Showing posts with label మమకు నిజమైన జాతిపిత అని అనిపంచుకొదగిన అర్హత ఒ క్క...... Show all posts
Showing posts with label మమకు నిజమైన జాతిపిత అని అనిపంచుకొదగిన అర్హత ఒ క్క...... Show all posts

Saturday, 10 February 2024

నిజమైన జాతి పిత

https://cherukuramamohanrao.blogspot.com/2024/02/blog-post.html

‘జాతి పిత’ అన్న పేరు వినగానే మన స్మృతిపథములో ఒక మహానాయకునిగా పేరుగాంచిన వ్యక్తి యొక్క పేరు మెదలుతుంది. కానీ నేను చదివిన మేరకు వారికి ఆ బిరుదు ప్రదానము చేసినట్లు గోచరించలేదు. అసలు ఆయనకు ప్రత్యేకముగా ఏ బిరుదూ ఏ సంస్థ ఇచ్చిన దాఖలాలు కూడా కనిపించలేదు. మొన్న ఫిబ్రవరి 10న టైమ్స్ అఫ్ ఇండియా లో వచ్చిన్ ఈ విషయాన్ని చదవండి:

ముని మనవడి కూతురు మరియు తన మునిమనవడి భార్యతో నగ్నంగా నిద్రపోవడాన్ని గాంధీ ఎప్పుడూ రహస్యంగా చెప్పలేదు. ఇది అతని లైంగిక ఇచ్ఛపై అతని నియంత్రణను పరీక్షించే మార్గం కావచ్చు, కానీ ఈ స్త్రీలను గినియా పందులుగా ఉపయోగించినారు. అతను ఇతర వయోజన మహిళలను ఉపయోగించినట్లయితే, అది ఆసక్తికరమైన గాసిప్ కంటే మరేమీ కాదు. కానీ గాంధీ తన లైంగిక కోరికల కోసం యుక్తవయసులో రక్త సంబంధీకులను మరియు మనవరాలిని ఎంచుకున్నాడు. ఇది క్షమించరానిది మరియు నమ్మదగనిది. నేను చక్రవర్తి కొత్త దుస్తులను మెచ్చుకునే దళానికి చెందినదానిని కాదు మరియు అతని గురించి నిజం చెప్పడంలో భయము మరియుసంకోచం లేదు. 'సత్యమేవ జయతే' అనే మంత్రాన్ని నాలో నింపింది ఆయనే. ఇపుడు నాకది హాస్యాస్పదంగా తోచుతుంది.

ఈ విషయము తెలిపినది 82 ఏళ్ల చరిత్రకారిణి, మాజీ గాంధీ ఆరాధకురాలు 'కుసూమ్ వద్గమా' కథనము లోని ఖండిక.

టైమ్స్ ఆఫ్ ఇండియా

శనివారము, ఫిబ్రవరి 10, 2024

వారి లీలా వినోదాల గూర్చి ఇంకా ఎన్నో కథనాలు ఉన్నాయి కానీ అవి మనకు అప్రస్తుతము .

అయినా నాయొక్క ఈ వ్యాసపు ఉద్దేశ్యము ఆయన యొక్క బిరుదులకు సంబంధించిన వివరాల విశ్లేషణను గూర్చి కాదు. కానీ ఎన్నో కోట్ల సంవత్సరములనుండి భూమిపై నిలచిన మన వేదములు, పురాణములు, శాస్త్రములు, సంస్కృతిని కాదని 1947 న మనకొక జాతిపితను వరిష్టులైన ఎవరినుండి నిర్ధారింపబడకనే అంగీకరించినాము. మరి అంతకు ముందువరకు మనము అనాథలమేనా! ఏది ఏమయినా ఈ విస్జయమును విశ్లేషించుట నా ఉద్దేశ్యము కాదు.

వాల్మీకి మహర్షి  రామునికి గల 16 సుగుణాలు ఈవిధముగా తెలిపినాడు;

1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్పాలకుడు 6. ధ్రుఢవ్రతుడు 7. ఉత్తమ చరితుడు 8. సర్వ భూతహితుడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అనసూయాపరుడు 16. దేవతలకే భయోత్పాతము  కలిగించు ఆగ్రహానుశాసకుడు.

ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు. ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టే రాముడు మర్యాదా పురుషోత్తముడు అయినాడు.

రావణుడు సీతాపహరనమునకు అర్థించవచ్చినపుడు మారీచుడు ఈ విధముగా అంటాడు:

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః ।

రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ ॥

శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకములో చించినాడు మహానుభావుడైన మారీచుడు: “శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు. దేవేంద్రుడు దేవతకు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ రాముడు”. ఇక అసలు శ్రీరాముడు ‘జాతిపిత’ కాదు ‘విశ్వపిత అగుటకు అన్నివిధములా అర్హుడు.

శ్రీరాముని గూర్చి బ్ర. శ్రీ. వే. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు ఒకే పద్యములో ఎంత గొప్పగా చెప్పినారో

చూడండి:

చూడండి:

ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా

పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే

హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ

ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై

ఇక్కడ ఒకటి రెండు కఠిన పదములను మీకు సుగమము చేసి పద్యర్థమును సుగమము చేస్తాను. కృపాకృతి కైశికమందు అంటే ఆయన తన కురులను ఎంతో చక్కగా నూనె రాచి దువ్వి తనమోములో ఎక్కడలేని కృప కనిపించేలాగున ఉంచుతాదట. ఇక దేహాకృతి సర్వదేహమున అనగా ఆయన శరీరములోని అంగాంగము సామర్థ్యముతో దేహము నిన్దియుంటుంది అని అర్థము. మిగిలిన పద్యము సుబోధకము. అది రాముని ప్రతిభ.

ఈ వ్యాసములో జగదేక సార్వభౌముడైన శ్రీరామ చంద్రుడే ‘జాతి పిత’ అన్న పట్టమునకు అర్హుడని  నా మనసులో కలిగిన అభిప్రాయమును బలపరచుతూ, తెలుగునాట అంతగా ప్రాచుర్యములో లేని తులసీదాసు గారి ‘రామచరిత మానస్ ఆధారముగా వ్రాయుచున్నాను. మనసారా చదువుతారని ఆశ.

ముని మఖ రాఖన గయవు కుమారాl

బిను ఫర్ సర్ రఘుపతి మోహి మారా ll

సత జోజన్ఆయావూఁ ఛన్మాహీఁl

తిన్హ సన్ బయరూ కియేఁ భల నాహీఁll

విశ్వామిత్ర యాగరక్షణకై వచ్చిన రామలక్ష్మనులలో రామశరాఘాతము నన్ను నూరు యోజనముల దూరములో పడవేసినది. లక్ష్మణుడు శరపరంపరతో రాక్షస దళములను మట్టి కరిపించినాడు. అట్టి వీర శిఖామనులతో అని కొనితెచ్చుకొనుట బుద్ధిమతుని లక్షణమా!

జేహిఁ తాడకా సుబాహు హతి ఖండేవు హర్ కోదండ l

ఖర దూషణ్ తిసిరా బధేవు మనుజ కి ఆసు బరిబండ్ll (దోహా - అరణ్య కాండ)

తారకా సుబాహుల ప్రాణాంతకుడు, అవలీలగా శివ ధనుర్భంగము గావించినవాడు,  ఖర దూషణ త్రిశిరులను ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానోక్కోక్కడై తోచు పోలిక ముగ్గురు అన్నదమ్ములను మట్టుబెట్టినవాడు శ్రీరామ చంద్రుడు. అని తెలుపుతాడు మారీచుడు. ఇక్కడ మనకు రాముడుని శౌర్యమునకు ప్రతీకగా తెలియజేస్తున్నాడు తులసీదాసు మహాకవీశ్వరుడు. వాల్మీకి మహర్షి రాముని ధర్మస్వరూపునిగా మనకు తెలియజేసినాడు.

ఇక ఆయన సత్యపాలన , పితృవాక్పాలన అనన్య సామాన్యము. తండ్రి దశరథుడు తననోటితోనే తెల్లవారితే పట్టాభిషేకమని చెప్పి కొద్ది సేపటిలోనే అడవికి పొమ్మని ఆదేశించినపుడు ‘తండ్రీ మాట తప్పుతావా అని మాట మాత్రము కూడా అడుగకుండా కాననలకు కదలి పోతాడు. ఆయన లో అనుమాత్రము స్వార్థము ఉన్నా పోనని మొరాయించియుండేవాడు. అది ఆయన పెద్దలపై గల గౌరవమునకు తార్కాణము. ఈ సందర్భముగా ఆయన  ఏమి చేబుతాడంటే:

సాజి బన్ సాజు సమాజు సబు బనిత బంధు సమేత్l

బండి బిప్ర గురు చరన ప్రభు చలే కరి సబహి అచేత్ ll

(దోహా - అయోధ్యాకాండ్)

14 సంవత్సరముల కాలమూ ఏ నగరములో కూడా ప్రవేశించనని చెబుతూ వారించినా వదలని దారా సోదర పురజన సమేతముగా అడవులవైపునకు అడుగు వేస్తాడు. కానీ పురజనులను నది దాటాక మునుపే నిలిపి సతీ సహోదర సహితుడై సాగించుతాడు తన ప్రయాణము. ఆమాటకు ఈ దిగువ శ్లోకము ప్రమాణము.

కహా ప్రభూ సన్ సుగ్రీవు హరీసా

పుర న జావుఁ దస్ చారి బరీసా

గత్ గ్రీషం బర్షా రితు ఆయీ

రహి హావుఁ నికట సైల్ పర్ ఛాయీ (కిష్కింధా కాండ)

శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో చెబుతాడు: 14 సంవత్సరములు నగర ప్రవేశము చేయనని నేను తండ్రికి మాట ఇచ్చినాను. తదనుగునముగా ఋతుప్రభావములకు అతీతముగా నేను వనములందే నివసిస్తాను, వనముల నడుమనే నడయాడుతాను.

ఇక వాలిని కోలతో కూలవేసిన తరువాత వాలి ప్రశ్నకు సమాధానముగా శ్రీరాముడు ఇలా అంటాడు “నీ రాజ్యము భరతుని ఏలుబడిలో ఉన్నది. భరతుడు నాకు రాజు. ధర్మాచరణ రాజుగారు నియమించిన ఆదేశము. నీవు ధర్మమూ తప్పి తమ్ముని భార్యతో సంగమించినావు.

అనుజ్ బధూ భగినీ సుత నారీ l

సును సఠ్ కన్యా సమయె చారీ ll

ఇంహహి కు దృష్టి విలోకయి జోయీl

తాహి బధేఁ కఛు పాప్ న హోయీll

తమ్ముని భార్య, కోడలుసోదరి కూతురు , వీరిపై కామాతురుడైన వ్యక్తిని వధించుట అన్నది రాజ శాసనము. ఆ రాజ్య సేవకునిగా నీను ఆ శాసనమును జావా దాతలేను”.

“నీవు మానవుడవు కావు. మృగజాతికి చెందినా వానివి. మాటున దాగి బాణము సంధించుట ఎట్టి పరిస్థితి లోనూ అధర్మము కాదు”. అని చెబుతాడు.

ఇక ఆయన లోకన్యాయమును అనుసరించిన తీరు చూడండి.

జాసు నామ్ సుమిరత్ ఎక్ బారాl

ఉతరహి నర భవసిందు అపారాl

సోయి కృపాళు కవటహి నిహోరాl

జాహి జాగు కియ తిహు పగహు తే తోరాll

ఏ రాముని పేరు, తలచితేనే జనులను, భవసాగరము దాటించ గలదో ఆ రాముడు ఓడ సరంగుకు తనను నదికి ఆవలి ప్రక్కకు చేర్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక్క సారి ఓరకంటితో సీతామాత వైపు చూచినాడు. ఆ సాధ్వి ఆయన మనసు గ్రహించినదై తన అంగుళీయకమును శ్రీరాముని చేతిలో ఉంచినది. దానిని ఆ నావికునికి కృతజ్ఞతాపూర్వకముగా సమర్పించుకొంటూ ఎంతో విధేయతతో స్వీకరించమని తెలుపుతాడు, చిన్న విషయమున కూడా తన ధర్మగతిని తప్పి చరించడు. పడవ నుడుపు వానికి కృతజ్ఞతగా తన శక్తి మేరకు ఇచ్చు సాంప్రదాయము నేటికినీ ఈ భూమిపై పదిలముగా ఉన్నది. ఇది నిజమునకు ఆయన మానవత్వమునకు ప్రతీక. ఇక ఆయన కర్తవ్య పరాయణతను గూర్చి ఒక మాట చెప్పుకొందాము.

 

ఝూఠేహుఁ హమహి దోషు జాని దేహు l

దుయి కే చారి మాగి మకు లేహూఁll

రఘుకుల రీతి సదా చలి ఆయీ l

ప్రాణ్ జాహుఁ పరు బచను న జాయీ ll (అయోధ్యాకాండ)

కైకేయి తన తప్పిదమును తెలుసుకొని, దశరథ మహారాజుతో “నేను మిమ్ము కోరిన వరములను ఉపసంహరించుకొంటున్నాను. శ్రీరాముని వనాంతర సీమా ప్రయాణమును, నివాసమును ఆపించండి అంటే ఎంతో ముదమందినవాడై దశరథుడు తదనుగునముగా అర్థించుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు రఘుకుల జాతులు ‘ప్రాణము పోయినా ఆడిన మాట తప్పరన్న సామ్ప్రదాయమును నేను భంగము చేయలేను అని జానకీ సహజాతుని సమేతముగా కాననలకు కదలుతాడు. ఇది  ఆయన సత్య వచన దీక్షకు తార్కాణము.

ఇక శ్రీరామచంద్రుని లోకతంత్రముపై  అనగా రాజు యొక్క ప్రజా పాలనపై ఎంత అవగాహన ఉన్నదో చూడండి.

రహహు కరహు సబ్ కర్ పరితోషు l

నాతరు తాత్ హోయహి బడ దోషుll

జాసు రాజ ప్రియ ప్రజా దుఖారీల

సోనుపు అవసి నరక్ అధికారీ

శౌర్యము, త్యాగము, ధృఢత్వము, కర్తవ్య పారీణత మరియు లోకతంత్రము కలిగినవాడే రాజు అనిచేప్పుతయే గాక తానూ పాటించి చూపించిన మహానుభావుడు శ్రీరామ చంద్రుడు.

ఒక సందర్భములో రాముడే తన పరిపాలనను గూర్చి చెబుతాడు.

స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపిl

ఆరాధనాయ లోకశ్చ మున్చతో నాస్తిమే వ్యథాll (వాల్మీకి రామాయణము)

తాను ప్రజా సౌఖ్యము కొరకు , స్నేహాన్ని, దయను, సౌఖ్యాన్ని అవసరమైతే జానకినే విడిచిపెడతానంటాడు.

వాల్మీకి రామాయణము లోనే ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించుటకు బాణమునేక్కుపెట్టి ఈ విధముగా   అంటాడు:

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరధి ర్యదిl

పౌరుషే చా౭ప్రతిద్వంద్వ శ్శరైనం జహి రావణి౦ll

తాను మేఘనాథునిపై బాణమును సంధించి రాముని గుణములను మంత్రముగా బంధించి వదిలి రావణ పుత్రుని తెగతార్చుతాడు. అది రాముని గొప్పదనము.

మరొక సందర్భమున              

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ !!

ఒక్కసారి శరణు అని నన్ను ఆశ్రయించిన చాలు , నేను నీ వాడినని అర్థిస్తే చాలు సమస్త జీవ సముదాయానికి  నేను అభయం ఇచ్చి తీరుతాను. ఇది నా యొక్క వ్రతము అని అంటాడు శ్రీరామచంద్రమూర్తి.

సముద్రాల (Junior) వ్రాసిన శాంతినివాసం సినిమాలోని ఈ పాట శ్రీరామచంద్రునికి తెనుగుభాష చేయించి ఇచ్చిన నగగా భావించవచ్చు.

 

అన్నదమ్ముల ఆదర్శమైనా

ఆలుమగల అనోన్యమైనా

అన్నదమ్ముల ఆదర్శమైనా

ఆలుమగల అనోన్యమైనా

తండ్రి మాటను నిలుపుటకైనా

ధరలో నీవే ధశరధరామ్

శ్రీ రఘురామ్ జయరఘురామ్

 అట్టి శ్రీరాముని పైన భక్తిని, శ్రీయుతులు పెమ్మరాజు పూర్ణచంద్ర రావు గారు సమయోచితముగా గుర్తు చేసిన శ్లోకమును తలచుకొంటూ,  ఈవిధముగా చాటుకొందాము. 

మాతా రామో మత్పితా రామచన్ద్రః

స్వామీ రామో మత్సఖా రామచన్ద్రః ॥

సర్వస్వం మే రామచంద్రో దయాలు ।

నాన్యం జానే నైవ జానే న జానే ॥

రాముడు నా తల్లి మరియు రాముడు (రామచంద్రుడు) నా తండ్రి , రాముడు నా ప్రభువు మరియు రామచంద్రుడు నా స్నేహితుడు , కరుణామయుడు అయిన రామచంద్రుడు నా సర్వస్వం, అంతకు మించి నాకుమరొకటి తెలియదు.


స్వస్తి.