Monday, 10 July 2017

శంభో శంకర జగద్గురుం

.

శంభో శంకర జగద్గురుం

https://cherukuramamohanrao.blogspot.com/2017/07/blog-post_9.html

సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాంl

అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాంll

ద్వాపరమున శ్రీకృష్ణునివలె కలియుగమున ఏకైక జగద్గురువు శంకరాచార్యులవారు. 

వారినుండి మొదలయి నేటివరకూ వచ్చే సకల శంకర పీఠముల గురువులూ 

జగద్గురువులే. దీనిని బట్టి భూమిపై నడయాడి, సనాతన ధర్మమును పునః ప్రతిష్ఠ 

చేసిన ఆ మహనీయుడు సాక్షాత్ శంకరావతరమేనని చెప్పక తప్పదు.

శంకరుల వారి కాలమును  క్రీ.పూ. 509 యని సోపపత్తికముగా నిరూపించే 

వ్యాసమును గతములో నేను బ్ర.శ్రీ. కోట వెంకటాచలము గారి రచనలను ఆలంబనగా 

తీసుకొని అందజేయుట జరిగినది. ఆయన జీవించిన కాలములోనే వారి జీవిత చరిత్ర 

‘శంకర విజయము’ అన్న పేరున చిత్సుఖాచార్యులవారు వ్రాసియుండినారు. 

తదనంతరము పుంఖానుపుంఖములుగా అనేక ‘శంకరవిజయములు’ వెలుగు 

చూసినవి. ఈ అన్నింటిలోనూ శంకరులవారు అపర శంకరులని తెలియ 

జేయుటయూ జరిగినది.

అట్టి శంకరవిజయములలోని ఒకదానిలో వ్రాసిన ఈ శ్లోకము నా మనసునకు 

హత్తుకొన్నది. ఆ శ్లోకము ఇది.

 అజ్ఞానాంతర్గహన పతితా నాత్మవిద్యోపదేశైః

త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప పాపచ్యమానాన్

ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి

శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా II

 ఈ శ్లోక భావము ఏమిటంటే ‘అజ్ఞానము అను అడవి నడుమ పడి, సంసారము అన్న 

మంటల సెగల పొగలచే ఉడికి పోవుచున్న లోకమును అంటే మానవులను 

బ్రహ్మవిద్యోపదేశములచే  కాపాడుటకు మౌనము వీడి మర్రిచెట్టు మూలము నుండి 

బయలుదేరి వచ్చుచున్న ఆ శంభుడు  అనగా ఆ దక్షిణామూర్తి జగద్గురు శంకరాచార్య 

స్వరూపుడై భూమిపై తిరుగు చున్నాడు.’

 వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం

 సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్‌ |

చిత్రం వట తరోర్మూలే వృద్ధాఃశిష్యా గురుర్యువా

గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః ||

 ఇక్కడ దక్షిణామూర్తిని గూర్చి స్తోత్రము చేస్తూ మర్రిచెట్టు క్రింద మౌనముద్ర వహించిన 

గురువు వృద్ధులగు మునిజనములకు జ్ఞానము, పెదవి కదపకుండానే, 

పంచుతున్నాడట.

మరి ఈ కలికాలములో అజ్ఞాన తిమిర బంధురులై, భోగాలాలసులై, 

పరమతాక్రాంతులై, పరిపరి విధముల పలు మాయలచే వంచింపబడి, వాసనా 

పయోనిధిలో తలమునకలగుచున్న మానవాళిని ఉద్ధరించుటకు ఆ మహనీయుడు 

మౌననమును వీడుటకు కూడా వెనుకాడక సాక్షాత్ శంకరాచార్యుల రూపములో 

భూమి పైకి దిగివచ్చినాడు.

ఈ శ్లోకమును చదవండి. జగద్గురువులు శంకరులే అని తెలియజేప్పుచున్నది.

దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే l

సఎవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకఃll

అసలు ఈ విషయమును పుష్టి చేస్తున్నదా అన్నట్లు యజుర్వేదములోని 

రుద్రాధ్యాయములోని పంచమానువాకంలో  'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని 

వుంటుంది. 'కపర్దినే చ' అంటే పెద్ద జడలు గలవాడు అని అర్థము.  మరి  

'వ్యుప్తకేశాయ చ' అంటే వెంట్రుకలు లేని వాడు అని అర్థము. అంటే శిరోముండనము 

గావించుకొన్నవాడు అని అర్థము చేసుకొనవచ్చును. ఇవి రెండూ పరస్పర 

విరుద్ధములు.  శివుడు ముండిత శిరస్కుడై వుంటాడని ఎక్కడయినా మనకు 

అగుపించే అవకాశము ఉందా! దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో పూర్ణ 

ముండనం చేయించుకున్న శివ స్వరూపమును  ఈ విధముగా తెలియజేసినారు:

 ‘చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి’

 'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని ఎవరయితే కనపడుతున్నాడో ఆయనే 

పరమశివుడు' అని.  ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్టను గుండు 

మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్న 

శంకరాచార్యులవారి చిత్రపఠము మన ఊహా ఫలకముపై నిలుచుట లేదా! కావున ఈ 

శంకరాచార్యుల వారు ఆ పరమశివుడే, అని మనకు ఇపుడు అర్థమగుట లేదా!

ఈయనకు 'ఆది శంకరాచార్యులు' అన్న ఒక సార్థక నామధేయము కలదు. ఈయనకు 

ఆచార్య అన్న అనుబంధ (Annex) నామదేయముకలడు. కావున ఈయన కైలాసపతి 

కాదు. ఈయన భారతీయ ప్రజ్ఞానపతి. కాలాంతరమున ఈయన 

భారతఖందపుపీఠా నాలుగు చెరగులా మఠములు స్థాపించి ఆ పీఠాదిపతులకు  

శంకరాచార్యులని ఆ పీఠములకు శంకర పీఠములని చిరస్థాయిగా చిరస్మరణీయ 

నామములను ఏర్పాటు చేసినారు. మరి శంకరాచార్యులు అంటే వీరిని గుగుర్తించేది 

ఎట్లు? అందుకే వీరు ఆది శంకరాచార్యులైనారు.

మొదట చెప్పిన శ్లోకములో ‘శంభు’ ‘శంకర’ అన్న రెండు పదములను మనము 

చూస్తాము. ‘సంభావయతి, ఉత్పాదయతి ఇతి శంభుః’ అని నిరుక్తి చెబుతుంది. అంటే 

కళ్యాణకారకములగు మన ఈప్సితములను సంభవింప జేసేవాడు. మనకు సదా 

శుభమును ఉత్పాదన అంటే కలిగించేవాడు. అదేవిధముగా ‘శం కరోతి ఇతి శంకరః’ 

అంటే తన ఉనికినే వదలి మన క్షేమమును తన బాధ్యతగా తీసుకొనే వాడు 

శంకరుడు. అట్టి ఆనందమునకు మూలము ‘శంభుడు’. ఎంతటి అర్థవంతమయిన 

విషయమో చూడండి.

ఒకే ఒక విషయమును స్పృశించి ఈ వ్యాసమును ముగించుతాను. ఈ పదములు 

గుణమునకు సంబంధించినవి. రూపము ఏదయినా కావచ్చు. కావున శివ కేశవ 

భేదములను మరచి కళ్యాణ రూపుడగు పరమాత్మను స్మరించుదాము. ఒకరు ఎక్కువ 

ఒకరు తక్కువ అని ప్రవచించుట అర్థవిహీనము, అసలు ఒక విధముగా మూర్ఖత్వము. 

పామరులమగు మనము శంకరాద్వైతము యొక్క లోతులకు పోనవసరము లేదు. ఏ 

రూపములో కొలిచినా అది ఆపరమాత్మునికే చెందుతుంది. అందుకే

ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం l

సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతిll

అన్నారు పెద్దలు.

చినుకు చినుకు రాలి చిన్న వాగుగ మారి

వాగు వాగు చేరి వంకయౌచు

వంకలన్ని చేరి వరదలు నదులౌచు

వచ్చి కడలి జేరు వనరుగాను

అంటే కణకణము అణువణువూ పరమాత్మయనెడు మహా సాగరము చేరుచున్నవి 

అనికదా అర్థము.

 వైష్ణవులు కేశవ అన్నపదమును విష్ణువు కు ప్రతినామముగా తెలిపి ఈ శ్లోకమునకు 

అర్థము చెబుతారు. కానీ నిజమునకు ‘కేశవ’ అను శబ్దము ‘క’ ‘అ’ ‘ఈశ’ యొక్క 

సంకలనము, అనగా త్రిమూర్తులుగా భాసించే ‘కేశవ’ అను మహాసాగరమును 

చేరుతాయి అని అర్థము.

ఇదియే అద్వైత సారాంశము. ఆ మాట చెప్పిన అపరస్వరూపులైన ఆది శంకరులే ఏకైక 

జగద్గురువు.

స్వస్తి.

 

నా అనుభవము

నా అనుభవము

భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమగు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని మొదటి శ్లోకము ఈ విధముగా వుంటుంది.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తమ్ ప్రాహుఃక్షేత్రజ్ఞ ఇతి తద్విదః
క్షేత్రము అంటే శరీరము. క్షేత్రజ్ఞుడు తానేనని పరమాత్మ వెంటనే రెండవ శ్లోకములో తెలుపుతాడు. ప్రతి జీవి శరీరము ఒక క్షేత్రమయితే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అయితే ఆయన ప్రతి జీవిలోనూ, ముఖ్యముగా ఆవిషయమును గ్రహించగలిగిన మానవునిలో ఆత్మయై ఉన్నాడన్న విషయము మనకు తెలుస్తుంది.ఇదే విషయాన్ని పరిపరి విధములుగా విశదీకరించి ప్రవచనకారులు చెబుతూ వుంటారు.జనసామాన్యమును రుజుమార్గాములో నడిపింప కంకణము కట్టుకొన్న వారి ప్రతి మాట బహిర్గాతమగుటకు ముందు ఆత్మకు సమర్పించుకోనవలసి వుంటుంది. పులుపుకు ఉప్పు, చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అను వ్యతిరిక్తగుణములు కలిగి మంచిని పంచవలసియుంటుంది.

నేను చెప్పదలచుకొన్న విషయమునకు పైన చెప్పినది ఉపోద్ఘాతమే! ఒక 3 సంవత్సరముల క్రిందటి మాట. పేర్లు తెలుపుట సభ్యత కాదు కావున నేను తెలుపుట లేదు. ఒక వ్యక్తి ఒక ప్రవచనకారుని వద్ద శిష్యునిగా వుండి, నాకు తెలియని కారణముల వల్ల వేరొకరి శిష్యుడయినాడు. అది తనకు తానే నాతో చెప్పిన మాట. కొంత కాలము తరువాత అతను 'గురువుగారు గోశాల ఏర్పాటు చేస్తున్నారు, దానికి ఆర్ధిక సహాయము చేయమని నన్ను అడిగినాడు. జవాబుగా నేను ' నాయనా నాలాంటివారు ఆ మహానుభావునికి ఇచ్చేటంత వసతి లేనివారు, రాజు తలచుకొంటే అన్నట్లు ఆయన ఎ వ్యాపారవేత్తనో, పారిఒశ్రామిక వేత్తనో, ప్రభుత్వ ప్రధాన యంత్రాంగాధికారినో అడగితే ధనము ఆయన వద్దకు వరదయై వచ్చి చేరుతుంది అని చెప్పినాను.ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది ఏమిటంటే, ఆ వ్యక్తి నాకు తెలియజేసినట్లే ఇంకా ఎంతో మందికి పంపి ఉంటాడు కదా! ఆ విధముగా పంపబదినవారిలో ఆ ప్రవచానకారునికి ముఖ్యుడగువాడు వుండే అవకాశము వుంది. అట్లుకాకున్నా ఇటువంటి విషయములు దావానలమై ఆతనికి చేరే అవకాశము వుంది. మరి ఇన్ని ప్రసార మాధ్యమములు ఉండికూడా ఆయన అటువంటి వారిని నమ్మవద్దు అని ఇచ్చిన ప్రకటన నేను చూచుట తటస్థించలేదు.

దాదాపు ఒక 8,10, నెలల క్రితము మన దేశ సైన్యమునకు మద్దత్తుగా ఒక సన్నిహితుడు సైన్యము యొక్క చిహ్నమును ణా whatsAap కు అనుసంధించినాడు. ఆతరువాత కొన్ని రోజులకు ఆ ప్రవచనకారుని భక్తగణము ఒక whatsAap సమూహమును తయారుచేసి,వారు నన్ను విశ్రాంత సైనికాధికారిగా తలచి, తమకు తామే నన్ను అందులో చేర్చుకొని, ఆ ప్రవచన కారుడు మహిమాన్వితుడైపోయినాడు, ఆయన సాక్షాత్తు దైవస్వరూపమే! అందువల్ల సతీసమేతుడగు ఆయన ఛాయా చిత్రమును పూజగదిలో వుంచుకొని ప్రార్థించితే ధనవంతుని కాగాలననే వార్త పంపినారు. నేను స్పందించలేదు. తరువాతిరోజు సతీసమేతుడగు ఆయన  చాయాచిత్రమును పంపి  ఆ పాదాలను సేవించితే అన్నికష్టాలూ వెనువెంటనే తొలగిపోతాయి అన్న సందేశమును పంపినారు. అది చూసి నేను  ఆ సమూహమును వదలిపెట్టినాను, చాలా నెలల క్రితమే! 

ఆయన వ్రాసిన ఒక పుస్తకములో రుద్రము లోని ప్రార్థనా శ్లోకములోని ' ఏకం ఈశం అనిశం' నకు బదులుగా 'మీనం మేషం మహిషం' అనియుండుట  నేను చూచుట తటస్తించినది. ఆయన గొప్పవాడు. విషయ పరిజ్ఞానము అధికముగా వున్నవాడు. సంఘములో అధికముగా గుర్తింపబడిన ప్రతిభావంతుడు. పుస్తకము యొక్క proof ను ఆయన చూడకుండినా ఆయన శిష్యులలో విషయ పరిజ్ఞానము గలవారు చూసియున్తారుకదా! పోనీ పుస్తకము వెలికి వచ్చిన తరువాతనయినా ఎదో ఒక భక్తుడు వారికి తెలియజేసే అవకాశము లేకపోలేదు కదా! ఇది పొరబాటు అని వారు కానీ వారి ప్రతినిధి కానీ చెబితే బాగుండేదికదా!

ఇవి చాలా కాలము క్రితము జరిగినవి. ఈ రోజు యెందుచేత చెప్పవచ్చినానంటే నేను పైన తెలిపిన సంఘము వంటిది, ఆయన మహిమలను గూర్చి ఆస్య గ్రంధిలో ఒక 3 రోజుల క్రితము ప్రచురించియుండినారు. ఇది రానురాను చిలువలు పలువలై అమాయకులు ఎర ఔతారను ఉద్దేశ్యముతో వ్రాసినాను. నేను వారి కున్నంత విజ్ఞత కలిగినవాడిని కాదు. ఆయనవేద పురాణ శాస్త్రేతిహాసములు తెలిసినవాడు, సంఘములో గౌరవ ప్రతిష్ఠలు గలవాడు కావున భగవద్గీతలో చెప్పినట్లు 
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 || 
సాధారణ జనులు ఆయనను భగవదంశగా  నమ్మి పాటించే అవకాశము వుంది. ఇప్పటికే చాలా మంది బాబాలతో స్వాములతో నిండిన ఈ సమాజమునకు ఇంకొకరినిచేర్చి సాధారణ జనులను అయోమయములోనికి నెట్ట వద్దు అన్న ఉద్దేశ్యముతో ఈ నాలుగు మాటలు వ్రాసినాను. భక్తజనాళి ప్రత్యక్షముగా ఆయన మహిమలు చూసే అవకాశము కలిగినపుడు వారే ఆయనకు భక్తులూ ఔతారు, ప్రచారకర్తలౌతారు. దీపమును ఎక్కువసేపు చేతులతో కప్పియుంచలేము కదా!

Friday, 7 July 2017

వసుదేవ సుతం దేవం

వసుదేవ సుతం దేవం

వయసు వచ్చెనుగాని వలసినదౌ భక్తి
వచ్చు నమ్మకమేమో వడల దొడగె
సుఖసంపదలదాత చూపించు నినుజేరు
సులభమౌ  మార్గమ్ము సూక్ష్మముగను
దేవదేవా నాకు దిక్కు తోచగలేదు
దేహబాధల ముందు దీర్చుమయ్య
వద్దునాకొద్దయ్య వాసనా భరితమౌ
వపుషమానసములు వరదరాజ
                  సుగుణ సుమమాల సురపాల సుజనలోల
                  తండ్రివైజూపు కరుణను తంపుమీర
                  దేనికీనేను కొరగాను దేహినయ్యు
                  వందనములివె కావుమా వందలాది

ఈ సీసపద్యము నేను వ్రాసినది. దీనికి ఒక ప్రత్యేకత వుంది. క్రిందికి 1,3,5,7పాదములలోని మొదటి అక్షరములు 

మరియు  తదుపరి వచ్చు తేట గీతి లోని ప్రతి పాదము యొక్క మొదటి అక్షరములు తీసుకొంటే ' వసుదేవ సుతం 

దేవం' అన్న వాక్యముతయారవుతుంది. అదే పద్ధతిలోనే 2,4,6,8 పాదాలలోని మొదటి అక్షరములు మరియు 

తేటగీతిలోని యతిస్తానములోని అక్షరములు తీసుకొంటే కూడా అదే వాక్యము వస్తుంది. తేట గీతికి నాలుగు పాదములే 

కాబట్టి ఒకే విధమగు వాక్యము వచ్చుటకు యతి స్థానములోని అక్షరములు తీసుకొనుట జరిగినది. చదివిన పిదప మీకు 

నచ్చితే అభిప్రాయము తెలుపండి. 

Monday, 3 July 2017

సంస్కృత పాఠము By Appaji Peri

సంస్కృత పాఠము

ॐ। ఏక----ద్వి..... బహు(వచనం)................ ప్రథమా.... రామః-రామౌ-రామాః।....... ద్వితీయా.... రామం-రామౌ-రామాన్...., తృతీయా.... రామేణ-రామాభ్యాం-రామైః..., చతుర్థీ... రామాయ-రామాభ్యాం-రామేభ్యః...., పఞ్చమీ.... రామాత్-రామాభ్యాం - రామేభ్యః..., షష్ఠీ.... రామస్య-రామయోః-రామాణామ్....., సప్తమీ.... రామే-రామయోః-రామేషు....., సంబోధనాప్రథమా........ హే రామ! - హేరామౌ! - హేరామాః।।। దీనిలాగే... 'కృష్ణ, భీమ, నల, శఙ్కర, హర,..... మొదలైనవి.... అయితే.. నియమం..... అకారాన్తమై... పుంలిఙ్గమైతేనే.... వర్తిస్తుంది!!!"

ॐ। నేనీనాఁడు'హరి'శబ్దాన్నివివరించెద.... "హరి---'ఇ కారాన్త'పుం'లిఙ్గశబ్దః (=విష్ణు, సింహం, ఇంద్రుఁడు, కోతి.....) ప్రథమా.... హరి-హరీ - హరయః..., ద్వితీయా.... హరిం-హరీ-హరీన్...., తృతీయా... హరిణా-హరిభ్యాం-హరిభిః...., చతుర్థీ.... హరయే - హరిభ్యాం-హరిభ్యః..., పఞ్చమీ... హరేః-హరిభ్యాం-హరిభ్యః.., షష్ఠీ... హరేః-హర్యోః-హరీణాం...., సప్తమీ.... హరౌ-హర్యోః-హరిషు...., సంబోధనాప్రథమా.... హే హరే! - హేహరీ! - హేహరయః!!!.... ఇట్లాగే..... 'కవి, రవి, ముని, ఋషి, మాతలి..... శబ్దాః లేఖనీయాః!!!

 ॐ। "ఉ'కారా'న్త'పుం'లిఙ్గ'గురు'శబ్దః।।। గురుః-గురూ-గురవః.(ప్ర) ., హే! గురించే! గురూ-హేగురవః(సం. ప్ర) .., గురుం-గురూ-గురూన్(ద్వి) .., గురుణా-గురుభ్యాం-గురుభిః(తృ) .., గురవే-గురుభ్యాం-గురుభ్యః(చ) ., గురోః -గురుభ్యాం-గురుభ్యః(పం) గురోః-గుర్వోః-గురూణాం(ష) .., గురౌ-గుర్వోః-గురుషు(స)!!! ఇదేవిధంగా.... 'మను, భాను, వాయు, విష్ణు.' ...... మొదలైనవి.... 'लेखनीयाः' ।।।

ॐ। "ధాతృ - - - ఋకారాన్త'పుం'లిఙ్గశబ్దః(=బ్రహ్మ)......! ధాతా-ధాతారౌ-ధాతారః(ప్ర) ..., హే! ధాతః-హే! ధాతారౌ-హే! ధాతారః(సం. ప్ర).... ధాతారం-ధాతారౌ-ధాతౄన్(ద్వి) .., ధాత్రా - ధాతృభ్యాం-ధాతృభిః(తృ) ..., ధాత్రే - ధాతృభ్యాం-ధాతృభ్యః(చ) .., ధాతుః-ధాతృభ్యాం-ధాతృభ్యః.(పం) ..., ధాతుః-ధాత్రోః-ధాతౄణాం(ష) .., ధాతరి-ధాత్రోః-ధాతృషు(స)....! ఇట్లే.... 'నేతృ, దాతృ, క్రేతృ, ప్రష్టృ..........!!! "

ॐ। "పితృ.... 'ఋ'కారాన్త' పుం'లిఙ్గశబ్దః।।। పితా-పితరౌ-పితరః(ప్ర)..., హే! పితః-హే! పితరౌ-పితరః(సం. ప్ర.)..., పితరం-పితరౌ-పితౄన్(ద్వి)..., పిత్రా-పితృభ్యాం-పితృభిః(తృ)... శేషం'ధాతృ'శబ్దవత్... ।।। " మాతృ.... 'ఋ'కారాన్త' స్త్రీ'లిఙ్గ శబ్దః...............................మాతా-మాతారౌ-మాతరః(ప్ర)....,హే!మాతః-హేమాతారౌ-హే!మాతారౌ-హే!మాతారః(సం.ప్ర.).....,మాతరం-మాతరౌ-మాతౄః(ద్వి).....శేషం'పితృ'శబ్దవత్..... ।।।
































Monday, 24 April 2017

వర్ణాంతర వివాహం

వర్ణాంతర వివాహం


ఇటీవల ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ సంఖ్యలో తారసపడుతున్నాయి. అందుకే

సమాధానమివ్వక తప్పడం లేదు. ఒకప్పుడు వర్ణాంతరాది అసంప్రదాయ వివాహాలు

పెద్దలు చేసేవారే కాదు. పిల్లలు ఏ 'రిజిస్ట్రేషన్' పెళ్ళిళ్ళో, దండల  మార్పిడిలో

చేసుకొనేవారు. గత్యంతరం లేక పెద్దలు సమ్మతించే వారు. కానీ ఇప్పుడు 'గత్యంతరం

లేక' వీళ్ళే పూనుకొని పెళ్లి చేస్తున్నారు. ఇది శోచనీయం, దోషం. పెళ్ళి ఒక ముచ్చటో,


వేడుకో కాదు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది వివాహ సంప్రదాయం. ఆ కన్యాదానం

పూర్వ తరాలను తరింప జేయడం కోసం అని సంకల్పిస్తారు. అటువంటప్పుడు అన్య వర్ణాల

వారి కాళ్ళు కడిగి, "పితౄణాం తారణార్ధాయ' అని చెప్పి కన్యాదానం చేయడం దోషం కాదా? ఆ

క్రియ వల్ల పూర్వీకులు నరకంలో పడతారు. అలా పడవేసిన పాపం ఉభయులకూ

వస్తుంది. ఇదంతా అస్తికులైతేనే గమనించాలి. నాస్తికులకు సంప్రదాయ వివాహాలు గానీ,

వివాహ సంప్రదాయాలు కానీ అనవసరం కదా! 'సంప్రదాయం' అనే మాట ఎత్తితే అసలు

ఏమిటో తెలియాలి కదా! వివాహంలో వాడే మంత్రాలన్నీ సవర్ణ, సంప్రదాయ వివాహాలకే

చెల్లుతాయి. భౌతిక తర్కాలకందని పరంపర, సూక్ష్మవిజ్ఞానం దాంపత్య ధర్మంలో ఉంది.

కేవలం వ్యక్తులు నచ్చుకుంటే సరిపోయిందా? ఆ వ్యక్తులననుసరించి ఉండేకుటుంబాలను; పరంపరను

తప్పకుండా జీవితంలో ఎదుర్కొనవలసిందే. అప్పుడు క్రమ క్రమంగా ఒకరికొకరు అలవడక, కలహించే పరిస్థితి 

ఏర్పడుతుంది. మీ అమ్మాయి 'మన సంప్రదాయ ప్రకారమే పెళ్ళి జరగాల'ని పట్టుబడుతోంది అని చెబుతున్నారు. 

అసలు ఈ విధమైన పెళ్ళి మన సంప్రదాయం కాదని చెప్పండి. తాను ఏ ఇంటికి కోడలిగా వెళ్ళబోతోందో ఆ ఇంటిని 

అనుసరించాలి అన్నది ఒక నియమం. ఇది గుడ్డిలోమెల్లలాంటిది. మీ ప్రశ్న బట్టి మరొకటి అర్థమౌతోంది. మీ 

అమ్మాయికి సంప్రదాయమంటే గౌరవం ఉంది. కానీ దాని ప్రాధాన్యం, పరంపర లాంటివి మీరు బాల్యం నుండి 

బోధించి ఉంటే ఈ అయోమయం రాదు. యౌవనావస్థకు సహజమైన ఆకర్షణ, మొహం మాత్రమే - ఇహ పరాలకు

సంబంధించిన దాంపత్య ధర్మాన్ని నిర్ణయించడానికి సరిపోదు. పెద్దలు ముందుగా విజ్ఞుల ద్వారా పరంపరను 

తెలుసుకొని, సంప్రదాయ ధోరణికి దూరం కాకుండా, ఆధునిక విద్యనూ నేర్పే పద్ధతులు అవలంబించాలి.



11 Comments
Comments
Gowri Sankar Karra పెద్దలకు శిరసాబివందనం

Reply
1
5 hrs
Manage
Sripada V Ramakrishna Great day, good message

Reply
1
5 hrs
Manage
Seetharaman Subramanian bhaga chepparu ramohangaru

Reply
1
5 hrs
Manage
Vvs Sarma మీరు చెప్పినది సవర్ణమైనా విడాకుల తరువాత గాని, ఒకరి వైధవ్యము వలన గాని జరిగే ద్వితీత 

వివాహమునకు కూడా వర్తిస్తుంది. అటువంటి వివాహాలు civil (registered) marriages మాత్రమే అయిఉండాలి.

Reply
1
4 hrs
Manage
Sriram Ramadugula ChandraMurthy సనాతన ధర్మశాస్త్ర విషయాలు నిష్కర్ష గా అందించిన మీకు 

అభినందనలు.

Reply
1
3 hrs
Manage
Si Kri మనసులు కలవని మనువులు ఎందుకు ? 

ఉన్న ఒక్క జీవితాన్ని ఇలా సంప్రదాయాలపేరుతో నాశనం చేసుకోవడం ఏమిటి ? మనిషి , మనసు , మమత 

వేటి తర్వాతే ఏదైనా , ఏ సంప్రదాయమైనా ?

Reply2 hrs
Manage

Chinthalapalle Kasipathi replied3 Replies
 సనాతన వర్ణాశ్రమ ధర్మములపై ఆధారపడినది. ఆ ధర్మములను అతిక్రమించడం. సనాతన ధర్మమమును అతిక్రమించుటయే. దానికి ప్రాధాన్యత యివ్వని వారు మాత్రమే ఈ విధముగా నాచరించుచున్నారు. మనుసులు, మనువులు, మనుషులు, మమతలు, మమకారాలు - ఈ పదాలనన్నిటిని సినిమా వారు వారి యిష్టాను సారముగా వాడి మంచి వయసులో వున్న యువకులును, సనాతన ధర్మమును పాడుజేయుచున్నారు. సనాతన ధర్మముయొక్క గొప్పదనమును, అది సమాజనమునకు జేయు మేలును గ్రహించినవారెవరును ఈ పనిని చేయరు. అది లోపించుట చేతనే, యెవరెవరు వారికి తోచినట్టు ఆచరించి తరువాత వారు చేసిన పనిని సినిమా వాక్యముల ద్వారా సమర్థించుకొని యితరులకును మార్గదర్శకులగుచున్నారు. కఠినముగా వ్రాసినందులకు క్షమించవలెను. ఇది బాధతో వ్రాసినది మాత్రమే!


Si Kri మనుషులందరూ సమానమైనప్పుడు ఈ వర్ణాలేంటి ? అసలు .

Reply2 hrs
Manage
Vvs Sarma సంప్రదాయ వివాహమనేది ఒక అర్థంలేని ప్రక్రియ కాదు ఆ మంత్రాలకు, తదుపరి జరిగే జీవన 

క్రమానికి సంబంధం ఉన్నది. ధర్మ పత్నికై చేసుకునేది సంప్రదాయ వివాహం. ఒక సంస్కారం. జీవిత 

భాగస్వామికై (life partner) కై చేసుకొనే ఒక న్యాయబద్ధమైన ఒడంబడిక (civil contract) recognized by law 

సంగతివేరు. రామమోహన రావుి గారు చెప్పినది రెండవ దానిని గురించి. అమెరికాలో ఒక విదేశీయ క్రైస్తవ 

వనితను ప్రేమించి అక్కడ చర్చిలోనో ఎక్కడో పెళ్ళిచేసుకొని ఇక్కడ తల్లిదండ్రుల వేడుుకకై సంప్రదాయ 

వివాహపు తంతు జరపడం హాస్యాస్పదం. వర్ణాంతరమైనా అంతే. వర్ణమంటే కులంకాదు.

Reply
2
2 hrsEdited
Manage
Chinthalapalle Kasipathi ధర్మబద్ధమైన సంస్కారము. Civil contract కాదు. చట్టబద్ధత ఈ మధ్య 

యేర్పఱచబడినది మాత్రమే. కానీ అత్యున్నతమైన భారతీయ వివాహ సంస్కారము సనాతనమైనది.

Like
Reply
1
51 mins
Manage
Srinivasa Chakravarthy Jonnalagadda DHANYAVADAALU GURUVU GAARU

Like
Reply
1
1 hr
Manage

Like
Reply
1
23 mins
Remove
Cheruku Ramamohanrao ఈ ధర్మము అత్యంత సనాతనమైంది. అందులో వుండే ఆచారాలు,

సాంప్రదాయాలు ఒక తర్కమునకు కట్టుబడియుంటాయి. మనము అర్థము చేసుకొనవలెనని తలచినపుడే మన

ప్రయత్నమూ ఆ దిశన సాగుతుంది. ఈ ధర్మము ఆకాశము వంటిది. సాగదు, కుంచించుకోదు, తాయిలాలు

చూపదు. వేద వాక్కునకు కట్టుబడి వుంటుంది. వానిని సమగ్రముగా పరీక్షించి పరిశీలించి పరిశోధించిన

తరువాతనే తొందరపాటుతనము కలిగిన కొందరు యువకులు తమ అభిప్రాయములు తెలుపుటకు అర్హతను

సాధించినవారవుతారు. జీవితములో ఎంతో కొంత శ్రద్ధతో తమకన్నాఅన్నివిధాల పెద్దలను ఆశ్రయించి అటు

VVS శర్మ గారు గానీ ఇటు చింతలపల్లె కాశీపతిగారుగానీ తమకు తెలిసిన విషయములు తెలుపవలెనను తపనతో

చేయుచున్న కృషి మాటలకు అందనిది. అట్టివారి కృషికి శిరసువంచి ధన్యవాదాలు తెలుపుదాము. మన

జిజ్ఞాసను పెంచుకొని మన సంస్కృతిని కాపాడుకొందాము.

ఈ రోజు ఒక పరమతమునకు వాదన చేతకాక, సంస్కృత స్తోత్రములను మన దేవతల ఫణితిలో

వ్రాయించుకొంటూవుంది.తమ దేవుడో దైవ సుతుడో దేవతదూతనో ఎవరైతేనేమి విభూది కుంకుమ పెట్టి చేతికి

శూలమునంటబెట్టి మనలోని అమాయకులను ఆకర్షింప ప్రయత్నము చేయుచున్నారణ్య. వేరొక మతస్తులు

తమ ప్రవక్త చెప్పిన మాటగా తమ పుణ్యక్షేత్రమునకు పోయినపుడు నిర్దుష్టముగా మన

పద్ధతులనాచరించుచున్నారు.

ఇక తెగలా! ఆ రెండు మతస్థులలో వున్నవి కొల్లలు. ఒకరినొకరు ద్వేషించుకొని చంపుకొంటారు. ఎంత

భిన్నత్వము వున్నా ఏకత్వము కలిగిన ధర్మము మనదే!

ఒకే ఒక్క మాట చెప్పి విరమించుతాను . ఈ కాలము నాటిది అని తెలుపలేని ఋగ్వేదము భూమి గోళాకారమని

చెప్పగా ఒక 2000, 1500 సంవత్సరముల క్రితము వచ్చిన ఆ గ్రంధములు భూమి బల్లపరుపని చెబుతూ, అది

గోళాకారమన్నవారిని వెంటబడి కర్కశముగా చంపించుట కూడా జరిగింది. ఆ గ్రంధములను కూలంకషముగా

చదివితే యువతకు మన ధర్మము యొక్క గొప్పదనము బోధపడుతుంది.

సృష్టిని గమనించితే అంతా భిన్నత్వమే, కానీ అందులోనే ఏకత్వము ఇమిడియుంది అన్న వాస్తవము

ముఖ్యముగా గ్రహింపవలసిన విషయము.

యువకులారా విమర్శకు ముందు, విషయము తెలుసుకోండి. ఈ ధర్మము ఏనాడూ చంపివేయమనిగానీ,

చెక్కమనిగానీ కాల్చమనిగానీ దేవుని వాక్యములుగా చెప్పినట్లు మనము చూడము.

చెప్పింది ఒకమాటే! ధర్మో రక్షతి రక్షితః