antioxidant and antimicrobial properties; it protects against tumors and atherosclerosis (narrowing and hardening of blood vessels). Being low in fat and gluten free, ragi is easy to digest. It is therefore, given as first foods to babies in the form of ragi porridge

Ragi for Weight Loss

Ragi contains an amino acid, Tryptophan which reduces appetite. It has a much higher amount of dietary fiber compared to white rice and other grains. It is also a low fat cereal and most of the fats are in the unsaturated form. This makes it the best choice in grains for people trying to lose weight. The bulkiness of the fibers and the slower digestion rate makes one feel fuller on fewer calories and therefore helps prevent excess caloric consumption.

Ragi for Bones

Ragi is the richest source of calcium among plant foods. Calcium along with vitamin D helps to strengthen bones. It is an excellent source of natural calcium for children and aging people. It helps in development of bones in growing children and in maintenance of bone health in adults. Thus Ragi helps to keep bone problems at bay and could reduce risk of fractures too.

Ragi for Diabetics

Regular consumption of finger millet is known to reduce the risk of diabetes mellitus and gastrointestinal tract disorders and these properties are attributed to its high polyphenol and dietary fiber content. According to research Finger Millet based diets help diabetics as they contain higher amounts of fiber over other cereals and millets. Diets based on whole finger millet have a lower glycemic response i.e. lower ability to increase blood sugar level. This has been attributed to presence of certain factors in ragi flour which lower digestibility and absorption of starch.

Ragi for lowering high cholesterol levels: Ragi contains amino acids Lecithin and Methionine which help in bringing down cholesterol levels by eliminating excess fat from Liver. Finger Millet also contains the amino acid threonine which hinders fat formation in the liver, and helps to bring down the cholesterol levels. The high fiber content of ragi also helps to manage cholesterol problems.

Ragi for Anemia

Ragi is an excellent plant source of natural Iron. Its consumption helps in Anemia. Vitamin C increases iron absorption. Sprouted ragi develops vitamin C in the process of sprouting, therefore the iron in ragi becomes more bioavailable when consumed as sprouted ragi flour or ragi malt.

Ragi for Relaxation

One amazing benefit of Ragi is that it helps in relaxing the body naturally. It is found to be beneficial in conditions of anxiety, depression, migraine and insomnia.

Ragi as a Source of Essential Amino Acids

Ragi is rich in Amino Acids vital for the body. Finger Millet contains amino acids namely Tryptophan, Threonine, Valine, Isoleucine and Methionoine. Isoleucine helps in muscle repair, blood formation, bone formation and improves skin health. Valine is an essential amino acid which facilitates metabolism and repair of body tissues. Another essential amino acid, not found in most cereals, is Methionine. It is found in Ragi and therefore makes it a complete protein food unlike other cereals and millets. The amino acid Methionine is useful in various body processes, helps in eliminating fat from the body, and is main provider of sulfur in body. Sulfur is essential for production of Glutathione which is the body’s natural and most important antioxidant.

Ragi Food Preparations

Finger millet is normally consumed in the form of flour-based foods such as roti (unleavened pancake), mudde (stiff porridge/dumpling) and ambli (thin porridge). Ragi can be used to make porridge, upma, cakes, and biscuits. Ragi flour is used to make various Indian preparations like dosas, idlis and ladoos.

‘Puttu’ is a traditional breakfast of Kerala, usually made with rice powder together with coconut and steamed in a cylindrical steamer. The same preparation is also made with ragi powder, which makes it more nutritious

Multigrain flour preparation by combining wheat and finger millet in the ratio of 7:3 (wheat: finger millet) is one of the simplest ways of incorporating ragi in the daily diet as no Indian meal is complete without the Indian style bread or roti. In the proposed blend, though the gluten content is reduced significantly, the making of chapatti is not much affected. However, the color turns a little dark. Fortification of finger millet in chapattis is very helpful in controlling glucose levels in diabetic patients efficiently.

Malted ragi grains are ground and consumed, mixed with milk, boiled water or yogurt. In southern parts of India, it is a recommended food, by doctors, for infants of six months and above because of its high nutritional content. Homemade ragi malt is one of the most popular infant foods till date.

Malting characteristics of finger millet are superior to other millets. On malting the vitamin-C is elaborated, phosphorus availability is increased, digestion is easier and amino acids are synthesized. In south India, the malted ragi flour is extensively used in preparation of weaning foods, instant mixes and beverages.

Despite finger millet’s rich nutrient profile, low cost and easy availability recent studies indicate its lower consumption in general by urban Indians. Obesity has become a matter of health concern in India. Unhealthy foods have increasingly become a part of the food choices made by youth. Large populations of children in the country are malnourished and are deficient in calcium and protein. The millet ragi then could be the answer to all the above problems relating to nutrient deficiencies. Ragi is truly a wonder cereal grain and should be consciously incorporated in the diets in one way or the other.

Wednesday, 26 August 2015

ZERO

Dear Vsudeva Rao Garu,
To understand vedic texts is, in fact, above our knowledge. It is actually unlimited as you too know it. Great Rishis ,scholars could realise certain things and with all selflessness and without any prejudice they propagated the entire knowledge they absorbed. Most of such great people never cared to mention to which period they belong.Of course we can come to know birth dates of certain people like Aryabhata Bhaskara-1 Bhaskara_2 etc.Veda is 'Apourusheya' and Purusha's Niswasa. Hence we can not adjudge the time by any measure. More over veda was not segregated before Veda Vyasa in Dwapara yuga. Hence evey science is contained in Veda from time immemorial. It is just taking out butter from milk.
The concept of Shunya, or zero, or void, was originally conceived as the symbol of Brahman, expressing the sum of all distinct forms. The symbol of zero and the decimal system of notation is described in the Atharvaveda. it describes how the number increases by 10 by writing zero in front of it. While there is no explicit mention of zero, it must have been common knowledge based on how it is used.
In fact, the concept of shunya was not just mathematical or scientific, but is deeply rooted in all branches of thought - especially metaphysics and cosmology. Shunya is the transition point between opposites, it symbolizes the real balance between divergent tendencies. Most ancient mathematicians defined zero as the sum of two equal and opposite quantities. Zero produces all figures, but is itself not limited to a certain value. Zero is the primary or final reservoir of all single numbers. The symbol of zero and the decimal system of notation is described in the Atharvaveda. It describes how the number increases by 10 by writing zero in front of it.
The concept of zero is referred to as shunya in the early Sanskrit texts and it is also explained in the Pingala’s Chandah Sutra (200 AD). In the Brahma Phuta Siddhanta of Brahmagupta (400-500 AD), the zero is lucidly explained. The Hindu genius Bhaskaracharya proved that x divided by 0 = infinity and that infinity however divided remains infinity. This concept was recognized in Hindu theology millennia earlier. The earliest recorded date for an inscription of zero (inscribed on a copper plate) was found in Gujarat (585 – 586 AD). Later, zero appeared in Arabic books in 770 AD and from there it was carried to Europe in 800 AD.
This is the little I know. I opted for English just for the reason that I have to use the key board too much to get the desired telugu words. More over I am poor at typing. Please reply if possible.

Friday, 21 August 2015

చౌద్వీఁ క చాంద్ హో

చౌద్వీఁ క చాంద్ హో 

చౌద్వీఁ క చాంద్ హొ అన్న ఈ పాటలో సూర్య చంద్రులు వున్నారు. అంటే వారున్నంతకాలము ఈ పాట భూతలము పై వుండితీరుతుంది. ఈ పాట 'చౌద్వీఁ క చాంద్ సినిమా లొనిదే! దీనిని నిర్మించిన వ్యక్తి గురుదత్. ఆ కాలములో ఆయన పేరు వినని వారు ఆయన సినిమాలు చూడనివారు వుండరు. ఆయన అసలు పేరు తెలిసినవారు అరుదు. ఆయన అసలు పేరు వసంతకుమార్ శివశంకర్ పదుకొనే . (9 జులై 1925 - 10 అక్టోబర్ 1964 ) 1950, 1960 దశకములలో చలనచిత్ర కళాఖండములను నిర్మించిన వారిలో అగ్రగణ్యుడు. ఆయన నిర్మించిన ఒక్కుక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యము. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహబ్ బీబీ ఔర్ ఘులాం, చౌద్విఁ క చాంద్ మకుటాయమానములు.  ఇందులో కాగజ్ కె ఫూల్ పూర్తిగా మట్టి కరచిన చిత్రము. కానీ గొప్పదనమేమిటంటే ప్యాసా కాగజ్ కె ఫూల్ సినిమాలు greatest films of all time, గా Time magazine's "All-Time" 100 best movies లో చేరినాయి.  Sight & Sound critics' and directors' poll, లో ప్రపంచములోని అతి గొప్ప దర్శకులలో గురుదత్ స్థానము సంపాదించినాడు.  ఆయనను గూర్చి తెలిసినవారు ఆతనిని "India's Orson Welles" అంటారు. CNN వారి సర్వేక్షనములో ఈయన దేశములోని అత్యుత్తమ మైన 25 మంది నటులలో ఒకనిగా ఎన్నికయినాడు.

కాగజ్ కె ఫూల్ సినిమా వరకు ఈయన తీసిన సినిమాలకు S.D. బర్మన్ (R.D. బర్మన్ తండ్రి) సంగీత దర్శకుడు. కాగజ్ కె ఫూల్ సినిమా తీయవద్దని గురుదత్ కు ఆయన అంట చెప్పినా లాభము లేకపోయినది. ఆ సినిమా తరువాత గురుదత్ సినిమాలకు సంగీత దర్శకత్వము వహించనని ఖరాఖండిగా చెప్పివేసినాడు. ఆయన చెప్పినట్లే చిత్రము fail అగుట యే కాక దాదాపు దివాలా తీసినంతపని ఐనది గురుదత్ కు. కానీ ఆ సినిమా అతనికి ఎనలేని ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. తరువాత సినిమానే మన చౌద్వీ@మ్ క చాంద్. 
దీని దర్శకత్వ భారమును మొహమ్మద్ సాదిక్ అన్న దర్శకునికి ఒప్పజేప్పినాడు కానీ గురుదత్ బానీ మనకు ఆ చిత్రములో అణువణువునా కనిపించుతుంది. సంగీత దర్శకుడు ఈ సినిమాకు 'రవి.' పాటను వ్రాసినది షకీల్ బదాయుని గారు. ఈయన పేరుమోసిన ఫాసి, అరబ్బీ, ఉర్దూ , హిందీ కవి. ఈపాతలోని వాణీ బాణీ నీవా నేనా అన్నట్లు వుంటాయి. అందుకే ఈ పాట ఆచంద్రతారార్కము నిలిచేదయ్యింది. బానీ ఇస్తే పాట వ్రాయుట ఈ కాలము  మన సినిమా కవులకు కష్టమైనది కాదు. ఆ కాలములో కూడా అందమైన హిందీ బాణీలకు పాటలు వ్రాసినవారున్నారు . కానీ భావము భాష  బాణీకి అనుసంధించుట అంట సులభమైన విషయము కాదని నావుద్దేశ్యము. అందులోనూ ఈ పాటలో ఫార్సీ అరబ్బీ పదాలు ఉర్దూ తో చేరియున్నాయి. అందువల్ల యధాతతముగా ఆంధ్రీకరించుట నా శక్తికి అంత సులభమైన విషయము కాదు. అయినా ఆశ చెడ్డది. అందుకే ప్రయత్నించినాను. చిత్తగించండి.
హిందీ పాట హిందీ లోనే ఇవ్వటము జరిగింది. దాని క్రింద నేను వ్రాసిన తెనుగు పాట పొందుపరచినాను.
चौदहवीं का चाँद हो या अफताब हो..
जो भी हो तुम खुद की कसम लाजवाब हो.. llचौदहवीं का चाँद हो..ll
      जुल्फ़ें हैं जैसे कांधों पे बादल झुके हुए,
      आँखें हैं जैसे मय के प्याले भरे हुए,
      मस्ती हैं जिसमे प्यार की तुम वो शराब हो.. llचौदहवीं का चाँद हो..ll
चेहरा है जैसे झील में हँसता हुआ कँवल,
या जिंदगी के साज़ पे छेड़ी हुई गज़ल,
जाने बहार तुम किसी शायर का ख़्वाब हो.. llचौदहवीं का चाँद हो..ll
     होंठों पर खेलती हैं तब्बसुम की बिजलियाँ,
     सजदे तुम्हारी राह में करती हैं कहकशां,
     दुनिया--हुस्नों इश्क़ का तुम्ही शबाब हो... llचौदहवीं का चाँद हो.. ll
*********************************************
ఇందుబింబ మందునా ఇనబింబమందునా
 
ఆ దైవ సాక్షిగా నీసరి లేరు ఎందునా
భుజకోటి నీరదాలు విరిసె  నీలాల కురులుగా  
నయనాలు దోచె నా మదికి  మధు పాత్ర దోయిగా
ఆనంద ప్రణయ వాహినీ నీవందు చషకమే         ll ఇందుబింబ మందునాll

ఆ మోము హ్రదమునందున హసియించు జలజమో 
జీవితపు వీణ తారలపై నర్తించు గీతమో
జీవన వసంతమానీవే కవుల కల్పనో                       llఇందుబింబ మందునాll

ఆడేను నీదు వాతెరపై చిరునవ్వు మెరుపులే 
నీ దారి మోకరిల్లెనులె ఆ పాలపుంతలే
ఈ ప్రణయ మోహ ధాత్రి దీప్తివి నీవె జవ్వనీ         llఇందుబింబ మందునాll

16 సెప్టెంబర్ 2015
Chada Sastry చాలా అర్ధవంతంగా లయకు సరిపోతూ రాసారు. చాలా బాగుంది. మీరు సినీ పాటల రచయితగా ప్రయత్నిస్తే బాగుమటుందేమో...
*********************************************
ఈ పాట రచయిత శ్రీయుతులు Dr. వేటూరి ఆనంద మూర్తి గారు.
ఇందుబింబ మే నహో లేదే ద్యుమణివే నహో  
వేరైన నే మొకో మో మనుపమాన మోహో 
కచబంధ మంసమం దదె క్రాలే ఘనాళియే
కందోయి చషకమం దదె చిందేను మధురిమే
మెయిగొన్న రాగ మాధురి వీవే సుధామయీ || ఇందుబింబ మే నహో !||
ఈ మోము సొబగు లీనేను జలేరుహమ్ముగా
నా భావ వీణ విన్చిన యాలాపనమ్ముగా 
ఏ సుకవి కలల పంటవొ గానీ సుహాసినీ! ||ఇందు బింబమే నహో||

కెమ్మోవి నటన మాడుచు క్రొమ్మించు లలరెనే  
నెమ్మేను పాలవెల్లిని మరపించి మెరిసెనే 

ఇల నల్లు ప్రణయవల్లరి వీవే విలాసినీ ! || ఇందుబింబ మే నహో||

*********************************************