Friday, 19 August 2022

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

 

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post_19.html

ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కం సంస్కృతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పరమార్థ సౌలభ్య బోధనా సంపుటి. నిర్వాణమునకు మోక్షము అన్న అర్థమును అన్వైన్చుకోన వచ్చును. అప్పుడు మోక్షము అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిన్చుతుంది. తన అనిర్వచనీయమైన ఆత్మయే పరమాత్మ. ఆతాదాత్మ్యమే శివము. అడికలిగినవాడే శివుడు. ఈ జటిలమైన విషయమును ఎంత సుబోధకముగా కలితుగమున పరమ గురువు, ఆదిగురువు, జగద్ద్గురువాగు శంకరులవారు ఎంత సులభ హ్రాహ్యముగా చెప్పినాడో చూడండి.  

మనోబుధ్యహంకార చిత్తాని నాహం

శ్రోత్రం జిహ్వాన ఘ్రాణనేత్రం

నచార్వ్యోమ భోమిర్నతెజోనవాయుః

చిదానందరూపః శివోహం శివోహం

మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను.పృథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. సచ్చితానందానికి సులభమైన నిర్వచనము ' సత్ అంటే సత్యము చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.

నచ ప్రాణ సంగో నవి పంచ వాయుః

నవా సప్తధాతుర్నవా పంచ కోశః

నవాక్పాణిపాదౌ నచోపస్థ పాయుః

చిదానందరూపః శివోహం శివోహం

పంచవాయువులు:

ప్రాణ :    శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు

అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు

వ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం

 ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు

  సమాన:  జీర్ణమవటానికి ఉపయోగపడే వాయువు

ఉప ప్రాణములు:

 నాగ : త్రేన్పు గా వచ్చే గాలి

 కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి

 కృకల :  తుమ్ము

 నంజయ: హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.

 దేవదత్తము  : ఆవులింత లోని గాలి

ఐదు వాయువులు,ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము. ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.

సప్త ధాతువులు:  రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు  (రక్తము, మాంసము, మేధ, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మిగతావి ఆయుర్వేదపరముగా ఈ విధముగా విశ్లేశిన్చుకోనవచ్చును.

మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. పూర్వము 'నీ తస్సదీయ' అనేమాట సాధారణంగానూ సినిమాలలోనూ (రేలంగి వాడినట్లు గుర్తు) వాడేవారు. 'తస్స' అంటే 'మజ్జ'యే. రసము అనగా  మిక్కిలి పలుచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును. మేధస్సు అన్న మాటకు బుద్ధి, అసాధారణ ధారణా మొదలగు అర్థములు మనకు తెలిసినవే! ఆయుర్వదపరముగా సప్త దాతువులలోని మేధకు అర్థము విధముగా ఉన్నది  ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . ఆయుర్వేదము ప్రకారము అస్థి మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధా తువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . శక్రము అనగా తెల్లనిది. దీనినే శుక్రము అని కూడా అంటారు. ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును .

  పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు- కాళ్ళు,ఉపస్థ-అనగా, జననేంద్రియము, పాయువు-గుదము, ఉపస్థాపాయువు(గుదము)లు అంటే పురీష శౌచ ద్వారములునేను, పైన తెలిపినవేవీ కాను. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

రేపు మరి రెండు శ్లోకములథిఒ.....

నపుణ్యం నపాపం సౌఖ్యం దుఃఖం

మంత్రో నతీర్థం నవేదా నయజ్ఞ్యాః

అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా

చిదానందరూప శ్శివోహం  శ్శివోహం

నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఃఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ ,భోజనమునుగానీ,బుజించేవాడినిగానీ కాదుచితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. చిట్ అన్న మాటకు నేను జ్ఞానము అన్న మాతకనా ప్రజ్ఞానము అన్న అన్వర్తమును చెప్పుకొంటాను.చిత్అన్న పదమునకు రూపమునిస్తే రూపమే శివుడు. ఆరు శ్లోకముల సారమును గ్రహించి తదనుగుణముగా ఎంత త్వరగా  శివోన్ముఖులమైతే నిర్వాణమును అంత త్వరగా చేరువౌటాము. అసలు జనన మరణ రాహిత్యమే కదా నిర్వాణము.

నమేద్వేష రాగౌ నమేలోభ మోహౌ

మదోనైవ మేనైవ మాత్సర్యభావః

నధర్మోనచార్థోనాకామోనమోక్షాః

చిదానంద రూపం శివోహం శివోహం

నాకు రాగ ద్వేషములు లేవు.లోభమోహములు లేవు. మదమాత్సర్యములు లేవు.ధర్మార్థకామ మోక్షాలు లేవుచిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. నేను శివుడను అనగా నేనే  చైతన్యము. ఆనంద స్వభావము యొక్క సర్వోన్నతమైన ఐశ్వర్యాన్ని. నేనే శివుడను అనగా  ఐశ్వర్యవంతుడను. నిజానికి ఐశ్వర్యము అన్న మాటను నేటి వాడుక భాషలో సిరి అనగా ధాన్యధనకనకవస్తువాహనసస్యకేదారాలకు వాడుతారు. ఐ సరికాదు. ఈ జగత్తున నిండియున్న సకల చరాహర సంపత్తియంతా ఐశ్వర్యమే! అసలు ఐశ్వర్యమంటే ఈశ్వరీయమే! దానికి అధిపతే ఈశ్వరుడు లేక శివుడు.

రేపు చివరి రెండు శ్లోకములు.......

నమృత్యుర్నశంకానమే జాతిభేదః

పితానైవమేనైవ మాతానజన్మాః

నబంధుర్నమిత్రంగురుర్నైవశిష్యః

చిదానంద రూపం శివోహం శివోహం

మృత్యువు,భయము లేక సందిగ్ధత,జాతిరీతులు,తల్లిదండ్రులు,అసలు జన్మమే, బంధువులు మిత్రులు,గురువు,శిష్యులు ఏమీ లేవు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

మరి నేనెవరు ?

అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం

నవాబంధనం నైవ ముక్తిర్నబంధః

చిదానంద రూపం శివోహం శివోహం

వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి

        అస్తవ్యస్తం, తారుమారు.

నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు.నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని).నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు.నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

ఆత్మ ను గూర్చి ఇంత వివవరంగా విశదంగా విపులంగా విలేవారీగా విజ్ఞతతో అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన ఆది శంకరులకు అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తుడను.

భావము నందు దోషమును భాషన గల్గిన నాదులోటులున్ 

కేవలమంచునెంచి బహు కూరిమి తోడ పఠించి ప్రేమతో

దీవనలిచ్చుచున్ నిగుల దివ్యము భవ్యము దీప్తివంతమై

 జీవితధన్యతన్ గలుగ జేయు మహాత్ముల నాలకించుడీ

అజ్ఞానాత్ విస్మ్రుతే భ్రాంత్యా

యన్యూనమధికం కృతం

తత్సర్వం క్షమ్యతాం దేవ

పరమేశ్వర నమోస్తుతే

 స్వస్తి


Tuesday, 16 August 2022

పూర్ణమదః పూర్ణమిదం

 

పూర్ణమదః పూర్ణమిదం

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post.html

పూర్ణమదః పూర్ణమిదం

ఈశావాస్యోపనిషిత్తు"ఈశావాస్యమిదగ్గ్ సర్వం" అనే మంత్రముతో  ప్రారంభమవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది. యజుర్వేద భాగమైన శుక్లయజుర్వేదము లోని వాజసనేయసంహిత లోని  40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సంహితలో ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతేl  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతేll

ఓం శాంతిః శాంతిః శాంతిః.

పూర్ణమనెడి పదమునకు  అర్ధము, సంపూర్ణమైనది, అన్నిటిని కలిగినది. అంటే అది భగవత్ స్వరూపము. ఇది కాక వేరొక అర్థము లేనిది. ఏమియును లేనిది అని అంటున్నప్పుడు ‘శూన్యము’ యనెడి అర్థము ఒకటి కాగా అన్నిటిని కలిగియున్న, భరించుచున్న ‘పూర్ణము’ అన్నది మరియొక అర్థము. ఇందలి నిజానిజములను పరిశీలింతము.  ‘0’ మరియు ‘   (Infinity, అనంతము) అన్వయించుకొన వచ్చును. ఇక్కడ భారతీయులకు పాశ్చాత్యులకూ ఒక తేడా ఉన్నది. మన సంఖ్యలు ఒక ఊహా వృత్త విభాజకములు, వారిది ఒక సరళరేఖా విభాజక సముదాయములు. అందుచేత వారికి     ఆ సరలరేఖకు ఆద్యము ‘0’ అంతము ‘’. మనకు అట్లు కాకాక ఆదిలోకే అంతము చేరిపోయి అది పూర్ణమౌతుం. వారు  ‘0’ -  ‘0’ =  ‘0’ అని ‘ - =    అని వేరు వేరుగా వ్రాసుకొంటారు. మనకు శూన్యము అనంతము అంతా ఒకటే! కాబట్టిరెండూ పూర్ణమే! ఒకే సంఖ్యనుండి అదేసంఖ్యను కూడినా తీసివేసినా ఆ ఫలితము ఒకటే అయితే ఆ సంఖ్యలు వేరువేరు కాజాలవు కదా! ఈ పూర్ణమే భగవత్ స్వరూపము.

ఈ వాస్తవమే కఠోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడినది.

అణోరణీయాన్మహతో మహీయా

నాత్మా2స్య జంతోర్నిహితోగుహాయామ్

తమః క్రతు పశ్యతి వీతశోకో

ధాతుప్రసాదాన్మహిమా నమాత్మనః (2.20)

అంటూ వున్నది కఠోపనిషత్తు.

మనకు అణువే కనబడదు. అణోరణీయాన్ - అణువులో అణువు వంటిది, మహతో మహీయాన్ - మనముచెప్పలేనంత పెద్దదిగా ఉంహించుకున్న దాని కంటె పెద్దది. జీవుల (సకల ప్రాణుల) హృదయగుహలో ఉన్నది. అదియే ఆత్మ. అక్రతుః- అంటే ఏకార్యమూ లేనివాడు. చూచేవాడు చూడబడేదీ అదే కాబట్టి ఆత్మకు ఏ ఇతర కార్యములేదు. పశ్యతి - దేహాత్మాభావన లేనివాడే హృదయగుహలోని వస్తువును చూడగలుగుతున్నాడు. వీతశోకః - శోకములేనివాడు అవుతున్నాడు. ధాతుప్రసాదాత్ మహిమానమాత్మన - విధాత ప్రసాదమువలన ఆత్మను మహత్తును చూడగలుగుతున్నాడు.

తిరిగీ అసలు విషయమునకు వస్తే ఆ పరమ పదార్థము మానవుల ఇంద్రియములకు గోచరమగునది కాదు. ఆకాశము వంటిది. ఆకాశమును మన పూర్వులు శూన్యముతో పోల్చినారు. భూమి గోళము అన్నది మనకు తెలిసిన విషయమే! కావున ఆకాశము కూడా ఒక పూర్ణ గోళమగుచూ భూమిని ఆవరించి యున్నట్లె కదా! అప్పుడది పూర్ణము. అనగా అది పరమాత్మ తత్వమగు ‘మహతో మహీయాన్’ ను ధృవ పరచుచున్నది.

కావున మన తత్వ శాస్త్ర రీత్యా అయినా గణిత శాస్త్ర రీత్యా అయినా పై శ్లోకము యొక్క సారాంశము

‘0’ - ‘0’ = ‘0’   - =

‘0’ + ‘0’ = ‘0’   + =

ఇదే పూర్ణత్వము ఇదే పూర్ణ తత్వము

ఒక పాఠకుడు తన విమర్శ యొక్క సారాంశముగా భగవద్గీత 2వ అధ్యాయములోని 16వ శ్లోకమును ఉటంకిస్తూ 'Matter can neither be created nor destroyed' అని తెలితెలిపినారు పుట్టుక నాశము లేనివాడు భగవంతుదనియే కదా భగవద్గీత చెప్పుచున్నది, ఈ matter  ను మాయ ఆవరించి ఉంటుంది, ఆ మాయ శాశ్వతము, భగవద్గీత ౨వ శ్లోకము యొక్క వివర ణ ఈ దిగువన తెలియజేయబడినది, చదువగలరు,

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।

ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।

అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.

శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.

భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా

సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)క్షరం ప్రధానమమృతాక్షరం హరః

క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)

సంయుక్తమేతత్ క్షరమక్షరం చ

వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)

ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.

. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).

2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.

3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చియి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?

ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.

సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స

తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా

తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్

నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం

చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం

కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)

భగవంతుడు ఈ జగత్తును సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో కూడా వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.

స్వస్తి.

Monday, 18 July 2022

అలంపురం జోగులాంబ

 

అలంపురం జోగులాంబ

   https://cherukuramamohanrao.blogspot.com/2022/07/blog-post.html

పూర్వము దక్షప్రజాపతి నివసించిన ప్రదేశముగా దక్షారామము ప్రసిద్ధిచెందినది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి అని కూడా చెబుతారు, కావున ద్రాక్షారామము  అయినదని కూడా చెబుతారు కానీ ‘దక్షారామము వాడుకలో కృతకమయి ‘ద్రాక్షారామము’ అయిఉండవచ్చునని నా అభిప్రాయము. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించినాడు కానీ, కారణాంతరాలవల్ల, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. నిరీశ్వర యజ్ఞం చేయాలని సంకల్పించినాడు. ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసి. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం చూడ ఉత్సుకత ఎంతగానో తనకున్నదని, వెళ్తానని పరమశివుని అడుగుతుంది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దని చెబుతాడు. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. శివుడ సతీదేవితో, అక్కడ అవమానము జరిగితే తిరిగీ కైలాసము రావద్దని అంక్ష విధించుతాడు. ఆయనకు భూత భావిష్యద్వర్తమానములు విదితములే కదా! అక్కడ సతీదేవికి అన్నివిధములా శృంగభంగము జరుగుతుంది. దానితో సతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకు వెళ్ళలేక పోయింది.  అవమానం భరించలేక జగన్మాత యజ్నగుండము లోనికి దూకింది.  శివుడు విషయమును గ్రహించి వీరభద్ర కాలికాడులను పరమత గణములతో కూడా పంపి యజ్ఞమును ద్వంసముజేసి విలయతాండవము జరిపినారు. శివుడు అప్పుడు అచటికి వచ్చి సతీదేవి అగ్నికి ఆహుతి కాకుండానే ఆమె మృతదేహమును భుజముపై వేసుకొని  లోక సంచారమునకు సమకట్టినాడు. తారకాసుర సంహారమునకు కుమారోద్భవము జరుగవలసియున్ననందున. విష్ణువు యోచించి తన చక్రాయుధముతో సతీదేవి శవమును ముక్కలు ముక్కలు చేసినాడు. ఆ శరీర భాగములు 18 ముక్కలయి 18 చోట్ల పడినాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీచక్రాలను స్ధాపించినారు. ఆ తరువాత సతీదేవి పార్వతియై హిమవంతుని కూతురిగా జన్మించి కుమారసంభవమునకు కారణమై తారక సంహారమునకు దొహదపడినది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకంము ఈ క్రింది విధముగా వున్నవి.

1.       లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురేl

     ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణేll

2.     అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికాl

     కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికాll

     3.  ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికాl

          ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికేll

 

4.    హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీl

     జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికాll

5.    వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీl

     అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ll

6.    సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్l

    సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్ll

ఈ పద్దెనిమిది శక్తి పీరములలో ఐదవది జోగులాంబ తల్లిది. ఆ తల్లిని ఈ క్రింది విధముగా ప్రార్థించుతారు

లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపం మహాబలాంl

ప్రేతాసన సమారూఢాం జోగులామ్బాం నమామ్యహంll 

 

అమ్మది ఇక్కడ భీకరాకారము. జారిన కుచములు, వికృత ద్రుష్టికలిగిన కనుగవ, ఘోరంకగు రూపము, మహా బలిష్టమగు శరీరము, పైగా ఈ తల్లి ప్రేతాసనముపై కూర్చొని ఉంటుంది. ఈ విక్రుతులను వైపరీత్యాలను తానూ గ్రహించి భక్తులను కాఆపాడు ఆ తల్లికి సాష్టాంగ నమస్కారము.

ఇక ఈ దేవాలయ చరిత్రను గూర్చి కాస్త తెలుసుకొందాము.

మిగిలినది మరొకమారు .........

అలంపురం జోగులాంబ 2

ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానుల ఆగడములచే నేలమట్టము చేయబడినది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపి, తదుపరి దాడులను అరికట్టి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచినాడన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని ప్రక్కనున్న బాలబ్రహ్మ దేవాలయానికి పూజారులు తరలించి, దాచిపెట్టినారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించుట జరిగినది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఈ పుణ్యక్షేత్రము 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమయిన గద్వాలుకు 60 కి.మీ. దూరములోనూ, హైదరాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్నdiది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ సముదాయమును కట్టించిన ఘనత బాదామి చాళుక్యులది. నాటి ఈ క్షేత్ర వైభవము వర్ణనాతీతమని చరిత్రకారుల మాట.  కన్నడ, ఆంధ్రప్రదేశాలలో అనేక నిర్మాణాలు వీరి ఔదార్యము మరియు భక్తియే! వీరు బీజాపూర్‌ మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించినారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక క్షేత్రము ఉన్నది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టినారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేసినారు. జోగులాంబ, బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర క్షేత్రము ఉత్తర వాహిని తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశీ గా పేరుగాంచిన ఈ క్షేత్రము. ఈ క్షేత్ర  విశేషాల గూర్చి కాస్త తెలుసుకొందాము....        ప్రస్తుతం అలంపురముగా పిలవబడుతున్న ఈ గ్రామము పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపుర అని తెలియవస్తూ ఉన్నది.  స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రాహ్మీలిపి లోని శాసనములో అలంపురము ప్రస్తావన ఉంది. నడుకశ్రీ(అర్థము తెలియలేదు) అనే వ్యక్తి తన ఆయుష్షు పెరుగుట కోసం భగవంతుడైన అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామికి కొంత భూమిని ధారాదత్తము చేసినాడట.

మిగిలినది మరొకమారు.......

అలంపురం జోగులాంబ 2

ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానుల ఆగడములచే నేలమట్టము చేయబడినది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపి, తదుపరి దాడులను అరికట్టి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచినాడన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని ప్రక్కనున్న బాలబ్రహ్మ దేవాలయానికి పూజారులు తరలించి, దాచిపెట్టినారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించుట జరిగినది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఈ పుణ్యక్షేత్రము 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమయిన గద్వాలుకు 60 కి.మీ. దూరములోనూ, హైదరాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్నdiది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ సముదాయమును కట్టించిన ఘనత బాదామి చాళుక్యులది. నాటి ఈ క్షేత్ర వైభవము వర్ణనాతీతమని చరిత్రకారుల మాట.  కన్నడ, ఆంధ్రప్రదేశాలలో అనేక నిర్మాణాలు వీరి ఔదార్యము మరియు భక్తియే! వీరు బీజాపూర్‌ మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించినారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక క్షేత్రము ఉన్నది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టినారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేసినారు. జోగులాంబ, బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర క్షేత్రము ఉత్తర వాహిని తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశీ గా పేరుగాంచిన ఈ క్షేత్రము. ఈ క్షేత్ర  విశేషాల గూర్చి కాస్త తెలుసుకొందాము....        ప్రస్తుతం అలంపురముగా పిలవబడుతున్న ఈ గ్రామము పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపుర అని తెలియవస్తూ ఉన్నది.  స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రాహ్మీలిపి లోని శాసనములో అలంపురము ప్రస్తావన ఉంది. నడుకశ్రీ(అర్థము తెలియలేదు) అనే వ్యక్తి తన ఆయుష్షు పెరుగుట కోసం భగవంతుడైన అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామికి కొంత భూమిని ధారాదత్తము చేసినాడట.

మిగిలినది మరొకమారు.......

అలంపురం జోగులాంబ 3 (చివరి భాగము)

నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించినారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మిక్కుటముగా ఆలయాలను కట్టించినారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి. బాలబ్రహ్మశ్వర దేవాలయము ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహము ఉండదు.  స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల శిల్పకళా సౌందర్యమునకు మచ్చుతునకగా నిలచింది. క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయము జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపురము భక్తుల కోలాహలము తో కిటకిటలాడుతుంది.                                                  

అలంపురము ఎలా చేరుకోవాలి అన్న సందేహమునకు ఇక్కడ సమాధానము దొరుకుతుంది. విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపురము గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

సంగ్రహముగా అలమ్పురమును గూర్చిన సమాచారము పాఠకుల సౌఖర్యార్థము ఈ దిగువన ఇవ్వబడినది.స్వస్తి.

1. అష్టాదశ శక్తి పీఠాల లోని ఒక శక్తి పీఠం...ఈ ప్రదేశంలో దేవి యొక్క పై దవడ పడిందట.

2. ఈ క్షేత్రంలో అమ్మవారిని యోగులంబ అని, యోగాంబ అని చివరికి జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి..

3. బహమనీ సుల్తానుల దాడులలో (క్రీ. శ. 1480) పూర్వపు ఆలయం పూర్తిగా శిధిలమయిందట. కారణం ముష్కర తురుష్క మూకలు అమ్మవారి ఆ ఆలయమును పూర్తిగా నామ రూపాల్లేకుండా   ధ్వంసం చేయుటయే!

4. పూజారులు మాత్రం అమ్మ వారి విగ్రహాలను కాపాడ గలిగినారు.

(చిత్రంలో దెబ్బతిన్న ఆలయకలశాన్ని చూపాను చూడండి)

5. దేవి ఇక్కడ చండి ముండి (బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో) రూపంలో ఉంటుంది.

6. దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయము 525 సంవత్సరములు.

7. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా కట్టిన గుడిలో అమ్మవారి పునః ప్రతిష్ఠ చేసినారు.

8. తురుష్కులు కేవలం ధ్వంసం చేయుటతో ఆగక ధ్వంసము చేసిన ఆలయముయొక్క  స్థలమున ఒక దర్గాను ఏర్పరచి నడుపుచున్నారు.

9. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముస్లిం మత పెద్దలందరినీ ఒప్పించి దర్గా ను ఒక చిన్న గదికి పరిమితం చేసినారు.

10.  ఈ క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. పూర్వం శ్రీశైలం ప్రాజెక్టు లో నీరు నిండితే ఈ ఆలయముపై నదీ ప్రవాహ ప్రభావం పడకుండా పెద్ద గోడ కత్తుట జరిగినది. .

ఇక్కడ అమ్మవారిది ఉగ్ర రూపము.

ఆ వేడిమిని తగ్గించుటకు  దగ్గరగా ఒక తటాకాన్ని నిర్మించినారు.

 ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలు నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి.

అవి 1. తారక బ్రహ్మ ఆలయము 2. స్వర్గ బ్రహ్మ ఆలయము 3. పద్మ బ్రహ్మ ఆలయము 4. బాల బ్రహ్మ ఆలయము 5. విశ్వ బ్రహ్మ ఆలయము 6. గరుడ బ్రహ్మ ఆలయము 7.కుమార బ్రహ్మ ఆలయము 8.ఆర్క బ్రహ్మ ఆలయము 9. వీర బ్రహ్మ ఆలయము.

ధ్వంసము కాగా మిగిలిన పురాతన  ఆలయలో చాల ఉపాలయాలు ఉన్నాయి. చాల విశాల ప్రాంగణము ను ఈ దేవాలయము కలిగియున్నది.

ఈ ఆలయ శిల్పకళ అత్యద్భుతము. ద్వారలపై భాగంలో బ్రహ్మ లోకం, విష్ణులోకం, శివలోకం అనే మూడు శిల్పాలు పై కప్పు పై చెక్క బడినాయి.

ఇంకా ఇచట సూర్యనారాయణ స్వామి ఆలయము, నరసింహ స్వామి ఆలయము ఉన్నాయి.

వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినాడు.

ఈ క్షేత్రం కర్నూల్ నుండి కేవలం 25 కి.మీ.దూరంలో, హైదరాబాదు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. కానీ ఇది తెలంగాణాలోని గద్వాల్  జిల్లా కు చెందుతుంది.

స్వస్తి.