Showing posts with label తపస్వి తులసీదాసు వ్రాసిన రుద్రాష్టకము చదవండి.. Show all posts
Showing posts with label తపస్వి తులసీదాసు వ్రాసిన రుద్రాష్టకము చదవండి.. Show all posts

Thursday, 27 July 2017

తులసీ దాస కృత రుద్రాష్టకము -- భావ వివరణ

తులసీ దాస కృత రుద్రాష్టకము -- భావ వివరణ

https://cherukuramamohanrao.blogspot.com/2017/07/blog-post_27.html

తులసీ దాస కృత రుద్రాష్టకములోని ఒక్కొక్క శ్లోకమును, భావార్థమును రోజుకు ఒకటి వంతున  ప్రచురిమ్పబోవుచున్నాను. ఆ మహనీయునికి రామేశ్వర భేదము లేదు. ఎంత హృద్యముగా ఉన్నదో చదివేది.

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |

అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేఽహమ్ || ౧ ||

ఈశానా శివ శంకరా పర భవా ఈశా మహా తేజసా  

ఆశాపాశ వినాశ కారక చిదాకాశస్థితా శాశ్వతా

పాశా! వాసవ కేశవాది వినుతా ప్రాంచత్ ఫణాలంకృతా

కేశాధీన సురాపగా శశికళా కేదారనాథా

ఓ పరమాత్మా ఈశా పరమేశా! ఈశాన్యమునకు అధిదేవతవగు నీవు జగత్ సృష్ఠికి ఈశునివి అంటే అధిపతివి (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి)

, శాశ్వత మోక్ష రూపివి, జగద్విభునివి, విశ్వ వ్యాపకునివి అంటే నీవులేని చోటు లేదు, వేద స్వరూపమగు పరబ్రహ్మ తత్వానివి, నీవు అజునివి అంటే మానవ మాత్రులవలె పుట్టుక అన్నదే లేనివానివి, పుట్టుకే లేనివానికి మరణమన్నది ఉండదు కదా, నిర్గుణ స్వరూపునివి, భవబంధ విమోచనము కోరి మోక్షప్రాప్తికై తపించు ముముక్షువునకు నీవుతప్ప వేరు మార్గము లేని వానివి, ఇహబంధ విముక్తిదాతావు, చిదాకార రూపునివి, చిత్తు అంటే జడత్వము లేకుండా చైతన్యము కలిగి, కలిగించేవానివి, అయినటువంటి నిన్ను భజించుచున్నాను, అంటే ప్రార్థించుచున్నాను.

రేపు రెండవ శ్లోకము భావ సహితముగా ......

నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |

కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ || ౨ ||

 

స్వామీ నీవు నిరాకారునివి, ఓంకారమునకు మూలతత్వము నీవు,తురీయునివి[ జాగ్రద = మెళకువగా ఉన్నప్పటి స్థితి, స్వప్న = కలలు కనే స్థితి; సుషుప్త = నిద్రావస్థ, ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ (= సమాధి స్థితి) నాలుగవది.] అంటే ఆ స్థితికి సాధకునిగా చేరగలిగితే అచట కనిపించే రూపము నీదే! అంటే నీవే తురీయునివి, వాచకమునకు అతీతమైన, కర్మేంద్రియ జ్ఞానేన్ద్రియములకు అంతుబట్టని (గిర్ = వాచకము; జ్ఞాన = సకలము తెలుసుకొనుట; గో = ఇంద్రియములు; అతీత=అధిగమించిన; గిరీశం = శిమాలయాధీశునివి, ఈశులలో ఉన్నతునివి అని కూడా అన్వయించుకొనవచ్చు),

ఉగ్రరూపిగా వెరపు పుట్టించువాడా,  యమునకు యముడవయిన వాడా (మార్కండేయుని రక్షించు సమయమున యమునిపైనే శూలము దూసెను కదా పరమేశుడు), దయామయుడా, గుణాగారా(గుణ = త్రిగుణములు, ఆగారము = చెర అని అన్వయించుకొనవచ్చును. అంటే అందు బంధింపబడినవాడు మానవుడు. ఏపని చేయవలెనన్నా ఆ మూడు గుణముముల పౌనఃపున్యములయందే చేయవలసియుంటుంది. ఇది ఒక అర్థమయితే ఆ మూడు గుణములనూ తన అదుపులో పెట్టుకొన్నవాడు అని ఒక అర్థము.), సంసార సాగరమును దాటించువాడా నీకు నతమస్తకుడనై నమస్కరించుచున్నాను.

రేపు మూడవ శ్లోకముతో.......

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |

స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ ||

వెండికొండ వెలుగులు వేదజల్లేవాడా, గంభీరమయిన అంటే ఊహకందని లోతయిన తత్వము కలిగినవాడా, మనోభూతమగు కోట్లాది ప్రభాశ్రీలను కలిగినవాడా,(మనోభూత = మనసునందు కలిగియున్న కోట్లాదిగా ప్రభవించు సకల విధములగు శ్రేయస్సులను కలిగిన శరీరము కలిగినవాడా, శిరస్సున గలగలల కదలికల హృదయానందకర గంగా ప్రవాహాంగా, ఫాలమున ధగద్ధగాయమానముగా ప్రకాశించు బాలచంద్రుని గలవాడా,కంఠమున భుజంగములు గలిగిన వాడా! (వర్ణన తరువాతి శ్లోకమునకు దారి తీయుచున్నది.)

రేపు నాలుగవ శ్లోకముతో.........

చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |

మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||

(సుఖాశీనుడవయి వున్న సమయమున పిల్ల తెమ్మెరకు) కదిలే కర్ణ కుండలములు గలిగినవాడా, భృకుటిన విశాలమగు సునేత్రములను కలిగినవాడా, ప్రసన్న వదనమును కలిగినవాడా, నీలకంఠా, దయాళూ, మృగాధీశుడగు పులి చర్మమును ధరించినవాడా, గళహారధారియైనవాడా, భక్తజన ప్రియుడా, శంకరా, సర్వ చరాచర జీవకోటికీ ప్రభువైనవాడా, నీకిదే నా ప్రణుతి.

రేపు 5వ శ్లోకముతో..... 

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |

త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||

భవానీపతీ! అందుకోలేనివానివి, అతిశయము కలవానివి, వీరాధివీరునివి, అశాధీశునివి (దేవదేవునివి) ఆద్యంతములు లేని అఖండ స్వరూపునివి, జన్మము లేనివానివి(మరణముంటేనే కదా జన్మ! అంటే జననమరణములకు అతీతమయిన వానివి), కోటి సూర్య ప్రభాసమానునివి, తాపత్రయములను హరించువానివి  (త్రయః శూల అంటే మూడు విధముల బాధలు, వీనిని తాపత్రయములు అంటారు, ఆధిదైవిక, ఆధ్యాత్మిక, ఆధిభౌతికములు, ఇక్కడ త్రిశూలము అను పరమేశ్వరుని ఆయుధము అన్వయము కాదేమో!), శూలపాణివి, నా భక్తిభావ గంయమయిన నీకు త్రికరణ శుద్ధిగా నమస్కరించుచున్నాను.

రేపు 6వ శ్లోకముతో///////

కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |

చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||

కళాతీతుడవు,( షోడశకళా ప్రపూర్ణుడు పరమాత్ముడు, దానికి అతీతుడూనూ, కానీ మానవునిలో ఈ షోడశ కళలను, గణిత పరముగా చెప్పవలసి వస్తే ఒక PERABOLA GRAPH కు అన్వయించుకోవచ్చు, అందుకే పెద్దలు పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే అన్నారు. ఈ PERABOLA GRAPH ను ఇటు ఐహికమునకు అటు ఆముష్మికమునకు కూడా అన్వయించుకోవచ్చు.), కళ్యాణ కారకునివి అంటే సకల శుభప్రదాతవు. కలకాలము సజ్జనాళికి ఆనందదాతావు, త్రిపురాసుర సంహారివి, చిదానంద సముదాయమును సంపూర్ణముగా సమకూర్చు వాడవు, మొహములను అపహరించువానివి(అందుకే రుద్ర నమకములో ‘తస్కరాణాం పతయే నమః’ అని వేదము తెలియజేసినది.), కావున కరుణించు కరుణించు కందర్ప హారీ!

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |

న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || 7 ||

సర్వభూతవాసియగు పరమేశ్వరా! ఉమానాధా! నిన్నుగురించి తెలియ ప్రయత్నింపజాలని వారు, ఇహపరములయందు సుఖశాంతులు పొందజాలరు అన్న వాస్తవము గ్రహించలేక యుండిపోతున్నారు. కరుణతో వారిని కూడా రక్షించు కారణమేమిటంటే నీవు సర్వభూతాధివాసునివి కదా!

 న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |

జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || 8 ||

స్వామీ యోగము, జపము భక్తి ఎరుగనివానిని,  సర్వకాల సర్వాస్థలయందు మదిలో నిన్నున్చుకొని మనసా ఉరసా శిరసా భక్తిప్రపత్తులతో కేవలము నమస్కరించగలిగిన వానిని మాత్రమే! జన్మ దుఃఖ, జరాదుఃఖములకు దూరము చేయుచూ, తెలిసియో తెలియకనో చేసిన పాపములవల్ల కలుగుచున్న బాధలనుండి విముక్తిని జేసి

కాపాడు స్వామీ శంభో స్వయభో!

 రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేన హరతోషయే

యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||

 పరమ భక్తులగు పండితులచే హరుని ప్రీత్యర్థము తెలిపిన ఈ రుద్రాష్టకమును ఎవరైతే అనుదినము పఠించెదరో వారికి శంభుడు కలకాలమూ తోడునీడయై ఉండగలడు.

..