Tuesday, 16 August 2022

పూర్ణమదః పూర్ణమిదం

 

పూర్ణమదః పూర్ణమిదం

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post.html

పూర్ణమదః పూర్ణమిదం

ఈశావాస్యోపనిషిత్తు"ఈశావాస్యమిదగ్గ్ సర్వం" అనే మంత్రముతో  ప్రారంభమవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది. యజుర్వేద భాగమైన శుక్లయజుర్వేదము లోని వాజసనేయసంహిత లోని  40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ సంహితలో ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతేl  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతేll

ఓం శాంతిః శాంతిః శాంతిః.

పూర్ణమనెడి పదమునకు  అర్ధము, సంపూర్ణమైనది, అన్నిటిని కలిగినది. అంటే అది భగవత్ స్వరూపము. ఇది కాక వేరొక అర్థము లేనిది. ఏమియును లేనిది అని అంటున్నప్పుడు ‘శూన్యము’ యనెడి అర్థము ఒకటి కాగా అన్నిటిని కలిగియున్న, భరించుచున్న ‘పూర్ణము’ అన్నది మరియొక అర్థము. ఇందలి నిజానిజములను పరిశీలింతము.  ‘0’ మరియు ‘   (Infinity, అనంతము) అన్వయించుకొన వచ్చును. ఇక్కడ భారతీయులకు పాశ్చాత్యులకూ ఒక తేడా ఉన్నది. మన సంఖ్యలు ఒక ఊహా వృత్త విభాజకములు, వారిది ఒక సరళరేఖా విభాజక సముదాయములు. అందుచేత వారికి     ఆ సరలరేఖకు ఆద్యము ‘0’ అంతము ‘’. మనకు అట్లు కాకాక ఆదిలోకే అంతము చేరిపోయి అది పూర్ణమౌతుం. వారు  ‘0’ -  ‘0’ =  ‘0’ అని ‘ - =    అని వేరు వేరుగా వ్రాసుకొంటారు. మనకు శూన్యము అనంతము అంతా ఒకటే! కాబట్టిరెండూ పూర్ణమే! ఒకే సంఖ్యనుండి అదేసంఖ్యను కూడినా తీసివేసినా ఆ ఫలితము ఒకటే అయితే ఆ సంఖ్యలు వేరువేరు కాజాలవు కదా! ఈ పూర్ణమే భగవత్ స్వరూపము.

ఈ వాస్తవమే కఠోపనిషత్తులో ఈ విధముగా చెప్పబడినది.

అణోరణీయాన్మహతో మహీయా

నాత్మా2స్య జంతోర్నిహితోగుహాయామ్

తమః క్రతు పశ్యతి వీతశోకో

ధాతుప్రసాదాన్మహిమా నమాత్మనః (2.20)

అంటూ వున్నది కఠోపనిషత్తు.

మనకు అణువే కనబడదు. అణోరణీయాన్ - అణువులో అణువు వంటిది, మహతో మహీయాన్ - మనముచెప్పలేనంత పెద్దదిగా ఉంహించుకున్న దాని కంటె పెద్దది. జీవుల (సకల ప్రాణుల) హృదయగుహలో ఉన్నది. అదియే ఆత్మ. అక్రతుః- అంటే ఏకార్యమూ లేనివాడు. చూచేవాడు చూడబడేదీ అదే కాబట్టి ఆత్మకు ఏ ఇతర కార్యములేదు. పశ్యతి - దేహాత్మాభావన లేనివాడే హృదయగుహలోని వస్తువును చూడగలుగుతున్నాడు. వీతశోకః - శోకములేనివాడు అవుతున్నాడు. ధాతుప్రసాదాత్ మహిమానమాత్మన - విధాత ప్రసాదమువలన ఆత్మను మహత్తును చూడగలుగుతున్నాడు.

తిరిగీ అసలు విషయమునకు వస్తే ఆ పరమ పదార్థము మానవుల ఇంద్రియములకు గోచరమగునది కాదు. ఆకాశము వంటిది. ఆకాశమును మన పూర్వులు శూన్యముతో పోల్చినారు. భూమి గోళము అన్నది మనకు తెలిసిన విషయమే! కావున ఆకాశము కూడా ఒక పూర్ణ గోళమగుచూ భూమిని ఆవరించి యున్నట్లె కదా! అప్పుడది పూర్ణము. అనగా అది పరమాత్మ తత్వమగు ‘మహతో మహీయాన్’ ను ధృవ పరచుచున్నది.

కావున మన తత్వ శాస్త్ర రీత్యా అయినా గణిత శాస్త్ర రీత్యా అయినా పై శ్లోకము యొక్క సారాంశము

‘0’ - ‘0’ = ‘0’   - =

‘0’ + ‘0’ = ‘0’   + =

ఇదే పూర్ణత్వము ఇదే పూర్ణ తత్వము

ఒక పాఠకుడు తన విమర్శ యొక్క సారాంశముగా భగవద్గీత 2వ అధ్యాయములోని 16వ శ్లోకమును ఉటంకిస్తూ 'Matter can neither be created nor destroyed' అని తెలితెలిపినారు పుట్టుక నాశము లేనివాడు భగవంతుదనియే కదా భగవద్గీత చెప్పుచున్నది, ఈ matter  ను మాయ ఆవరించి ఉంటుంది, ఆ మాయ శాశ్వతము, భగవద్గీత ౨వ శ్లోకము యొక్క వివర ణ ఈ దిగువన తెలియజేయబడినది, చదువగలరు,

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।

ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।

అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.

శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.

భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా

సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)క్షరం ప్రధానమమృతాక్షరం హరః

క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)

సంయుక్తమేతత్ క్షరమక్షరం చ

వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)

ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.

. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).

2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.

3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చియి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?

ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.

సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స

తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా

తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్

నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం

చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం

కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)

భగవంతుడు ఈ జగత్తును సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో కూడా వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.

స్వస్తి.

Monday, 18 July 2022

అలంపురం జోగులాంబ

 

అలంపురం జోగులాంబ

   https://cherukuramamohanrao.blogspot.com/2022/07/blog-post.html

పూర్వము దక్షప్రజాపతి నివసించిన ప్రదేశముగా దక్షారామము ప్రసిద్ధిచెందినది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి అని కూడా చెబుతారు, కావున ద్రాక్షారామము  అయినదని కూడా చెబుతారు కానీ ‘దక్షారామము వాడుకలో కృతకమయి ‘ద్రాక్షారామము’ అయిఉండవచ్చునని నా అభిప్రాయము. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించినాడు కానీ, కారణాంతరాలవల్ల, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. నిరీశ్వర యజ్ఞం చేయాలని సంకల్పించినాడు. ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసి. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం చూడ ఉత్సుకత ఎంతగానో తనకున్నదని, వెళ్తానని పరమశివుని అడుగుతుంది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దని చెబుతాడు. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. శివుడ సతీదేవితో, అక్కడ అవమానము జరిగితే తిరిగీ కైలాసము రావద్దని అంక్ష విధించుతాడు. ఆయనకు భూత భావిష్యద్వర్తమానములు విదితములే కదా! అక్కడ సతీదేవికి అన్నివిధములా శృంగభంగము జరుగుతుంది. దానితో సతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకు వెళ్ళలేక పోయింది.  అవమానం భరించలేక జగన్మాత యజ్నగుండము లోనికి దూకింది.  శివుడు విషయమును గ్రహించి వీరభద్ర కాలికాడులను పరమత గణములతో కూడా పంపి యజ్ఞమును ద్వంసముజేసి విలయతాండవము జరిపినారు. శివుడు అప్పుడు అచటికి వచ్చి సతీదేవి అగ్నికి ఆహుతి కాకుండానే ఆమె మృతదేహమును భుజముపై వేసుకొని  లోక సంచారమునకు సమకట్టినాడు. తారకాసుర సంహారమునకు కుమారోద్భవము జరుగవలసియున్ననందున. విష్ణువు యోచించి తన చక్రాయుధముతో సతీదేవి శవమును ముక్కలు ముక్కలు చేసినాడు. ఆ శరీర భాగములు 18 ముక్కలయి 18 చోట్ల పడినాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీచక్రాలను స్ధాపించినారు. ఆ తరువాత సతీదేవి పార్వతియై హిమవంతుని కూతురిగా జన్మించి కుమారసంభవమునకు కారణమై తారక సంహారమునకు దొహదపడినది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకంము ఈ క్రింది విధముగా వున్నవి.

1.       లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురేl

     ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణేll

2.     అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికాl

     కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికాll

     3.  ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికాl

          ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికేll

 

4.    హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీl

     జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికాll

5.    వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీl

     అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ll

6.    సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్l

    సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్ll

ఈ పద్దెనిమిది శక్తి పీరములలో ఐదవది జోగులాంబ తల్లిది. ఆ తల్లిని ఈ క్రింది విధముగా ప్రార్థించుతారు

లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపం మహాబలాంl

ప్రేతాసన సమారూఢాం జోగులామ్బాం నమామ్యహంll 

 

అమ్మది ఇక్కడ భీకరాకారము. జారిన కుచములు, వికృత ద్రుష్టికలిగిన కనుగవ, ఘోరంకగు రూపము, మహా బలిష్టమగు శరీరము, పైగా ఈ తల్లి ప్రేతాసనముపై కూర్చొని ఉంటుంది. ఈ విక్రుతులను వైపరీత్యాలను తానూ గ్రహించి భక్తులను కాఆపాడు ఆ తల్లికి సాష్టాంగ నమస్కారము.

ఇక ఈ దేవాలయ చరిత్రను గూర్చి కాస్త తెలుసుకొందాము.

మిగిలినది మరొకమారు .........

అలంపురం జోగులాంబ 2

ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానుల ఆగడములచే నేలమట్టము చేయబడినది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపి, తదుపరి దాడులను అరికట్టి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచినాడన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని ప్రక్కనున్న బాలబ్రహ్మ దేవాలయానికి పూజారులు తరలించి, దాచిపెట్టినారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించుట జరిగినది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఈ పుణ్యక్షేత్రము 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమయిన గద్వాలుకు 60 కి.మీ. దూరములోనూ, హైదరాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్నdiది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ సముదాయమును కట్టించిన ఘనత బాదామి చాళుక్యులది. నాటి ఈ క్షేత్ర వైభవము వర్ణనాతీతమని చరిత్రకారుల మాట.  కన్నడ, ఆంధ్రప్రదేశాలలో అనేక నిర్మాణాలు వీరి ఔదార్యము మరియు భక్తియే! వీరు బీజాపూర్‌ మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించినారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక క్షేత్రము ఉన్నది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టినారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేసినారు. జోగులాంబ, బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర క్షేత్రము ఉత్తర వాహిని తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశీ గా పేరుగాంచిన ఈ క్షేత్రము. ఈ క్షేత్ర  విశేషాల గూర్చి కాస్త తెలుసుకొందాము....        ప్రస్తుతం అలంపురముగా పిలవబడుతున్న ఈ గ్రామము పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపుర అని తెలియవస్తూ ఉన్నది.  స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రాహ్మీలిపి లోని శాసనములో అలంపురము ప్రస్తావన ఉంది. నడుకశ్రీ(అర్థము తెలియలేదు) అనే వ్యక్తి తన ఆయుష్షు పెరుగుట కోసం భగవంతుడైన అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామికి కొంత భూమిని ధారాదత్తము చేసినాడట.

మిగిలినది మరొకమారు.......

అలంపురం జోగులాంబ 2

ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానుల ఆగడములచే నేలమట్టము చేయబడినది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపి, తదుపరి దాడులను అరికట్టి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచినాడన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని ప్రక్కనున్న బాలబ్రహ్మ దేవాలయానికి పూజారులు తరలించి, దాచిపెట్టినారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ పునఃప్రతిష్ఠించుట జరిగినది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు ఈ పుణ్యక్షేత్రము 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమయిన గద్వాలుకు 60 కి.మీ. దూరములోనూ, హైదరాబాద్‌కు 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్నdiది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ దేవాలయ సముదాయమును కట్టించిన ఘనత బాదామి చాళుక్యులది. నాటి ఈ క్షేత్ర వైభవము వర్ణనాతీతమని చరిత్రకారుల మాట.  కన్నడ, ఆంధ్రప్రదేశాలలో అనేక నిర్మాణాలు వీరి ఔదార్యము మరియు భక్తియే! వీరు బీజాపూర్‌ మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించినారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక క్షేత్రము ఉన్నది.

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టినారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేసినారు. జోగులాంబ, బాల బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి. అలంపూర క్షేత్రము ఉత్తర వాహిని తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశీ గా పేరుగాంచిన ఈ క్షేత్రము. ఈ క్షేత్ర  విశేషాల గూర్చి కాస్త తెలుసుకొందాము....        ప్రస్తుతం అలంపురముగా పిలవబడుతున్న ఈ గ్రామము పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపుర అని తెలియవస్తూ ఉన్నది.  స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రాహ్మీలిపి లోని శాసనములో అలంపురము ప్రస్తావన ఉంది. నడుకశ్రీ(అర్థము తెలియలేదు) అనే వ్యక్తి తన ఆయుష్షు పెరుగుట కోసం భగవంతుడైన అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామికి కొంత భూమిని ధారాదత్తము చేసినాడట.

మిగిలినది మరొకమారు.......

అలంపురం జోగులాంబ 3 (చివరి భాగము)

నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించినారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మిక్కుటముగా ఆలయాలను కట్టించినారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి. బాలబ్రహ్మశ్వర దేవాలయము ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహము ఉండదు.  స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల శిల్పకళా సౌందర్యమునకు మచ్చుతునకగా నిలచింది. క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయము జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపురము భక్తుల కోలాహలము తో కిటకిటలాడుతుంది.                                                  

అలంపురము ఎలా చేరుకోవాలి అన్న సందేహమునకు ఇక్కడ సమాధానము దొరుకుతుంది. విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపురము గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

సంగ్రహముగా అలమ్పురమును గూర్చిన సమాచారము పాఠకుల సౌఖర్యార్థము ఈ దిగువన ఇవ్వబడినది.స్వస్తి.

1. అష్టాదశ శక్తి పీఠాల లోని ఒక శక్తి పీఠం...ఈ ప్రదేశంలో దేవి యొక్క పై దవడ పడిందట.

2. ఈ క్షేత్రంలో అమ్మవారిని యోగులంబ అని, యోగాంబ అని చివరికి జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి..

3. బహమనీ సుల్తానుల దాడులలో (క్రీ. శ. 1480) పూర్వపు ఆలయం పూర్తిగా శిధిలమయిందట. కారణం ముష్కర తురుష్క మూకలు అమ్మవారి ఆ ఆలయమును పూర్తిగా నామ రూపాల్లేకుండా   ధ్వంసం చేయుటయే!

4. పూజారులు మాత్రం అమ్మ వారి విగ్రహాలను కాపాడ గలిగినారు.

(చిత్రంలో దెబ్బతిన్న ఆలయకలశాన్ని చూపాను చూడండి)

5. దేవి ఇక్కడ చండి ముండి (బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో) రూపంలో ఉంటుంది.

6. దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయము 525 సంవత్సరములు.

7. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా కట్టిన గుడిలో అమ్మవారి పునః ప్రతిష్ఠ చేసినారు.

8. తురుష్కులు కేవలం ధ్వంసం చేయుటతో ఆగక ధ్వంసము చేసిన ఆలయముయొక్క  స్థలమున ఒక దర్గాను ఏర్పరచి నడుపుచున్నారు.

9. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముస్లిం మత పెద్దలందరినీ ఒప్పించి దర్గా ను ఒక చిన్న గదికి పరిమితం చేసినారు.

10.  ఈ క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. పూర్వం శ్రీశైలం ప్రాజెక్టు లో నీరు నిండితే ఈ ఆలయముపై నదీ ప్రవాహ ప్రభావం పడకుండా పెద్ద గోడ కత్తుట జరిగినది. .

ఇక్కడ అమ్మవారిది ఉగ్ర రూపము.

ఆ వేడిమిని తగ్గించుటకు  దగ్గరగా ఒక తటాకాన్ని నిర్మించినారు.

 ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలు నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి.

అవి 1. తారక బ్రహ్మ ఆలయము 2. స్వర్గ బ్రహ్మ ఆలయము 3. పద్మ బ్రహ్మ ఆలయము 4. బాల బ్రహ్మ ఆలయము 5. విశ్వ బ్రహ్మ ఆలయము 6. గరుడ బ్రహ్మ ఆలయము 7.కుమార బ్రహ్మ ఆలయము 8.ఆర్క బ్రహ్మ ఆలయము 9. వీర బ్రహ్మ ఆలయము.

ధ్వంసము కాగా మిగిలిన పురాతన  ఆలయలో చాల ఉపాలయాలు ఉన్నాయి. చాల విశాల ప్రాంగణము ను ఈ దేవాలయము కలిగియున్నది.

ఈ ఆలయ శిల్పకళ అత్యద్భుతము. ద్వారలపై భాగంలో బ్రహ్మ లోకం, విష్ణులోకం, శివలోకం అనే మూడు శిల్పాలు పై కప్పు పై చెక్క బడినాయి.

ఇంకా ఇచట సూర్యనారాయణ స్వామి ఆలయము, నరసింహ స్వామి ఆలయము ఉన్నాయి.

వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినాడు.

ఈ క్షేత్రం కర్నూల్ నుండి కేవలం 25 కి.మీ.దూరంలో, హైదరాబాదు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. కానీ ఇది తెలంగాణాలోని గద్వాల్  జిల్లా కు చెందుతుంది.

స్వస్తి.



Wednesday, 8 June 2022

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము

 

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము

https://cherukuramamohanrao.blogspot.com/2022/06/blog-post.html

బృహదారణ్యకోపనిషత్తును గూర్చి మాట్లాడుకొనునపుడు శరీరాంతర్గతమగు ఆత్మయే పరమాత్మ అని చెప్పుకొన్నాము.  మహా చైతన్య పదార్థమైన ఈ ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు అంతా ఆత్మచైతన్యము ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్దస్పర్శరూపరస గంధాలుసర్వ శారీరక సుఖాలు. ఇవన్నీ ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినాఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూస్వప్నావస్థలోనూ, సుషుప్తిలోనూ  జాగృతంగా ఉండి జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించితిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి హృదయకుహరంలో స్థితమై ఉన్న ఆత్మ. ‘హృదయమునకు దగ్గరగా నీలి రంగులో జ్వలించుచున్న జ్వాల శిఖరమున అణుమాత్రముగా ప్రకాశించుచునా పరమాత్మయే ఆత్మ. జీవికి ఆత్మ జీవులకు పరమాత్మ. అది చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ అధిగమించి  ముందుకూ వెళ్ళగలుగుతుంది వెనకలకూ రాగలుగుతుంది. ముందునకైనా వెనకలికైనా దాని వేగమును అందుకొనజాలవు. మరి పరమాత్మే సృష్టించిన ఏ వస్తువైనా పరమాత్మను అధిగమించలేవు కదా!

ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా అతీతమైనది. ఇంద్రియములద్వారా మనము ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవము. మనకు ఉన్న ఏ ఉపకరణమయినా తనకు నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. అవయవ లోపము ఉన్నపుడే దాని బాధ్యతను ఉన్న అంగము స్వీకరించవలసి వస్తుంది. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు. 

శరీరమునకు ఉన్న బాహ్యాంగములు బాహిరమగు వస్తు సముచ్చయమును గమనించగలవుదృశ్యములను చూడగలవు అవసరమగునపుడు తత్సంబంధిత అంగములతో స్పందించనూగలవు.

ఆత్మ భూతభవిష్యత్తులకు అతీతము కానీ వానికదియే అధిపతి.

ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ ‘‘బొటనవేలి పరిమాణం కలిగిభూతవర్తమాన. భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషునిగా చెప్పవచ్చును. ఇక్కడ పురుషుడు అన్న శబ్దము నపుంసక లింగము. ‘ఆత్మ పొగబారని నిర్మల తేజోమయ జ్యోతి’గా వర్ణించుతుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదుమరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జన్మించిన ప్రతి వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. ఆ ఆరూ మానవుని పరిణామ దశలు. అవి జాయతేఅస్తివర్ధతేవిపరిణమతేపరిక్షీయతేవినశ్యతి అనునవి. అంటే సూక్ష్మ (పుట్టుక)స్థూల (పెరుగుదల) , మహిమ (మరింతగా పెరగడం లేక బలపడడం)రూప పరివర్తన (రూపంలో మార్పు రావడం)రూపక్షీణము (వార్ధక్యము)నాశనం (మరణించుట). ఇవన్నీ బాహ్య పరిణామములు. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ. అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండము కన్నా పెద్దది.  ఆత్మను గూర్చి పరమాత్మ భగవద్గీతలోని రెండవ అధ్యాయములోని సాంఖ్య యోగములోని 22, 23వ శ్లోకములుగా ఆత్మను గూర్చి ఈ విధముగా తెలుపుతాడు:

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి 

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2 - 22 ।

ఎలాగైతే మానవుడుజీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మమరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి 'న్యాయ దర్శనమన్న గ్రంధము ఈ క్రింది వాదన ని చెపుతోంది.

జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)                                                                            

చిన్న శిశువును గమనిస్తేఏ పత్యేకమైన కారణం లేకుండానేఒక్కోసారి నవ్వుతూ వుంటుంది, ఒక్కొక్కపరి ఏడుస్తూ ఉంటుందిఒక్కోసారి ఎదో ఆలోచనలో ఉన్నట్లు ఉంటుందిఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శనముప్రకారముఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీఅ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ వాసనలు మనసులో బలంగా ముద్రింపబడటం చేత అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి.

మిగిలినది మరోమారు....

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము – 2

 

'న్యాయ దర్శనముపునర్జన్మ కు మద్దతుగా ఇంకొక వాదనను పేర్కొంటుంది. ‘స్తన్యాభిలాషాత్ (3.1.21)’  అప్పుడే పుట్టిన శిశువుకు ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడుతల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలికానీఅప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలోజంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలుపొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.

అందువలనసహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.

ఇక 23వ శ్లోకమును గమనించుదాము.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 2 - 23 ।।

ఈ ఆత్మనుఆయుధములు ఛేదింపలేవుఅగ్ని కాల్చలేదునీరు తడపలేదుగాలి అరిపోవునట్లు చేయలేదు. ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చుకానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనదికావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగాగాలి ఆత్మను ఎండబెట్టలేదునీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.

ఆత్మ ఇంద్రియగోచరం కానిది. అంతేకాదుఅచింత్యమైనది. అంటే మన మనసులోని ఆలోచనలకు అందనిది. ప్రతి ఒక్క చలనానికి అనగా కదలికకు అచంచలమైనదొకటి హేతువాయి తీరవలసినదే! రైలు పరుగెత్తాలంటే కదలకుండా ఉండే పట్టాలు అవసరం. చలనచిత్రము చూడాలంటే దానికి స్థిరమైన తెర ఆధారంగా ఉండి తీరాలి. లోకంలో సంభవించే చలనాలన్నిటికీ కారణభూతమైనది ప్రాణం. తెరమీది చలచిత్రమును చలింపజేయు పనిచేయడానికి ఆధారంగా నిలిచేది ప్రక్షేపకము (Projector). ఇది చలన చిత్రమునకు  ఆత్మ. దృగ్గోచకాని ఆత్మను వర్ణిస్తూ ‘‘చేరి కానరానివాడు... చింతింపరానివాడుభారపు వికారాల పాయనివాడీ ఆత్మ’’ అంటారు అన్నమాచార్య. ఆత్మతత్త్వం వర్ణించడం సాధ్యంకానంత అనంతత్వంతో భాసిస్తుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది. మహాచైతన్య పదార్థమైన ఆత్మనే హృదయాంతరికలోకాన వసించే అంతర్యామిగా మనం భావన చెయ్యాలి.

ఇక మానావమానాలను గూర్చి విశ్లేషించుకొందాము.

జీవునికి ముక్తి పొందటానికి ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల లభించేది మానవ దేహం. మానవఉపాధి లభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం. అనుకోకుండా ఒక పదునైన చాకు దొరికితే బుద్ధిమంతుడు కాయగూరలూ పండ్లు తరుగుటకు వాడితే,కౄరుడగు బుద్ధిహీనుడు తలలు తరగడానికి వాడుతాడు.

జగద్గురువగు శంకరులవారు ఎంత మంచిమాట చెప్పినారో చూడండి.

మిగిలినది మరోమారు.....

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము- ౩


మన పూర్వ కర్మానుసారంగా మనకు లభించిన ఉపాధి ధర్మాలను పాటిస్తూబాధ్యతలను నెరవేరుస్తూనేఅసలైన జ్ఞానాన్వేషణ సాగించాలి. సదసద్వివేకాన్ని వృద్ధి చేసుకోవాలి.

ఇక్కడ ఒకమాట చెప్పి తరువాత మానావమానములను గూర్చి ముచ్చటించుకొందాము. మనము ఈ అలియుగములోనే అత్యంత నిమ్న జాతికి చెందిన నాయనార్లు ఆళ్వార్లూ భగవద్భక్తులై ఏకముగా కైవల్యమునే సాధించినారు.  అంటే దేవుని సన్నిధి చేరుటకు వర్ణము కాదు ముఖ్యము.

 

జ్ఞానాదేవ తు కైవల్యమ్. అన్నది తేటతెల్లమగుచున్నది. వేదము ప్రతి వర్ణమునకు బాధ్యత్కలను అప్పగించినది. వానిని చిత్తశుద్ధితో పాలించుటయే ధర్మానుసరణమగును.

మన వేదములు, ఉపనిషత్తులు అని వర్ణములవారికి శ్రేయోదాయక్మగు హితవాక్యములకు తోడుగా ఎన్నో భక్తి మార్గములను ఉపదేశించుతూ ఉండగా, వాని సారమును కాచి వడపోసిన మహనీయులు ఎన్నో స్తోత్రములు, స్తవములు సర్వ మావజాతికి సమర్పణ చేసినారు అట్టి మహానీయులబాట మనము నడచుటకు అత్యంత ఉత్కృష్టమై యోప్పారుచున్నది. అమితమగు సారభూతముగా జగద్గురువులగు శంకరుల వంటి వేదశాస్ర పరినిష్ఠితులైన వారు వేరు వేరు చోట్ల ఉన్న భగవద్గీత లోని ఉపదేశములను సకల శాస్త్ర ఉపనిషత్సారమును ఒక్కటి జేసి రంగరించి సంగ్రహించి  ఈ క్రింది శ్లోక రూపములో చెప్పినారు.   

యక్త్వా మమాహమితి బంధకరే పరేద్వే

మానావమాన సదృశాః సమదర్శినస్యా

కర్తారమన్య మవగమ్య తదర్పితాని

కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః

మనకు ఈ సంసారబంధమునకు ముఖ్య హేతువులు అహంకార మమకారములు.

ధనము విద్య వంశము, బలగము, అధికారము మొదలగునవి అహన్కారెఅహెథువులు. నేను అనుకోనుతయే అహము. ఈ విధముగా తాలువ మొదలిడితే ఇక మన గర్వమునకు హద్దే ఉండదు. అహంకారము పెరిగే కొద్దీ సాటి మనుషులపై తూష్ణీభావము పెరుగుతుంది. అది పతన హేతువే కానీంయతా కాదు.

చెరుకు తీపి ఎంతొ చేకొని యున్ననూ

చీడ పుట్టెనేని చెరుకు చెడును

అహము చీడ సమము అది నీవు గమనించు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

మిగుల చెడుగు చేసి మీసాలు మెలిబెట్టి

కానరారు సాటి కళ్ళముందు

అన్న నిన్ను జూడ ఆపైన ఒకడుండు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

అహంకార చిత్త మత్త ప్రవృత్తుడైన దుర్యోధనుని ఒకసారి చూద్దాము. బాల్యములోనే భీముని జంప నీట ముంచినాడు, లాక్ష్యాగృహము దహింప జేసినాడు, ద్రౌపదీ వస్త్రాపహరణము గావింపజేసినాడు. అతిరథ మహారథులు ఆరు మంది కలిసి  అభిమన్యుని పద్మవ్యూహమునందు  చంపింప జేసినాడు. తనకు సతి ఎవరని విర్రవీగినాడు. చివరకు భీమునిచేతిలో హృదయ విదారకమైన రీతిలో చనిపోయినాడు. పిండప్రదానము చేయుటకు ఇటు పుత్రులు గానీ అటు సహోదరులు గానీ లేకుండా బలిచేసుకొని, చివరకు ధర్మరాజుతో నువ్వులు నీరు వదిలింప జేసుకొన్నాడు. మన కార్య కలాపములను పైవాని కన్ను గప్పి చేయలేము. ఇటువంటి కార్య కలాపములు చేయువాడు తప్పక జనన మరణ వాయు గుల్మమున అనగా సుడి గుండమున తగులుకొన్నట్లే! అంటే శంకరులవారు వేరొక సందర్భములో చెప్పినట్లు

పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం|

ఇహ సంసారే బహుదుస్తారే

కృపయాపారే పాహి మురారే||

పరమాత్మా! ఈ చావు పుట్టుకల జలవలయము లోనికి నన్ను జోప్పించకు. దానిని దాటింపజ్జేయు అనుగ్రహము నాపై చూపించుఅని ఆర్త్ తో వేడుకొంటాడు నిజమైన భక్తుడు. దానకి మనము కృషిచేయవలసినది అందుకు చేయవలసిన మొదటి పని అహంకార త్యాగము.

ఈ విషయమై ఇంకొక మాట చెబుతాను:

మనుష్యుల మధ్య వచ్చే చాల మటుకు పొట్లాటలు ఈ ''అహం" వల్లనే జనిస్తాయి. అది మనకు తెలిసినదే!  "What They Don’t Teach You At Harvard Business School" అనే పుస్తకం రాసిన Mark H McCormack, అనే రచయిత ఇలా అన్నాడు : "చాలా వరకుపెద్ద పెద్ద సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు(Carporate Executives) , రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు." గణాంకాలు పరిశీలిస్తేచాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణంవారికి పనిలో నైపుణ్యం లేక కాదువ్యక్తుల మధ్య సమస్యల వలన. కావున అహంకారాన్ని పెంచి పోషించు కోకుండాదానిని త్యజించటం లోనే ప్రశాంతత కు మార్గమున్నది.

ఇక మమకారమును గూర్చి కాస్త విశ్లేషించుకొందాము.

మరొక మారు.........

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము- 4

భగవద్గీతలోని ఈ రెండు శ్లోకములను గమనించండి:

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥1-1

ఈ శ్లోకము ప్రతమాధ్యాయములోని ప్రథమ శ్లోకము.  ధృతరాష్టృదు పుట్టు గ్రుడ్డి. ధర్మశాస్త్ర రీత్యా రాజ్యపాలనా యోగ్యత లేనివాడు. పాండురాజు యొక్క దయ, జాలి, అభిమానముతో సింహాసనము అధీష్ఠించినాడు. తన పుత్రులు ఎల్లవేళలా పాండవులకు ఎగ్గులు చేసినవారే! కానీ యుద్ధము వచ్చిన వెంటనే నా సుతులు పాండుసుతులు అన్నాడు కానీ, అయ్యో అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకొన యుద్ధమునకు సిద్ధమైనారే అని అనలేదు. ఇదే మమకారము అంటే! పిఒనీ ఇది శాశ్వతమా అంటే క్షణికమే! మరి దీనికి అంత స్వార్తమవసరమా! అసలు  ధృతరాష్ట్రుడు

ఏమంటున్నాడో చూడండి- “ఓ సంజయాధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్దులై కూడి ఉన్న నా వారైన దుర్యోధనాదులుపాండు పుత్రులు ఏం చేసినారుఇదీ మమకారము. ఇపుడు భగవద్గీత నుండియే మరియొక ఉదాహరణ తీసుకొందాము.

రెండవ అధ్యాయములోని 5వ శ్లోకములో అర్జునుడు తన మమకారమును ఈ విధముగా వ్యక్తము చేయుచున్నాడు.

గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |

హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 2 -5 ||

మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని యైనను ఈ లోకమున జీవించుట శుభదాయకము. ఏలనన ఈ గురుజనులను చంపిననురక్తసిక్తములైన రాజ్యసంపదలనుభోగములను మాత్రమే నేను అనుభవింతును గదా

మమకారము అను బలమైన పొర లేక తెర ఎంతగా అర్జునుని కనులుగాప్పిందో చూడండి. అర్జునుడు స్వతహాగా క్షత్రియుడు. ఎదుటి వ్యక్తి యుద్ధమునకు ఆహ్వానించి యుద్ద్ఝారంగాములో నిలచిన తరువాత ఎదురించి పోరుట క్షాత్ర ధర్మము. అదికాదని ఎదురునిలచినవారు నాకు గురువులు, పెద్దలు ప్రియతమ బంధువులు అనుట మమకారము కాక మరేమిటి? భగవంతుని సారధిగా చేసుకొని, ఆయన అదేశానుసారమూ నడచుకొనే పార్థుడు మమకారము అన్న మాయకు ఎంత లోనయినాడో చూడండి. మన సనాతన ధర్మమూ నిర్దుష్టముగా చేయ తగినవి చేయ తగనివి అనేకానేక గ్రంధములావ్ ద్వారా ఆదేశించినది. మనము అల్లోచించక ఆచరించుతూ పొతే చాలు.

ఇక్కడ పెద్దలు చెప్పిన ఒక మాట గుర్తు చేస్తాను. ‘సంఘః ఖలు పాంథ సంగమః’ అంటే భావమంధము లోన బందీలై మమకారము పెంచుకొన్నవారంతా కేవలము ప్రయాణములో కలిసిన పాంథులు అంటే ప్రయాణీకులు. ఎవరిగామ్యము వారిది అన్నది ఎరిగి మసలుకోనుతకు బదులుగా ‘ఆహామైతెశాం’ ‘మమైతే’ అనగా నేను నాది అన్న వలయమున తగుల్కొని తిప్పలు పడుతూ ఉన్నాము. పై శ్లోకములోని మొదటి పాదములో జగద్గురువులు ఆదేశించినది దీనిని పరిత్యజించమనియే! శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినది కూడా ఇదియే!

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః

నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 2-71 ।।

ఎవరైతే  ప్రాపంచిక కౌతుకములను త్యజించిఅత్యాశ లేకుండానేను/నాది అన్న భావన లేకుండాఅహంకార రహితముగా ఉంటాడోఅలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. 

శ్లో॥ సమశ్శత్రౌచ మిత్రేచ తథా మానావ మానయోః

శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః॥    (18)

శత్రువుల యందుమిత్రులయందు సమంగా ప్రవర్తించేవాడుఅలాగే మానావమానములయందుశీతోష్ణములయందుసుఖదుఃఖములయందు సమంగా ఉండేవాడుసంగభావాన్ని విడిచిన వాడు(నా ప్రియభక్తుడు).

అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవచ l

నిర్మమో నిరహంకార: సమదు:ఖ  సుఖ క్షమీll

 సమస్త ప్రాణుల యెడల ద్వేషము లేనివాడు , స్నేహభావముదయకలవాడుఅహంకార మమకారములు లేనివాడుసుఖ దు:ఖములందు కలవాడు. ఓదార్పుగలవాడు (భక్తుని లక్షణములు). 

అని ఈ విధముగా ఇది చెప్పినదే కదా! అనుకోకుండా పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.

కళ్ళుమూసుకొని శ్లోకములను చెప్పుకొనుటయే గాక నైతిక విలువలను పాటించుతూ అహంకార మమకారములను సమదృష్టితో చూస్తూ, సుఖదుఃఖములను సాకు జేయక సరభూత శ్రేయోభావనతో ఈవితము5 కొనసాగించువాడు నిజమగు భక్తుడు. జీవన గమనములో మనము ఏర్పరచుకొన్న పథములో బాటకు ఇరువైపులా పాత్ర పుష్టి గల చెట్లుంటే సేదతీరి బడలిక సడలుతుంది. అదే చెట్లు లేని దారింబడితే దారి క్కన్తక్కబ్ ప్రాయమయినడై ఉండవచ్చు, సూర్యుని వాదియగు వేడి భరించనూ లేకపోవచ్చు. కానీ కానీ సుఖదుఃఖాలను పరిగణన లోనికి తీసుకొనక ప్రయాణము చేస్తూ ఆదేవదామమును పొందినవాడే నిజమగు భక్తుడు.

మిగిలినది మరోమారు....... 

ఆత్మ – అహంకారమమకారము – మానావమానము – 5 (చివరి భాగము)

మన పూర్వుల మనస్తత్వము ఏవిధముగా ఉండేదో ఒకసారి ఈ క్రింది శ్లోకములో గమనించండి:

మన్నిన్దయా యః జనః పరితోషమేతి నన్నప్రయత్న సులభోయమనుగ్రహోమేl

శ్రేయోర్థినోహి పురుషాః పరతుష్టి హేతోః దుఃఖార్జితాన్యాపి ధనాని విసర్జయతిll 

ఈ శ్లోక సారాంశము ఏమిటంటే , నాటి విద్వద్వరేణ్యులు ఈ విధముగా తలపోసేవారట. సాధారణముగా సంతోషమును పొందుటకు దాతలు  అవసరమగు వ్యక్తులకు ధనమును దానము జేసి సంతోషమును పొందుతారు, కానీ నేను ఒక వ్యక్తి నిందకు కారనంకై సంతోషమును కలిగించుచున్నాను. ఎటువంటి ఖర్చూ లేకుండా ఎదుటి వ్యక్తిని సంతోషపరచి ఆ పుణ్యమును మూటకట్టుకొనుచున్నాను కదా! మానావమాన విషయములో ఈ ఉదాసీనతను కలిగియున్డుతకు ఇది పరాకాష్ట.

 ఈ విషయమై మహనీయులు నీలకంఠదీక్షితులు ఒకసారి ఇలా అన్నారు:

ప్రామాణ్య బుద్ధిః స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని l

కీట బుద్ధిర్మనుష్యేషు నూతనాయాః శ్రియః ఫలంll

స్తోత్రము అనగా ‘అవిద్యమాన గుణ కీర్తనం స్తోత్రం’. అంటే లేని ఉత్తమ గుణములను స్తోత్రము చేయు వ్యక్తిలో ఆపాదించుట. ఇది మానవుల విషయములో మాత్రమే! మనుష్యుల విషయములో ఈ స్తోత్ర పాఠమును వంగర, అల్లు గారలు రేలంగిని ప్రశంసించుతూ ఆయన పాత్రకు లేని గుణములతో చ్గేస్తారు. ఇది నేటి సామాజిక పరిస్థితికి నిలువుటద్దము.

ఈ శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే కొత్తగా సంపద పొందినవాడు, స్తోత్ర పాఠాలకు,

 అవి వాస్తవాలు కాకున్నా పొంగి పొరలి పోతాడు. తనకు ఎక్కడలేని దేవతా బుద్ధులను ఆపాదించుకొంటాడు. కీతబుద్ధి అంటే సాటి మనుషులను పురుగులవలె చూస్తూ హీనముగా మాట్లాడుతాడు. అందుకే మనవాలు అంటూవుంటారు ‘అష్ట దరిద్రునికి ఐశ్వర్యము వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడని’. కాబట్టి మనకు ఒకరి రాగద్వేషాలతో పనిలేదు. మనసుకు తోచిన పని మనము చేస్తున్నామని మన ఆత్మకు నచ్చజేప్పుకోగలిగితే చాలు.

మానావమాన సదృశాః సదర్శినశ్చ’ అన్నది ఆర్యవాకు. మానావమానములకు పొంగనూ వద్దు కృంగనూ వద్దు. భగవద్గీత ఈ విధముగా చెబుతూ వుంది.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శుని చైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః ।। 5 - 18 ।

విద్యా వినయములు గల్గిన నిజమైన పండితులుదివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడినిఓ ఆవునిఓ ఏనుగునిఓ కుక్కనిఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు. ఈ తరతమ భేదములు పాతిన్చానివాడే నిజమైన భక్తుడు కాగలుగుతాడు.

‘కర్తారమన్య మవగమ్య తదర్పితాని కుర్వన్తి కర్మ పరిపాక ఫలాని ధన్యః’ ఆదేమీ లేదండీ. అంతా పైవాడు చేసినదే! నన్ను ఉపాధిగా ఆయన వాడుకొన్నందుకు ధన్యుడను. ఇది మనము మనసా వాచా నమ్మి ఆచరించవలసినది. గీతలో పరమాత్మ ఈ మాటే చెబుతున్నాడు.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్

యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 9 - 27 ।

నీవు ఏ పని చేసినానీవు ఏది తిన్నానీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినానీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినామరియు ఏ నిష్ఠలను ఆచరించినాఓ కుంతీ పుత్రుడావాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.

అంటే  “భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయటమేమరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే.” పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి వేస్తే దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులనుఇటువంటి దృక్పథం దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా మార్చివేస్తుంది. స్వామి వివేకానంద పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: “ఏ పనీ లౌకికమైనది కాదు. ప్రతిదీ భక్తి మరియు సేవయే! పరమ భక్తుడగు కబీరు ఈ విధముగా అంటున్నాడు.

జహాఁ  జహాఁ  చలూ కరూ పరిక్రమాజో  జో కరూ సో సేవా

జబ సోఁవూ కరూ దండవత్జానూ దేవ న దూజా

“నేను నడిచినప్పుడల్లా నేను భగవంతుని గుడిని ప్రదక్షణ చేస్తున్నట్టు భావిస్తానునేను ఏది చేసినాఅది భగవత్ సేవ గానే చేస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడునేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగానేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.”

పోతన భాగవత రచనా ప్రారంభములో ఈ విధముగా అంటాడు:

పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట,నే

బలికిన భవహర మగునట

 పలికెద వేరోండు గాథ పలుకగ నేలా?

అట్టి భక్తియే  నిజమైన తాదాత్మ్య యుక్తమగు భక్తి. అసలు గీతలో పరమాత్ముడే అర్జునునితో చెబుతాడు” ఈ యుద్ధమంతా నీభ్రమ. చావవలసినవారి నందరినీ చంపుచున్నది నేనే! ఆ మాటకొస్తే వీరిని పరిమార్చాదము అయిపోయినది.నీవు నిమిత్త మాత్రుదివే!”. ఈ భావన కలకాలమూ మాడిన నిలిపి కర్మను చేసేవాడు భక్తి తాదాత్మ్యతను పొందినవాడే!

శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః

ఎవడైతే ఆహంకారమమకారములను వదిలిపెట్టి మానావమానములను లెక్కించక, సర్వత్ర సమదర్శిగాఉండి, తాను చేస్తున్నాననే భావనతో కర్మలను చేయక, చేయించే వాడు పరమాత్మయే అని తలచి, తత్కర్మలను చేసి పరమేశ్వరార్పణముగా భావించుతాడో వాడు ధన్యుడు అన్నది శంకరులవారు, భగవద్గీతలో వేర్వేరు అద్యాయములలో చెప్పిన సందేశములను క్రోడీకరించి ఆదియందు తెలిపిన చిన్న శ్లోకము రూపములో జగద్గురువగు ఆది శంకరులవారు మనకు అందజేసినారు.

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే

న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 6 - 40 ।

 ఓ పార్థాఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకం లో కానిపర లోకంలో కాని చెడిపోడు. ప్రియ మిత్రమాభగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.

 తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నదిదీనర్థం "పుత్రుడా" అని. అర్జునుడిని తాత అని సంబోధించి శ్రీ కృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొడుకుని అనురాగంతో తాత అని సంభోదిస్తారు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటి వాడుకాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో 'తాతఅని సంభోదిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూఆయన మార్గం లో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు. మరియు "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ లోకంలో మరియు పర లోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషులకు ఒక గొప్ప భరోసా.

స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం

న్యాయేన మార్గేన మహీం,మహీశాం l

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం

లోకాః సమస్తా స్సుఖినో భవంతు.ll

సర్వే జనాః సుఖినోభవంతు.