Friday, 27 November 2020

మహారాజా అగ్రసేన్

మహారాజా అగ్రసేన్

https://cherukuramamohanrao.blogspot.com/2020/11/blog-post.html

శ్రీ అగ్రసేన్ భవన్ హైదరాబాద్ లోని బోవెన్ పల్లిలోని సైఫర్ లేన్ వద్ద ఉన్న అత్యంత 

ప్రతిష్టాత్మక ఫంక్షన్ హాల్. హైదరాబాద్ లోని శ్రీ అగ్రసేన్ భవన్ పుట్టినరోజులు

నిశ్చితార్థం, నామకరణ కార్యక్రమం, వివాహం మరియు ఇతర సామాజిక 

కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంది. ఇది పాట్నీ Bus Junction కు దగ్గరగా 

Audi Car Service Center ప్రక్కన ఉన్నది. ఎంతమంది గమనిన్చియుంటారో 

నాకు తెలియదు. ఇటువంటి ధార్మిక సంస్థలను తన పేరుపై కలిగిన ఆ మహానుభావుని గూర్చి తెలుసుకొందాము.

అజరామర సూక్తి-64

ప్రాతరుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు l

స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ ll - చాణక్య నీతి

లో రాజా అగ్రసేన్ ను గూర్చి వివరముగా తెలుపుతానని చెప్పియుండినాను. ఆ 

మాటలోని వాస్తవమును మీముందుంచున్నాను.

మహారాజా అగ్రసేన్ అగర్వాల్ కులపితామహుడు. అతను కలియుగ సంధికాలములో 

సుమారు 5,187 సంవత్సరాల తరువాత సూర్యవంశి క్షత్రియ వంశానికి చెందిన 

మహారాజా వల్లభ సేన్ ఇంట శ్రీ రాముని కుమారుడైన కుశుని యొక్క  34 వ తరం లో 

అశ్వయుజ శుక్ల పాడ్యమినాడు జన్మించినట్లు తెలియవస్తూ ఉంది. స్వయముగా 

‘అగ్రవాల్’ వంశజుడయిన ప్రసిద్ధ చరిత్రకారుడగు భారతేందు హరిశ్చంద్ర గారి వలన 

మనకు అగ్రసేనుని చరిత్ర చాలావరకూ ఆయన రచించిన ‘అగ్రవాలోన్ కి ఉత్పత్తి’ ద్వారా 

తెలియవస్తూ వున్నది.

ఆయన రాజధాని యగు అగ్రోహా (ప్రతాప్ నగర్ అని కొందరంటారు)  రాజస్థాన్ 

మరియు హర్యానా రాష్ట్రాల మధ్య సరస్వతి నది ఒడ్డున ఉంది. వల్లభసేనునకు కు 

అగ్రసేన్ మరియు శూరసేన్ అనే 2 కుమారులు ఉన్నారు. అగ్రసేన్ వల్లభసేనుని పెద్ద 

కుమారుడు. అగ్రసేనుడు జన్మించిన సమయంలో, గర్గమహర్షి  వల్లభునితో అగ్రసేనుడు 

గొప్ప పేరుపొందిన రాజగుటయేగాక  దేశమున ప్రజా హితమునకై పెను మార్పులు 

చేస్తాడని  చెబుతూ ఆయన పేరు అమరమై భూమిపై నిలుస్తుందని చెప్పినాడు.

పురాతన గ్రంథాలలో పేర్కొన్న అగర్వాలల యొక్క మూలము నేడు కూడా మనకు 

అగ్రోహా లో లభించుతుంది. ‘మహారాజా అగ్రసేన్’ పేరుతోనున్న రాష్ట్రీయ రహదారి సంఖ్య 

-10 హర్యానాలోని హిసార్-సిర్సా బస్సు మార్గంలో, దిల్లీ నుండి 190 కిలోమీటర్లు 

మరియు హిసార్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు మహారాజా 

అగ్రసేన్ రాజధానిగా ఉన్న ఈ నగరం నేడు ఐదు వందల కుటుంబాల జనాభా కలిగిన 

సాధారణ గ్రామంగా ఉంది. దాని సమీపంలో, పురాతన రాజధాని అగ్రెహ్ (అగ్రోహా) 

యొక్క అవశేషాలు 750 ఎకరాల విస్తీర్ణము గల ఈ నేల బంజరుభూమిగా విస్తరించి 

ఉన్నది. ఇది అగ్రసేన్ మహారాజ్ యొక్క అగ్రోహా నగర్ యొక్క అద్భుతమైన చరిత్రను 

చూపిస్తుంది.

భారత యుద్ధమున వల్లభసేనుడు పాండవ పక్షమున యుద్దముచేసి 10వ రోజున 
భీష్ముని చేతిలో నిహతుదయినట్లు చరిత్రకారులు చెబుతారు. అప్పుడు 15 సంవత్సరముల 
వయసు కలిగిన అగ్రసేనునికి పట్టము న్కట్టినట్లు తెలియ వస్తూవున్నది.
ఒకసారి అగ్రసేనుడు శివుని అనుగ్రహాన్ని కోరి వారణాసిలో ఘోరతపస్సు సాగించినాడట. 
అగ్రసేనుని తపశ్చర్యకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహాలక్ష్మిని కూడా 
ప్రసన్నం చేసుకోమని సలహాను అందించాడట. అంతట అగ్రసేనుడు మహాలక్ష్మికై 
తపస్సు సాగించగా, లక్ష్మీదేవి ప్రత్యక్షమై ప్రజల సౌభాగ్యం కోసం వైశ్యవృత్తిని చేపట్టమనీ, 
వారి కోసం ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించమనీ సూచించిందట. ఆమె చెప్పినట్లుగానే 
అగ్రసేనుడు నూతనంగా రాజ్యాన్ని స్థాపించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతకడం 
మొదలుపెట్టగా,  ఒకచోట పులిపిల్లలూ, తోడేలు పిల్లలూ కలిసి ఆడుకోవడం 
కనిపించిందట. తన రాజ్యస్థాపనకు అదే సరియైన ప్రదేశముగా భావించి, అక్కడ 
అతను అగ్రోదయ అనే రాజ్యమును స్థాపించి, దానికి రాజధానిగా  'అగ్రోహా' ను 
చేసుకొని ఆరాజ్యమును పాలించినాడు.
 హర్యానాలోని హిసార్‌ జిల్లాలో ఇప్పటికీ ఈ పట్టణం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. 
ఇక్కడ త్వవకాలను జరిపిన పురాతత్వ శాఖకు క్రీస్తు పూర్వం నాటి అవశేషాలెన్నో 
కనిపించినాయి.
ఆయన జీవిత కాలమంతా అచంచల లక్ష్మీభక్తునిగా ఉండిపోయినాడు. ఆ తల్లిని 
ప్రసన్నము చేసుకొని తనకుయ్ కలిగిన 18 కుమారులకు పద్దేనిమిద్ది గోత్రములను 
ఈ దిగువ తెలిపిన విధముగా కల్పించి, వారు లక్ష్మీ దేవిని శ్రద్ధా భక్తులతో పూజించినంత 
కాలము  వంశాభివృద్ధి కల్గినవారై వర్ధిల్లుతూ ఉండవలెనన్న వరమును పాయిందినారు. 
అగ్రసేనుడి వంశజ్ఞులైన అగ్రర్వాల్‌లు 11వ.శ వరకు "అగ్రోహ రాజధానిగా పరిపాలన 
కొనసాగించారు. మనదేశంపై మహ్మద్‌ఘోరి దండయాత్ర వలన అగ్రోహ వారు 
దూరప్రాంతాలకు వలస వెళ్లినారు. ఆ కారణంగా వేలాది మంది నిరాశ్రయులగుటయే 
గాక  జీవనోపాధి కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస రావటము జరిగింది 
కానీ, వారు తమ గుర్తింపును వదల్లేదు. వారు ఇప్పటికీ ఆ 18గోత్రనామాల్తోనే లోకపరిచయము ఏర్పరచుకొనియున్నారు.
ఆ 18 గోత్రములవారు:
గార్గ్, గోయల్, కుచ్చల్, కన్సల్, బిందాల్, ధారన్, సింఘాల్, జిందాల్, మిట్టల్, టింగల్, 
తాయల్, బన్సాల్, భాండాల్, నంగల్, మంగళ్, అయిరన్, మధుకుల్. గోయన్. 
కావున ఈ 18 గోత్రములవారూ అగ్రసేనుని సంతానమే!
మహారాజా అగ్రసేన్ లౌకిక వాదమునకు చక్కని నిర్వచనమునిచ్చినాడు. తన ప్రాంతంలో 
నిజమైన సమసమాజమును నెలకొల్పుటకు, తన దేశములోని ఏ ప్రాంతమునకు వచ్చి 
నిలిచిపోవలేనని తలచినా ఆ వ్యక్తికి ఆప్రాంతవాసులందరూ,  అతనికి  1 రూపాయి
(ఆ కాలమున రూపాయిని ఏమనేవారో నాకు తెలిసిరాలేదు) మరియు 1 ఇటుకను 
ఇవ్వవలసినదిగా దేశమంతటా ఉత్తరువును జారీ చేసినాడు. తద్వారా ఆయన 
ఆ అగంతుకునికి స్థిరనివాసము వ్యాపార అవకాశాన్ని  కలుగాజేసినాడు. దానివల్ల 
వచ్చిన వానిహృదయములో కృతజ్ఞతా భావము వెల్లివిరిసి ఉత్తమ జీవితమును 
నెరిపి ధర్మ యుక్తముగా ఆర్జన చేసేవాడు. అగ్రసేన మహారాజు ఆ విధముగా ఒక కొత్త 
వ్యవస్థకు జన్మనిచ్చినారు. సనాతన వేద సంస్కృతి యొక్క ప్రాథమిక సూత్రములను 
వర్తింపజేసి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో వ్యవసాయ-వ్యాపార, పరిశ్రమ, గోపోషణతో బాటు నైతిక విలువల స్థాపనకు కంకణము కట్టుకొని వానిని ప్రతిష్ఠించిన మహానుభావుడు ఆయన.
అగ్రసేనుడు 108 సంవత్సరములు అవిశ్రాంతముగా, నియమ నిబద్ధతలను పాటించుతూ, జనరంజకముగా, ఆదర్శవంతముగా  పాలించినట్లు జనవాక్యం. ఆయన శాస్త్రములలో  వైశ్య వర్ణానికి దర్శకత్వం వహించిన కార్యాచరణ విదానములకు ప్రాధాన్యత నిచ్చి పట్టము కట్టి అందుకు అనుకూలముగా సముచిత శాసనములను చేసినారు. మరోవైపు దేశ పురోగతికి కొన్ని  ఆదర్శ సూత్రములను నెలకొల్పినారు. ఆయన 3 ఆదర్శ ప్రాథమిక సూత్రములకు ప్రాదాన్యతనిచ్చినాడు.  అవి:- ప్రజానురంజక పాలన, ఆర్థిక సమత మరియు సామాజిక సమతత్వము. ఆయన 18 ఆశ్వమేధములను జేసి 18వ యాగము నుండి చేసిన మిగతా యజ్ఞములయందు పశుబలులను మాన్పివేసినాడు. 
ప్రతి వ్యక్తి తన రాష్ట్ర మరియు మతపరమైన పనుల కోసం తన ఆదాయంలో పదోవంతు దైవ కైంకర్యమునకై నిర్దేశించినాడు. అంటే దైవ, మత, మానవపరమైన ధర్మకార్యములకై ఉపయోగించవలెనను ఆదేశములనొసంగినాడు. రాష్ట్రములోని ప్రతి వ్యక్తి తన జీవనోపాధిని ఇతర ధర్మమార్గాల ద్వారా లేదా వాణిజ్యము ద్వారా సంపాదించుకొంటూ ఉండినా  దేశంపై విపత్తు సమయంలో, అన్ని వర్గాల ప్రజలు ఆయుధాలతో పోరాడటానికి సిద్ధముగా ఉండునట్లు కట్టడి చేసినాడు. సమసామాజ వ్యవస్థను అకుంఠిత దీక్షతో పాటించి సనాతన ధర్మ గౌరవమును తన పదవీ కాలములో కాపాడుతూ వచ్చినాడు.

107 సంవత్సరములు రాజ్యపాలన సాగించి తన 108 ఏట వాన ప్రస్తమును బూని

అడవులకు వెళ్ళి తపమాచారించుతూ పరమాత్మ సాయుజ్యమును పొందినాడు.

నేటికీ, వారి వారసులందర, మహారాజ్ అగ్రసేన్ దర్శకత్వం వహించిన మార్గాన్ని 

అనుసరించి సమాజ సేవలో నిమగ్నమై ఉన్నారు. ‘అగ్రసేన్ కి బావోలి’ అంటే అగ్రసేన 

మహారాజు త్రవ్వించిన అతి పెద్ద దిగుడు బావి, దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలో హైలీ 

రోడ్‌లో ఉంది. ఇది 40 మీటర్ల పొడవు మరియు 15 మీటర్ల వెడల్పు గలిగియుంది. ఇది 

పురావస్తు సర్వేక్షణ మరియు అవశేషాల చట్టం, 1956 ప్రకారం భారత పురావస్తు శాఖ 

పర్యవేక్షణలో ఉంది. 2012 లో, భారతీయ తపాలా శాఖవారు , అగ్రసేన్ శాసనం కలిగిన 

ఈ బావి యొక్క తపాలా బిళ్ళ కూడా జారీ చేసినారు.

ఇంతటి చరిత్రపురుషుని గూర్చి, ఎంత మందికి తెలుసును అన్నది మన 

చేతకానితనమును చెప్పుకోలేని రహస్యము. అసలు అహింసను గౌతమ బుద్ధునిని కంటే 

ఎంతోముందే, సనాతన ధర్మ పరిధిలోనే,  వ్యాప్తి లోనికి తెచ్చిన మహానుభావుడీయన.

అట్టి మహానుభావుని ఇకనైనా జ్ఞాపకము ఉంచుకొని పదుగురికి ఆయన 

గొప్పదనమును తెలియజేద్దాము.

స్వస్తి.


Saturday, 31 October 2020

కాళీదాసు భోజునికి సంబంధించిన ఒక హృద్యమైన కథ

 కాళిదాసు – భోజుడు

https://cherukuramamohanrao.blogspot.com/2020/10/blog-post_31.html
సంస్కృతము బాల్యములో నేర్చుకొనే అవకాశము లేకపోయినవాళ్ళు, ఆ భాష ప్రాశస్త్యమును, భగవత్ సాక్షాత్కారము పొంది మహాకావ్యములను రచించిన కాళిదాసాది మహాకవుల గొప్పదనమును, అలంకార సమలంకృతమై యొప్పారు కావ్య వైచిత్రిని తెలుసుకొనవలెనంటే ఆదిగా ఆ భాషపై మక్కువను ఏర్పరచుకోవలసి యుంటుంది. అట్టి జిజ్ఞాసకు ఉపాధే భోజ కాళీదాసు కథలు.ఉడుతా భక్తిగా, నేను పండితుని గాకున్నా, పాఠకులలో  ఒక తపనను కలిగించు నెపముతో అప్పుడప్పుడు భోజ కాళీదాస కథలను అందిస్తూ వస్తూవున్నాను. అందులోని ఒక భాగమే ఈ కథ.
ఒకనాడు భోజరాజు కొలువు దీరి యుండగా,ఒక సన్యాసి  వచ్చి ఆయనను ఆశీర్వదించినాడు. రాజు ఆయనతో స్వామీ! కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించినారు. నిత్య ఉపవాసాలతో కృశించి ఏమిసాధించదలచుకొన్నారు. నేను చెప్పబోవు ఈ మాట మీకు తెలియనిదికాదు .
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసముసన్యాసముతద్దినములందు మాంస వినియోగముకట్టుకొన్న భార్యకు సంతాన లేమి (అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు కదా మరి మీరెందుకు పాటించుచున్నట్లుఅని అడిగినాడు.
 పైపెచ్చు “గృహస్తాశ్రమము స్వీకరించ రాదానేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.” అనికూడా అన్నాడు.
అందులకా యువసన్యాసి “రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది ఏముంటుంది? ‘లోకో భిన్న రుచి’ అన్న నానుడి తమకు తెలియనిది కాదు.
ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశముప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుటనిద్రాభయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాలుగు గుణములు పశువులలోనుమనుష్యులోను సమానముగ కనిపించు సామాన్య గుణము. మనుష్యులో ధర్మమనునది విశేష గుణము. ధర్మాచరణలేని మనుష్యుడు అపుడు పశువుతో సమానము కాదా! ఈ ధర్మమూ అతని వృత్తి ప్రవృత్తులబట్టి మారుతూ వుంటుంది. రాజధర్మము వేరు మరియు యిచ్ఛాపూర్వక సన్యాసమును స్వీకరించిన సన్యాసి ధర్మమూ వేరు.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవలసి యున్నది. విద్యవలననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనగలడు. తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును కూడా పొందగలడు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నరయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ అని కఠోపనిషత్తు 3-9
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమునువ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగలడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమిదేవపురిబ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియముమనస్సుబుద్ధి ఈ ఏడిరటిని ఋషులని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతయని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి. దానిని సాధించుటయే ధ్యేయముగా నేను ఈ సన్యాసాశ్రమమును స్వీకరించినాను. నన్ను సరియగు రీతిలో అర్థము చేసుకోనగలరని నానమ్మకము. దయతో ఈ మాటను కూడా ఆలకించండి:
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహ-శాంతి:ప్రియా గేహినీ
వృత్తి: వన్యలతాఫలై: నివసనం,వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నివ్వృతి:
తేషాం యిందు కళావతంస యామినాం మొక్షేపి నో నః స్పృహాII
లేళ్ళు మాకు మిత్రులుకొండగుహలే మా ఇళ్ళుశాంతికామిని శాంతిగామిని మా ఇల్లాలుఅడవులలో తీగెలతో,పండ్లతో సహవాసమే మా జీవన విధానము. చెట్టు పట్టలే మాకు వస్త్రాలుసద్వచన ప్రవాహ స్నాతులము అంటే మంచి మాటలు అనుగంగా తరంగముల నోలలాడువారము ఇటువంటి నిరంతర సుఖసౌఖ్యములు గల్గిన  మాకు నిజానికయితే స్వర్గము పై కూడా  కాంక్ష ఉండదు. బ్రహ్మైక్యమే మా ధ్యేయము అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము కావలసి వస్తే   
చెప్పండి అని విధేయతతో అడిగినాడు. అప్పుడు అతడు “రాజా! ఇంతగా సాదు సాంగత్యము పై అభిలాష చూపే మీ తీయనైన మాటలు తలదాల్చి ఒక్క కోరిక కోరుతాను.నేను సాటి సన్యాసగణముతో  కాశీయాత్రకువెళుతున్నాను. దయచేసి మీ సభలోని పండితులను భార్యా సమేతంగా మాతో పాటు యాత్రకు పంపించండి. త్రోవ పొడుగునా శ్రమ తెలియకుండా పండిత గోష్టులు జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.” అన్నాడు ఆ సన్యాసి. రాజు అందుకు వల్లె యనగా  రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళినారుఒక్క కాళిదాసు తప్ప. మీరు ఎందుకు వెళ్ళలేదుఅని రాజు కాళిదాసును అడిగినాడు. కాళిదాసు ఈ విధముగా బదులిచ్చినాడు.
 తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో దూర వర్తినఃI
యస్య గౌరీశ్వర: చిత్తే / తీర్థం,భోజ పరం హి సఃII
భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారుఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజునకు మనసులో ఒకప్రక్క ఎదో కినుక ఉన్నది. కానీ తెలియబరచలేదు బాహాటంగా!
కొద్దిరోజుల తర్వాత భోజరాజు బయటి దేశముల నుండి వచ్చిన పండిత సదస్సును ఏర్పాటుచేసి వారికి భూరి సంపదలను దానము చేసినాడు. కాళిదాసును మీ నుండి కూడా కవనమును వినగోరుచున్నామన, కాళిదాసు ఈ విధముగా పలికినాడు.

మేరౌమందర కందరాసుహిమవత్సానౌ.మహేంద్రాచలేI
కైలాసస్య శిలా తలేషులయ ప్ర్రాగ్భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గణైః: వుద్గీయ మానం యశఃII
చారణులనే దివ్య గాయకుల బృందాల చేత, నీ కీర్తి గురించి  మేరు మంధర పర్వతపు గుహలలో,హిమాలయ మలయ పర్వత శిఖరాగ్రముల మీదా, సహ్యాద్రి మీదనేగాక  అనేకానేక ప్రదేశములయందు, కొనియాడబడుతున్న నీ కీర్తి వినబడినది.

అప్పుడు భోజుడు సంతోషముతో పులకరించిన శరీరము కలిగినవాడై, కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని నేను వినగలిగే వాడిని కాదు కదా! అని తలచుతూ, నిర్మొహమాటముగా మనసులోకలిగిన తన తప్పిదమును కాళిదాసు కు మనవి చేసుకొన్నాడు. ఎంతటి సౌశీల్యమో చూడండి. కవనములో ఎంతటి సౌందర్యమో చూడండి. భాష భావానికి ఎంతగా ఒదిగిపోతూవుందో  చూడండిసంస్కృతముతో జీవితమునే సంస్కృతము చేసుకొందాము.

స్వస్తి.

Friday, 16 October 2020

శ్రీ దుర్గా సూక్తము

 శ్రీ దుర్గా సూక్తము

https://cherukuramamohanrao.blogspot.com/2020/10/blog-post.html

I:

ఓం జాతవే'దసే సునవామ సోమ' మరాతీయతో నిద'హాతి వేదః' |

స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా' నావేవ సింధుం' దురితాఽత్యగ్నిః

మేము యజ్ఞాది క్రతువుల ద్వారా సోమ రసాన్ని జాతవేదునికి అనగా 

అగ్నికి పంపుదుము గాక! సర్వజ్ఞుడగు ఆయన శత్రునాశనము 

చేయుగాక!  అగ్నిదేవత అన్ని అవరోధములను మరియు చెడుల నుండి 

మనలను రక్షించి, ఈ కష్టాల కడలికి పడవయై మానలు దరిజేర్చును 

గాక!

2:

అగ్నే త్వం పా'రయా నవ్యో' అస్మాంథ్-స్వస్తిభిరతి' దుర్గాణి విశ్వా'' |

పూశ్చ' పృథ్వీ బ'హులా న' ఉర్వీ భవా' తోకాయ తన'యాయ శంయోః

కర్మ ఫల్కములను అందజేసి కాపాడే విరోచనుని అర్ధాంగి మరియు 

అగ్ని రూపిణి యగు  దుర్గాదేవిని నేను ఆశ్రయిస్తాను, ఆమె లోని 

అగ్నితత్వము తపస్ (ఆధ్యాత్మిక అగ్ని) తో ఈ సంసార సాగరమును 

 దాటించు  నైపుణ్యము  కలిగిన నీకు విదేయులమై యుండి 

దాటుదుము గాక.

3:

విశ్వా'ని నో దుర్గహా' జాతవేదః సింధున్న నావా దు'రితాఽతి'పర్-షి |

అగ్నే' అత్రివన్మన'సా గృణానో''స్మాకం' బోధ్యవితా తనూనా''మ్

మనఃపూర్వకమగు మా ప్రార్థనలను మన్నించి జాతవేదుడు అనగా  అగ్ని

సురక్షితమైన మార్గాల ద్వారా మమ్మల్ని అన్ని అడ్డంకులను అధిగమింప 

జేసి మా జీవన యానమును సుఖవంతము చేయు గాక! మా 

ప్రాంతముమా భూములు విస్తరింప్క్యజేసి మా పిల్లలకు సుఖ 

సంతోషముల నిచ్చుగాక!

4:

పృతనా జితగం సహ'మానముగ్రమగ్నిగ్ం హు'వేమపరమాత్-సధస్థా''త్l

స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా క్షామ'ద్దేవో అతి' దురితాఽత్యగ్నిః

అడ్డంకులను తొలగించే జాతవేదుడు, మమ్ములను, తానొక నావయై, 

అన్ని అడ్డంకులను తొలగించి మమ్ములను తీరము చేర్చుగాక! సకల 

జీవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ శ్రద్ధ చూపే అత్రి వంటి అగ్నిదేవుడు మా 

శరీరములను జాగ్రత్తగా రక్షించు గాక!

అత్రి మాహముని గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలాన్ని అత్రి 

మండలం అని పిలుస్తారు. అందులోని ఎనభై ఏడు శ్లోకాలు ఆయనకు

ఆయన వారసులకు ఆపాదించబడియి. అత్రి గురించి రామాయణం

మాహాభారతాల్లో కూడా వివరాలు లభిస్తూన్నాయి.

5:

ప్రత్నోషి' కమీడ్యో' అధ్వరేషు' సనాచ్చ హోతా నవ్య'శ్చ సత్సి' |

స్వాంచా''గ్నే తనువం' పిప్రయ'స్వాస్మభ్యం' చ సౌభ'గమాయ'జస్వ

ఎత్తైన ప్రదేశాల నుండి, అత్యంత శక్తివంతుడు మరియు అజేయుడు 

అయిన అగ్ని సకల శత్రుసంహారము చేసి మాకు ఎటువంటి 

అవరోధములను కలుగనీక  కాపాడుగాక!

6:

ప్రత్నోషి' కమీడ్యో' అధ్వరేషు' సనాచ్చ హోతా నవ్య'శ్చ సత్సి' |

స్వాంచా''గ్నే తనువం' పిప్రయ'స్వాస్మభ్యం' చ సౌభ'గమాయ'జస్వ

ఓ అగ్ని, మా భక్తి పూర్వక  ప్రశంసలు, నీకు  ఆనందాన్ని పెంచుగాక! 

అనాదిగా హవిర్వాహకునివైన ఓ అగ్నీ! నీవు తృప్తి చెంది  మాకు 

శ్రేయస్సును అనుగ్రహించు.

7:

గోభిర్జుష్ట'మయుజో నిషి'క్తం తవేం''ద్ర విష్ణోరనుసంచ'రేమ |

నాక'స్య పృష్ఠమభి సంవసా'నో వైష్ణ'వీం లోక ఇహ మా'దయంతామ్

సర్వవ్యాపకుడవైన ఓ ఇంద్రా! మా పశువులు మరియు అకుంఠిత  

ఆనందము కొరకు  మేము నిన్ను అనుసరిస్తాము. ఓ స్వర్గాధిపతీ! నీ 

సహచరుల సాయముతో విష్ణుదేవుని అనుగ్రహముతో వైకుంఠమును 

భూమిపై నిలుపుదువు గాక!

8:

ఓం కాత్యాయనాయ' విద్మహే' కన్యకుమారి' ధీమహి | తన్నో' దుర్గిః 

ప్రచోదయా''త్

ఓం శాంతిః శాంతిః శాంతిః'

మేము కాత్యాయనిని, కన్యకుమారిని  తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాము

దుర్గ మాకు మార్గనిర్దేశమును చేసి సంతృప్తి పరచు గాక!

ఈ మూడు రంగాలలోనూ శాంతి ఉండనివ్వండి ఆది-భౌతిక: భౌతిక, ఆది-దైవిక: దైవిక మరియు అధ్యాత్మికాంతర్గత మగు శాంతి వేలయుగాక
స్వస్తి.