ౘదరంగము - చెద రంగము
అట్ట మీద వున్నవరకె ఆగుచూవున్నది యాట
అట్ట మడిచివేయగనె అయిపోయిందన్న మాట
ఆనాడది చదరంగము ఈనాడిది చెదరంగము
ఎంతకాల మీఎత్తులు ఎందుకు నక్కల జిత్తులు
నేలపైన నిలుచు వరకు నీవు వేరు నేను వేరు
ఆపై మన ఆత్మలేమొ అచ్చటికే పోయి చేరు
చేరు గోడ చిత్రమ్ములు చెత్త నకలు మాలలతో
మాటలాడ వలసినదే మరి నీవిక మూలలతో
రాజు మంత్రి రౌతు బంటు రోజు కూడబెట్టు గంటు
పరికించిన కనికట్టు పనికిరాదు నీకు బెట్టు
అట్ట పైనె రాజు రౌతు ఆపై మరి ఎవరి కేవరొ
ఈ భువి పై నట్లు గాక ఎవ్వరైనను వుండగలరొ
ఆటలోన ఉన్నవరకె అమీతుమీ యనుచుందువు
ఆపై నొక పెట్టె లోనె అంగాలార్చు కొనుచుందువు
నీ బంటులు నీ ఒంటెలు నీ గుర్రాలేనుగులు
నీకోసము బలియగుచు నిష్క్రమించు పీనుగులు
అవి పోయిన పిదప నీకు అగచాట్లే అహరహము
ఆమాత్రపు భోగానికి అవసరమా అంత అహము
చెరుకు రామ మోహన్ రావు
అట్ట మీద వున్నవరకె ఆగుచూవున్నది యాట
అట్ట మడిచివేయగనె అయిపోయిందన్న మాట
ఆనాడది చదరంగము ఈనాడిది చెదరంగము
ఎంతకాల మీఎత్తులు ఎందుకు నక్కల జిత్తులు
నేలపైన నిలుచు వరకు నీవు వేరు నేను వేరు
ఆపై మన ఆత్మలేమొ అచ్చటికే పోయి చేరు
చేరు గోడ చిత్రమ్ములు చెత్త నకలు మాలలతో
మాటలాడ వలసినదే మరి నీవిక మూలలతో
రాజు మంత్రి రౌతు బంటు రోజు కూడబెట్టు గంటు
పరికించిన కనికట్టు పనికిరాదు నీకు బెట్టు
అట్ట పైనె రాజు రౌతు ఆపై మరి ఎవరి కేవరొ
ఈ భువి పై నట్లు గాక ఎవ్వరైనను వుండగలరొ
ఆటలోన ఉన్నవరకె అమీతుమీ యనుచుందువు
ఆపై నొక పెట్టె లోనె అంగాలార్చు కొనుచుందువు
నీ బంటులు నీ ఒంటెలు నీ గుర్రాలేనుగులు
నీకోసము బలియగుచు నిష్క్రమించు పీనుగులు
అవి పోయిన పిదప నీకు అగచాట్లే అహరహము
ఆమాత్రపు భోగానికి అవసరమా అంత అహము
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment