Showing posts with label సంస్కృత చాటువు (కవికి దొంగకు గల పోలిక). Show all posts
Showing posts with label సంస్కృత చాటువు (కవికి దొంగకు గల పోలిక). Show all posts

Saturday, 1 February 2014

సంస్కృత చాటువు (కవికి దొంగకు గల పోలిక)


సంస్కృత చాటువు (కవికి దొంగకు గల పోలిక)
మందం నిక్షిపతే పదాని పరిత శ్శబ్దం సముద్వీక్షితే
నానార్థాహరణంచ కాంక్షతి ముదాలంకారమాకర్షతి
ఆదత్తే సకలం సువర్ణ నిచయం ధత్తే రసాన్తర్గతం
దోషాన్వేషణ తత్పరో విజయతే చొరోపమస్సత్కవిః
దొంగ
మందం నిక్షిపతే పదాని = అడుగులు నెమ్మదిగా వేస్తాడు
పరితః శబ్దం సముద్వీక్షితే = చుట్టుప్రక్కల గల శబ్దాలను జాగ్రత్తగా గమనించుతాడు
నానార్థాహరణం చ కాంక్షతి = పలు విధములైన సంపద దొంగలించ దలచుతాడు
ముదాలంకారమాకర్షతి = తానిష్ట పడిన ఆభరణాలన్నీ దోచుకొంటాడు
ఆదత్తే సకలం సువర్ణ నిచయం = బంగరు వస్తు సమూహమెల్లా కావాలని కోరుకొంటాడు
ధత్తే రాసాన్తర్గతం =రసము అంటే భూమి లో దాచిపెట్టిన సంపద గ్రహించుతాడు
దోషాన్వేషణ తత్పరో విజయతే చోరః = తాను దోచుకోబోయేవారి దోషాలనుకనిపెట్టి విజయం పొందుతాడు
కవి
మన్దమ్ నిక్షిపతే పదాని = జాగ్రత్తగా యోచించి తన కవితలో పదాలను పేర్చుతాడు
పరితః శబ్దం సముద్వీక్షితే = శబ్ద ప్రయోగము సరిగా చేసినది లేనిది చనానార్థాహరణం చ కాంక్షతి = ప్రయోగము నానార్థాలతో భాసిల్లాలని కోరుకొంటాడు
ముదాలంకారమాకర్షతి = మనొరంజనమౌ అలంకారాలను తన కవిత లో కోరుకొంటాడు
ఆదత్తే సకలం సువర్ణ నిచయం = అక్షర రమ్యత నాశించుతాడు
ధత్తే రాసాన్తర్గతం = తన కవిత రసమయమై వుండాలని కోరుకొంటాడు
దోషాన్వేషణ తత్పరో విజయతే సత్కవిః = నిర్దోషమై తన కవిత విలసిల్లాలనుకొంటాడు

ఉపమ = ఇది వారిద్దరి నడుమ గల పోలిక
 స్వస్తి.