Friday, 10 October 2014

పునర్జన్మ -- సద్వపుషము

 

పునర్జన్మ -- సద్వపుషము

ఆస్యగ్రంధి యొక్క గోడనంటిన రోజు 10\10\2014 

https://cherukuramamohanrao.blogspot.com/2014/10/bhaskarananda-natha.html

గ్రాసము లేక  సృక్కిన  జరాకృశమైనను శీర్ణమైననున్

నీ సముఖమ్ము వీడనయ నిక్కము జీర్ణతృణమ్ము నేను,

వేసములోని పాత్రయును వీడు క్షణమ్ములు  దగ్గరాయె, నా

కూసము జారులోన మరి కూర్చుము సద్వపుషమ్ము శంకరా!

Dr. Chintalapati MuraliKrishna పద్యం చాలా అర్ధవంతం గా వుందయ్యా! కానీ 

మహానుభావులు మీరు. మీరే ఇంకా సద్వపుషమ్మును మరల కోరుకుంటున్నారేమి

కూసము జారినంత సమకూర్పుము మోక్షపదమ్ము శంకరా ! అని నేనైతే అడుగుతాను. 

అది దుర్లభమే కావచ్చును. కానీ అడగలేని అభిమానం నాకెందుకు ? పెద్దవారు కదా - 

ఇలా పలకరిస్తే లోపలి గని పెల్లుబుకుతుందని నా లేఖిని ...... కోపపడకండి- 

భవదీయుడు !

Ranga Rao Peyyeti పద్యమైతే బాగుంది కాని, మళ్ళీ మరో జన్మ కోరుకుంటున్నారా 

స్వామీ?

Bhaskarananda Natha ఓహో...పాత శరీరము జీర్ణము అయిపోయిందా, క్రొత్త 

శరీరము కావాలా? అందులోనూ మంచిది కావాలా?

బలీయమైనదా? బలిష్టమైనదా? బలోపేతమైనదా?

Bhaskarananda Natha చాలా బాగుంది.

Bhaskarananda Natha అయ్యా, సరదాగా ప్రశ్నలు సంధించినాము గానీ, నిజానికి 

కాదు. మీ హృదయం మాకు తెలియదా ఏమిటి? మీరు ఏమి కోరుతున్నారో

నిజముగానిక్కముగా!

మీ అభిమానమునకు మిక్కిలి కృతజ్ఞుడను.నా పై అభిమానముతో మీరు సందేహము 

వెలిబుచ్చినారన్నది నాకు అర్థమైనది. జవాబు అవధరించండి.

 నేను X అన్న ఊరినుండి Y అన్న వూరికి పోవాలి. దానికగు బస్సు టికెట్టు విలువ 

రూ.1000/= అనుకొందాము.నా వద్ద అంత డబ్బులేదు అన్నది నాకు మాత్రమె తెలుసు. 

ఉదాహరణకు నావద్ద రూ.700/= ఉందనుకొందాము.ఇప్పుడు నావద్ద ఎంతున్నది 

అన్నది మీకుకూడా దయవుంచి తెలుసు అనవద్దు .ఇప్పుడు నా వద్ద నున్నవి మూడు ప్రత్యామ్నాయములు.

1. నేను మిగత రూ. 300/= సంపాదించు వరకు ప్రయాణము ఆపుకొనుట. అది నా 

చేతిలో లేని పని. ఎంతకాలము పడుతుందో ఆ రూ.౩౦౦\= సంపాదించుటకు.

2. ఆ రూ.300/= ఎవరివద్దనైనా అప్పుగాకానీ ఉదారముగా కానీ తీసుకొనుట. అది ఆది 

శంకరుల విషయములో మాత్రమె జరిగినది నేను పెద్దలనుండి విన్నంతవరకు. కాశీ లో 

వ్యాసులవారు తన తపః ఫలమునుండి 16 సంవత్సరములు ధారపోసినారట 

శంకరులవారికి. నా చర్మ చక్షువులకు అటువంటి మహనీయులు కనిపించుతారన్న 

తలపే లేదు ఇక ఆశ ఏముంటుంది?

3. ఉన్న డబ్బు మేరకు ఎంతవరకు పోగలుగుతానో అంతవరకు పోయి ఆపై ఆ 

మజలీలో నాకు వలసిన మేరకు గమ్యము చేరుటే నేను చేయగలిగినది.

బిచ్చగాడు అన్నముంటే పెట్టమ్మా అంటాడు గానీ పరమాన్నం పెట్టమని అడిగే యోగ్యత 

ఏదీ ? ఆ పరమాత్మ ముందు నేనూ అంతే! ఆ తల్లి బిచ్చగానికి ఒకవేళ దయ, జాలి

సానుభూతికలిగి పరమాన్నమే పోస్తే వద్దనడు

కదా ! నేనూ అంతే ! నేనేమడిగినా ఇచ్చేవాడు ఆయన. ఎదో నోటి దురద తీర్చుకొనుటకు 

అడుగుతున్నాను కానీ ఆయన ఇష్టమేమిటో నాకు తెలియదు కదా.

ఇక మహాపురుషుడైన  జడ భరతునికే 'పునరపి జననం పునరపి మరణం' నేనొక బక్క 

పిపిపీలిక పాదరేణువును.

తెలియని తనముతో తప్పులేవయిన వ్రాసియుంటే,'దాసరి దోసము దండము తో సరి.

మురళీ కృష్ణ గారు,

రంగా రావు గారు. పెద్దలు మన్నించుతారు కదూ.

Peyyeti Ranga Rao commented on "(Untitled)"

28 Jul 2016

రామమోహనరావు గారూ, నమస్కారం. మిమ్ములను విమర్శించేటంత పాండిత్యం నాకు 

లేదు. కోరుకోవడమంటూ వస్తే జన్మరాహిత్యాన్నే కోరుకోవచ్చును కదా అన్న ఉద్దేశ్యంతో 

అలా వ్రాసాను. మీరు ఇచ్చిన వివరణ చాలా బాగున్నది. మన అంతస్తు మనం 

తెలుసుకొని కోరుకోవాలి అన్నది మీ అభిప్రాయం. సంతోషం. మీ సహృదయతకు 

నమస్కరిస్తున్నాను.

ఇక భాస్కరానందనాథ గారి ప్రశ్నకు :

Bhaskarananda Natha ఓహో...పాత శరీరము జీర్ణము అయిపోయిందా, క్రొత్త 

శరీరము కావాలా? అందులోనూ మంచిది కావాలా?

బలీయమైనదా? బలిష్టమైనదా? బలోపేతమైనదా?

Bhaskarananda Natha చాలా బాగుంది.

Bhaskarananda Natha అయ్యా, సరదాగా ప్రశ్నలు సంధించినాము గానీ, నిజానికి 

కాదు. మీ హృదయం మాకు తెలియదా ఏమిటి? మీరు ఏమి కోరుతున్నారో

నిజముగానిక్కముగా!

Cheruku Ramamohanrao మీరు సరదాగా అన్నారని సత్యముగా నాకు తెలుసు. కానీ 

నా ఆలోచనవేరు. మీ మాటను ఒక యువకుని నోటనుండి వచ్చినదిగా తీసుకొని 

జవాబు వ్రాస్తున్నాను . మీతో మైత్రి నాకు ఈనాటిది కాదుగదా!

భాస్కరానంద నాథ గారు మీ కారణముగా నామసులోని కొన్ని మాటలు తెలుపుటకు 

ఒక అవకాశామునోసంగినారు. మీకు సదా కృతజ్ఞుడను.

నా మనసు ఈ విధముగా చెబుతూ వున్నది.

ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకం. మన శరీరం కూడాభూమి, నీరు, అగ్ని, వాయువు

ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైనదే. పైకి కనిపించేదంతా స్థూల శరీరం. స్థూల 

శరీరంలో సూక్ష్మ శరీరం, కారణ శరీరాలున్నాయి. ఎముకలు, మూలగ, రక్తనాళాలు

మాంసం, రక్తం, చర్మం అనే అనే ఆరు పదార్థాలతో ఏర్పడింది స్థూల శరీరం. తల, కాళ్లు

చేతులు, వెన్ను, మస్తకం అనే అవయవాలతో మలమూత్ర సహితమై, ‘నేను’, ‘నాది’ అనే 

అహంకారంతో కూడుకొన్నదే స్థూలశరీరం. ఈ స్థూల శరీరము నశ్వరము, జర్జరీ 

భూతము. దీనికి  ఎంత బలోపేతము చేసి ఎన్ని అలంకారములు కూర్చినా అది చివరకు 

మట్టిచేరవలసినదే! దానికి ఎంత బలము సమకూర్చినా అది మసాలా జీడిపప్పు 

తినుటతో సమానము. తిన్నంత వరకు నోటిపై రుచి ఉన్నంతవరకు ఎక్కడలేని 

అనుభూతిని పొందుతాము. అది పురీషము ద్వారా బహిర్గాతమైపోతే దాని సారము 

రక్తములో కలిసి తన ఉనికినే కోల్పోతుంది. బాహిరమగు శరీరమూ అంతే! మరి దానికి 

బలము చేకూర్చుట ఎందుకు?

మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ పంచభూతాలు కలిసి మొత్తం 

పదునేడు తత్వాలతో ఏర్పడింది సూక్ష్మ శరీరం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలంటే 

స్థూల శరీరంలో బయటకు కనిపించే కళ్లు, చెవులు, కాళ్లు, చేతులు కాదు. అవి ఆ 

ఇంద్రియాలకు చెందిన బాహ్యోపకరణాలు. ఈ ఉపకరణాల ద్వారా విషయాలు 

ఇంద్రియాలకు చేరతాయి. ఉదాహరణకు బయటకు కనిపించే కన్నులో నేత్రేంద్రియం 

లేదు. నేత్రేంద్రియం మెదడులోని నాడీ కేంద్రంలో ఉంటుంది. ఇతర ఇంద్రియాల 

విషయం కూడా ఇంతే. ఇంద్రియాలన్నీ శరీరంలోని నాడీ మండలంలో ఉంటాయి. కన్ను 

ద్వారా దృశ్యం నేత్రేంద్రియానికి చేరుతుంది. సూక్ష్మ పంచభూతాలంటే శబ్ద స్పర్శ రూప 

రస గంధాదులు. వీటినే విషయాలు లేదా పంచ తన్మాత్రలు అంటారు. ఇంద్రియాల 

ద్వారా విషయాలు మనసుకు చేరుతాయి. మనసు బుద్ధికి అందజేస్తుంది. బుద్ధి నుండి 

జీవుడు గ్రహిస్తాడు. అప్పుడు చేయవలసిన పనికి కరేంద్రియాలను నియమిస్తాడు. 

మనసు బుద్ధి తప్ప మిగిలిన ఇంద్రియములు మరియు ఇంద్రియోపకరణములకు 

ముసలితనము ఉంటుంది కానీ కంటికి కనిపించని బుద్ధి మనసులు అగోచారములు. 

వానికి ముసలితనము అంటదు. కావున వానిని బలీయము, బలిష్టము, బలోపేతము 

చేయనవసరములేదు. ఎంత బలిష్టము చేసినా అవి నశ్వరములే! కావున వీనిని 

బలిష్టము చేయనవసరము లేదు. మనసు బుద్ధిని, బుద్ధి కర్మను అనుసరించుతాయి 

ఆగామి కర్మను ప్రక్కనుంచి  సంచిత ప్రారబ్ధ కర్మలను అనుసరించి బుద్ధి నడవడిక 

ఉంటుంది. మరి దుష్ట కర్మల ప్రభావము బుద్ధిపైనుంటే అది మనసును చెడుగు వైపే 

ప్రచోదనము చేస్తుంది. దానిని బలోపేతము చేస్తే అనర్థమే!

స్థూల శరీరాన్ని తేజోమయం చేస్తున్నది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరానికి ఆధారం ఆత్మ. 

కాబట్టి సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం ఎందుకూ పనికిరాదు. స్థూల శరీరం 

సూక్ష్మ శరీరంతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నది. ఈ శరీరమే ఆత్మజ్ఞానం పొందడానికి 

అనువైనది. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు సూక్ష్మ శరీరంతో కూడి బయటకు 

వెళ్తాడు. అప్పుడు స్థూల శరీరం నిర్జీవమవుతుంది. శరీరాన్ని వదిలే ముందు వాక్కు 

మనస్సులో లీనమౌతుంది. చక్షురాది ఇంద్రియాలన్నీ మనస్సును చేరుతాయి. 

ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం ఆత్మలో 

లీనమౌతుంది. ఈ విధంగా సూక్ష్మ శరీరం దేహాన్ని విడిచి ఆత్మను చేరి ఉంటుంది. 

మృత్యుకాలంలో జీవుడు సూక్ష్మ శరీరంతో పాటు చేసిన కర్మలతో కూడి దేహాన్ని 

వదలిపోతాడు. సూక్ష్మ శరీరం జీవునికి వాహకమవుతుంది. తదుపరి అది మరో స్థూల 

శరీరానికి కారణమవుతుంది కాబట్టి దానిని కారణ శరీరమంటారు. మన గత జన్మల 

పాప, పుణ్యాల ఫలితాలు, మునుపటి జీవితాల సంస్కారాలతో కూడి ఉన్న శరీరమది. 

మరి ఆత్మయే పరమాత్మ అని మంత్రం పుష్పము చెబుతూ వున్నది. పరమాత్మను 

బలోపేతము చేయుటకు మనమెంతటివారము. కాబట్టి ఇచ్చినది ఇచ్చినట్లుగా 

ఉంచుకొని ఆయా అవయవముల స్వాస్త్యతను కాపాడుకొంతో వస్తూ వాణి ప్రకృతికి వానిని వదలి వేస్తె ఆ పరమాత్మ తన వస్తువు తానూ త్వీసుకో పొడలచినపుడు తానూ తీసుకుపోతాడు. కావున మాయమగు కాయముపై బాయని మమథనుఇ పెంచుకోనక్కరలేదు ఆమాటకొస్తే అతిగా ఉంచుకోనక్కరలేదు.

భాస్కరానంద నాథ గారు  సరదాకే అన్నా యువతలో కొంతమందికి బలీయము

బలిష్టము, బలోపేతము అగు శరీరము కావలెనని, సల్మాన్ ఖాన్ లాగ 6 pack body 

వుండాలని కోరుకొంటారు. సరదా వరకు ఫరవాలేదు. వేలకు వేలు ఖర్చుపెట్టి body 

building చేసుకొని అటు డబ్బు ఇటు శరీరము పాడుచేసుకోవద్దు. ముసలితనము 

లేనిది ఆత్మకు మాత్రమే అన్న మాటను గూర్చి పైన సవిస్తారముగా తెలిపినాను.

మనము చేసే మంచి/చెడు  పనుల ఫలితము ఎక్కువగా ఈ జన్మలోనే పొందుతాము. 

చెడు పనులలో కూడా చెడుపు ఇతరులకు చేసేవి, తమకు తామే చెడుపు చేసుకోనేవీ 

రెండూ వుంటాయి. 'పళ్ళూడ కొట్టుకోనుటకు ఏరాయి అయితే ఏముంది.' తస్మాత్ 

జాగ్రత్త ' ఇక యోగము పతంజలి మహర్షి ఆవిష్కరించిన శాస్త్రము. దానిని ఆయన 

మనసును నియంత్రించి దేవునిపై మరలించుటకు వ్రాసిన శాస్త్రమది.ఆయన దానిని 

patent చేసుకోనియుంటే ఎన్ని వేల కోట్ల డబ్బులోచ్చేవో. నాడు లోకహితము తప్ప 

అదాయము వారు గాంచలేదు. మరి నేడో 'చిన్ని నా బొజ్జకు శ్రీ రామ రక్ష.' దేహ రక్షణకు 

అర్థము jims మరియు beauty parlors కాదు. ఆరోగ్యము వున్న శరీరమే భగవత్ 

సంయోగమునకు యోగ్యము. ఆ కాలములో ఆయుర్వేదమును అందుకే 

ఆశ్రయించినారు.

వేదం శాస్త్రము లో చెప్పినమాటే పాశ్చాత్యులు తమ ఆంగ్లములో ' Matter can neither 

be created nor destroyed'  అని చెప్పినారు. కావున భగవంతుడు ఇచ్చిన 

శరీరముతో, ఆయనకు కృతజ్ఞతలు సమర్పించుకొంటూ, మనసును ఆయనతో 

యోగము చేయగలిగితే చాలు. వయసు మళ్ళిన తరువాత కండలు కరుగకా తప్పదు 

నడుములు వంగకా తప్పదు.

కావున మరుజన్మ ఆరోగ్యము తో కూడిన ఆయనను అర్చించుకోగల జన్మ  ఎందుకు 

నేను కోరుతున్నానంటే, నేను చేయగలిగి కొన్ని, చేయలేక కొన్ని పరమేశ్వర ప్రీతికి

చేయలేక పోయినాను ,పోతున్నాను. అందువల్ల అటువంటి బద్ధకము లేకుండా నా 

సర్వము ఆయన సేవలోనే అర్పించ గలిగే పుట్టుక కోరుకొంటున్నాను. ఎందుకంటే నేను 

శంకరులవారినీ కాను జడ భరతుడను కాను.

కేవలము పరమభక్తజన పాదాంఘ్రి రేణువును.

స్వస్తి.

Ravi Sudhakar Musunuri

Excellent sir. Thank you very much for posting such a detailed description.

Pl.write about Jada Bharatha, new area for me.

8yEdited

Lakshminarayana Murthy Ganti

శ్రీ రామమోహరావుగారు.శుభోదయం.ఉదయన్నేమీ పద్యం ఆనందాన్ని కలిగించింది.ఆపద్యం శీర్షిక "పునర్జన్మ" అయితే మీరు చాలాబాగా రాసేరు.జన్మరాహిత్యం మీదకాదుకదా?

8y

Cheruku Ramamohanrao

జన్మ రాహిత్యము అంత సులభము కాదు అని తెలుప ప్రయత్నించినాను లక్షినారాయణ మూర్తి గారు

8yEdited

Lakshminarayana Murthy Ganti

అవును.నేను గ్రహించాను.శ్రీరమణ మహర్షిగారి గురించి కాని వారి రచనలు కాని అవగాహన లేకుండా మొక్షము అనే పదము బాగా అర్ధంకాదు

8y

DrChintalapati MuraliKrishna

అయ్యా ! నా మతిమాలిన్యాన్ని తొలగించటానికి ఎంత సమయం వినియోగించినారో కదా !--- 

మందుడ -బుద్ధిహీనుడను -మాన్యము గానటు మాటలాడి మీ 

ముందొక రేణువై నిలచి మోకరిలన్‌ బడనుంటి ; నన్ను మీ 

యందరికన్న చిన్ననిగ నల్పునిగా గణియించి ప్రాజ్ఞ్తతన్‌ 

వందనముల్ గ్రహింపుమని వాఙ్మయ శేఖర ! కోరుచుంటి నిన్‌ !!

8y

Bhaskarananda Natha

అయ్యా, నమస్కారములు. నా ప్రశ్నలో గూడార్ధము వున్నది. బలీయమైనదా, బలిష్టమైనదా, బలోపేతమైనదా? ఏ శరీరము కావాలి అని అనడం లోని అర్ధం ....స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా? కారణ శరీరమా? ఏ శరీరము మీకు బలంగా వుండాలి? ఏది మంచిగా వుండాలి? అని అడిగాను. అంతే. నా ప్రశ్న లోని భావము అది.

8y

Cheruku Ramamohanrao

మురళి కృష్ణ గారు మీ సహృదయతకు మనఃపూర్వక నమస్సులు.మీ వంటి వారిపరిచయము నా అదృష్టము





Sunday, 5 October 2014

మళ్ళీ వచ్చిన మృతసంజీవని
మృత సంజీవని మొక్కగా భావించబడుతున్న 'రోహి డియాలో'
నిర్జీవంగా పడిఉన్న లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు హుటాహుటిన హిమాలయాలకు వెళ్ళి 'సంజీవని' మొక్కను తెచ్చి ప్రాణదానం 
చేసిన విషయం మనందరికి తెలుసు.
ఇటీవల హిమాలయ పర్వతాలలో అతి ఎత్తైన ప్రదేశంలో నాడు లక్ష్మణుని బ్రతికించిన 'సంజీవని' లాంటి మొక్క ఒకటి దొరికింది. పర్వతాలలో నివసించే 
ప్రజలు దీనిని 'సోలో' అని పిలుస్తుండగా, శాస్త్రవేత్తలు 'రోహ్ డియాలో' అని పేరు పెట్టారు. ఈ మొక్క ఆకును స్థానికులు కూరగా చేసుకొని తింటారు. ఈ 
మొక్కకు అనేక ఉత్తమ లక్షణాలున్నాయని భారత పర్వత పరిశోధనా సంస్థ (DIHAR) సంచాలకులు శ్రీ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అవి చూడండి :
1) సంజీవని రోగనిరోధక శక్తి పెంచుతుంది. 2) అత్యల్ప ఉష్ణోగ్రత కల, నీరు గడ్డకట్టే అంత చలిప్రదేశాలలోను, ఆక్సిజన్ (ప్రాణవాయువు) లభించని 
ప్రదేశాలలో సహితం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 3) అణుబాంబు పేల్చినపుడు వెలువడే అతి ప్రమాదకరమైన రేడియోధార్మిక కిరణాల నుండి మనిషిని 
కాపాడుతుంది. 4) విపరీతంగా మార్పులకు గురయ్యే వాతావరణం కారణంగా ఎదురయ్యే అన్ని సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. 5) 
జీవరసాయన ఆయుధాల (Bio-Chemical Warfare) నుండి వెలువడే గామా కిరణాల నుండి రక్షిస్తుంది.
ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిశోధనలు జరిపి 'ఈ మొక్క మైనస్ 50 డిగ్రీల 
శీతల వాతావరణంలో పనిచేసే మన సైనికులకు ఎంతో రక్షణనిస్తుందని ప్రకటించారు. రామాయణంలో చెప్పిన సంజీవని ఇదే అయిఉండవచ్చునని 
శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

రావణ లంక




రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. 
ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.. లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది. రావణుడి ఆనవాళు్ల శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం.. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి. సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...2ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది.. ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా? శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం. దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి. విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...3రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిక్తా్వలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.. మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది
ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది.. ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక రీసర్‌‌చ టీమ్‌ నిర్ధారించింది. మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళ్ళు కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి ట్రాన్‌‌సపోర్‌‌ట సిస్టమ్‌ను, కము్యనికేషన్‌ వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం. 4రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి.. తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది. కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్ని సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది... ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎతైతే, అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ.లంకలో రామరావణ యుద్ధం భీకరంగాజరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎతె్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి. రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నము్మతున్నారు.. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి


మీ.... the hinduisam..
జన్మదిన ఆశంసనములు

రవి సుధాకరా

శ్రీయుతమైన శేషగిరి శేఖరమందు రమా వినోద భ
ద్రాయిత వేంకటేశ విభు డాశ్రిత రక్షకుడాదరమ్మునన్
బాయని సౌఖ్యముల్ సకల భాగ్యములన్ సమకూర్చు నీకు నీ
జాయకు పుత్రుకున్ మరియు జాతకు,అల్లునికిన్ సుధాకరా!

దేవనదీ ప్రవాహము గతిన్ విమలంపు మనంబు గల్గు నీ
భావము తానెరుంగు సతి భాసమయమ్ము గృహమ్ము జేయగా
దైవ కటాక్షమున్ దగినదైన సుసంతతి పొందజేయగా
ప్రావు ప్రతిష్టయున్ మరియు బాయని భక్తీ చరించుడిద్ధరన్

అరవిందాసనుడాయువివ్వ శివుదష్టైశ్వర్యముల్ గూర్చ, తా
మరసాక్షుండు స్థిరత్వమివ్వగ ఉమా మా వాణి రక్షించగా
అరుదౌ సౌఖ్యములన్ని గూర్చుకొనుచున్ ఆనందమోప్పారగా
పరిపూర్ణంబగు భక్తితో తోడుత సదా భాసిల్లుడీ బాయకన్

రవి సుధాకర నీదు రమ్యమౌ భాగ్యాన
లలితాను రాగ నీ 'లక్ష్మి' యయ్యె
తా 'సుజాత'గుటచే తనియలేనంతగా
నీ ఇంటిలో నింపె నిఖిల సిరులు
లీలా శిరీషగా హేలాంబ లీలచే
నీ తల్లి తాబుట్టె నీదు సుతగ
కృష్ణుడే వసుధైక జిష్ణుడై దనరారె
నీదు జామాతగా నిజము తెలుప

లోక రంజితరాజీవ లోచనుండు
పుత్రుడైచేరె నీ పూర్వ పుణ్యమొప్ప
నీదెయదృష్టమన్నచో నిజము చెప్ప
రవి సుధాకర ముసునూరి , రమ్య చరిత

కంటిలోగల చూపు
హరిచందనము తోపు
పూల మధువున తీపు
నీ స్నేహితపు రూపు


నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే

భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్తిరతి దేర్ఘమాయుః

శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి

ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు. ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్తు



తత్సత్





Friday, 19 September 2014




మన తెలుగు మన సంస్కృతి చిత్ర కవిత శీర్శిక మొదలై అప్పుడే ఒక సంవత్సరం అయ్యింది సాహిత్యానికి సరైన నిర్వచనం చెప్పే ఆశయంతో విభిన్న సామాజిక, సాంస్కృతిక అంశాలమీద చిత్ర కవిత పేరుతొ మా వంతుగా ఉడుతా భక్తితో సాహిత్యానికి , తెలుగు భాషకు సేవలు అందిస్తున్నాము . మేము మొదలు పెట్టిన ఈ మహా సాహితీ యజ్ఞం మహా విజయం దిశగా సాగుతుంది అంటే దీని వెనుక, ముందు ఎంతోమంది కవిమిత్రుల మరియు సాటి సభ్యుల కృషి, సహకారం వుంది . ఈ శీర్షిక మొదలు అయిననుండి ఈ రోజు వరకు దాదాపు క్రమం తప్పకుండా వ్రాస్తున్న కవిమిత్రులుకు పేరు పేరున మా హృదయ పూర్వక ధన్యవాదాలు .

మా విన్నపం మన్నించి కవులు వ్రాసిన కవితలు చూస్తూ వారికి పరోక్షంగా మా ద్వారా సరైన దిశా నిర్దేశం చేయించి సరైన న్యాయ సహకారం అందిస్తున్న మన న్యాయ నిర్ణేతలు శ్రీ చెరుకు రామ్మోహన రావు గారికి , శ్రీ వేమారెడ్డి మధుసూదన రెడ్డి గారికి , శ్రీమతి గౌరీ భ్రమరాంభ గారికి , శ్రీమతి శ్రీపాద స్వాతీ గారికి , శ్రీమతి శశి బాల గారికి , శ్రీ సవ్యసాచి గారికి, శ్రీ ఆర్ వి వి శ్రీనివాస్ గారికి , శ్రీ జాస్తి రామకృష్ణగారికి పేరు పేరున మా నమః పూర్వక ధన్యవాదాలు .

నేను అందుబాటులో వున్నా లేకున్నా ఆ లోటు ఏమాత్రం కనిపించకుండా సహయ సహకారాలు అందిస్తున్న మా సహ నిర్వాహకుల సహకారం మరువలేనిది . ఈ సందర్భంగా మొట్ట మొదట మన చిత్ర కవిత శీర్శికకు శ్రీకారం చుట్టిన మా సహ నిర్వాహకులు శ్రీ శీలం సురేంద్ర గారికి ముందుగా ధన్యవాదాలు . అమెరికా లో వుంటూ ఉద్యోగ నిర్వాహణలో తలమునకలై , అక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహణ భాద్యతలూ , ఇంటి భాధ్యతలుతో పాటు అధనంగా మన సమూహం "చిత్ర కవిత" భాద్యత సమ్మర్దవంతంగా నిర్వహిస్తున్న మన గౌరవ నిర్వాహకులు శ్రీమతి సువర్ణ విజయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు . మూడవ వ్యక్తి నిరంతర శక్తి, పని రాక్షసి, సాహిత్య వెలుగు, మన సమూహానికి మూల బలం శ్రీమతి యనమదల మంజు గారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు . ఇంకా ఈ చిత్ర కవిత ద్వారానే సాహిత్యం లో ప్రవేశించి ఎన్నోసార్లు విజేతగా నిలిచి , ఈమద్య కాలం లోనే మన సమూహం సహ నిర్వాహకురాలిగా భాద్యతలు చేపట్టి అనతి కాలం లోనే మంచి నిర్వహణ సామర్ధ్యం తో పాటు సమూహం పట్ల అంకితభావం వున్న వర్ధమాన రచయిత్రి శ్రీమతి స్వప్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు.





Thursday, 18 September 2014

Triple Filter (Chanakya )

In ancient India, One day a person met the great Chanakya, and said, "Do you know what I just heard 
about your friend?"
"Hold on a minute," Chanakya replied.
"Before telling me anything I'd like you to pass a little test.
It's called the Triple Filter Test."

"Triple filter?"

"That's right," Chanakya continued.
"Before you talk to me about my friend, it might be a good idea to take a moment and filter what you're 
going to say.
That's why I call it the triple filter test.
The first filter is Truth.
Have you made absolutely sure that what you are about to tell me is true?"
"No," the man said, "actually I just heard about it and..."
"All right," said Chanakya.
"So you don't know if it's true or not.
Now let's try the second filter, the filter of Goodness.
Is what you are about to tell me about my friend something good?"
"No, on the contrary..."
"So," Chankaya continued, "you want to tell me something bad about him, but you're not certain it's true.
You may still pass the test though, because there's one filter left, the filter of Usefulness.
Is what you want to tell me about my friend going to be useful to me?"

"No, not really."

"Well," concluded chankaya, "if what you want to tell me is neither true nor good nor even useful, why tell 

it to me at all?"

మూడుకుండల వడపోత

ఒకసారి ఒక అగంతకుడు చాణక్యుల వారి వద్దకు వచ్చి ఈ విధంగా అన్నాడు " కొద్దిసేపు ముందు నేను తమ స్నేహితుని గూర్చి 

ఒక మాట విన్నాను. ఆ విషయములోని నిజానిజాలు మీకు తెలిస్తే చెబుతారా?"

చాణక్యుడు "   ఒక్క క్షణము ఆగండి. మీ మాటను నేను నా మూడుకుండల వడపోత పద్ధతిలో       వడపోసిన పిమ్మట మీకు 

బదులు చెబుతాను." మొదటి కుండ నిజాన్ని నిగ్గదీస్తుంది. మీరు విన్న మాటలోని నిజానిజాలను పరీక్షించినారా ? "

అగంతకుడు : " లేదు నిజము తెలుసుకొందామని మీ వద్దకు వచ్చినాను."

చాణక్యుడు : " అలాగైతే మీకు నిజము తెలియదన్న మాట !" " సరే అప్పుడు రెండవ కుండ వద్దకు       వస్తాము." దాని పేరు 

మంచితనము." " మీరు నా స్నేహితుని గూర్చి చెప్పదలచుకొన్నది అతని మంచితనమును గూర్చియా లేక ......"

అగంతకుడు : " మంచి ని గూర్చి కాదు. "

చాణక్యుడు :  ఓహో ! అలాగైతే అతని చెడ్డాను గూర్చియే కదా చెప్పదలచుకొన్నది, కాబట్టి మీ తో నేను జరిపిన సంభాషణ ద్వారా 

నేను తెలుసుకోన్నదేమంటే  అతనిని గూర్చిన చెడ్డను నిజానిజాలు తెలుసుకోకుండానే నమ్మినారు. ఎదో మూలన 

వున్నసందేహాన్ని నాతో నివృత్తి చేసుకోవాలనుకొంటున్నారు. ఇప్పుడు మూడవకుండను ఉపయోగించుతాను. ఆ కుండపేరు 

యోగ్యత. మీరు చెప్పే విషయము నాదినచర్యకు ఉపయోగపడే యోగ్యత వున్నదా అన్నది. 

అగంతకుడు : లేదండి. లేనేలేదు. ఎందువల్ల నంటే దానితో మీకు సంబంధమే లేదు."

చాణక్యుడు : మరి మీరు చెప్పే మాటలో నిజములేక, మంచిది కాక , ఉపయోగము లేక వున్నప్పుడు విని నా సమయము  

వినిపించి మీ సమయము వృధా కాదా !" 

ఆగంతకుడు : ???