విపంచి హస్తా విరించి కాంతా
విమల విభాస విభూతిస్వాంతా
నమోసురాగ పరాగ లతాంతా
నమామి మాతా వేదశ్రాంతా
1. స్ఫాటిక మాలాలంకృత హస్తా
స్ఫారక విద్యా జ్ఞాన సమస్తా
పరమ పవిత్రా పరిమళ గాత్రా
ప్రబల శుభాన్విత ప్రధిత చరిత్రా llవిపంచి హస్తాll
2. విస్ఫుర విద్యా వినయాక్రాంతా
విమూఢ మంద ధ్వాంతాహంతా
దయానితాంతా క్లాంతా శాంతా
ధవళ నీరజా విశ్రాంతా llవిపంచి హస్తాll
3. కుల మత జాతి విచక్షణ రహితా
విలసిత కరుణా భరణా భరితా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా
ప్రబల భారతీ పవిత్ర చరితా llవిపంచి హస్తాll
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా
కరుణ దయార్ద్రత ప్రేమాకలితా
పూర్ణ గాన విజ్ఞాన ప్రధితా
రామ మోహనభిదాన ప్రదాతా
కఠిన పదార్థములు
1.
విపంచి=వీణ
విరించి= బ్రహ్మ
విమల= మలినములేని
విభాస=వెలుగు
విభూతి=ఐశ్వర్యము
స్వాంతా= మనసు కలిగిన దానా
2. సురాగా= శ్రేష్ఠమైన రాగములు (అనెడు)
పరాగ= పుప్పొడిని గల్గిన
లతంతా=లతకు చివర నిల్చునది (పుష్పము)
వేద శ్రాంతా=వేదములయండు సేద దీరునది
3. స్ఫాటిక మాలాలంకృత హస్తా= స్ఫటిక మాలను
హస్తమున కలిగిన దానా
స్ఫారక=విస్తృతమైన
4. గాత్రము= శరీరము (గొంతు అన్న అర్థము కూడా
కలదు)
ప్రబల=మిక్కిలి
శుభాన్విత=శుభములను కూర్చునది
ప్రధిత=ప్రఖ్యాతి గాంచిన
5. విస్ఫుర= అమితముగా
6. విద్యావినయ+ఆక్రాంతా= విద్యావినయములను తన
వశములో ఉంచుకొన్నది.
విమూఢ మంద ధ్వాంతాహంతా= తెలివే లేని, ఉన్న తెలినివిని ఉపయోగించలేని, (వారియొక్క)
ధ్వాంతా+హంతా = చీకటిని (బుద్ధిహీనతను, బుద్ధి మాంద్యమును)రూపు మాపెదానివి.
నితాంత = అపారముగా
ఆక్లాంతా శాంతా = అలసటయే ఎరుగనట్టి శాంతము
కలిగినదానా
ధవళ నీరజ =
తెల్ల తామర
విశ్రాంతా
= విశ్రమించుదానివి
విలసిత =
ఒప్పబడిన, మెచ్చుకోనబడిన , అంగీకరించిన
కరుణా భరణా భరితా= అన్ని ఆభరణములలోనూ కరుణ అన్న బంగారమును కలిగినదానా
జ్ఞాన సత్వ విద్వజ్జన విహితా=జ్ఞానము మరియు సర్వశ్రేష్ఠమైన
సత్వగుణమును కల్గిన విద్వాంసులకు అనుకూలించు మాతా
లోకహితా= లోకములకు
మేలుచేయుదానా
జయనీకు జయమగు గాక!
4. అభిదానము = మంచి పేరు