కిం శూరః?విజితేంద్రియ:;ప్రియతమా కా?సువ్రతా. కిం ధనం?
విద్యా, కిం సుఖం?మప్రవాస గమనం రాజ్యం కిం?మాజ్ఞా ఫలం.
అర్థము:-- మనకు లాభం కలిగించేది సద్గుణాలు కలిగిన సజ్జనుల సాంగత్యము. ఇబ్బంది కలిగించే విషయం ప్రాజ్ఞులు కాని పామరుల సాంగత్యం, విలువైన సమయాన్ని వృథాగా గడపటం అనేది మనకు హాని కలిగిస్తుంది.(సమయము చాలా విలువైనది దాన్ని వృథాగా గడప కూడదు). నైపుణ్యం సిద్ధించాలంటే
ధర్మాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి . జితేంద్రియత కలిగియుండవలెను. వాడే శూరుడనబడతాడు. అనుకూలవతి యైన భార్యయే ప్రియతమురాలు. విద్యయే నిజమైన ధనం. సుఖమంటే ఏమిటి?
స్వస్తి.
న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే
భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి
కారణం
భగవంతుడు కొయ్యబొమ్మలోనో, రాతి విగ్రహంలోనో, మృణ్మయ మూర్తి లోనో లేడు.. ఆయన మన
భావనలో ఉన్నాడు. అందువల్ల భావమే ప్రధానము.
అర్థం. అదెలాగని అనుకొంటారేమో, ఒక వ్యక్తి తల్లి వద్దకు, భార్య చెంతకు, కూతురు దగ్గరికి పోయినప్పుడు మనసులో కలిగిన భావ భేదం మనకు అనుభవైక వేద్యమే!
అందుకే ‘యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ’ అన్నారు పెద్దలు. ఎక్కడ మనకు
ఎటువంటి భావన ఉంటుందో అటువంటి ఫలితాన్నే పొందుతాం. ఒక రోగి.. ‘ఇక నా ఆరోగ్యం
క్షీణించింది. నన్ను కాపాడేవాడే లేడు’ అని దిగులుగా ఉన్న సమయంలో ‘సమర్థుడైన
వైద్యుడు విదేశామునుంది వచ్చినాడు’ అనగానే రోగిలో చిగురించిన అశ అతనిని సగము
ఆరోగ్యవంతుని చేస్తుంది. ఇటువంటి విషయములు మన అనుభవములో ఎన్నో చూస్తూనే ఉంటాము.
‘భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు’ అనే భావన తో ప్రహ్లాదుడు అడుగడుగునా
భగవంతుని రక్షణ పొందితే,. ‘నేనే గొప్పవాడిని. నన్ను
మించినవాడెవడూ లేడు. అనే అసత్యమైన భావనతో ఉన్నందుననే, హిరణ్యకశపుడు మట్టికరచినాడు..
నీతి మాట
శుకవత్ భాషణం కుర్యాత్
అజవత్ భోజనం తథాl
కాకవత్ మైధునం కుర్యాత్ గజవత్ స్నానమాచారేత్ll
మన పూర్వీకులు నీతి
వాక్యోపదేశమును శాస్త్రముగా పరిగణించినారు. శాస్త్రము అంటే ‘ఇది ఈ విధముగానే చేయి’
అని నిర్దేశించుట. ఆ ఆదేశమును పాతిన్చావలసినదే కానీ అన్యథా తలపోయరాదు.
పై శ్లోక భావమును
ఒకసారి గమనించండి.
చిలుక వలె మాట్లాడవలేనట.
అంటే మనమాట చిలుక పలుకు వలె ముద్దుగా ముచ్చటగా ఉండవలెనట. అంటే చిలుకను అనుకరించుట (To
Mimic) కాదు. చిలుక మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో ఆవిధముగా మాట్లాడవలెను అని
అర్థము. మేకవలె తినవలెనట. మేక శాఖాహారి మరియు భయము అధికముగా కలిగినది. ఆకులలములు
నోటితో చప్పున లాగి బాగా నమిలి మ్రింగుతుంది. కొన్ని జంతువుల వలె నెమరు వేయదు.
కావున మనకూడా ఆహారమును బాగా నమిలి మ్రింగావ్లేనైని అర్థము అందుకే
అక్రోధనేన శుచినా
నిర్మలేన బ్రహ్మాత్మనాl
సుఖాసీన కరం కృత్వా
సదామౌనేన భోక్తవ్యంll
అంటే మనసు కోపముతో
నింపుకుండా, శుచి శుభ్రతలను పాటించుతూ, పరిశుద్ధమైన మనస్సుతో, పరమాత్మను హృదయములో
నిలుపుకొని సుఖాసీనుడై మౌనమును పాటించుతూ సుఖముగా భుజింపవలెను. ఎంతటి గొప్పమాట
చెప్పినారో చూడండి. దూరదర్శనములు చూస్తూ తింటే అవి ఆరోగ్య దుర్దర్శనములౌతాయి. ఇక ‘కాకవాత్
మిధునం కుర్యాత్’ అంటే శృంగారములో పాల్గొనుటకు కాకి ఎఆన్థమును మాత్రమె
కోరుకొంటుంది. చెదలుపట్టిన నేటి సమాజమువలె నడివీధులలో చుంబనాది శృంగార లీలలలో
పాల్గొనవు. మనము కాకిని హీనముగా చూస్తాము కానీ మనము కాకికన్నా హీనమన్న విషయమును
గుర్తెరుగము. ఇక స్నానము ఎనుగువలె ఎంతో నిదానముగా, బుద్ధిజీవులము కాబట్టి నీళ్ళలోనే
కాకుండా,భగవధ్యానములో కూడా మునుగుతూ బాహిరమగు శుభ్రతకు కావలసిన విధముగా స్నానమును
ఆచరించవలెను. ఇది నీరే దొరకని కాలము కాబట్టి ఇపుడు ఆయా పరిస్థితులకు అనుకూలముగా
మనము స్నానము విషయములో సర్దుకోవలసి ఉంటుంది.
ఖేచర భూచర ప్రాణుల
చూచినచో తెలియనగును
సుగుణములెన్నో
యోచన చేయగ మనగతి
పాచిన పులిహోర కన్నా
పాచెను రామా!
స్వస్తి.
స భవన్తి సమాః శీలే యథా బదరకంటకాః || 4
అర్థము :- ఏకోదర సముద్భూతా = ఒకే తల్లి కడుపున ప్టుిన వాడును, ఏకనక్షత్ర జాతకాః = ఒకే నక్షత్రమున బ్టుినవారును, శీలే = శీలమందు, బదరకంటకాః = రేగుముల్లు, యథా = ఎట్లు, సమాః = సమానమైనవి, న భవన్తి = కానో, యట్లే వారును సమానులుగారు.
తాత్పర్యము :- ఒకే కడుపున బ్టుిన వారుగాని, ఒకే నక్షత్రమున బ్టుినవారుగాని శీలవిషయములో సమముగా నుండరు. రేగుముండ్లు సమముగా నొకే విధముగా నుండక వంకరింకరగా నుండునో యట్లే పై జెప్పబడినవారు సమానముగా నుండరు.
వివరణము :- అందఱు సమానముగా నుండరు. వేదవాక్యము-
సమౌ చిద్దస్తా న సమం వినిష్టః సమ్మాతరా చిన్న సమం దుహతే |
యమయో శ్చిన్న సమా వీర్యాణి జ్ఞాతీ చిత్సన్తౌ న సమం పృణీతః ||
(ఋ. 10-117-9)
రెండు చేతులు సమానముగా కర్మ చేయలేవు. ఒక తల్లి కడుపున ప్టుిన రెండు దూడలు సమానముగా పాలనీయవు. కవలపిల్ల లిద్దరు సమానమైన బలశక్తులు కలవారిగా నుండరు. చుట్టఱిక మున్న్టి యిద్దఱు మనుష్యులలో నొకరివలె రెండవవాడు దానాదులచే తృప్తిపఱపలేడు
మఱొక వేదమంత్రములో అసమానతను గూర్చి బాగుగా చెప్పబడినది-
అక్షణ్వస్తః కర్ణవస్తః సఖాయో మనోజవేష్వనమా బభూవుః |
ఆదఘ్నాన ఉపకక్షాన ఉ త్వా హృదా ఇవ స్నాత్వా ఉ త్వే దదృ శే ||
(ఋ. 10-71-7)
కళ్లు, చెవులు గలిగిన స్నేహితులు జ్ఞానమునకై ప్రయత్నించు వారియొక్క మనోవేగ మొక్కిగా నుండదు. ఒకడు పుక్కిలింతలగు నీరుగల చెఱువువలెను. మఱొకరు చంకలలోతు నీరుగల చెఱువువలెను, ఇంకొకడు మునిగి స్నానము చేయుటకు తగినంత నీరుగల చెఱువువలెను విభిన్నముగా నుందురు. వేదము స్పష్టశబ్దములతోను, ఉదాహరణములతోను మనుష్యులలోని యసమానతను వర్ణించెను. పై శ్లోకము వేదము యొక్క యొక యంగమునకు ఛాయానువాదము మాత్రమే.