శ్రీ శైల శిఖరం దృష్ట్వా
https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_15.html
పద్మపురాణంలో ఉత్తరఖండంలో శివక్షేత్రాల గురించి చెబుతూ,
మల్లికార్జునుని ప్రశస్తిని చెబుూ ఈ వాక్యం చెప్తారు
కేదారే ఉదకం పీత్వా వారణాస్యాం మృతోధృవం!
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే!! (పద్మపురాణం)
కేదారంలోని తీర్థం త్రాగినా, వారణాసిలో మరణించినా,
శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదు. అంటే "మోక్షం తప్పక లభిస్తుంది" అని అర్థం.
స్కాందపురాణంలో కాశీఖండం మరీ స్పష్టంగా వివరించింది.
"శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్విలోకనాత్!
పునర్భవో మనుష్యాణాం భవేత్ర న భవేత్ క్వచిత్!
గిశ్చతుర శీత్యాయం యోజనానాం హి విస్తృతం!!
సర్వలింగమయో యస్మాత్..."
"శ్రీశైల శిఖరం శుభమయమైనది. దానిని దర్శించినంత మాత్రాన, మరి జన్మ ఉండదు. ఎనభై నాలుగు యోజనాల విస్తృతి కలిగిన శ్రీగిరి సర్వలింగమయం."
తిరుమలగిరినీ, శ్రీవేంకటేశ్వరునీ, దర్శించితే తప్పక శ్రీనివాస కృపాబలం చేత తరించుతాము. ముక్తి లభిస్తుంది. అయితే ఇది చెప్పడానికి శ్రీశైలాన్ని కాదనక్కరలేదు కదా! ఒకరి మంచిని చెప్పడానికి ఇంకొకరిని చెడుగా పేర్కొననవసరం లేదు కదా!
శ్రీశైలంలో ’శిఖరేశ్వరం’ అని చెప్పబడే శిఖరప్రాంతాన్ని చూడడం చాలు. అక్కడ నంది కొమ్ముల్లోంచి ఆలయశిఖరం చూడవలసిన అవసరం లేదు.
స్వస్తి.
No comments:
Post a Comment