ఆత్మ
నివేదన -- దైవమా చాలు ఈ జీవితం
దైవమా
చాలు ఈ జీవితం
లోకమంతా
ఉదాసీనమే
కలిగియుండేది
వ్యాపారమే
వెలుగు విరజిమ్మెను, చీకటులు
క్రమ్మెను
ఆశ అడుగంటగా ఆశయము
కృంగెను
చూపులెడబాసెను, బాధలెదనిండెను
గుండె బరువెక్కెను, తెల్పుమిది నీకు తగు కార్యమే
ఉన్న
సంతోషమును నిల్పుకోనైతిని
జీవినేగాని
జీవించ లేనైతిని
ఊపిరులు
లాగినా ఊరకెట్లుందును
ఈర్ష్యతో
సుఖమును,
నీవు కబళింపగా న్యాయమే
No comments:
Post a Comment