ఓం
శాంతిః శాంతిః శాంతిః
https://cherukuramamohanrao.blogspot.com/2018/09/blog-post_13.html
నిదుర
లేచినది మొదలు నిదుర పోయేవరకూ ఎదోవిధమైన సమస్య, ఏదో ఒక కలత. మనసుకు ప్రశాంతత
కలిగితే కలత తీరుతుంది అలత తీరుతుంది. ఇవి తీరడానికి మందునాశ్రయించే వారు
కొందరయితే విందునాశ్రయించే వారు కొందరు, పొందునాశ్రయించే వారు మరి కొందరు. సమస్య
అన్నది ఒక వెలిగించిన Gas Stove లాంటిది. దానిని, పని ముగిసిన వెంటనే Off చేస్తే Stove పదికాలాల పాటు
పనిచేస్తుంది. నిరంతరమూ అది మండుతూనే వుంటే అది Stove కే కాదు. ఇంటికి కూడా చేటే!
మరి ఈ విషయమును త్వరగా తెలుసుకొంటే దానిని తగిన విధముగా ఉపయోగించుకొనగలుగుతాము. అది
ఇంకా ఎక్కువగా మండితే మన సమస్య తీరుతుంది అస్నుకొంటే అది భ్రమే. కాలే Stove మీద
kirosine పోసినా, ఒక
Paint పోసినా, నూనె పోసినా కొంప మునిగే అవకాశము వుంటుంది. అటువంటిదే
మందు, విందు పొందు. కావున ఇవి మన సమస్యలు తీర్చవు.
మరి
మనము విద్య అధికముగానే గడించుతున్నాముకదా! సమస్యలు
లేకుండా గానీ, సమస్యలు రాకుండాగానీ ఎందుకు చేసుకో లేకుండా ఉన్నాము. జవాబు
తెలుసుకొనుటకు ముందు విద్య అవిద్య అంటే ఏమిటో చూస్తాము.
విద్య
అనగా జ్ఞానము, అది లేకపోవుట అవిద్య అన్నది సాధారణార్థము. కానీ నిజానికి మనము
గడించేది కేవలము అవిద్య. అందుకే అవిద్య అన్న మాటకు వ్యుత్పత్తి ఈ విధముగా వుంది. 'వేత్తుం న శక్యా
అవిద్యాః' అంటే ఎటుదిరిగీ తెలుసుకొనుటకు వీలుకానిది అవిద్య. ఏమి తెలుసుకొనుటకు అన్నమాటకు ‘పరమాత్ముని ఉనికిని’ అన్నది జవాబు.
పరమాత్మ
స్వరూప స్వభావములను సంపూర్ణముగా ఎరుగుట సాధ్యపడని వారి తెలివితేటలు లేక జ్ఞానము
అన్నవి అవిద్యగా చెప్పబడుతాయి. ఈశావాస్యోపనిషత్తు ఈవిధముగా చేబుతూవుంది.
విద్యాంచావిద్యాంచ
యస్తద్వేదో భయగుమ్ సహl
అవిద్యయా
మృత్యుంతీర్వా విద్యాయామమృతమశ్నుతేll ( ఈశావాస్య
11 వ మంత్రము)
యః = ఎవరైతే
విద్యాంచ =
విద్య(మరియు) ( ఆత్మ జ్ఞానము బ్రహ్మ తత్వము తెలుపునట్టిదే విద్య మిగిలినదంతా
అవిద్య)
అవిద్యాంచ =
అవిద్యలన్న (మనము పాఠశాల, కళాశాలలకు పోయి చదివేది అవిద్య.)
తత్ = ఆ
ఉభయగుం = రెండింటినీ
సహా = కలిపి
వేదో = తెలుసుకొనునో (అతను)
అవిద్యయా = (తన)
దైనిక కర్మానుష్ఠానములచేత
మృత్యుం = మృత్యువును
తీర్వా = అధిగమించును
లేక దాటును
విద్యాయాం = (పైన
తెలుపబడిన) విద్య వలన
అమృతం = అమరత్వమును
అశ్నుతే = పొందును
అంటే
రెండూ కావలసినదే కానీ అవిద్య మృత్యువు దాటే మార్గమే చెబుతుంది. విద్య అమృతత్వమును
సిద్ధింపజేస్తుంది.
వేదాంత
పరిభాష అన్న గ్రంధమును వ్రాసిన మహనీయుడు
ధర్మరాజ అధ్వరి, అవిద్యను గూర్చి ఈవిధముగా చెబుతున్నాడు.
యదవిద్య విలాసేన భూతభౌతిక సృష్టయః
తన్నోమి పరమాత్మానం సచ్చితానంద విగ్రహం
పరమాత్మ
మొట్టమొదట శక్తిని సృష్టించినాడట. ఆమె తన మాయచే ఈ జగత్తును సృష్టి చేస్తూ వుంది. ‘తన్నోమి పరమాత్మానం సచ్చితానందవిగ్రహం’ కానీ ఆమె దృష్టి మొత్తము
సచ్చితానందవిగ్రహము వైపే వుంటుంది. కావున మనము ఆ మాయలో పడగూడదు.
మరి
మొదటికే మోసముగా వుండే స్థితిలో మరి సమస్య తీరేదెట్ల? మనసు నిష్కల్మషముగా
చేసుకొంటే బుద్ధికి పరిష్కారమార్గములు తోచే అవకాశము వుంటుంది. దానికి దైవప్రార్థన
అవసరము. దానికి తగిన పూజనో పునస్కారమో ధ్యానమో ఎదో ఒకటి అవసరము. ఇవి సమస్యలు
వచ్చినపుడు చేసే దానికంటే లేకున్నపుడు
చేస్తే ఇంకా మంచిదే! అందుకే కబీర్ దాసు అంటాడు:
దుఃఖ్
మేఁ సుమిరన్ సబ్ కరేఁ సుఖ్ మేఁ కరైన కోయ్
జొ
సుఖ్ మేఁ సుమిరన్ కరే తో దుఃఖ్ కాహే కో హొయ్
ఓ
దేవుడా!
‘కష్ట నష్టాలలో నిన్ను తలతురు
సుఖము
సంతోషమున్నపుడూ మరతురు
సుఖములో
నిను తలచేవారు దుఃఖించరు
అన్న
ఈ చిన్న మర్మాన్ని మరచుతారు’
కాబట్టి
ఆ ధ్యానము అవసరము. కానీ రోజంతా ధ్యానములోనే గడపలేము. అందుకే మన పూజ, వ్రతము
ధ్యానము ముగిసిన వెంటనే ‘ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః’ అని మూడు మార్లు చెబుతాము. మరి
మూడే ఎందుకు అన్నది ఇప్పుడు చూస్తాము.
పంచ
మహాభూతములను మరియు వానిచే ఏర్పడిన వస్తువులు కలుగజేసే వనరులు మన బుద్ధి చాంచల్యము
అన్నీ పైన చెప్పిన శక్తి యగు ఆమె విలాసమే!
ఈ జీవుడు ఆమెకు కట్టుబడి ఉన్నంతవరకూ అశాంతితో జీవించవలసిందే!
అందువల్ల
నిరంతరమూ తాపత్రయమును అనుభవించుతూ ఉండవలసిందే!
మనము
ఉండే అగోచర స్థితిని తాపము, బాధ, కష్టము, ఇబ్బంది, ఇడుము, సమస్య అని ఏ పేరుతో నైనా
పిలువవచ్చు. వీనిని మన ద్రష్టలు మూడు విధములుగా విభజించినారు. వీనికి కర్త మాత్రము
ఆ మహా శక్తే! ఆ మూడే
1.
ఆధ్యాత్మికము 2. ఆధిభౌతికము 3. ఆధ్యాత్మికము
1.
ఆధ్యాత్మిక అంటే ఆది+ఆత్మిక . అంటే ఆత్మ సంబంధమైనది అంటే ఆంగ్లములో Related to self అని అర్థము. ఇక్కడ
ఆత్మ అంటే తనయొక్క అని అర్థము. తన శరీరమునకు సంబంధించిన సమస్యలు. ఉద్రేకము, భయము,
కోపము, తాపము, అవమానము, సోమరితనము, శారీరిక బాధ, మానసిక బాధ, కపటము, ఆశ
వీనికి ఒక శాంతి, ఇవన్నీ ఆధ్యాత్మికములే!
2.
ఇక రెండవది. ఇది శారీరికమైనదికాదు. నీచుట్టూ వున్న
ప్రకృతివల్ల ఏర్పడే సమస్యలు. ఆంగ్లములో చెప్పవలసి వస్తే Environmental Problems. ముఖ్యముగా పంచ మహాభూతములవల్ల ఏర్పడే ఉపద్రవములు, ఇవి కాక ఇంకా తన
శత్రువులవల్ల, చోరులవల్ల, మృగ కీటకముల వల్ల, ఏర్పడునవి. అంటే ఈ విధమయిన బాధలకు
కొన్ని జాగ్రత్తలు తీసుకొనుటవల్ల కొంత జాగరూకత పెంచుకొనవచ్చును.
3.
ఇక మూడవది ఆధిదైవికము External Compulsions meaning Instantanious problems. తుఫాను, ఉప్పెన , వరద, కరువు,
గ్రహాబలము, మనకు తెలియకనే వచ్చేవి, ఇవన్నీ మనము దైవ ప్రార్థన చేయుట చేత మాత్రమే
చిత్తశాంతిని చేకూర్చుకోగలుగుతాము.
అసలు
ఈ మూడూ మన జోలికి రాకుండా వుండుటకే మనము ‘ఓం శాంతి శ్శాంతిశ్శాంతిః’ అని చెప్పుట.
మనకొక దిక్కు వుంటే ధైర్యము వుంటుంది. ఆ దిక్కే భగవంతుడు. అందుకే ఆయనను ఈ
తాపత్రయములు లేకుండా చేయమని మనము మన ప్రార్థన తరువాత
‘ఓం
శాంతి శ్శాంతిశ్శాంతిః’ అని చెప్పవలసి వుంటుంది.
స్వస్తి.
unwanted desires r the root cause for the unhaapyness
ReplyDelete