Showing posts with label క్రోధో వైశ్వానరో దేవో. Show all posts
Showing posts with label క్రోధో వైశ్వానరో దేవో. Show all posts

Saturday, 19 May 2018

క్రోధో వైశ్వానరో దేవో


కోపము - తాపము
క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది
విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం
తన క్రోధమగ్ని గాంచగ
తన ఆశే వైతరిణిని  తప్పక చేర్చున్
తన విద్య కామధేనువు
తనతృప్తే నందనమ్ము తలవగ రామా!
కోపము అగ్ని వంటిది. అది తననూ కాల్చుకొంటుంది పరులనూ నిర్దాక్షిణ్యముగా కాల్చివేస్తుంది. ఇక ఆశ వైతరిణీ నది వంటిది. ఈ వతరినీ నదిని గూర్చి ఒక్కమాట చెప్పుకొందాము. ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది. చిక్కని రక్తము, చీము కూడా. భయంకర  జలచరాలు, ఒక్క క్షణం కూడా భరించలేని దుర్వాసన కలిగియుంటుంది.  ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి   తను చేసిన  పాపాలకు ఫలితం అందులో మునిగి అనుభవించవలసిందే. అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు.  గోదానం చేస్తే వైతరిణి  నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు స్వయంగా  గరుత్మంతుడికి  తెలియజెప్పినాడు. విద్య పాలిచ్చే పాడియావు వంటిది. తన సంతృప్తే నందనవనము. ఎంతటి నీతి వాక్యములో గమనించండి.
కోపము తాపము గూర్చును
తాపము తనతోడ తెచ్చు తక్కిన చెడుగున్
పాపమునవి సమకూర్చును
కోపము గమనింప నరక కూపము రామా!