Showing posts with label సందిగ్ధత. Show all posts
Showing posts with label సందిగ్ధత. Show all posts

Sunday, 13 March 2022

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స

https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_13.html

సంశయం , సందేహం అన్నవి వేరు వేరు ధాతువులు. సంశయం న్యాయ తర్కాలలో పారిభాషిక పదం. ప్రమాణ,ప్రమేయ, సంశయ, దృష్టాంత, సిద్ధాంత... ఇలా పదహారు తత్త్వాలున్నాయి. భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి అని వస్తుంది. భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకము చూడండి.

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః|| 4-40 ||

అజ్ఞాని, శ్రద్ధలేనివాడు, సంశయ చిత్తుడు వినాశమునే పొందును. అట్టివానికి ఇహలోకమందుకాని, పరలోకమందుకాని శాంతిసౌఖ్యములుండవు.

సంశయము అన్నది  ఆత్మ గతము. సందేహము, విచికిత్స అన్నవి మనోబుద్ధులకు సంబంధించినవి. సందేహాత్ముడు ఎన్నటికీ సంశాయాత్ముడు కాలేడు. ఎందుకంటే దేహానికి, ఆత్మకు పొసగదు. సందేహము కలవాడు తన కళ్ళారా చూచి దానిని తీర్చుకొంటాడు. కానీ అతడు సంశాయాత్ముడు కాలేడు. అదే సంశాయాత్ముడు తన తర్కము వల్లనో గురు బోధన వల్లనో నిస్సంశయుడు కాగలడు. నిస్సంశయుడైతే అతను ఆత్మా సాక్షాత్కారానికి అడుగు దూరములో ఉన్నట్లే!

ఆంద్ర భాగవతమున ప్రహ్లాద చరిత్ర ఘట్టమందు ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికి జూచిన అందందే కలడు” నా శ్రీహరి - అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని అజ్ఞానం మనోబుద్ధుల స్థాయిది. హరి ఈ స్తంభంలో ఉంటాడా అన్న ఆయన ప్రశ్న ఆయనకు వచ్చిన సందేహం. ఒక విధముగా ఈ సందేహము ధర్మబద్ధమైనదే! విష్ణువు అనేపదానికి అర్థం తెలియని అజ్ఞానం. అందుచేత ఇక్కడ సందేహమే కానీ, సంశయము, విచికిత్సకు  లేదు.

సందిగ్ధము అన్నది కూడా ఇలాటిదే ఇంకో పదం, Dubious, doubtful, uncertain; as in संदिग्धमति. సందిగ్ధ స్థితి, ఒక విధమగు డోలాయమానము.

విచికిత్స Vicikitsa विचिकित्सा 1 Doubt, hesitation, uncertainty.

सन्देहःइत्य-मरः ॥ (यथा, भागवते३६

तुभ्यं मद्विचिकित्सायामात्मा मे दर्शितोऽवहिः

नालेन सलिले मूलं पुष्करस्य विचिन्वतः ॥”) విష్ణువు నాభీకమలంలో సృష్టింప బడిన బ్రహ్మగారికి తానెవరు? తన కర్తవ్యంఏమిటి? ఈ పద్మము యొక్క మూలమేమిటి? అనే విషయాలపై విచికిత్స ప్రారంభించాడు. అదే తపస్సు. అదే contemplation to resolve doubt.

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స వీని ప్రయోగాలలో ఇన్ని సున్నితమైన వ్యత్యాసాలున్నాయి. దానికి షడంగముల న్యాయ తర్క పారిభాషిక నిర్వచనాలు అవసరమౌతాయి. దీనినే శబ్దబోధ, మీమాంస అంటారు.

స్వస్తి.ధ మీమాంస అంటారు