ఇది మన సాంప్రదాయమా!
అది ప్రభుత్వ
ఉత్తరువై,ఆంగ్లేయ కేలెండరును పాటించినంత
మాత్రాన వారి ఆచార వ్యహారాలు పాటించనవసరము లేదన్నది నా అభిప్రాయము. మతముల పేరుతో
వ్యవహరించే రెండు సమాజములు అన్యులను తమ మతములో కలుపుకొనుటకు ఎన్నో ప్రలోభములను
చూపుతూ వుంటే, మన ధర్మము మనది అని నాబోంట్లు చెప్పినా ,
వినక ఆచరించే వారు ఆచరించగా, అది సరియైనదే అని అనవసర సానుభూతి చూపే
స్వధర్మానుచారులు ఎందఱో వున్నారు. అట్టి ఉదార చరితులకు ఈ పద్యము అంకితము.
అరుపులు
కేకలున్ మరియు నర్థము పర్థములేని వాగుడున్
తురగమునెక్కి
తూలుచును దూరుచునన్యుల నర్ధరాత్రమున్
మెరుపులవోలు
భామినులు మేనికి వస్త్రము లేక చిందులన్
పరువును వీడి
త్రొక్క బహుబాగని మెచ్చుటె న్యూయియర్సు డే!