Showing posts with label పాంచభౌతికమైన ఈ దేహమంతా శివునితినే ఉంచుకోమ్మను వేడికోలు. Show all posts
Showing posts with label పాంచభౌతికమైన ఈ దేహమంతా శివునితినే ఉంచుకోమ్మను వేడికోలు. Show all posts

Sunday, 16 April 2023

పాంచభౌతికమైన ఈ దేహమంతా

 

పాంచభౌతికమైన ఈ దేహమంతా

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_16.html

పాంభౌతికమైన ఈ దేహమంతా

భావహారి నీకు నే నర్పణము సేతు

అలసితిని ఈదుచూ ఆశ సంద్రమును

గస పెట్టుచున్నాను గతి గానలేక

శీతోష్ణముల బాధ చెలగి బాధింప

పృథివితత్వపు మేను పెనుబాధ పడెను

నీ పాద పీఠమై అది నిలువ చాలు

భూమియౌ నామేను పులకించు స్వామి llపాంచll

నాలోని ఉదకాంశఅజ నీ శిరమున 

ఆపాదమస్తకము అభిషేచనము చేయు

గంగలో కలుపుము గతి వేరు వలదు

జన్మ సార్థకమౌను  జగదీశ నాకు llపాంచll

 

నాలోని తేజస్సు నగజాదినాథ

నీదీప కళికలో నిలిపితే చాలు

రేపుమాపులు నిన్ను రెప్ప వాల్చక గాంతు

నీతేజమును కలిసి నిలుతు నిరతమ్ము

అంతకన్నా నాకు ఐశ్వర్యమేల  llపాంచll

 

నాలోని మరుదంశ  నందీశఈశా

కైలాస సీమలో కదిలితే చాలు

నీ మేను తాకుచూ నిజము పులకింతు

నీ సేవలో నేను నిలచిపోఎడను

వేరేమి కావలయు విశ్వేశ నాకు llపాంచll

 

కైలాస గగనాన కలిసి శబ్దముతో

నటనాన నేను నీ నట్టువాంగమున

నిరతమ్ము నాదమై నిలచి పోవుచును

లయలోన సాంతమ్ము లయమౌదు తండ్రి

నీ సేవలో నేను నిలుపుదల లేక  llపాంచll