Showing posts with label శంకరాచార్య విరచిత గణేశ రత్న పపంచకము.. Show all posts
Showing posts with label శంకరాచార్య విరచిత గణేశ రత్న పపంచకము.. Show all posts

Thursday, 6 April 2023


జగద్గురు శంకరాచార్య విరచిత గణేశ రత్న పంచకం 

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_6.html

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని యుండు 

మహానుభావుడు, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే మహనీయుడు

శిరస్సున చంద్రుని ధరించుచు, లోకాన్ని కాపాడే వాడగు, నాయకులకే 

నాయకుడై అసురులను మరియు అన్ని ఆశుభములను నశింప జేసే ఆ 

విఘ్నేశునికి నా నమస్కారములు.

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం

భక్తుల శత్రువులకు భయం కలిగించే వాడగు , అప్పుడే ఉదయిస్తున్న 

సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికిదేవతలు, అసురులచే 

నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే 

దేవునికిసర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల 

గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ

 నా నమస్కారములు.

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి 

కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను 

ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి

శుభముయశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ 

శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి

నా నమస్కారములు.

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషనం ధనంజయాది భూషణం

కపోల దాన వారణం భజే పురాణ వారణం

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన 

వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని 

అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి,

సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా 

ఉన్నవానికి, పురాతనమైన వానికి నా వందనములు.

నితాంతికాంత దంతకాంతిమంతకాంతకాత్మజం

అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం

తమేకదంతమేవతం విచింతయామి సంతతం

ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ 

కారకుడైన శివుని కుమారునికివర్ణనకు, ఊహకు అందని ఆకారము 

కలవానికి, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే

వానికి, వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి 

ఎల్లప్పుడూ నా నమస్కృతులు.

స్వస్తి.