గోపాలక పాలక బాలక
https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_5.html
పల్లవి: గోపాలక పాలక బాలక శరణం తవ పద్మపాద ద్వయి నిరతం llగోపాలకll
అనుపల్లవి: నిర్మల నిగ్రహ నిశ్చల గుణ వితతం సతతం llగోపాలకll
చరణము 1.
మధురాధిప మదహారా మనోరమాధర మధుర సుధాపానవరా
మంజు మృదుల మురళీరవ విరళీ మాయుత వినతా సుత రథ సరళీ llగోపాలకll
చరణము 2.
పీతాంబర పీయూష వితరిణీ ప్రీణకారి
సుర నికర హితాగ్రణి
వసుదేవసుతం వాసవ వినుతం రసమయ చరితం రాధికాయుతం llగోపాలకll
చరణము 3.
శ్రేయో దీక్షం పాండవ పక్షం కౌరవ శిక్షం మునిజన రక్షం
సురనుత దక్షం దుష్టవిపక్షం రామమోహనాద్యంత కటాక్షం llగోపాలకll
Beautifully written song. Perfect tuning required
ReplyDelete