వర్ణాంతర వివాహం
ఇటీవల ఇలాంటి
ప్రశ్నలు ఎక్కువ సంఖ్యలో తారసపడుతున్నాయి. అందుకే
సమాధానమివ్వక
తప్పడం లేదు. ఒకప్పుడు వర్ణాంతరాది అసంప్రదాయ వివాహాలు
పెద్దలు చేసేవారే
కాదు. పిల్లలు ఏ 'రిజిస్ట్రేషన్'
పెళ్ళిళ్ళో, దండల
మార్పిడిలో
చేసుకొనేవారు.
గత్యంతరం లేక పెద్దలు సమ్మతించే వారు. కానీ ఇప్పుడు 'గత్యంతరం
లేక' వీళ్ళే పూనుకొని పెళ్లి చేస్తున్నారు. ఇది
శోచనీయం, దోషం. పెళ్ళి ఒక
ముచ్చటో,
వేడుకో కాదు
కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది వివాహ సంప్రదాయం. ఆ కన్యాదానం
పూర్వ తరాలను
తరింప జేయడం కోసం అని సంకల్పిస్తారు. అటువంటప్పుడు అన్య వర్ణాల
వారి కాళ్ళు
కడిగి, "పితౄణాం
తారణార్ధాయ' అని చెప్పి
కన్యాదానం చేయడం దోషం కాదా? ఆ
క్రియ వల్ల
పూర్వీకులు నరకంలో పడతారు. అలా పడవేసిన పాపం ఉభయులకూ
వస్తుంది. ఇదంతా
అస్తికులైతేనే గమనించాలి. నాస్తికులకు సంప్రదాయ వివాహాలు గానీ,
వివాహ
సంప్రదాయాలు కానీ అనవసరం కదా! 'సంప్రదాయం'
అనే మాట ఎత్తితే అసలు
ఏమిటో తెలియాలి
కదా! వివాహంలో వాడే మంత్రాలన్నీ సవర్ణ, సంప్రదాయ వివాహాలకే
చెల్లుతాయి.
భౌతిక తర్కాలకందని పరంపర, సూక్ష్మవిజ్ఞానం
దాంపత్య ధర్మంలో ఉంది.
కేవలం వ్యక్తులు
నచ్చుకుంటే సరిపోయిందా? ఆ
వ్యక్తులననుసరించి ఉండేకుటుంబాలను; పరంపరను
తప్పకుండా
జీవితంలో ఎదుర్కొనవలసిందే. అప్పుడు క్రమ క్రమంగా ఒకరికొకరు అలవడక, కలహించే పరిస్థితి
ఏర్పడుతుంది. మీ అమ్మాయి 'మన సంప్రదాయ ప్రకారమే పెళ్ళి జరగాల'ని పట్టుబడుతోంది అని చెబుతున్నారు.
అసలు ఈ
విధమైన పెళ్ళి మన సంప్రదాయం కాదని
చెప్పండి. తాను ఏ ఇంటికి
కోడలిగా వెళ్ళబోతోందో ఆ ఇంటిని
అనుసరించాలి అన్నది ఒక నియమం. ఇది
గుడ్డిలోమెల్లలాంటిది. మీ ప్రశ్న బట్టి
మరొకటి అర్థమౌతోంది. మీ
అమ్మాయికి సంప్రదాయమంటే గౌరవం ఉంది. కానీ దాని ప్రాధాన్యం,
పరంపర లాంటివి మీరు బాల్యం
నుండి
బోధించి ఉంటే ఈ అయోమయం రాదు. యౌవనావస్థకు సహజమైన ఆకర్షణ, మొహం మాత్రమే - ఇహ పరాలకు
సంబంధించిన
దాంపత్య ధర్మాన్ని నిర్ణయించడానికి సరిపోదు. పెద్దలు ముందుగా విజ్ఞుల ద్వారా
పరంపరను
తెలుసుకొని, సంప్రదాయ ధోరణికి దూరం
కాకుండా, ఆధునిక విద్యనూ
నేర్పే పద్ధతులు అవలంబించాలి.
11 Comments
No comments:
Post a Comment