Thursday, 11 September 2014

కొనకుండా నవ్వుకొనండి

కొనకుండా నవ్వుకొనండి -- 1

బాల భీముడు 

పప్పు పచ్చడి బహురుచి పటిమతోడ 
ఆకు విలసిల్ల కూరల అప్పడముల 
మనసు చూపుల నొకటిగా మసలజేసి 
బాలభీముడు లంఘించె పరవశమున

Photo: బాల భీముడు 

పప్పు పచ్చడి బహురుచి పటిమతోడ 
ఆకు విలసిల్ల కూరల అప్పడముల 
మనసు చూపుల నొకటిగా మసలజేసి 
బాలభీముడు లంఘించె పరవశమున

కొనకుండా నవ్వుకొనండి -- 2

కొన్ని దశాబ్దాల క్రితం రెండు హిందీ సినిమాలు ఈ క్రింది పేర్లతో వచ్చియుండినవి. 
1.సావన్ కో ఆనేదో 2. ఆయా సావన్ ఝూం కె . సావన్ అంటే శ్రావణమాసమని మీకు తెలిసే వుంటుంది .
అంటే 1. శ్రావణ మాసము రానీ 2.శ్రావణము ఊపుతో వచ్చింది అని మనము తెలుగులో అర్థము చేసుకోవచ్చు. 

ఒక ఆటోకు వెనకల 'సావన్ కో ఆనేదో' వ్రాయబడి వుండినది. ఆటో వెనకాల ఒక లారీ అమిత వేగంగా వచ్చి దానిని బలంగా గుద్దినది. ఆ లారీ ముందు వైపు చూస్తే 'ఆయా సావన్ ఝూం కె' అని వుండినది. 

అంతే.

కొనకుండా నవ్వుకొనండి -- 3

ఒకసారి హిందూ మహా సాగరములో పడవషికారుకు రాహుల్,కేజ్రేవాల్ ,మోదీ పొయినారు . 
ఉన్నట్లుంది ఒక భూతము దర్శనమిచ్చింది వారికి . 'మీరు నన్నుదాటి పోలేరు నాషరతును అంగీకరించకుండా' అన్నది ఆ భూతం . వాళ్ళూ వేరే దారిలేక 'ఆ షరతు ఏమిటి'అని అడిగినారు . భూతము వెంటనే 'మీరీ సముద్రములోపడవేసిన యేవస్తువైనా నేను వెదకి తెస్తే మీకు దెబ్బలు పడుతాయి లేక నేను తేలేకపోతే అల్లా ఉద్దీన్ కు మల్లె మీరు నాయజమానులౌతారు' అన్నది చెప్పిన వెంటనే ఒక సూది సముద్రములోనికి వేసినాడు మన రాహులుడు . వెదకి తెచ్చింది భూతము . ఆ పై విషయము నేను చెప్పనవసరము లేదు. కేజ్రేవాలు తనతెలివిని ఉపయోగించి తన చెల్లు లోని సింకార్డును తీసి నీల్లపాలు చేసినాడు . భూతము అది కూడా తెచ్చుట జరిగింది . తరువాత విషయం సరేసరి . ఇక మోడీ వంతు వచ్చింది . ఒక తెల్లటి గుండ్రటి వస్తువు చూపి సముద్రము లోనికి విసరినాడు మోదీ. భూతము ఎంత వెదకినా దొరకలేదు . వెంటనే భూతము వంగి నమస్కరించి నీ బానిసను అనింది . అంటే పద డిల్లీకి పనిచాలా వుంది అన్నాడు మోదీ.
మిగిలిన యిద్దరికీ శారీరిక బాధకన్నా మానసిక బాధ బలమై ఏమి విసరినావని మోదీని అడిగినారు. అతను వెంటనే ఒక desprin tablet అన్నాడు .


కొనకుండా నవ్వుకొనండి -- 4

క్రికెటు బేటు పట్టి క్రీసున నిలబడి
నెల దంచుచుండె నెల యనగ
తనకు వచ్చు 'డక్కు' తిన క్రిముల నతండు
ఎరుచుందే నంటి తీరుబడిగ

కొనకుండా నవ్వుకొనండి -- 5

నా భార్యతో ప్రక్క ఇంటి ఆవిడ ఈ విధంగా అనింది. ఆమాటకు నేనిచ్చిన జవాబు చదవగలరు.
 'నీ సెలక్ షనమ్మ నిజ మెపుడు బాగుండు
అన్న పడతి తోడ నంటి నేను 
'అమ్మ తానూ నన్ను అందుకే మనువాడె'
అట్లు కాక నైతినామె పతిని

కొనకుండా నవ్వుకొనండి -- 6

కొంటె శిష్యుడు :'గురువు గారూ ప్రకృతి అంటే ఏమిటి వికృతి అంటే ఏమిటి.

గురువు : ' మీ అమ్మ ప్రక్రుతి,నీవు వికృతి ' కొనకుండా నవ్వుకొనండి -- 7

మేస్త్రీ : అదేమిటి నీవు మాత్రమె ఒక రాయి పట్టుకొని పోతున్నావు. మిగత వారిని చూడు.వాళ్ళంతా రెండు రాళ్ళను పట్టుకొని పోతున్నారు చూడు.
కూలి : వాళ్ళంతా బద్ధకస్తులండీ. పని ముగించి విశ్రమించవలె ననుకొంటున్నారు. నేను వారిలాగాక  కాక నా పనిని నిలుపు నిదానం గా వలుపు వైనంగా అలుపు ఆయాసము లేకుండా చేయవలె ననుకొంటున్నాను.


కొనకుండా నవ్వుకొనండి -- 8

స్నేహితుల బిల్లు కూడా తానే చెల్లించ వలసి వస్తూవుందన్న బాధతో cash counter వద్దకు పొతే అక్కడ వినిపిస్తూ వున్నా పాట " ఇచ్చుటలో వున్నా హాయి వేరేచ్చతను లేనే లేదని ... నిజాము నాకు తెలిసింది "

కొనకుండా నవ్వుకొనండి --  9

మార్కెటింగు బ్రాంచి మానేజరొక్కడు 
కాలు లోన బెట్టు కష్టమరును
చెప్పుడేమి సేవ చేయుదు నేనన్న
సుస్సుకెళ్ళు దారి చూపమనెను

కొనకుండా నవ్వుకొనండి --  10
రైల్వే గార్డు తో అతని స్నేహితుడు: ఎందుకండీ మీ ఆవిడ ఆకు పచ్చ లిప్ స్టిక్ పెట్టుకొంటుంది"

గార్డు : ఎరుపు చూస్తే నేనేపనీ చేయనుగా ?"
కొనకుండా నవ్వుకొనండి -- 11
శిష్యుడు : గురువుగారూ మీకన్నా వయసులో పెద్దవారు కూడా తలకు రంగు వేస్తారు మీరెందుకు వేయరు ?

గురువు : ఏ బస్సు రైలు ప్రయాణాలలో నేను సీటు లేక నిలబడి వుంటే అయ్యోపాపమని తలచి సీటిచ్చి మాట కలుపుతారని "

కొనకుండా నవ్వుకొనండి -- 12

"నేను అమెరికా ప్రెసిడెంటును కావాలనుకొంటున్నాను "

"నీకసలు బుద్ధుందా"

"ఏం బుద్ధున్నవాళ్ళు పనికిరారా"

కొనకుండా నవ్వుకొనండి -- 13
ఒక స్త్రీ ఒక పురుషుడు తమ తమ వాహనాలను, పెద్దగా సంచారములేని రోడ్డుపై, వ్యతిరేక దిశలో నడుపుకొంటూ వస్తున్నారు.అతడు చాలా rash గా వస్తున్నాడు. ఏమైందో ఏమో పెద్ద accident జరిగి పోయింది. రెండు కార్లు ఎందుకూ పనికిరాకుండా పోయినాయి. స్త్రీ వెంటనే స్పందించి " ఇంత accident జరిగినా కార్లకు తప్ప మనకేమీ హాని జరుగలే"దన్నది అతనితో. అందంగా వున్న యాఅతివ ఆమాట అంటూనే ఆలోచనే లేకుండా "అవునవును మనము చాలా అదృష్టవంతుల"మన్నాడు అతను. ఆమె వెంటనే "మీరెంతో సరళ హృదయులు" అని ప్రశంసించింది. అతను కూడా స్పందించి "మీకన్నానా" అన్నాడు. ఒక నిముసం మాట్లాడుకొన్న తరువాత ఆమె అతనితో " ఇంత accident జరిగినా చూడండి నాకిష్టమైన విస్కీ బాటిలు మాత్రం పగలలేదు. బహుశా అది కూడా మన సహవాసాన్ని కోరుకొంటూవుందేమో" అన్నది. అతను కూడా ఉత్సాహంగా "అవును" అని తల వూపినాడు. వెంటనే ఆమె "ఈ సందర్భాన్ని ఇక్కడే చిరస్మరణీయమ్ ఎందుకు చేసుకోకూడదు" అని అన్నది. అతనూ ఉత్సాహంతో "అవును' అన్నాడు . ఆమె మూత తీసి విస్కీ సీసా అతని చేతికిచ్చింది. అతను ఆనందంగా ముప్పాతిక సీసా ముగించి ఆమె చేతికిచ్చినాడు . ఆమె సీసాకు మూతపెట్టి తిరిగి అతని చేతికే ఇచ్చింది. "మీరు పుచ్చుకోరా" అన్నాడతడు.

ఆవిడ నింపాదిగా "నాకు వద్దు నేనిప్పుడు పోలీసులకోరకు wait చేస్తున్నాను"అన్నది.
మీకర్తమై పోయివుంటుంది, మరి ఆలస్యమెండు నవ్వండి



కొనకుండా నవ్వుకొనండి -- 14

కొనకుండా నవ్వుకొనండి -- 15

కొనకుండా నవ్వుకొనండి -- 16

కొనకుండా నవ్వుకొనండి -- 17

కొనకుండా నవ్వుకొనండి --  18


కొనకుండా నవ్వుకొనండి -- 19

కొనకుండా నవ్వుకొనండి -- 20

Saturday, 6 September 2014

నేను వ్రాసిన ఈ సర్వలఘు ఆటవెలదిని చదువరూ !

కన నడకన విరుపు కనుగవన మెరుపు
అరయ ముఖము నునుపు ఆధరమెరుపు
వనితలనిన మిగుల వలపక్షము విధికి
పురుషు చులక బరిచె పురుగు వలెను

Friday, 18 July 2014

Samavedam Shanmukha Sarma


'వేదానాం సామ వేదోస్మి' (భగవద్గీత 10-22) అని పరమాత్మ శ్రీ కృష్ణుడు చెప్పినాడు. అది ద్వాపరము . చెప్పినది ఒక్కరికే అంటే అర్జనునికే . చెప్పినదీ ఒక్క సారే . బహుశ అది చాలినట్లు ఆయనకే అనిపించలేదేమో.  . అందుకే కలియుగములో సామవేదానికి ప్రాణము పోసి, 'శివాయ విష్ణురూపాయ ... '
అన్న నిజాన్ని తెలుపుతకా అన్నట్లు 'షణ్ముఖుడై' 'సామవేదం  షణ్ముఖ శర్మ' యై వేదవేదాంగ వేదాంత 
గీతా రహస్యాలను ప్రపంచానికి చాటుతూ 'వసుధైవ కుటుంబకం' చేయుటయే కాక మన సంస్కృతి సాంప్రదాయాలను సహేతుకముగా నిరూపించి  వాటిని పునఃప్రతిష్ఠ చేయుచున్న ఆ మహనీయుని గూర్చి తెలుప సామాన్యులకు శక్తీ సరిపోదు. 
ఆయన విజ్ఞాన ఖని    ప్రజ్ఞాన ధని    సుజ్ఞాన సుమవని   
అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసే ద్యుమణి 

సామవేదమన్న సామాన్యుడా మరి 
సకల వేదమూర్తి సత్వవర్తి 
వారి దర్శనమ్ము వారించు నఘములు 
ధన్యులగుద మతని దరిన చేరి


  • 16 hrs · Unlike · 1
  • Sunitha Macherla Cheruku Ramamohanrao garu, pravachanam meeru vaaripai vraasina padaalathone modalu ayindi. pedda oorlallo ayinantha ghanangaa kaakapoyina, maakoo vaarikee entho thrupthi karanga jarigindi. ippatiki nenu idi nijama kalanaa ani anukuntunnaanu. 4-5 days aayana mottham maathone unnaaru. ennenni thappulu chesaano! annitinee aayana entho dayatho mannisthoo, chakkagaa chesthunnaavamma ani prothsahisthoo vacchaaru. ivvaale vere ooriki vellipoinaaru. maa iddari manasullo anthaa velithe.

Wednesday, 14 May 2014

ఎండకాలము పై నా సీసము

మాయూర నీరు

ఘన తపమ్ములు జేసి గంగ తెచ్చుట కాదు
చేదు మా బావి లో చెంబు నీరు
జటిల మందాకిని  జడల నిల్పుట కాదు
ఇంటి టాంకున  నింపు ఇంత  నీరు
పాతాళ గంగను బయలు దెచ్చుట  కాదు
బోరింగు కొట్టి మా బొచ్చె నింపు
జలనిధులింకంగ జలము ద్రావుట గాదు
చూపు మాయూరిలొ చుక్క నీరు

ఓ భగీరథ భూజాని ఓ మహేశ
పాండుమధ్యమగస్త్యయో  పరమ పురుష
గతము గొప్పలు గట్టిగా కట్టి పెట్టి
మండు వేసవి మాయూర మసలి పొండు

అయ్యా భగీరథా నీవు ఎన్నోమార్లు ఎందరినో గూర్చి తపస్సు చేసి గంగను దివి నుండి భువికి తెచ్చిన్నావు . అందులో ఏమి వున్నది గొప్పతనము నీ చేతనైతే వా వూరి బావిలో ఒక చెంబు నీరు చేదు చూద్దాము!
అయ్యా గంగాధరా! అన్యులకు సాధ్యముగాని మహావాహినియైన గంగను నీ జటల నడుమ బంధించినావట. మరి అదే నిజమైతే మా ఇంటి టాంకులో ఇంత నీరు నింపు, నీవు చేసినపని నిజమో కాదో చూస్తాము!
అయ్యా! పాండవ మాధ్యమా అర్జునా ! భీష్ముడడిగితే పాతాళ గంగను నీవు ఒక్క బాణపు వ్రేటుతో బయటికి తెప్పించి ఆయన దాహము తీర్చినావట. అదే నిజమైతే మా బోరింగు కొట్టి నీళ్ళు మా బొచ్చెలో నింపు నీపస మేము పసికడతాము!
మహానుభావా అగస్త్యా కుంభసంభవా! నీవు జలనిధినే త్రాగినావట. మరి మా ఊరికొచ్చి ఒక్క చుక్క నీరు చూపించు నీ గొప్పదనము తెలుసుకుంటాము.

ఇన్నిమాటలేల మందు వేసవి రోజు మా వూరిలో ఒకసారి ఉండ రండి . 

Tuesday, 6 May 2014

బస్సులో ఒక రోజు-కథ



బస్సు బయలుదేరుటకు ముందు నామాటలు నాలుగు వినండి. నాలుగు అన్నది మాటవరసకే సుమా! పళ్ళు లేని అవ్వ కూడా పువ్వు లాంటి నవ్వు  నవ్వా లనుకునే ఈ రోజుల్లో ఎవ్వడైనా రవ్వంతైనా నవ్వు నవ్వనివాడుంటాడా  అని నా మనసును అడిగినాను . మనసు వెంటనే ఎందుకు వుండరూ! మన చంద్రబాబు ఇప్పుడిప్పుడు నవ్వు నేర్చుకుంటున్నాడు గానీ గతమంతా నవ్వు రువ్వేవాడు కాడుగదా! అని వెంటనే సమాధానమిచ్చింది. మరి నవ్వకపోతే ఏమౌతుంది అన్నది నా ప్రశ్న. 'నీవు నవ్వకుంటే పళ్ళులేనివానివి అనుకొంటారు అందరూ అన్నది' నా మనసు యొక్క జవాబు. సరే నేను నవ్వడానికే నిశ్చయించుకొన్నాను మరి మీ మనసులు మీకేమి జవాబు చెబుతాయో!

ఇక బస్  ఎక్కుచున్నాను. పై ఉపన్యాసము చెప్పి ఎక్కేలోపల బస్సు నిండిపోయింది. చేరవలసినది కడప ప్రయాణము 35 కిలోమీటర్ల దూరము. నేను బయలుదేరిన స్థలము కమలాపురము. 'అడుగడుగు దండాలవాడా' 'ముద్ద కు బిస్మిల్లా' అన్నట్లు అది ప్రతి 4,5 కి.మీ. లకు వచ్చే పల్లె పల్లె దగ్గరా నిలిచే బస్సు . నేను ప్రతి రోజూ ప్రయాణము చేసే వాడిని. టికెట్టు ధర రూ.1.25. రానూపోనూ రూ.2.50 మరియు ముఖ్యమైన వినియోగదారులు ఆఫీసులో నన్ను చూచుటకు వస్తే, వారికి చాయ్ ఇప్పించుటకు, ఒకరోజుకు ఇద్దరు మాత్రమె,1/2 రూపాయి కలిపి రూ.3 గా ఇచ్చేది వితరణశీలియైన నా ఇల్లాలు. దేవుని దయతో చివరిలో ఏడుమంది కూర్చునే సీటులో నాకోసమా అన్నట్లు ఒక్క సీటు మిగిలియుంటే నేను అచ్చటసుఖాశీనుడనైనాను. సర్డుకొన్నతరువాత ప్రక్కన చూస్తే ఒక పల్లెటూరి ఆవిడ నా ప్రక్కన కూర్చొని వుంది. ఆ ఊరు మల్లె పూలకు ప్రసిద్ధి.ఎండలు మండిపోతూ వుంటాయి. నేనెక్కిన సమయము సాయంకాలము 5.30నిముసములు. నా వయసు 30 లోపే.

ఎట్టకేలకు, కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరకు, బస్సులో కదలిక కనిపించింది. తడిసిన చొక్కాను మెల్లగా వచ్చిన పిల్లగాలి చల్లగా పలకరించింది. పైకి పోబోతున్న ప్రాణాన్నికిందికి లాగింది, గాలి , నాకష్టాన్ని అర్థం చేసుకొని.అంతలో ఒక మల్లెపూలమ్మే కుర్రవాడు 'మల్లె పూల్', మల్లెపూల్', అని అరుస్తూ బస్సు యొక్క ఒక ప్రక్కన ఎక్కి దిగుటకు రెండవ ప్రక్క రాసాగినాడు. ఎదో ఆలోచనలో ఏటో చూస్తున్న నన్ను ఎవరో తొడమీద బలంగా చరిచినట్టనిపించి,  నేను దిగ్భ్రమకు లోనైనాను.సప్త సముద్రములేకమైనట్లు,మిన్ను విరిగి మీద పడుతున్నట్లు, ఆశనిపాతము తో కూడిన వర్షము నాపైన మాత్రమె పడుతున్న అనుభూతులన్నీ ఒక్కసారి కలిగి, బాధ కలిగిన తొడ వైపు చూపు మరల్చినాను. నా ప్రక్కనున్న ఆ పల్లెటూరి ఆవిడ ఆ పూలసాయాబు వైపు చూపించి 'అయ్యా! పూలు కొనుక్కుంటా' నని అన్నది. నా అదృష్టమో దురదృష్టమో కానీ ఆ రోజు నా అతిధి పూజా ధన వినియోగము కాలేదు. కొనివ్వకపోతే గిచ్చుతుందేమోనని భయపడి  సరే అన్నాను. ఆమె పూలవానిని పిలిచి ఒక అర్ధ రూపాయికి పూలు ఇవ్వు అనింది.ఆశ్చర్య పడవద్దండి. ఆ రోజులలో ఆ ధరకు టీలు,కాఫీలు,పూలు ఇత్యాదులు అర్ధ రూపాయికి లోపలే దొరుకేవి. దేవునికి మనస్సులోనే నమస్కరించి ఉన్న అర్ధరూపాయిని పూలవాని హస్తగతం చేసివేసినాను. థాంక్స్ అన్న మాట ఆమెకు తెలియదు కావున చెప్పలేదు.ముఖములోని సంతోషము అంతకన్నా ఎక్కువే చెప్పింది.

బస్సు మెల్లగా కదిలింది. కండక్టరు 'కడప,కడప' అని అరుస్తూనే వున్నాడు అంతలోనే ఒక 'బిస్కోతులు'(Biscuits)(అక్కడ ఆ మాటే అందరూ అంటారు, ఇవి ఏ విధమైన 'కోతులు' అని అనుకోవద్దు.) అమ్మే వాడు వచ్చినాడు లోనికి.ఉన్నది సున్నా అన్నది నాకు తెలుసు కాబట్టి, ఈ సారి ఆమె నన్ను కొట్టక ముందే గట్టిగా ఓ అమ్మా! అని  పిలచినాను. బస్సులో  ఆశబ్దము విన్న అందరితోబాటు ఆమె కూడా నన్ను చూసింది. అందరూ చూడటము వల్ల కాస్త సిగ్గనిపించింది నాకు. అయినా మళ్ళీ గట్టి దెబ్బ పడకముందే చెప్పి తీరవలయునన్న ధృఢ నిశ్చయముతో 'అమ్మా ఆ బిస్కోతులు కొని ఇవ్వమని నన్నడుగ వద్దు' అన్నాను . ఆమె 'సరే' అనకుండా 'ఎందుకు' అన్నది. బిత్తర పోవడము తిరిగీ నావంతయింది. 'ఏమిటీ అధికారము, ఏమిటీ అహంకార' మని రామారావు గారు పౌరాణిక వేషధారణలో నామనసులో చెబుతున్న అనుభూతి కలిగింది. నేను ఆయన కృష్ణ పాత్రను తలచుకొని శాంత చిత్తుడనై అమ్మా నావద్ద ఇంకా దుడ్డు (డబ్బు) లేదన్నాను. ఆమె ముసిముసి నవ్వులతోబాటూ పక్కనున్నవారి వికటాట్టహాసాలూ వినిపించినాయి. కొద్ది దూరము పోయిన తరువాత ఆమె దిగి పోయింది .
బస్సు ఇంకా కాస్త దూరము పోతూనే ఎక్కువ మంది దిగి పోయినారు. బస్సు దాదాపు ఖాళీ అయ్యింది. నేను కూడా దగ్గరేవున్న Three Seater లోకి మారినాను. కిటికీని ఆనుకొని నాప్రక్కన ఒక 60 సంవత్సరాల పళ్ళూడిన మీసాల పులి కూర్చొని వున్నాడు . Rush లేనందువల్ల సముద్రములో కెరటాలు ఎగిరి పడినట్లు రోడ్డుమీద బస్సు ఎగిరి పడుతూవుంది. బస్సుతోబాటూ నేనూ ఎగరక తప్పటములేదు. కిటికీని ఆనుకొని కూర్చున్న ముసలతనికి కుదుపులు అదుపు లోనే వున్నాయి. నేను మాత్రము ఎగిరినపుడు ఆయనపై వద్దనుకోన్నా పడవలసి వచ్చేది. ఆయనకు కోపము కట్టలు తెగింది. నా వైపు రోషారుణ నేత్రాలతో చూస్తూ 'యాంటికి జాన్నూకులూ అట్ల మీద పడతావ్' అన్నాడు. (జాన్నూకులు=అంటే సారి సారికి అని). అసంకల్పితంగా నానోటినుండి ' నీవు అందంగావున్నా' వని  అన్న మాట వచ్చేసింది. అంతే మీసాల క్రింద విడిగిన పువ్వులా పెదవులు తెరుచుకోవడము నాకన్నులు గమనించినాయి. కొంత దూరము పోతూనే అతను దిగిపోయినాడు 'పోయివస్తా'నని చెబుతూ.

అక్కడ ఒక వ్యక్తి ఎక్కి నా ప్రక్కన కూర్చున్నాడు.  మాటలు కలిసి అతను తెలుగు పండితుడని తెలుసుకొన్నాను. నాకూ తెలుగులో అభిరుచి వున్నదని గమనించిన అతడు ఎన్నో భాషావిషయముల గూర్చి మాట్లాడుతూ వస్తునాడు, బస్సులో కూర్చునే సుమా! అంతలో driver వద్ద వుండే entrance లో ఒక తటస్త (అటు ఇటు కానీవాడు.) వ్యక్తి ఎక్కినాడు. నాప్రక్కనున్నతను అర్ధనారీశ్వరుడెక్కి డ్రైవర్ దగ్గరికి పోతున్నాడు, కొంపదీసి బండి నడుపుతాడేమో అన్నాడు. నేను వెంటనే 'అంతటి అదృష్టమా! అట్లయితే అందరమూ కైలాసము చేరుతాము కదా' అన్నాను. నవ్వడము ఆయన వంతయింది.
ఈ విధంగా ఆ రోజు ప్రయాణము జరిగింది.ఒకటిన్నర గంట ప్రయాణము చేసిన తరువాత బస్సు, కడకు, కడపకు చేర తప్పలేదు.
 స్వస్తి.





















Sunday, 4 May 2014

కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం (గేయము)


సంసారము'ఛీ' సన్యాసము'సై'
అని తలచుచు ఒక సంసారి
ఆలు పిల్లలను ఇంటిని వదలి
అడవి దారి బడె కౌపీనముతో
సగముదారి తాబోయిన పిమ్మట
ఇంకొక గోచియు అవసరమనుకొనె
ఇల్లుజేరి వేరోక్కటి గైకొని
అడవి జేరే నత డాత్రముగా

మొదటి రోజు తా గడిపిన పిమ్మట
వానగాలి శీతోష్ణ స్థితులకు
వలనుగ కుటీర మవసరమనుకొని
అడవి కట్టెలకు వచ్చినవారిని
అడిగి సహాయము, నిర్మించె

ఏటి స్త్నానమును చేసిన పిమ్మట
తడిగోచిని తన ఇంటివద్ద తా
నారవేసి వేరోక్కటి కట్టెను
దైనందిన సద్విధులకునై

ఒకనా డొక చిట్టెలుక వచ్చియా
కౌపీనమ్మును కొరికె కొద్దిగా
చింతించిన యా తాపసి యంతట
బిడాలమును తా బిరబిర తెచ్చి
పెంచగనుంచెను పర్ణశాలలో

అప్పుడాతనికి అర్థం బయ్యెను
పిల్లికి కావలె పాలనుచు
పాలకొరకు ఒక ఆవును తెచ్చెను
ఆవు గడ్డికై భూమిని దున్నెను
నాట్లువేసి పంటను పండించెను

పిల్లి త్రాగగా మిగిలిన పాలను
అమ్మ దలచె నాసన్యాసంతట
అడవికి వచ్చిన అబ్బాయొకనిని
అందుకొరకు తా వినియోగించెను

పంటను కూడా అమ్మ సాగెను
వ్యవసాయమ్మును పెంచి వేసెను
రాను రాను సన్యాసము మరచి
సంపద మార్గము ననుసరించెను

అతని జాడ తా వెదుకుచు సతియు
సంతానముతో ఆతని జేరెను
బ్రహ్మచర్యమతి దుర్భరమనుచు
సంసారమ్మును చేర దీసెను

ఒకనాడంతట ఒక్క విలేఖరి
ఆతని కడకుజని యడిగెనిటు
అయ్యా నీకడ ఫ్రిజ్జీ ,టీవీ
గ్యాసుగొయ్యి మరియాపై పొయ్యి
భార్యా పిల్లలు సిరులు సంపద
అన్నీ చేరె నదా సన్యాసము

అంతట యాతను బదులు పల్కెను
'కౌపీనార్థము పటాటోప'మిది
ఎరిగితి సంసారమె 'సై' యంచును
దేశామంతటిని జంటల జేసెద
ఎన్నిక గుర్తును 'పుట్టగోచిగా'
ఎంచుచు నిలిచెద నేనెన్నికలో
దేశమెల్ల సంసారుల నింపుచు
సన్యాసుల లేకుండ జేసెదను
గోచిపాత నా పార్టీ పేరు
గోచిపాత నా పార్టీ జెండా
గోచిపాత నా పార్టి ఎజెండా
గోచిపాత గా పేరును మార్చి
మహారాజుగా దేశమునేలెద











































Friday, 28 February 2014

Pride

PRIDE

I am a genious no doubt
With immense talents stout
Make master piece unique
With mere chunk of clay great magic
But calamly said the dust
Let not pride rest in your bust   
For some day I shall knead your back into crust