Showing posts with label ఐకమత్యమే మహాబలమని చెప్పినది వేదము.. Show all posts
Showing posts with label ఐకమత్యమే మహాబలమని చెప్పినది వేదము.. Show all posts

Friday, 18 October 2019

ఐకమత్య సూక్తమ్


ఈ మాటను శ్రద్ధగా ఆలకించండి. కొన్ని లక్షల సంవత్సరముల క్రితము జనావాస,పట్టణ, నగర సముదాయములలో పరస్పర శ్రేయస్సుకై వర్ణవిచక్షణ పాటించుతూ తమ తమ వృత్తులకు అంకితమై మేలగుచున్న సమాజము సర్వకాల సర్వావస్థలయందు సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని, ఎక్కువగా బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణులలో కూడా కొందరు వనములకు పోయి కఠిన తపమునాచారించి అపౌరుషేయములైన వేదములను శృతుల రూపములో మౌఖికముగా భూమిపై వెలయించినారు. ద్రష్టలు ఆ మహర్షులితే వ్యాప్తి చేసినవారు బ్రాహ్మణులు. కల్యానాది శుభకార్యములు, క్రతువులు, అపర కర్మలు ఏవి చేయవలయునన్నా ఏరే కాలము మాదిరి డబ్బుకు కట్టడి చేసేవారు కాదు. కాలము ఇంచుమించు వెయ్యి సంవత్సరముల విదేశీయుల పాలనలో ఉండుటచే మన సంస్కృతి, సంస్కృతము సద్వైదిక విదానములన్నీ కృశించి, నశించి, పర-వశించినాయి. నియమిత నిర్దుష్ట ఆహారము తినుట మానివేసినాము. ఏవేవోతిని రోగాలు తెచ్చుకొని వాటిని బాపుకొనుటకు Doctors వద్దకు పోయి Antibiotics వేసుకొని ఎంతో తీక్షణమైన రోగాలు తెచ్చుకొంటున్నాము.
రోగ సృష్టి
రోగి నష్టి
వెజ్జు దృష్టి
డబ్బు పుష్టి
ఇదీ నేటి వరుస. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చినానంటే మన పూర్వులు వర్ణము అన్నదానిని తమకు వేదము విధించిన వృత్తులను ఆచరించుట తప్పించి కువిమర్శలు చేసేవారు కాదు. దానికి ఋగ్వేదములోని 10వ కాండ లో వచ్చే ఈ ఐకమత్య సూక్తమే సాక్షి.
ఋషిః సంవననః ఆఙ్గిరసః  
ఛన్దః అనుష్టుప్ ౧,,౪ త్రిష్టుప్ ౩  
దేవతా అగ్నిః ౧, సఞ్జ్ఞానమ్ ౨-౪  
  ఓం సంసమిద్యువసే వృషన్నగ్నేవిశ్వాన్యర్య ఆ ఇళస్పదే సమిధ్యసే స నో  
వసూన్యా భర 1  
సం గచ్ఛధ్వం సం వదధ్వం సం వో మనాంసి జానతామ్ దేవా భాగం యథా  
పూర్వే సఞ్జానానా ఉపాసతే 2  
సమానో మన్త్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్  
సమానం మన్త్రమభి మన్త్రయే వః సమానేన వో హవిషా జుహోమి ౩ ॥  
సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యథా
వః సుసహాసతి 4
ఈ సూక్తము మన పూర్వుల విశ్వ శ్రేయస్సు ఎంత ప్రగాఢమైనది అన్న విషయమును తెలియజేస్తుంది. ఇందులో వర్ణ విచక్షణ లేదు, వర్గ విచక్షణ లేదు. జాతి విచక్షణ లేదు, ప్రాంత విచక్షణ లేదు, దేశ విచక్షణ లేదు, కేవలము విశ్వ విచక్షణ వున్నది.
ఈ సూక్తమునకు ద్రష్టయైన అంగీరస మహర్షిని గూర్చి ఇక్కడ ఒక మాట చెప్పవలసి వస్తుంది. ఈయన బ్రహ్మ కుమారుడు. తండ్రి అనుమతితో తపస్సుకు వెళ్ళిన మహనీయుడు. ఆయన సర్వసంగ పరిత్యాగి. త్యాగమును సంతోఫ మున్నదని గ్రహించిన మహనీయుడు. ఈయన కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసికొన్నాడు. కాలక్రమాన ఆ దంపతులు ఏడుగురు కుమారులను ఏడుగురు కుమార్తెలను కన్నారు. వారి సంతానము విశ్వమంతా  ప్రాకింది. ఒకసారి దేవతలకు హవిస్సులను అందజేయవలసిన అగ్ని వారిపై కినుక వహించి తన ఉనికిని తెలియనీయ ఒక రహస్య ప్రదేశములో దాగినాడు. బ్రహ్మ అగ్నికి బుద్ధి చెప్పగానేంచి అంగీరసునికి అగ్ని బాధ్యతలను ఒప్పగించినాడు. దానితో సకల లోకవాసులు అగ్నిని మరచి అంగీరసుని ద్యానింప మొదలిదినారు. అగ్ని తన ఉనికికే ప్రమాదమని తెలుసుకోన్నవాడై అంగీరసుని, ఆయన ద్వారా బ్రహ్మను అర్థించి తిరిగీ తన హోదా తాను పొందినాడు. అప్పటినుండి క్రతువులలో అంగీరసునికి ద్వితీయ స్థానము ఆయన కుమారుడగు దేవగురువు బృహస్పతికి తృతీయ స్థానము ఇచ్చుట జరిగినది.
అత్యంత సాత్వికుడు, సదాచార సంపన్నుడు, విశ్వశ్రేయోభిలాషి కాబట్టే ఈ సూక్తమును ఆయన దర్శించినాడేమో! అంగిరసులు శారు. ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు,  ఆత్మ అవినాశియని తెలియజేసినవారూ అంగీరసులే!
తప్పన్నది లేకుండా స్వర యుక్తముగా చదువుట చేత ఏర్పడు ప్రకంపనలు మనసు లోని ఉద్వేగామును ఉపశమింపజేసి ఆత్మానందమును అందిస్తుంది. చురుకుగా మెదడు పని చేయుటకు దొహదకారియౌతుంది. అది అట్లుంచితే ఇది ముఖ్యముగా ప్రబోధాత్మక సూక్తము. ఇందు తరతమ భేదాలు లేవు. హెచ్చు తగ్గు లేదు. పెద్ద చిన్న లేదు. ధనిక దరిద్ర తారతమ్యము లేదు, వివేకి అవివేకి అన్న ఆలోచనే లేదు. అందరూ ఐకమత్యముగా వుండాలి అన్నదే ఇందలి సందేశము. All for One and One for All అన్న సూక్తిని పాశ్చాత్య దేశములు కన్ను తెరువకముందు, కొన్ని లక్షల వత్సరముల పూర్వమే తెలిపినది మన వేద మాత. మన మధ్యన ఎన్నో పోరాపోచ్చులను ఏర్పరచి ఐకమత్యమును పాడుచేసినది బ్రిటీషు పరిపాలనే!
ఈ మంత్రమును నోటికి నేర్చుకొని పఠించే శ్రమ తీసుకోనవసరము లేదు. మీరు youtube లో ప్రయత్నిస్తే దొరుకవచ్చు. దానిలో వేదపండితులు సస్వరముగా తప్పులు లేకుండా చెబుతారు కాబట్టి మనకు మన దేశమునకు ఈ ప్రపంచమునకు కూడా శ్రేయస్కరము. తమ జీవితమును విశ్వశాంతికి అర్పించిన పూర్వులగు ఆ మహనీయులకు మనసారా ఒక నమస్కారము సమర్పించండి.
ఈ దిగువ ఒక్కొక్క మంత్రమునకు అర్థము కూడా ఇవ్వటము జరిగినది.
1.     ఓ నిర్మల అగ్నిహోత్రమా! ఈ విశ్వ ప్రానులన్నిటినీ ఒకటిగా కలిపి నీ ఆశీస్సులను అందజేయి. యజ్న వేదికను అధిష్టించియున్న నీవే మా సకల సంపదలకూ మూలము. మా ఐక్యతకు నీవే కారణము. మా ఐక్యత ఆచరమై, చిరమై, శాంతి గోచరమై, రుచిరమై, అనుచరమై యుండులాగున అనుగ్రహించు స్వామీ!
2.    ఐక్యత అందరిలోనూ పెంపొందాలి. అభిప్రాయ భేదములను సద్విమర్శల ద్వారా పరస్పరము పరిష్కరించుకోవాలి. అందులో వాస్తవికత, ఉపయోగిత ప్రతిఫలించాలి. తమ తమ వనరులను ఒకరికొకరు పంచుకొని సామూహిక శ్రేయో లక్ష్యమును, దేవతలు తమమ హవిస్సులను ఎటువంటి పోరపొచ్చులు లేకుండా పంచుకొన్నట్లు పంచుకొని, సాధించాలి.
3.    అందరి ప్రార్థన, మోర, విన్నపము ఒకటే అయి ఉండాలి. వారి కార్యాచరణ లోక కళ్యాణము అను  ఒకే ధ్యేయము, ఒకే లక్ష్యము ఒకే గురి కలిగియుండాలి. పరస్పర సహకారము వల్ల మాలో పట్టు వదలని పట్టుదల ప్రతిఫలించాలి.
4.    మాయందు  విశ్వ శాంతి అన్న ఒక్క కోరిక తప్ప అన్యథా ప్రవేశించకుండుగాక. అందువల్ల మాయందు హృదయ పరిశుభ్రత, భావసారూప్యత, కలకాలమూ విలసిల్లుచూ ఐకమత్యముతో అడుగు ముందుకు వేస్తూ ప్రగతి అను లక్ష్యమును సాధింతుము గాక!
స్వస్తి.