Showing posts with label మన దేశ చరిత్ర. Show all posts
Showing posts with label మన దేశ చరిత్ర. Show all posts

Saturday, 31 January 2015

విశ్వనాథ సత్యన్నారాయణ గారి భగవంతుని మీది పగ నవలలోని కొన్ని వాక్యములు: మన పురాణములు 



చరిత్రయే, మన ఋషులకి చరిత్ర జ్ఞానము లేదనుట, మన పూర్వ నాగరికతను ఎంత 


తక్కువపరచినచో వారి 

ఏలుబడి అంత గొప్పగా సాగునని, పాశ్చ్యాత్యులు పన్నిన పన్నుగడ!! ఇంగ్లీషువారు క్రైస్తవులు, బైబిలు నందు 

విశ్వాసము కలవారు. పాశ్చ్యాత్య దేశాలు అన్నియు నింతే. మన కలియుగముప్రవేశించి నప్పటికే వారికి లెక్క 


కుదరలేదాయె!! వారి సృష్టి అప్పుడు జరిగినట్లాయెను!! 
ఇది ఏమి లెక్క? ఐదు వేల అరువదిసంవత్సరముల 

క్రింద కలి ప్రవేశం చేసెనని పంచాంగములు చెప్పుచున్నవి. భారత యుద్దమపుడు జరిగినదని భారతంలో 

దాఖలా లున్నవి. ఆర్యభట్టు మొదలయిన మన పూర్వ ఖగోళ శాస్త్రజ్ఞులు వ్రాసిపెట్టినారు. వారి నన్నిటిని 

పాశ్చ్యాత్యులు కాదని అన్నారు. ఇంగ్లీషు నేర్చిన మన పెద్దలువారినే . విశ్వసించుచున్నారు .పాశ్చ్యాత్యులు 

చరిత్రలో మొదటి విచిత్రమెమనగా, శాలివాహన మహారాజును, విక్రమార్క మహారాజును కల్పిత చక్రవర్తులనుట!! 

విక్రమార్క మహారాజు కాలములో కాళిదాసు ఉండెను, కాళిదాసు జ్యోతిర్విద్యాభరణము అన్న జ్యోతిష 

గ్రంధమును వ్రాసి, దానిలో తాను రఘు వంశ, కుమారసంభవ, మేఘసందేశం వ్రాసితిననియు, ఆ రాజునకు 

తాను స్నేహితుడనియు చెప్పికొన్నాడు. ఆ విక్రమార్క మహారాజు కల్పిత మహారాజట!! ఇంకాపాశ్చ్యాత్యులు 

చరిత్రకారుల్ని నమ్మేదేట్లు? మన పెద్దలు నమ్ముచున్నారే, దానికి సమాధానమేమీ? గ్రీకుల రచనలో 

Sandrakotas అన్న మాట ఉన్నది. దానికి పాశ్చ్యాత్యులు మౌర్య చంద్రగుప్తుడని అర్ధం చెప్పినారు. దానితో 

పురాణము లోని కలి రాజ వంశమంతయు తారుమారయినది. చరిత్రను పలు మంది పాశ్చ్యాత్యులు దిద్ది పాడు 

చేసిరి. పంక్తులు తప్పు చదివి దుర్వ్యాఖ్యానములు చేసి హిందువుల యొక్క, బౌద్ధుల యొక్క వ్రాతలను 

పరిహసించి దుర్మార్గములు చేసిరి. ఈ దౌర్మార్గ్యమును ప్రారంభించినవాడు సర్ విలియంజోన్స్!! తరువాత చాలా 

మంది పాశ్చ్యాత్య చరిత్రకారులు వారిని అనుసరించిరి. మన వేదాంతములాయందభిమనము కల 

మాక్స్ ముల్లర్ కూడా చరిత్ర విషయములో దుష్టముగానే వ్రాసెను. ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది....Blood is 

thicker than water !