Showing posts with label ఆత్మ. Show all posts
Showing posts with label ఆత్మ. Show all posts

Friday, 13 March 2015


ఆత్మ
 నిన్నటిరోజు ఒక పాఠకురాలు 'సమస్య మనది -సలహా గీతది -- 10' అన్న విషయము చదివి ఒక సందేహము వేలిబుచ్చినది. ఆత్మ ఒక చొక్కావిడిచి వేరొక చొక్కా తోడుగుకోనేటపుడు ఈ కర్మ కాండ అవసరము లేదుకదా అని. నాకు తెలిసినమేరకు , అందుకు సమాధానముగా ఈ మాట వ్రాస్తూవున్నాను. నాలోని అజ్ఞత ఏదయినా వుంటే మన్నిప వేడ్కోలు. 

 అమ్మా చాలాకాలం పాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు.
ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం. చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపులనుంచి ముడుచుకుపోయి మస్తిష్కంలో ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ,మనస్సునూ, బుద్ధిని కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" అది వాయువులో లీనమానది కావున  దేనినీ  ఆశ్రయించకుండా కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది .   అటుపిమ్మట దాన్ని నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వుంటుంది. కొందరు పుణ్య పురుషులు మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకపు ఆత్మను మరణించకముందే చూడగలుగుతారు.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది .మొదటినుంచే ఈ శరీరాన్ని ఒక ఆవరణ కప్పియుంచి వుంటుంది. అది తేజోమయ శరీరము. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరముగా కూడా 'కిర్లియన్ ఫోటోగ్రఫి' లో చూడ వచ్చును.'రేకీ' ని అనుసరిఉంచువారు కూడా ఈ 'ఔరా(aura)' ను చూడగలుగుతారు.దానికి  స్థూలశరీరంతో సంబంధం ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి.ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి ఈ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జన్మకు నాకా అదృష్టము లేదు.
లోకాలు పైకి ఏడు క్రిందికి ఏడున్నాయి. అవి ఆటలా,వితల, సుతల,తలాతల,రాసాతలములని, భూ,భువ,సువ,మహత్, జన, తప,సత్య లోకములని వాని పేర్లు. మన కర్మ ఫలాలు వానికి వేసే దారులు.
ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి 'స్థర'లు(పొరలు అని అనుకొందాము)ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళీ కర్మానుసారంగా ఒక విశేషస్తరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్తరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడేడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మ పైకి లేవనూ వచ్చు క్రిందకు పడనూ వచ్చు. అందుకే యమ నియమ నిష్ఠళ నేర్పరచినారు పెద్దలు. మహర్లోకంలో అనుభవించవలసిన కారణము ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది.వీటికికూడా పైన ఒకలోకం ఉంటుంది. 
నేను నాకు తెలిసిన మేరకు విషయమును అతి క్లుప్తముగా చెప్పినాను.


డా మిఛెల్ ః -- మంచిది స్వామీజీ ! భూతప్రేతాలనుగూర్చి మీ అభిప్రాయం ఏమిటి ?
స్వామి నిగమానంద ః --- చనిపోయిన తరువాత అసంతృప్తిగల ఆత్మకు ఉండే వాయురూపాన్నిభూతమనీ,ప్రేతమనీ అంటుంటారు. కింది స్థాయి మనిషి,లేదా ఆత్మహత్యచేసుకున్నవాడుచాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది.అతను చచ్చిపోవడమయితే జరిగింది,కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సమవత్సరాలు పడుతుంది .ఎందుచేతనంటే అతని ఆత్మ ఆసమయంలో గాఢసుషుప్తలో ఉంటుంది. భూతప్రేతాలు మనుష్యశరీరాన్ని ధరించడం సులువుకాదు. అనేకప్రయత్నాలు చేసినమీదట అది భాష్పీయ[ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పంఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుందికూడా . కానీ ఆ శరీరం సమాన్యకారణాలవల్ల కరిగిపోగలదు.పరలోక గతమయిన ఆత్మ రక్తసంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు. పమ్చభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు,. . ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని,భాజాలు,సంగీతం,లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.
డా//మిఛెయిల్ ః-- చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళేదెక్కడికి ?
స్వామి నిగమానంద ః-- సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం.స్వర్గలోకం వరకు చేరుతుంది.మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగ మిగిలిఉంటుంది .ఆవాయుశరీరాన్ని ఆధారమ్ చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంతవరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలిఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారన చేయవలసి ఉంటుంది.
డా.మిఛెల్ ః--- ఆజీవి భూలోకానికి చేరేదెలా ?
నిగమానంద సరస్వతి ః- అతను స్వర్గంలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బులద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు.దాన్ని మనుషులు తినవచ్చులేదా పశువులు తింటాయిఅలా తిండిద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లికడుపులోకి చేరుతాడు.మనిషిగాగాని లేదా పశువుగానైనా ఏదో ఒకజీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆజీవి జన్మ .అంతకుపూర్వం అనుభవించగా మిగిలిఉన్నదాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈవిధంగా ఆజీవిభోగం[అనుభవం]పూర్తవుతుంది.