Wednesday, 8 June 2022

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము

 

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము

https://cherukuramamohanrao.blogspot.com/2022/06/blog-post.html

బృహదారణ్యకోపనిషత్తును గూర్చి మాట్లాడుకొనునపుడు శరీరాంతర్గతమగు ఆత్మయే పరమాత్మ అని చెప్పుకొన్నాము.  మహా చైతన్య పదార్థమైన ఈ ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు అంతా ఆత్మచైతన్యము ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్దస్పర్శరూపరస గంధాలుసర్వ శారీరక సుఖాలు. ఇవన్నీ ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినాఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూస్వప్నావస్థలోనూ, సుషుప్తిలోనూ  జాగృతంగా ఉండి జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించితిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి హృదయకుహరంలో స్థితమై ఉన్న ఆత్మ. ‘హృదయమునకు దగ్గరగా నీలి రంగులో జ్వలించుచున్న జ్వాల శిఖరమున అణుమాత్రముగా ప్రకాశించుచునా పరమాత్మయే ఆత్మ. జీవికి ఆత్మ జీవులకు పరమాత్మ. అది చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ అధిగమించి  ముందుకూ వెళ్ళగలుగుతుంది వెనకలకూ రాగలుగుతుంది. ముందునకైనా వెనకలికైనా దాని వేగమును అందుకొనజాలవు. మరి పరమాత్మే సృష్టించిన ఏ వస్తువైనా పరమాత్మను అధిగమించలేవు కదా!

ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా అతీతమైనది. ఇంద్రియములద్వారా మనము ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవము. మనకు ఉన్న ఏ ఉపకరణమయినా తనకు నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. అవయవ లోపము ఉన్నపుడే దాని బాధ్యతను ఉన్న అంగము స్వీకరించవలసి వస్తుంది. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు. 

శరీరమునకు ఉన్న బాహ్యాంగములు బాహిరమగు వస్తు సముచ్చయమును గమనించగలవుదృశ్యములను చూడగలవు అవసరమగునపుడు తత్సంబంధిత అంగములతో స్పందించనూగలవు.

ఆత్మ భూతభవిష్యత్తులకు అతీతము కానీ వానికదియే అధిపతి.

ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ ‘‘బొటనవేలి పరిమాణం కలిగిభూతవర్తమాన. భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషునిగా చెప్పవచ్చును. ఇక్కడ పురుషుడు అన్న శబ్దము నపుంసక లింగము. ‘ఆత్మ పొగబారని నిర్మల తేజోమయ జ్యోతి’గా వర్ణించుతుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదుమరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జన్మించిన ప్రతి వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. ఆ ఆరూ మానవుని పరిణామ దశలు. అవి జాయతేఅస్తివర్ధతేవిపరిణమతేపరిక్షీయతేవినశ్యతి అనునవి. అంటే సూక్ష్మ (పుట్టుక)స్థూల (పెరుగుదల) , మహిమ (మరింతగా పెరగడం లేక బలపడడం)రూప పరివర్తన (రూపంలో మార్పు రావడం)రూపక్షీణము (వార్ధక్యము)నాశనం (మరణించుట). ఇవన్నీ బాహ్య పరిణామములు. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ. అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండము కన్నా పెద్దది.  ఆత్మను గూర్చి పరమాత్మ భగవద్గీతలోని రెండవ అధ్యాయములోని సాంఖ్య యోగములోని 22, 23వ శ్లోకములుగా ఆత్మను గూర్చి ఈ విధముగా తెలుపుతాడు:

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి 

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2 - 22 ।

ఎలాగైతే మానవుడుజీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మమరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి 'న్యాయ దర్శనమన్న గ్రంధము ఈ క్రింది వాదన ని చెపుతోంది.

జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)                                                                            

చిన్న శిశువును గమనిస్తేఏ పత్యేకమైన కారణం లేకుండానేఒక్కోసారి నవ్వుతూ వుంటుంది, ఒక్కొక్కపరి ఏడుస్తూ ఉంటుందిఒక్కోసారి ఎదో ఆలోచనలో ఉన్నట్లు ఉంటుందిఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శనముప్రకారముఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీఅ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ వాసనలు మనసులో బలంగా ముద్రింపబడటం చేత అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి.

మిగిలినది మరోమారు....

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము – 2

 

'న్యాయ దర్శనముపునర్జన్మ కు మద్దతుగా ఇంకొక వాదనను పేర్కొంటుంది. ‘స్తన్యాభిలాషాత్ (3.1.21)’  అప్పుడే పుట్టిన శిశువుకు ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడుతల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలికానీఅప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలోజంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలుపొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.

అందువలనసహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.

ఇక 23వ శ్లోకమును గమనించుదాము.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 2 - 23 ।।

ఈ ఆత్మనుఆయుధములు ఛేదింపలేవుఅగ్ని కాల్చలేదునీరు తడపలేదుగాలి అరిపోవునట్లు చేయలేదు. ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చుకానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనదికావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగాగాలి ఆత్మను ఎండబెట్టలేదునీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.

ఆత్మ ఇంద్రియగోచరం కానిది. అంతేకాదుఅచింత్యమైనది. అంటే మన మనసులోని ఆలోచనలకు అందనిది. ప్రతి ఒక్క చలనానికి అనగా కదలికకు అచంచలమైనదొకటి హేతువాయి తీరవలసినదే! రైలు పరుగెత్తాలంటే కదలకుండా ఉండే పట్టాలు అవసరం. చలనచిత్రము చూడాలంటే దానికి స్థిరమైన తెర ఆధారంగా ఉండి తీరాలి. లోకంలో సంభవించే చలనాలన్నిటికీ కారణభూతమైనది ప్రాణం. తెరమీది చలచిత్రమును చలింపజేయు పనిచేయడానికి ఆధారంగా నిలిచేది ప్రక్షేపకము (Projector). ఇది చలన చిత్రమునకు  ఆత్మ. దృగ్గోచకాని ఆత్మను వర్ణిస్తూ ‘‘చేరి కానరానివాడు... చింతింపరానివాడుభారపు వికారాల పాయనివాడీ ఆత్మ’’ అంటారు అన్నమాచార్య. ఆత్మతత్త్వం వర్ణించడం సాధ్యంకానంత అనంతత్వంతో భాసిస్తుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది. మహాచైతన్య పదార్థమైన ఆత్మనే హృదయాంతరికలోకాన వసించే అంతర్యామిగా మనం భావన చెయ్యాలి.

ఇక మానావమానాలను గూర్చి విశ్లేషించుకొందాము.

జీవునికి ముక్తి పొందటానికి ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల లభించేది మానవ దేహం. మానవఉపాధి లభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం. అనుకోకుండా ఒక పదునైన చాకు దొరికితే బుద్ధిమంతుడు కాయగూరలూ పండ్లు తరుగుటకు వాడితే,కౄరుడగు బుద్ధిహీనుడు తలలు తరగడానికి వాడుతాడు.

జగద్గురువగు శంకరులవారు ఎంత మంచిమాట చెప్పినారో చూడండి.

మిగిలినది మరోమారు.....

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము- ౩


మన పూర్వ కర్మానుసారంగా మనకు లభించిన ఉపాధి ధర్మాలను పాటిస్తూబాధ్యతలను నెరవేరుస్తూనేఅసలైన జ్ఞానాన్వేషణ సాగించాలి. సదసద్వివేకాన్ని వృద్ధి చేసుకోవాలి.

ఇక్కడ ఒకమాట చెప్పి తరువాత మానావమానములను గూర్చి ముచ్చటించుకొందాము. మనము ఈ అలియుగములోనే అత్యంత నిమ్న జాతికి చెందిన నాయనార్లు ఆళ్వార్లూ భగవద్భక్తులై ఏకముగా కైవల్యమునే సాధించినారు.  అంటే దేవుని సన్నిధి చేరుటకు వర్ణము కాదు ముఖ్యము.

 

జ్ఞానాదేవ తు కైవల్యమ్. అన్నది తేటతెల్లమగుచున్నది. వేదము ప్రతి వర్ణమునకు బాధ్యత్కలను అప్పగించినది. వానిని చిత్తశుద్ధితో పాలించుటయే ధర్మానుసరణమగును.

మన వేదములు, ఉపనిషత్తులు అని వర్ణములవారికి శ్రేయోదాయక్మగు హితవాక్యములకు తోడుగా ఎన్నో భక్తి మార్గములను ఉపదేశించుతూ ఉండగా, వాని సారమును కాచి వడపోసిన మహనీయులు ఎన్నో స్తోత్రములు, స్తవములు సర్వ మావజాతికి సమర్పణ చేసినారు అట్టి మహానీయులబాట మనము నడచుటకు అత్యంత ఉత్కృష్టమై యోప్పారుచున్నది. అమితమగు సారభూతముగా జగద్గురువులగు శంకరుల వంటి వేదశాస్ర పరినిష్ఠితులైన వారు వేరు వేరు చోట్ల ఉన్న భగవద్గీత లోని ఉపదేశములను సకల శాస్త్ర ఉపనిషత్సారమును ఒక్కటి జేసి రంగరించి సంగ్రహించి  ఈ క్రింది శ్లోక రూపములో చెప్పినారు.   

యక్త్వా మమాహమితి బంధకరే పరేద్వే

మానావమాన సదృశాః సమదర్శినస్యా

కర్తారమన్య మవగమ్య తదర్పితాని

కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః

మనకు ఈ సంసారబంధమునకు ముఖ్య హేతువులు అహంకార మమకారములు.

ధనము విద్య వంశము, బలగము, అధికారము మొదలగునవి అహన్కారెఅహెథువులు. నేను అనుకోనుతయే అహము. ఈ విధముగా తాలువ మొదలిడితే ఇక మన గర్వమునకు హద్దే ఉండదు. అహంకారము పెరిగే కొద్దీ సాటి మనుషులపై తూష్ణీభావము పెరుగుతుంది. అది పతన హేతువే కానీంయతా కాదు.

చెరుకు తీపి ఎంతొ చేకొని యున్ననూ

చీడ పుట్టెనేని చెరుకు చెడును

అహము చీడ సమము అది నీవు గమనించు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

మిగుల చెడుగు చేసి మీసాలు మెలిబెట్టి

కానరారు సాటి కళ్ళముందు

అన్న నిన్ను జూడ ఆపైన ఒకడుండు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

అహంకార చిత్త మత్త ప్రవృత్తుడైన దుర్యోధనుని ఒకసారి చూద్దాము. బాల్యములోనే భీముని జంప నీట ముంచినాడు, లాక్ష్యాగృహము దహింప జేసినాడు, ద్రౌపదీ వస్త్రాపహరణము గావింపజేసినాడు. అతిరథ మహారథులు ఆరు మంది కలిసి  అభిమన్యుని పద్మవ్యూహమునందు  చంపింప జేసినాడు. తనకు సతి ఎవరని విర్రవీగినాడు. చివరకు భీమునిచేతిలో హృదయ విదారకమైన రీతిలో చనిపోయినాడు. పిండప్రదానము చేయుటకు ఇటు పుత్రులు గానీ అటు సహోదరులు గానీ లేకుండా బలిచేసుకొని, చివరకు ధర్మరాజుతో నువ్వులు నీరు వదిలింప జేసుకొన్నాడు. మన కార్య కలాపములను పైవాని కన్ను గప్పి చేయలేము. ఇటువంటి కార్య కలాపములు చేయువాడు తప్పక జనన మరణ వాయు గుల్మమున అనగా సుడి గుండమున తగులుకొన్నట్లే! అంటే శంకరులవారు వేరొక సందర్భములో చెప్పినట్లు

పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం|

ఇహ సంసారే బహుదుస్తారే

కృపయాపారే పాహి మురారే||

పరమాత్మా! ఈ చావు పుట్టుకల జలవలయము లోనికి నన్ను జోప్పించకు. దానిని దాటింపజ్జేయు అనుగ్రహము నాపై చూపించుఅని ఆర్త్ తో వేడుకొంటాడు నిజమైన భక్తుడు. దానకి మనము కృషిచేయవలసినది అందుకు చేయవలసిన మొదటి పని అహంకార త్యాగము.

ఈ విషయమై ఇంకొక మాట చెబుతాను:

మనుష్యుల మధ్య వచ్చే చాల మటుకు పొట్లాటలు ఈ ''అహం" వల్లనే జనిస్తాయి. అది మనకు తెలిసినదే!  "What They Don’t Teach You At Harvard Business School" అనే పుస్తకం రాసిన Mark H McCormack, అనే రచయిత ఇలా అన్నాడు : "చాలా వరకుపెద్ద పెద్ద సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు(Carporate Executives) , రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు." గణాంకాలు పరిశీలిస్తేచాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణంవారికి పనిలో నైపుణ్యం లేక కాదువ్యక్తుల మధ్య సమస్యల వలన. కావున అహంకారాన్ని పెంచి పోషించు కోకుండాదానిని త్యజించటం లోనే ప్రశాంతత కు మార్గమున్నది.

ఇక మమకారమును గూర్చి కాస్త విశ్లేషించుకొందాము.

మరొక మారు.........

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము- 4

భగవద్గీతలోని ఈ రెండు శ్లోకములను గమనించండి:

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥1-1

ఈ శ్లోకము ప్రతమాధ్యాయములోని ప్రథమ శ్లోకము.  ధృతరాష్టృదు పుట్టు గ్రుడ్డి. ధర్మశాస్త్ర రీత్యా రాజ్యపాలనా యోగ్యత లేనివాడు. పాండురాజు యొక్క దయ, జాలి, అభిమానముతో సింహాసనము అధీష్ఠించినాడు. తన పుత్రులు ఎల్లవేళలా పాండవులకు ఎగ్గులు చేసినవారే! కానీ యుద్ధము వచ్చిన వెంటనే నా సుతులు పాండుసుతులు అన్నాడు కానీ, అయ్యో అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకొన యుద్ధమునకు సిద్ధమైనారే అని అనలేదు. ఇదే మమకారము అంటే! పిఒనీ ఇది శాశ్వతమా అంటే క్షణికమే! మరి దీనికి అంత స్వార్తమవసరమా! అసలు  ధృతరాష్ట్రుడు

ఏమంటున్నాడో చూడండి- “ఓ సంజయాధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్దులై కూడి ఉన్న నా వారైన దుర్యోధనాదులుపాండు పుత్రులు ఏం చేసినారుఇదీ మమకారము. ఇపుడు భగవద్గీత నుండియే మరియొక ఉదాహరణ తీసుకొందాము.

రెండవ అధ్యాయములోని 5వ శ్లోకములో అర్జునుడు తన మమకారమును ఈ విధముగా వ్యక్తము చేయుచున్నాడు.

గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |

హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 2 -5 ||

మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని యైనను ఈ లోకమున జీవించుట శుభదాయకము. ఏలనన ఈ గురుజనులను చంపిననురక్తసిక్తములైన రాజ్యసంపదలనుభోగములను మాత్రమే నేను అనుభవింతును గదా

మమకారము అను బలమైన పొర లేక తెర ఎంతగా అర్జునుని కనులుగాప్పిందో చూడండి. అర్జునుడు స్వతహాగా క్షత్రియుడు. ఎదుటి వ్యక్తి యుద్ధమునకు ఆహ్వానించి యుద్ద్ఝారంగాములో నిలచిన తరువాత ఎదురించి పోరుట క్షాత్ర ధర్మము. అదికాదని ఎదురునిలచినవారు నాకు గురువులు, పెద్దలు ప్రియతమ బంధువులు అనుట మమకారము కాక మరేమిటి? భగవంతుని సారధిగా చేసుకొని, ఆయన అదేశానుసారమూ నడచుకొనే పార్థుడు మమకారము అన్న మాయకు ఎంత లోనయినాడో చూడండి. మన సనాతన ధర్మమూ నిర్దుష్టముగా చేయ తగినవి చేయ తగనివి అనేకానేక గ్రంధములావ్ ద్వారా ఆదేశించినది. మనము అల్లోచించక ఆచరించుతూ పొతే చాలు.

ఇక్కడ పెద్దలు చెప్పిన ఒక మాట గుర్తు చేస్తాను. ‘సంఘః ఖలు పాంథ సంగమః’ అంటే భావమంధము లోన బందీలై మమకారము పెంచుకొన్నవారంతా కేవలము ప్రయాణములో కలిసిన పాంథులు అంటే ప్రయాణీకులు. ఎవరిగామ్యము వారిది అన్నది ఎరిగి మసలుకోనుతకు బదులుగా ‘ఆహామైతెశాం’ ‘మమైతే’ అనగా నేను నాది అన్న వలయమున తగుల్కొని తిప్పలు పడుతూ ఉన్నాము. పై శ్లోకములోని మొదటి పాదములో జగద్గురువులు ఆదేశించినది దీనిని పరిత్యజించమనియే! శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినది కూడా ఇదియే!

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః

నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 2-71 ।।

ఎవరైతే  ప్రాపంచిక కౌతుకములను త్యజించిఅత్యాశ లేకుండానేను/నాది అన్న భావన లేకుండాఅహంకార రహితముగా ఉంటాడోఅలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. 

శ్లో॥ సమశ్శత్రౌచ మిత్రేచ తథా మానావ మానయోః

శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః॥    (18)

శత్రువుల యందుమిత్రులయందు సమంగా ప్రవర్తించేవాడుఅలాగే మానావమానములయందుశీతోష్ణములయందుసుఖదుఃఖములయందు సమంగా ఉండేవాడుసంగభావాన్ని విడిచిన వాడు(నా ప్రియభక్తుడు).

అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవచ l

నిర్మమో నిరహంకార: సమదు:ఖ  సుఖ క్షమీll

 సమస్త ప్రాణుల యెడల ద్వేషము లేనివాడు , స్నేహభావముదయకలవాడుఅహంకార మమకారములు లేనివాడుసుఖ దు:ఖములందు కలవాడు. ఓదార్పుగలవాడు (భక్తుని లక్షణములు). 

అని ఈ విధముగా ఇది చెప్పినదే కదా! అనుకోకుండా పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.

కళ్ళుమూసుకొని శ్లోకములను చెప్పుకొనుటయే గాక నైతిక విలువలను పాటించుతూ అహంకార మమకారములను సమదృష్టితో చూస్తూ, సుఖదుఃఖములను సాకు జేయక సరభూత శ్రేయోభావనతో ఈవితము5 కొనసాగించువాడు నిజమగు భక్తుడు. జీవన గమనములో మనము ఏర్పరచుకొన్న పథములో బాటకు ఇరువైపులా పాత్ర పుష్టి గల చెట్లుంటే సేదతీరి బడలిక సడలుతుంది. అదే చెట్లు లేని దారింబడితే దారి క్కన్తక్కబ్ ప్రాయమయినడై ఉండవచ్చు, సూర్యుని వాదియగు వేడి భరించనూ లేకపోవచ్చు. కానీ కానీ సుఖదుఃఖాలను పరిగణన లోనికి తీసుకొనక ప్రయాణము చేస్తూ ఆదేవదామమును పొందినవాడే నిజమగు భక్తుడు.

మిగిలినది మరోమారు....... 

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము – 5 (చివరి భాగము)

మన పూర్వుల మనస్తత్వము ఏవిధముగా ఉండేదో ఒకసారి ఈ క్రింది శ్లోకములో గమనించండి:

మన్నిన్దయా యః జనః పరితోషమేతి నన్నప్రయత్న సులభోయమనుగ్రహోమేl

శ్రేయోర్థినోహి పురుషాః పరతుష్టి హేతోః దుఃఖార్జితాన్యాపి ధనాని విసర్జయతిll 

ఈ శ్లోక సారాంశము ఏమిటంటే , నాటి విద్వద్వరేణ్యులు ఈ విధముగా తలపోసేవారట. సాధారణముగా సంతోషమును పొందుటకు దాతలు  అవసరమగు వ్యక్తులకు ధనమును దానము జేసి సంతోషమును పొందుతారు, కానీ నేను ఒక వ్యక్తి నిందకు కారనంకై సంతోషమును కలిగించుచున్నాను. ఎటువంటి ఖర్చూ లేకుండా ఎదుటి వ్యక్తిని సంతోషపరచి ఆ పుణ్యమును మూటకట్టుకొనుచున్నాను కదా! మానావమాన విషయములో ఈ ఉదాసీనతను కలిగియున్డుతకు ఇది పరాకాష్ట.

 ఈ విషయమై మహనీయులు నీలకంఠదీక్షితులు ఒకసారి ఇలా అన్నారు:

ప్రామాణ్య బుద్ధిః స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని l

కీట బుద్ధిర్మనుష్యేషు నూతనాయాః శ్రియః ఫలంll

స్తోత్రము అనగా ‘అవిద్యమాన గుణ కీర్తనం స్తోత్రం’. అంటే లేని ఉత్తమ గుణములను స్తోత్రము చేయు వ్యక్తిలో ఆపాదించుట. ఇది మానవుల విషయములో మాత్రమే! మనుష్యుల విషయములో ఈ స్తోత్ర పాఠమును వంగర, అల్లు గారలు రేలంగిని ప్రశంసించుతూ ఆయన పాత్రకు లేని గుణములతో చ్గేస్తారు. ఇది నేటి సామాజిక పరిస్థితికి నిలువుటద్దము.

ఈ శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే కొత్తగా సంపద పొందినవాడు, స్తోత్ర పాఠాలకు,

 అవి వాస్తవాలు కాకున్నా పొంగి పొరలి పోతాడు. తనకు ఎక్కడలేని దేవతా బుద్ధులను ఆపాదించుకొంటాడు. కీతబుద్ధి అంటే సాటి మనుషులను పురుగులవలె చూస్తూ హీనముగా మాట్లాడుతాడు. అందుకే మనవాలు అంటూవుంటారు ‘అష్ట దరిద్రునికి ఐశ్వర్యము వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడని’. కాబట్టి మనకు ఒకరి రాగద్వేషాలతో పనిలేదు. మనసుకు తోచిన పని మనము చేస్తున్నామని మన ఆత్మకు నచ్చజేప్పుకోగలిగితే చాలు.

మానావమాన సదృశాః సదర్శినశ్చ’ అన్నది ఆర్యవాకు. మానావమానములకు పొంగనూ వద్దు కృంగనూ వద్దు. భగవద్గీత ఈ విధముగా చెబుతూ వుంది.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శుని చైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః ।। 5 - 18 ।

విద్యా వినయములు గల్గిన నిజమైన పండితులుదివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడినిఓ ఆవునిఓ ఏనుగునిఓ కుక్కనిఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు. ఈ తరతమ భేదములు పాతిన్చానివాడే నిజమైన భక్తుడు కాగలుగుతాడు.

‘కర్తారమన్య మవగమ్య తదర్పితాని కుర్వన్తి కర్మ పరిపాక ఫలాని ధన్యః’ ఆదేమీ లేదండీ. అంతా పైవాడు చేసినదే! నన్ను ఉపాధిగా ఆయన వాడుకొన్నందుకు ధన్యుడను. ఇది మనము మనసా వాచా నమ్మి ఆచరించవలసినది. గీతలో పరమాత్మ ఈ మాటే చెబుతున్నాడు.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్

యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 9 - 27 ।

నీవు ఏ పని చేసినానీవు ఏది తిన్నానీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినానీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినామరియు ఏ నిష్ఠలను ఆచరించినాఓ కుంతీ పుత్రుడావాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.

అంటే  “భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయటమేమరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే.” పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి వేస్తే దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులనుఇటువంటి దృక్పథం దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా మార్చివేస్తుంది. స్వామి వివేకానంద పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: “ఏ పనీ లౌకికమైనది కాదు. ప్రతిదీ భక్తి మరియు సేవయే! పరమ భక్తుడగు కబీరు ఈ విధముగా అంటున్నాడు.

జహాఁ  జహాఁ  చలూ కరూ పరిక్రమాజో  జో కరూ సో సేవా

జబ సోఁవూ కరూ దండవత్జానూ దేవ న దూజా

“నేను నడిచినప్పుడల్లా నేను భగవంతుని గుడిని ప్రదక్షణ చేస్తున్నట్టు భావిస్తానునేను ఏది చేసినాఅది భగవత్ సేవ గానే చేస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడునేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగానేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.”

పోతన భాగవత రచనా ప్రారంభములో ఈ విధముగా అంటాడు:

పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట,నే

బలికిన భవహర మగునట

 పలికెద వేరోండు గాథ పలుకగ నేలా?

అట్టి భక్తియే  నిజమైన తాదాత్మ్య యుక్తమగు భక్తి. అసలు గీతలో పరమాత్ముడే అర్జునునితో చెబుతాడు” ఈ యుద్ధమంతా నీభ్రమ. చావవలసినవారి నందరినీ చంపుచున్నది నేనే! ఆ మాటకొస్తే వీరిని పరిమార్చాదము అయిపోయినది.నీవు నిమిత్త మాత్రుదివే!”. ఈ భావన కలకాలమూ మాడిన నిలిపి కర్మను చేసేవాడు భక్తి తాదాత్మ్యతను పొందినవాడే!

శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః

ఎవడైతే ఆహంకారమమకారములను వదిలిపెట్టి మానావమానములను లెక్కించక, సర్వత్ర సమదర్శిగాఉండి, తాను చేస్తున్నాననే భావనతో కర్మలను చేయక, చేయించే వాడు పరమాత్మయే అని తలచి, తత్కర్మలను చేసి పరమేశ్వరార్పణముగా భావించుతాడో వాడు ధన్యుడు అన్నది శంకరులవారు, భగవద్గీతలో వేర్వేరు అద్యాయములలో చెప్పిన సందేశములను క్రోడీకరించి ఆదియందు తెలిపిన చిన్న శ్లోకము రూపములో జగద్గురువగు ఆది శంకరులవారు మనకు అందజేసినారు.

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే

న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 6 - 40 ।

 ఓ పార్థాఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకం లో కానిపర లోకంలో కాని చెడిపోడు. ప్రియ మిత్రమాభగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.

 తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నదిదీనర్థం "పుత్రుడా" అని. అర్జునుడిని తాత అని సంబోధించి శ్రీ కృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొడుకుని అనురాగంతో తాత అని సంభోదిస్తారు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటి వాడుకాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో 'తాతఅని సంభోదిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూఆయన మార్గం లో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు. మరియు "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ లోకంలో మరియు పర లోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషులకు ఒక గొప్ప భరోసా.

స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం

న్యాయేన మార్గేన మహీం,మహీశాం l

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం

లోకాః సమస్తా స్సుఖినో భవంతు.ll

సర్వే జనాః సుఖినోభవంతు.

 

Tuesday, 17 May 2022

బృహదారణ్యకోపనిషత్తు

 

బృహదారణ్యకోపనిషత్తు

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_17.html

బృహదారణ్యకోపనిషత్తులోని విషయమును గ్రహించేముందు దాని కర్తయగు యాజ్ఞవల్క్య మహర్షి ని గూర్చి తెలుసుకోవలసిన విషయము ఎంతో ఉంది. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. మొదట ఆయన స్తుతితో మొదలుపెడదాము.   

యాజ్ఞవల్క్య స్తుతి (కవి పేరు తెలియదు)

సంయమితిలక ! నీ సరసవాక్యంబులు

పరికంప వేదాంత భాషణములు

పరమ ఋషీంద్ర ! నీ కరుణాకటాక్షంబు

లఖిలంబులకు జీవనౌషధములు

ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌

దావపాపక శిఖాధారణములు

సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు

సకల పురాణాను సమ్మతములు

దినము నీ వొసంగు దీవన్యనృపతుల

భూరిసంపదలకు గారణములు

నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును

యాజ్ఞవల్క్య! మునికులాగ్రగణ్య !.

యాజ్ఞవల్క్య మహర్షి (వికీపీడియా సౌజన్యము)

అది  పాంచాల దేశము. అందు చమత్కార పురమను నగరం ఉన్నది. ఆ నగరమున యజ్ఞవల్కుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేసి వేద విదుని గావించినాడు. ఇతను బాస్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించినాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసినతరువాత విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురియై తాను నేర్చుకున్న వేదజ్ఞానముతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు. అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలనూ సాధించినాడు. తరువాత కాత్యాయిని అను స్త్రీని  వివాహము చేసుకున్నాడు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది. ఇతని ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరి శిష్య పరంపరను కాణ్వశాఖీయులు అంటారు.

జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించినాడు. యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు. వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టినాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి. 'మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు ' అని గంభీరంగా పలికినాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో ఉండిపోయినారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించినాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయినారు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించినాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించినాడు. ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేగా విశ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయినాడు.

ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికి ఎక్కినాయి. యాజ్ఞవల్క్యుడు ధర్మమార్గమున తానూ సంపాదించిన సంపదను పటులిరువురిని పంచుకోనమనగా కాత్యాయిని సరే అన్నా మైత్రేయి తనకా సంపద అవసరములేదని తెలుపుతూ తనకు బ్రహ్మతత్వమును బోధించమన్నది. వల్లె యనుచూ ఆమేకుఅటులనే బోధించి సన్యసించినాడు. అతని పేర ఒక స్మతి కూడా ‘యాజ్ఞవల్క్య స్మృతి’ యన్న పేరుతో ప్రచారంలో ఉన్నది. అందు కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేసినాడు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి. ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు.

 యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించినాడు.

మిగిలినది మరొకమారు........

బృహదారణ్యకోపనిషత్తు – 2వ భాగము

ఇక విషయానికివస్తే, దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యము వ్రాసినారు. ఇందు ఆత్మనుండి ప్రపంచము సృష్టి అయినట్లుకలదు. 2వ భాగమునందు వేదాంత చర్చలు కలవు. బ్రహ్మ, శాస్త్రములచే అగమ్యుడనియు, అభ్యాసము వలన బ్రహ్మను కనుగొన వచ్చునని తెలుపబడినది. యాజ్ఞవల్క్యజనకులకు జరిగిన చర్చ ఇందు కలదు. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ యనగ అచ్యుతుడు నిరంజనుడు, నిరాకారుడు, అచలుడు అని చెప్పియున్నాడు.

జనకునకును యాజ్ఞవల్క్యునకును ఆత్మను గూర్చి చర్చయు, మరియు ఆత్మకు  జాగ్రత్ స్వప్న సుషుప్త్యా వస్థలకు గల సంబంధమును గురుంచియు వివరింపబడినది. ఇట్టి గ్రంథము హైందవ వాజ్మయమందు లేదనుట అతిశయోక్తి కాదు. యాజ్ఞవల్క్యనకును ఆతని భార్య మైత్రేయికిని జరిగిన సంభాషణము నందు గృహమును త్యజించి వానప్రస్థమును స్వీకరించుటకు గల విషయములు వర్ణితములు. ఇందు పునర్జన్మ గురుంచి చెప్పబడియున్నది. శుక్లయజుర్వేదములో పెద్దది చాందోగ్యము, చిన్నది ఈశావాస్యోపనిషత్తు. ఇందులో ఉన్నవి 18 మంత్రములే!

ఇక ఈ బృహదారణ్యకము నందు మనము సాధారణముగా వినే ఏఏ మంత్రములు ఉన్నవో చూతము.

అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.

తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి అనగా వెలుగు లోనికి తీసికొని పొమ్ము.

మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..

ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ

ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే కలదు.

ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును. (కలుగదని భావము.) ఈ ఆత్మనే మనము పరమాత్మగా అర్థముము చేసుకొనవలెను). ఈ ఆత్మ అన్నది శ్రేష్ఠతమము. పుత్రునికంటెను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే,మనలోనే,  మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమని చెప్పు మనుజునకు, అత్మజ్ఞుడు ‘అయ్యా!’ మీరు ప్రియమని తలంచు పుత్రాదులు నశ్వరము కదా! అని చెప్పెను. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు. సృష్టికి పూర్వము ఈ ప్రపంచము బ్రహ్మముగా నుండెను. బ్రహ్మము ‘నేనే బ్రహ్మమునై యున్నాను’ అని తలంచెను. కావున అది సమస్తమును అయినది. ఎవడు తన అత్మకంటే వేరైనా దేవత కలదనియు, అది వేరు, తానూ వేరు అనియు భావించి అన్యదేవతోపాసన చేయుచున్నాడో అతడు అవివేకి. ఎవడీ ప్రపంచమున తన స్వరూపమే అయియున్న ఆత్మ నెరుగక మృతినొందునో, అతనిని ఆత్మ (బ్రహ్మము) రక్షింపదు.

అధ్యయనము చేయబడని వేదము మనుజుని రక్షింపనట్లు ఆత్మ అతనిని రక్షింపదు. కాబట్టి ఆత్మ నెరుగని వాడెట్టి మహత్తర పుణ్య మాచరించినప్పటికిని అది ఫలానుభోగాంతమున నశించిపోవును. కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించవలయును. అట్టివానికి కర్మము అంటదు. ఇట్టి అత్మజ్ఞాని ఏదేది ఇచ్చగించునో, అదంతయు ఆత్మచే ప్రాప్తమగును.

మిగిలినది మరొకమారు.......

బృహదారణ్యకోపనిషత్తు – ౩వ భాగము

కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము – ఇవి అన్నియు మనస్సే (మనో రుపములే) అయియున్నవి. (యాజ్ఞవల్క్యుడు – ఓ మైత్రేయి) భార్య తన భర్త యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియమైయుండుట లేదు. తన ఆత్మ యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియముగా నున్నది.

అట్లే భర్త తన భార్యయందును, తండ్రి కుమారునియందును ఆ విధముగా సమస్తమును ఆత్మకోరకే కాని వేరుకాదు. ఆత్మయే చూడదగినది; ఆత్మయే వినదగినది; ఆత్మయే తలంచదగినది;

ఆత్మయే ధ్యానింపదగినది. ఆత్మయొక్క స్మరణము చేతను, ధ్యానము చేతను, దర్శనము చేతను, సమస్తము బోధపడును. ఆ ఆత్మయే (విశ్వాత్మయే, బ్రహ్మమే) ఈ ఆత్మ (జీవాత్మ). అది సమస్త ప్రాణులకును అధిపతి. బండిచక్రముయొక్క నాభియందు అరములు (ఆకులు) (Spokes) గ్రుచ్చబడి యున్నట్లు ఈ ఆత్మయందు సమస్తప్రాణములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గ్రుచ్చబడియున్నవి, అనగా ఇవి ఆత్మకు అనుబంధములై ఉన్నవి. ఆత్మ జలమువలె స్వచ్చమై, ఏకమై, ద్రష్టమై, అద్వైతమై యున్నది. అదియే బ్రహ్మలోకము, అనగా పరబ్రహ్మస్థానము. అది జీవునకు ఉత్తమగతి. అదియే సమస్త సంపదలకంటెను శ్రేష్ఠమైనది. అదియే పరమానందము. ఈ ఆనందముయొక్క ఒక్క అంశమున ఆధారపరచుకొని సమస్త ప్రాణులును జీవించియున్నవి.

మనుజులలో ఎవడు సకల భోగములు అనుభావించుచు ఏదియు కొరతలేక యున్నాడో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము కేవలము జీవానందము, ఆత్మానందము కానేరదు. దానికి నూరు రెట్లు ఆనందము కలిగించగలిగినది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలిగించగలిగినది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలిగించగలిగినది ఒక ఆజానదేవతల(దేవతలుగానే పుట్టినవారు) ఆనందము. వేదాధ్యనమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును అజానుదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు.

అదియే పరమానందము. ఈ పరమానదమే బ్రహ్మలోకము (పరబ్రహ్మ స్థానము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను. జీవులలో సాధుకార్యము చేయువాడు సాదువైయుండును, పాపము చేయువాడు పాపియై యుండును, పుణ్యము చేయువాడు పుణ్యశాలియై యుండును. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారణమైనవాడుగా నున్నాడు. ఎపుడతనికి ఒక సంకల్పము కలుగునో అపుడు ఒక నిశ్చయబుద్ది కలుగుచున్నది. ఎపుడు నిశ్చయబుద్ది కలుగునో, అపుడు కర్మము చేయనారంబించెను. తదుపరి ఆ కర్మఫలము అనుభావించవలసియున్నది.

జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మ కాముడు (ఆత్మకంటె వేరుగా మరొకదానిని కోరనివాడు). అట్టి వాని ప్రాణములు ఎచటికిని పోవుటలేదు. అతడు ఇచటనే బ్రహ్మరూపు డగు చున్నాడు.

మిగిలినది మరొకమారు.......

 

 

బృహదారణ్యకోపనిషత్ - 4

ఎపుడు జీవుని హృదయమందు కోరిక లన్నియు నశించి పోవునో, అపుడు మనుజుడు అమృతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు.  అవిద్యను ఉపాసించువారు అంధకారబందుర్గమగు సంసారమును పొందుదురు.

మనము పాఠశాలలకు పోకుండా మన తరగతులకు ఏర్పరాచిన పాఠ్యాంశాలు చదువకపోవుట చదువలేక పోవుట అవిద్య కాదు. లౌకికమైన విద్యలన్నీ అవిద్యలే! ఒక్క పారలౌకిక సంప్రాప్తికై గురువులెడ అభ్యసిన్చునదే విద్య. ఈ విధమైన విద్య౭అ నేర్చుకొన ప్రయత్నమూ చేయని వారంతా అజ్ఞానులే!  సందర్భము వచ్చినది కాబట్టి ఇక్కడ ఈ శావాస్యోపనిశాత్తులోని 11వ శ్లోకమును ఉటంకించుచున్నాను:

విద్యాంచావిద్యాంచ యస్తద్వేదోభయం సహ |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే 11‖

 

ఈ శ్లోకము పై భావమును ద్రువీకరించుచున్నది. అవిద్య మనము జీవితమును కొనసాగించుటకు నేర్చుకోనవలసినదే! అది మృత్యువును దాటిన్చుతుంది అంటే అపమృత్యువు లేకుండా చేస్తుంది, అంతే కానీ అమృతత్వమును ప్రసాదించేది మాత్రము విద్య యే!

అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు. అత్మసాక్షాత్కారమును బడసినవాడు విశ్వకృత్తు. అనగా సమస్తము అతని లోకమే, సమస్త లోకములకూ అతను చెందినవాడే! (సమస్త లోకములు ఆత్మయందు కల్పింపబడి యుండుటవలన. ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వమొందినవారము. లేనియెడల మహాకష్టము కలుగును. బ్రహ్మవిద్యచే మోక్షము కలుగును. అదిలేనిచో దుఃఖము కలుగును.      

కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకొనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.

 

నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును(సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము

ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడిచట అనేకత్వము చూచునో, అతడు ఒక  మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును.(జనన మరణ జాలములో దగుల్కొనును). ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేయము. ధృవమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది. జన్మము లేనిది. సర్వశ్రేష్టమైనది. నాశరహిత మైనది. ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) ధీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు అనగా ఏకాగ్రత కొరకు ఎంత తక్కువ శబ్దములు ఉంటే అంతగా ఏకాగ్రత లభించుతుంది. ఓంకారము అతిచిన్న మాత్రా శబ్దము, నమశ్శివాయ శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ మొదలగు మంత్రములు అనుష్ఠాతకు అందుబాటులో ఉన్న మంత్రములు.  ఎట్లనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును. ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి వున్నది. అది పుణ్య కర్మచే వృద్ధినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నెరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు. అతనిని కృత్యాకృత్య కర్మలు బాధించవు. అట్టి కర్మల నతడు భస్మముచేయగల శక్తిమంతుడు. అతడు పాపరహితుడై, విరక్తుడై, ఇచ్ఛారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండును.  ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మచే సృష్టించబడిన ఇహ లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.

మిగిలినది మరొకమారు .....

బృహదారణ్యకోపనిషత్తు  – 5వ భాగము

 

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_17.html

 

యాజ్ఞవల్క్య,బృహదారణ్యక పనిషత్తుల గూర్చి సంగ్రహముగా తెలుసుకోండి.,

 

బృహదారణ్యకోపనిషత్తు – 5వ భాగము

ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది,వార్ధక్యములేనిది, మరణము లేనిది, అమృతమైనది, అభయమైనది. ఇట్లేరుగువారు ఆ అభయ బ్రహ్మమే (ఆత్మయే) అగుచున్నాడు.

ధనము చేత (సంపదల చేత) అమృతత్వము (మోక్షము) లభింపదు. లభించునను ఆశ వ్యర్ధన. అది ఒక్క సాధన (ధ్యానము) ద్వార మాత్రమే లభింపబడుతుంది.

ఈ ఉపనిషత్తు (అన్ని ఉపనిషత్తులకంటే) పరిమాణంలో చాలా పెద్దది (బృహత్తు). అందుకే దీనిని బృహదారణ్యకోపనిషత్తు అని అంటారు. ఇది పరిమాణంలోనే గాక, విషయ విశిష్టత, సమగ్రత, వివరణ లన్నింటిలో కూడా విశేషమైనదే.

బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు 6 అధ్యాయాల్లో విస్తరించి ఉన్నాయి. 1, 2 అధ్యాయాలను మధుకాండ అంటారు. 3, 4 అధ్యాయాలను యాజ్ఞావల్క్యకాండ అంటారు. 5, 6 అధ్యాయాలను ఖిలకాండ అంటారు.

ఇందులో యాజ్ఞవల్క్యుడు, జనకుడు, గార్గి, మైత్రేయి – ఇలా అనేకమంది ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు. ఒకరు ఋషిపుంగవుడు, బ్రహ్మజ్ఞాని, ఒకరు రాజు, ఒకరు బ్రహ్మవాదిని, ఒకరు గృహిణి అయినా జిజ్ఞాసువు. అందరు వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూనే సత్యావిష్కరణలో పాలు పంచుకోవడం భారతీయ చింతనలో ఒక విశిష్టతను తెలియజేస్తుంది – సత్యాన్వేషణకు అందరూ అర్హులే – జిజ్ఞాస ఉండాలంతే.

గార్గ్యుడను వ్యక్తికి విద్యాగర్వం మెండు. ఆతను అజాతశత్రువు అనే రాజు వద్దకు వెళ్లి అర్థించబడకుండానే ‘నేను నీకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తా’ నన్నాడు. సరేనన్నాడు నిగర్వి, జ్ఞాని అయిన అజాతశత్రువు. గార్గ్యుడు అజాత శత్రునివద్ద భంగపడతాడు. చివరికి అజాతశత్రువు దగ్గరే ఉపదేశం పొందుతాడు. విద్యాగర్వం పనికి రాదనీ, ఎదుటి వారి సత్తా తెలుసుకోకుండా అహంకరించ కూడదు అనే సందేశంతో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది.

జనకుని యజ్ఞం, అక్కడ జరిగిన సభ, అందులోని వాదోపవాదాలు ఈ ఉపనిషత్తులోని పెద్ద ముచ్చట.

ఆత్మను ప్రత్యక్షంగా చూపమన్న ఉషస్తునికి, ***కహోలునికి, ఆత్మ బాహ్య ప్రపంచంలోని వస్తువు (object) కాదని అది మనలోనే ఉండే కర్త (subject) అని యాజ్ఞవల్క్యుడు బోధించిడు.

యాజ్ఞావల్క్యునితో గార్గి వాదోపవాదాలు అత్యంత ఆసక్తికరం, భారతీయ తత్త్వశాస్త్ర సారస్వతంలో ఒక మధుర ఘట్టం. మొదట హిరణ్య గర్భుడే మూలద్రవ్యం అని, ఆయన్ని ఆవరించేది ఇంకేది లేదని యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు. గార్గి రెండవసారి వాదనకు దిగినప్పుడు సూత్రాత్మ అవ్యక్త ఆకాశంచేత వ్యాపింపబడిందని, ఆ అవ్యక్త ఆకాశం అక్షర బ్రహ్మం చేత వ్యాపింపబడిందని చెప్పి, ఆ అక్షర బ్రహ్మం మాటలకు, ఊహకు అందనిదని, దాని నుండే జీవజాలం ఉద్భవించి, మళ్ళీ దానిలోనే లయం అవుతుందని ఉపన్యసించాడు.

జనకుడికి ఆత్మజ్ఞానం మీద, దేహాత్మల మీద ఇంకా అనేక విషయాల మీద ఉపదేశం ఇచ్చాడు.

భోగలాలసత్వం (దేవతల ప్రకృతి), పరపీడన పరాయణత్వం (ఆసుర ప్రకృతి), లోభం (మానవ ప్రకృతి) – ఇవి మూడూ మన సమాజంలోనే ఉన్నాయని, అవి వరుసగా శమ దమాల వల్ల, దయ వల్ల, దానం వల్ల, నివారించుకోవాలని ఈ ఉపనిషత్తు ఒక చక్కని కథా రూపకంగా వివరించింది.

భార్య మైత్రేయికి, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వలేవని, ఆత్మానందం అనుభవైకవేద్యమని, అది శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా మాత్రమే సాధ్యమని ఉపదేశించాడు.

ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహా వాక్యం “అహం బ్రహ్మాస్మి”. సంక్షిప్తంగా దీని అర్థం “నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను”.

ఆసతో మా సద్గమయ

తమసో మా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయేతి (1.3.28)

నన్ను అసత్తు నుండి (చెడు నుండి లేక జడత్వం నుండి), సత్తు (మంచి లేక చైతన్యం) వైపుకునడిపించు . తమస్సు (చీకటి లేక అజ్ఞానం) నుండి జ్యోతి (వెలుగు లేక జ్ఞానం) వైపుకు నడిపించు. మృత్యువు (death) నుండి (అశాశ్వతమైన దాని నుండి) అమృతత్వం (శాశ్వతమైన దాని వైపు) (immortality) వైపుకు నడిపించు. అని ముముక్షువు ఆ పరమాత్మను వేడుకుంటున్నాడు. భారతీయ సంప్రదాయంలో, ధనంతో పొందగలిగే భోగాల కంటే చైతన్యంతో కూడిన సత్ ప్రవర్తన, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం (అమృతత్వం) మాత్రమే ఉన్నతమైనవి.

ప్రతి జీవికి అన్నింటికంటే ప్రియమైనది ఏది?

ప్రతి జీవికి అన్నిటికంటే ప్రియమైనది – తానే.

తనకు అన్నిటి కంటే ప్రియమైనది తానే (ఆత్మయే) అని చెప్పే వాక్యం ఏది?

తదేతత్ప్రేయః పుత్రాత్ప్రేయో విత్తాత్ప్రేయో2

న్యాస్మాత్సర్వస్మాదన్తరతరం యదయమాత్మా (1.4.8)

ఈ ఆత్మతత్త్వం పుత్రుని కంటే, సంపద కంటే ఇతరములైన అన్నిటి కంటే ఉత్తమమైనది. కనుక దానినే ప్రేమతో ఉపాసించవలయును.

బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావే

దాహం బ్రహ్మాస్మీతి, తస్మాత్తత్సర్వమభవత్ (1.4.10)

సృష్టికి పూర్వం ఉన్నది పర బ్రహ్మమే. నేనే పరబ్రహ్మమని తనకు తానే ఆ పరబ్రహ్మమును తెలిసికొనెను. మానవుడు కేవలం ఈ జడ స్వరూపం కాదు. పుట్టుకకు ముందు, తర్వాత కూడా మానవుడు నిజానికి ఆత్మ స్వరూపుడే. తరువాత జ్ఞాన సముపార్జన చేత ‘అహం బ్రహ్మాస్మి’ నేను ఆత్మ స్వరూపుడను అని తెలిసికుంటాడు. అదే ముక్తి.

తాను బ్రహ్మము కంటే వేరనే భ్రమతో ఇతర దేవతలనారాధిస్తే ఆ దేవతలు అటువంటి వారి చిన్న కోర్కెలు తీర్చి తమ ఆధీనంలో పెట్టుకొని పశువులను చూసినట్లు చూస్తారు. అందుచేత అలాంటి దేవుళ్ళను ఉపాసించడం కంటే బ్రహ్మోపాసన మేలని చెప్తుందీ ఉపనిషత్తు.

సత్యం, ధర్మం వేరు వేరా?

సత్యం, ధర్మం వేరు కాదు. ధర్మంలో భాగమే సత్యం అని ఈ మంత్రం చెప్తుంది.

తస్మాత్సత్యం వదంతమాహుర్ధర్మం వదతీతి ధర్మం వా

వదంతం సత్యం వదతీత్యేతద్దేవైతదుభయం భవతి (1.4.14)

సత్యం పలికే వాడిని ధర్మం పలికే వాడుగాను, ధర్మం పలికే వాడిని సత్యం పలికేవాడు గాను అంటారు. అంటే సత్యం, ధర్మంలో ఒక భాగమే అన్నమాట. పురుషార్థాలలో సత్యాన్ని ప్రత్యేకంగా పేర్కొనక పోవడానికి కారణం ఇదే.

మిగిలినది మరొకమారు ..........

 బృహదారణ్యకోపనిషత్తు 6వ భాగము

కోరికలను పూర్తిగా త్యజించవలసిన అవసరం లేదు. ధర్మబద్ధమైన కోరికలుండటంలో తప్పు లేదు.

మొదట జీవాత్మ ఒకటిగానే ఉన్నాడు. తరువాత భార్య, సంతానం, సంపద కావాలనే కోరిక పుట్టి వాటిని పొందినాడు. తరువాత తన కోసమో తనవారి కోసమో కర్మలు చెయ్యాలనుకున్నాడు. ఈ విధంగా కోరికతోనే పరిపూర్ణత పొందినాడు. ‘అకామస్య క్రియానాస్తి’ అని మనుస్మృతి. కోరిక లేకపోతే కర్మలేదు, ప్రపంచం స్తంభిస్తుంది. కనుక ధర్మబద్ధమైన కోరికలు ఉండవలసిందే. అయితే ఈ కోరికలు దురాశకు దారి తీయకూడదు. ‘దురాశ దుఃఖమునకు చేటు’ అనికదా పెద్దలమాట. తెలిసిన కథను అతి క్లుప్తముగా నేను వ్రాసిన పద్యరూపములో చదువండి.

ఆశకుపోయి మూర్ఖుడొక అవ్యయ భూమిని పొందగోరుచున్

పాశముతోడ నీశ్వరుని బాయక ధ్యానము చేసి వరంబు కోరగా

ఈశుడు వల్లెయంచు తన ఇచ్చకు చుట్టిన మేర కొమ్మనన్

కోశపు శక్తి మించురికి కొల్పడె ప్రాణము ఆశ తోడుతన్

తస్మాత జాగ్రత.

పంచ భూతాత్మకమైన ప్రపంచం అంటే నామం, రూపం, కర్మ అని ఉపనిషత్తు చెప్పింది. నామములకు ముఖ్యకారణం వాక్కు. దీని నుండే నామాలన్నీ పుట్టుకు వస్తాయి.

‘సత్యస్య సత్యం’ అన్నదే ఆత్మ అని ఉపనిషత్తు ప్రవచించింది.

ఏ ఆత్మ వలన సృష్టి, స్థితి, లయాలు జరుగుచున్నాయో, ఆ ఆత్మను గూర్చి చెప్పేది ఉపనిషత్తు. అందుచేత ఉపనిషత్తును సత్యస్య సత్యం అంటారు. అట్లాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణం అన్నీ సత్యాలే. కాని వాటికి మించిన సత్యం, అంటే ఆత్మను సత్యస్య సత్యం అని చెబుతుందీ ఉపనిషత్తు. ఆత్మ కర్తగా హృదయకుహరంలో ఉంటుంది. గనుక దానిని చూడలేము.

ఉషస్తుడు ఆత్మను ప్రత్యక్షంగా చూపమని యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినపుడు ఆయన ఆత్మ స్వరూపాన్ని ఈ విధంగా వివరించినాడు. కంటిలో చూచే శక్తి ఉంది. ఆ శక్తిని కన్ను చూడగలదా? అట్లాగే చెవి శ్రవణ శక్తిని, మనస్సు మానస శక్తులను చూడగలవా? ఆత్మ కర్త (subject) దానిని నీవు బాహ్య వస్తువుగా (object) చూస్తున్నావు. ఆత్మ నీలోని కర్త గనుక దానిని నువ్వు ప్రత్యక్షంగా బాహ్య వస్తువుగా చూడలేవు. అది సర్వాంతర్యామిగా ఉండే శక్తి. దీనిని తెలుసుకో.

ధ్యాన నిష్ఠ లో ఉండే వాడు మునిగా మారతాడు.

బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసి, జ్ఞాన బలముతో, ఆత్మ జ్ఞాన సంబంధిత విషయాల మీద మాత్రమే ఎకాగ్రచిత్తులయి మెలగాలి. కేవలము పాండిత్యం సరిపోదు. దాన్ని ప్రక్కన విడిచి పెట్టి అమాయక బాలునివలె, ధ్యాన నిష్ఠలో ఉండాలి. అంటే ఒక సంవత్సరము రెండేళ్ళ మధ్య వయసు గలిగిన బాలుడు తానూ చేపట్టిన పని మంచిదో చెడ్డదో, పూర్తి చేయువరకు తన ధ్యాసను ప్రక్కకు మరల్చడు.ఆ విధంగా పట్టువిడువక ప్రయత్నిస్తే క్రమంగా సాధకులు మునులుగా పరివర్తన చెందుతారు.

సూత్ర బ్రహ్మ అంటే ఎవరు?

సూత్ర బ్రహ్మ అంటే వాయువని ఉపనిషత్తు వివరించింది.

ఈ జన్మను, తరువాతి జన్మను, సర్వ భూతాలను పూలమాల వలే కలిపేది వాయువే. మన శరీర భాగాలను కూర్చి సంఘటితంగా ఉంచేది వాయువే. అది నిష్క్రమించిన తరువాత అవి విడిపోతాయి. అందుచేత వాయువే సూత్ర బ్రహ్మ.

‘అక్షర బ్రహ్మం’ అంటే ఎవరు?

అక్షర బ్రహ్మం అంటే నాశరహితమైన ఆత్మ.

అక్షరం (నాశనం లేని ఆత్మ) చూడబడదు గాని చూస్తుంది. వినబడదు గాని వింటుంది. మననం చేయబడదు గాని మననం చేస్తుంది. తెలియబడదు గాని తెలుసుకుంటుంది. ఆత్మ కర్తగా, అంతర్నిహితంగా ఉండేదే గాని మనచేత చూడ శక్యమైన బాహ్యవస్తువు కాదు, అది సర్వాంతర్యామి. సర్వ శక్తి శాలి.

శరీర త్యాగం ఎలా జరుగుతుంది?

శరీర త్యాగ క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

గరిక యందలి పురుగు తను ఉన్న గడ్డి పోచ చివర వరకు వచ్చి దాని నుండి మరియొక గడ్డిపోచ మీదకు ప్రాకి, దాని ఆధారం దొరికిన తరువాత వెనుకటి గడ్డిపోచను విడుస్తుంది. అదే రీతిలో జీవుడు ప్రాణోత్క్రమణ సమయంలో మరియొక దేహాన్ని ధరించి వెనుకటి శరీరాన్ని అచేతనం చేస్తాడు.

ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవాలి?

శ్రవణ, మనన, నిధి ధ్యాసలు ద్వారా చేసుకోవాలి అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది. ఓ మైత్రేయీ! చూడదగినది ఆత్మ మాత్రమే. ఆత్మావలోకనం చేసుకోవాలంటే ముందుగా సద్గురువు నాశ్రయించి, ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటూ క్రమంగా దాని మీదే ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి. ఆ విధంగా శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా ఆత్మావలోకనం చేసిన తరువాత ఇంక తెలుసుకోవలసినదేమీ ఉండదు.

స్వస్తి.

భగవంతుని అనుగ్రహము ప్రాప్తించితే ఇదే విషయముపై మరొకమారు విమర్శ కొనసాగించుకొందాము.

స్వస్తి.

 

Sunday, 15 May 2022

శ్రీ శైల శిఖరం దృష్ట్వా

 శ్రీ శైల శిఖరం దృష్ట్వా

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_15.html

పద్మపురాణంలో ఉత్తరఖండంలో శివక్షేత్రాల గురించి చెబుతూ,

మల్లికార్జునుని ప్రశస్తిని చెబుూ ఈ వాక్యం చెప్తారు

కేదారే ఉదకం పీత్వా వారణాస్యాం మృతోధృవం!

శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే!! (పద్మపురాణం)

కేదారంలోని తీర్థం త్రాగినావారణాసిలో మరణించినా,

శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదు. అంటే "మోక్షం తప్పక లభిస్తుంది" అని అర్థం.

స్కాందపురాణంలో కాశీఖండం మరీ స్పష్టంగా వివరించింది.

"శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్విలోకనాత్!

పునర్భవో మనుష్యాణాం భవేత్ర న భవేత్ క్వచిత్!

గిశ్చతుర శీత్యాయం యోజనానాం హి విస్తృతం!!

సర్వలింగమయో యస్మాత్..."

"శ్రీశైల శిఖరం శుభమయమైనది. దానిని దర్శించినంత మాత్రానమరి జన్మ ఉండదు. ఎనభై నాలుగు యోజనాల విస్తృతి కలిగిన శ్రీగిరి సర్వలింగమయం."

తిరుమలగిరినీశ్రీవేంకటేశ్వరునీదర్శించితే తప్పక శ్రీనివాస కృపాబలం చేత తరించుతాము. ముక్తి లభిస్తుంది. అయితే ఇది చెప్పడానికి శ్రీశైలాన్ని కాదనక్కరలేదు కదా! ఒకరి మంచిని చెప్పడానికి ఇంకొకరిని చెడుగా పేర్కొననవసరం లేదు కదా!

శ్రీశైలంలో ’శిఖరేశ్వరం’ అని చెప్పబడే శిఖరప్రాంతాన్ని చూడడం చాలు. అక్కడ నంది కొమ్ముల్లోంచి ఆలయశిఖరం చూడవలసిన అవసరం లేదు.

స్వస్తి.

Tuesday, 3 May 2022

సదయం హృదయం

సదయం హృదయం 

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post.html

 सदयं हृदयं यस्य भाषितं सत्यभूषितम् ।

कायं परहितं यस्य कलिस्तस्य करोति किम् ॥

సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం |

కాయం పరహితం యస్య కలిస్తస్య కరొతి కిం ||

సదయమైన హృదయముండి సత్య భాష భుషణుడై

పర హితమే పరమావధి పరమాత్మను చేరుటకును

అని నమ్మిన వాని నేమి ఆ 'కలి' ఇక చేయగలడు

ఆలకించుడీ  సూక్తి అందుకోండి మీరు ముక్తి

ह्रदय कभी सदय हो

सत्यवचन भूषण हो

पर हित ही परमात्मा

का साया समझ गयो

करता क्या कलिपुरुष

वही तेरा महा धनुष

sadayaM hRudayaM yasya bhaaShitaM satyabhUShitam |

kaayaM parahitaM yasya kalistasya karoti kim ||

Heart with compassion

Free from any corruption

No hurting no flirting

Making word lethal sword 

With truth as the sharp blade

How can that KALI great

Dare to come to you to treat

Monday, 18 April 2022

కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

 కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష 

https://cherukuramamohanrao.blogspot.com/2022/04/blog-post.html

కేకయాత్మజ తాను కేకల కెరజేయ

తాంతుడై వనికంపె దశరథుండు 

రాక రాక నడుమ రామ చంద్రుడ నిన్ను

పదునాల్గు ముగియగా బడసి నట్టి

క్రూర రాక్షస హంత, కుంఠనము విడదీసి

గూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

నానామునీన మాన నమన మనమున

నీనామ మననము నేను మాన

హీర హార విహార హే హేయ హార

వైరివీరాళి సంహార  వాసవేశ  

శ్రావ్య యశ సూర్య వైహాళి  సారసార

సూరి సారస సుర సేవ్య శూర వర్య                                                                                                                                                                                                  భావము: 

కైకేయి అలకబూని కేకలు వేసి దశరథుని నొప్పించి ఒప్పించ మిక్కిలి కలత  జెందినవాడయిన (తాంతుడు) దశరథుడు అరణ్యమునకు రాముని పంపినాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము నెరపి రావణుని కూల్చి సీతను తోడుకొని రాక రాక వచ్చినాడు రాముడు అయోధ్యకు. ఈ పద్యపాదమునకు తరచి జూచినచో మరొక గోప్యార్థము ప్రకటిత మగుచున్నది. ‘రాక’ అన్న మాటకు పున్నమి అని ఒక అర్థము. రాముడు అయోధ్యలో ఉన్నపుడు అయోధ్యావాసులకు అది పున్నమియే! ఆయన 14 సంవత్సరముల అరణ్యవాస ప్రారంభము వారికి అమావాస్య. అదే 14 సంవత్సరములు ముగించుకొని అయోధ్యకు వచ్చుట వారికి తిరిగీ పున్నమి. ‘రాక’ అన్నమాటకు భూమి పైకి రాక,  అనగా అయోధ్య లో ఆయన పుట్టిపెరిగి పెళ్ళయి సుఖముగా ఉన్నంతవరకు వారికి పున్నమి. ఆయన లేని అయోధ్య వారికి అమావాస్య. 14 సంవత్సరములు ముగియగానే ఆయన సీతాలక్ష్మణ సహితుడై అయోధ్య చేరుట వారికి పౌర్ణిమ. అమావాస్యనుండి పున్నమి బడయుటకు 14 రోజులు. అప్పుడు చంద్రుడు రామచంద్రునిగా అంటే అత్యంత మొహనాకారుడై అగుపించుచున్నాడు. మరి రామచంద్రుడు కూడా 14 వత్సరముల కాలములో సకల రాక్షస సంహారము చేసి , గడువు పూర్తి అయినవెంటనే రెట్టించిన మొహనాకారముతో అయోధ్యావాసులకు అగుపించినాడు. అట్టి శ్రీరామచంద్రుడు మాయందలి అలసత్వమును (కుంఠనమును) ఎడబాపి సద్బుద్ధిని ప్రసాదించమని వేడికోలు. ఎందరెందరో మహా మహా మహర్షులు తమ మనోవానములో నిన్ను ప్రతిష్ఠించుకొని తపమాచారించుకొనుచున్నారు కదా  అట్టి నీవు నా మనసును ఆవహింపగా , మానకుండా నీ నామ మననము చేసుకొను విధి విధానమును నేను మానను  తండ్రీ! ఇందు మూడవ పాదము నందు పదములు కేవలము 'న, మ' అన్న రెండక్షరముల సంయోగము చేత ఏర్పడిన పదములను మాత్రమే ఉపయోగించుట జరిగినది.

పై సీసపద్యమునకు అనుబంధముగా రచింపబడిన తేటగీతికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందు వాడిన పదములలోని అక్షరములు అన్నీ వర్గ రహితములు. అనగా ‘క, చ, ట, త, ప ’ వర్గములకు చెందని ‘య, ర, ల,ళ, వ, శ, ష, స. హ’ లను ఉపయోగించి మాత్రమే వ్రాయుట జరిగినది. ఇక భావమును ఒక పరి పరికింతము.

‘హీర’ అన్న మాటకు వజ్రము, మణి, రవ్వ అని అర్థము. ఒకవ్యక్తి సుగుణ సంపన్నుడయితే అతనిని వజ్రమునకు, మణికి. మనము పోల్చుట కద్దు. అటువంటి సుగుణ మణుల మాలను ధరించి విహరించు, నీచమగు ఆలోచనలను హరించునట్టి, మరియు సన్మతుల విరోధుల ఆట కట్టించు మహనీయుడు మరియు వాసవాదులు అనగా ఇంద్రాది దేవ పూజితుడు, వినుటకు ఎంతయో శ్రావ్యమగు సంభాషణ చేయువాడు,  యశస్సు అను కిరణములను జగద్వ్యాప్తముగా ప్రకటించుచూ విహరించువాడు,  ప్రతిపదార్థ సారమునకు సారమైనవాడు, అగు మహా పండితుడు, సరసమతులగు సకల దేవతలచే సేవింపబడు శూరవర్యుడు శ్రీరాముడు సద్బుద్ధిని ప్రసాదించుగాక!

స్వస్తి.