Monday, 20 November 2017

మహాదేవ నామావళి

మహాదేవ నామావళి
నీ నామావళి మహదేవా -  మనసా వచసా మహదేవా
తలువగ నెంచితి మహదేవా – తలపులనిలువుము మహదేవా
శివ శివ శంభో మహదేవా – శంభో శంకర మహదేవా
        మహదేవా జయ మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
1.              శుద్ధ జ్ఞానీ మహదేవా – శూలపాణీ మహదేవా
        సుముఖ తాత హర మహాదేవా – శూలాయుధ పిత మహదేవా
2.              నంది వాహనా మహదేవా – నటరాజ పరా మహదేవా
             నాద మూర్తయే మహదేవా – నాగాప్రియ శివ మహదేవా
3.              అంధక సూదన మహదేవా – ఆది భిక్షుకా మహదేవా
అంబర కేశా మహదేవా – అనాది నాథా మహదేవా
4.              కాల రూప ధర మహదేవా – కాలాతీతా మహదేవా
కాలకంధరా మహదేవా – కాల కాల హర మహదేవా
5.              విశ్వంకర హే మహదేవా – విశ్వంభర హే మహదేవా
విశ్వేశ్వర హే మహదేవా – విశ్వ విధాతా మహదేవా
6.              రజ్జు జటాళీ మహదేవా - రవళిత డమరుక మహదేవా
రాగి విరాగీ మహదేవా – రయ వాంఛితదా మహదేవా
7.              త్రిపురధ్వంసక మహదేవా – త్రినేత్ర ధారీ మహదేవా
త్రిదళార్చిత శివ మహదేవా – త్రికాల రూపా మహదేవా
8.              సితాభ ధవళా మహదేవా – శీతనగాలయ మహదేవా
శీఘ్ర వరప్రద మహదేవా – శితికంఠా పర మహదేవా
9.              గజోదరస్థిత మహదేవా – గజదానవ హర మహదేవా
గజ చర్మాంబర మహదేవా – గజాననా పిత మహదేవా
10.       బాలేందు ధరా మహదేవా – భస్మాలంకృత మహదేవా
భగనేత్ర భిదే మహదేవా – భక్త జనాశ్రయ మహదేవా
11.       అనంగ హారీ మహదేవా – అనంత రూపా మహదేవా
అవ్యయాకృతీ మహదేవా – అపర్ణ నాథా మహదేవా
12.       విష్ణు వందితా మహదేవా – విలయ కారకా మహదేవా
విద్వద్హృది స్థిత మహదేవా – విశాల ఫాలా మహదేవా
13.       తస్కరాధిపా మహదేవా – తరుణేందుధరా మహదేవా
తాపస మూర్తీ మహదేవా – తాపత్రయ హర మహదేవా
14.       ప్రమదాధిపతీ మహదేవా – ప్రమోద కారక మహదేవా
ప్రకర్ష రూపా మహదేవా – ప్రకీర్ణ తేజా మహదేవా
15.       దాక్షాయణిపతి మహదేవా – దక్షాధ్వర హర మహదేవా
దర్పక దమనా మహదేవా – దానవ భంజన మహదేవా
16.       నాగ కంకణా మహదేవా – నాట్యాధిపతీ మహదేవా
నగజ బిడౌజా మహదేవా – నందివందితా మహదేవా
17.       రిపు వపు హరణా మహదేవా – రింఖణ రేతస మహదేవా
రిరంస వర్జిత మహదేవా – రీతి మతీశా మహదేవా
18.       ప్రచండ రూపా మహదేవా – ప్రకృష్ట రూపా మహదేవా
ప్రగల్భ రూపా మహదేవా – ప్రశాంత రూపా మహదేవా
19.       భూత పతీ హర మహదేవా – భువన మోహనా మహదేవా
బుధజన వంద్యా మహదేవా – భూరిదయాళూ మహదేవా
20.       వారణాశి విభు మహదేవా – వాదాతీతా మహదేవా
వాక్పతి వంద్యా మహదేవా – వాసవ నుత శివ మహదేవా
21.       పినాక పాణీ మహదేవా – పియూష దాతా మహాదేవా
పీతాంబర నుత మహదేవా – పీడిత రక్షక మహదేవా
22.       పంచానన శివ మహదేవా – పంచాక్షరి స్థిత మహదేవా
పంచభూతమయ మహదేవా – పంచామృత ప్రియ మహదేవా
23.       రావణ సేవిత మహదేవా – రాక్షస వందిత మహదేవా
రక్షాకృతి హర మహదేవా – రమ్య మానసా మహదేవా
24.       రామేశ్వర భవ మహదేవా – రామ తారకా మహదేవా
రజతాచలపతి మహదేవా – రాజిత ఫాలా మహదేవా
25.       మందాకిని ప్రియ మహదేవా – మందారార్చిత మహదేవా
మార్దవ హృదయా మహదేవా – మకార మహితా మహదేవా
26.       సాంబ సదాశివ మహదేవా – సాంద్ర దయాకర మహదేవా
సారస మూర్తీ మహదేవా -  సదాశివా హర మహదేవా

27.       హస్తి ముక్తి కృత మహదేవా – అర్జున హితకర మహదేవా
అద్భుత రూపా మహదేవా – అక్షయ వపుషా మహాదేవా

28.       అప్రమేయ ధృతి మహదేవా - అతుల్య గుణగణ మహదేవా
అతి భయంకరా మహదేవా – ఆశ్రిత రక్షక మహదేవా

శివ శివ శంభో మహదేవా శంభో శంకర మహదేవా
మహదేవా జయ మహదేవా – జయ జయ జయ జయ మహదేవా

రచయిత పాఠక జనమునకూ – గాయక శ్రోతా గణమునకూ
కోరిన కోర్కెలు మహదేవా – కూరిమి దీర్చుము మహదేవా
లోకములన్నీ మహదేవా – లోపరహితముగ మహదేవా
నెలకొను లాగున మహదేవా – నీదయ జూపుము మహదేవా
నీపై భక్తిని మహదేవా – నిరతము నిల్పుము మహదేవా
తప్పుల క్షమించి మహదేవా – దయతో చూడుము మహదేవా
మహదేవా జయ మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
మహదేవా జయ మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
కఠిన పదార్థములు
1.సితాభ ధవళ = కర్పూరము వంటి తెల్లనైన
శితి కంఠా = నల్లని కంఠము కలిగినవాడు
2. గజోదరస్థిత = గజాసురుని కడుపులో లింగరూపమున వున్నవాడు
3. భగనేత్ర భిదే = ప్రళయాగ్ని వంటి కన్ను (3వ కన్ను) కలిగినవాడు
4. ప్రకర్ష రూపా = అతిశయించిన రూపము కలవాడా
       ప్రకీర్ణ తేజా = వెదజల్లబడిన తేజస్సు గలవాడా
5. నగజ బిడౌజా = పార్వతీ హృదయేంద్రా
6. రింఖన రేతస = స్కలించిన రేతస్సు గల్గినవాడు
7. రిరంస వర్జిత = కామ వర్జితుడు
8. ప్రకృష్ట రూపా = చెప్పలేనంత పెద్ద రూపము గల్గిన వాడు
9. పియూష దాత = అమృతామును అనుగ్రహించినవాడు

             చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment