Showing posts with label సుందర కాండ లో గమనించితే తెలుస్తుంది.సీతామాత శ్రీలలితా స్వరూపిణి అని.. Show all posts
Showing posts with label సుందర కాండ లో గమనించితే తెలుస్తుంది.సీతామాత శ్రీలలితా స్వరూపిణి అని.. Show all posts

Monday, 24 July 2023

సీతామాత – శ్రీలలిత -సుందర కాండ

 సీతామాత – శ్రీలలిత -సుందర కాండ

https://cherukuramamohanrao.blogspot.com/2023/07/blog-post_24.html

పరబ్రహ్మ యొక్క సృష్టిస్థితిలయకారక రూపములే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ‘అందుకే శివాయ విష్ణురూపాయ....’ అంటూ వారిమధ్య గల అభేదమును గూర్చి తెలిపినారు. శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి అవతారము. ఇదిమనకు తెలిసిన విషయమే! ఆయనను 9 నెలలు గర్భము నందు ధరించి ప్రసవించినది మాత కౌసల్య. సీతను లక్ష్మీదేవి అవతారముగా భావించుతారు. కానీ ఆమె జనక, సునయనల బిడ్డగా జన్మించలేదు. ఆమె అయోనిజ. నాగేటిచాలున పుట్టినది. కావున అయోనిజ. జనకుడు ఆమె బహిర్గతమైనంతనే ఆమెను జగన్మాతగా గుర్తించి, నాగేటిచాలున పుట్టినది కాబట్టి ‘సీత’ అన్న పేరు పెట్టుకొన్నాడు. అసలు అమ్మవారు ఎపుడు జగత్తులో ప్రభవించినా అయోనిజగానే వస్తుంది, పార్వతి రాధ, సీత, ఆండాళ్,ఈవిధముగా చెప్పుకోవచ్చు. పైపెచ్చు దుర్గ, లక్ష్మి, సరస్వతి వేరుకాదు. అంతా ఆతల్లి రూపన్థరములే! లలితా సగాస్రనామావళి లోని ఈ క్ర్రింది శ్లోకములు రూఢి చేస్తూవున్నాయి.

సర్వయన్త్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీl

మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియాll53ll

దేశకాలాపరిచ్చిన్నా సర్వగా సర్వమోహినీ l

సరస్వతీ శాస్త్రమయీ గుహామ్బా గుహ్య రూపిణీll137ll

పై రెండు శ్లోకములూ లలితా సహస్రనామము లోనివి. ఇవి అమ్మవారి అభిన్న రూపమును తెలియజేస్తుంది. ఇక సీతామాతను గూర్చి మాట్లాడుకొన్నా మనము శ్రీలలితను గూర్చి మాట్లాడుకొంతున్నట్లే! అసలు  లలితా సహస్రానామములో ఆతల్లి ఈవిధముగా తెలియజేయబడింది.

విశ్వగర్భా స్వర్ణ గర్భా ఽవరదా వాగధీశ్వరీl

ధ్యానగమ్యా ఽ పరిచ్ఛేదయా జ్ఞానదా జ్ఞాన విగ్రహాll

అంటే ఈ శ్లోకములోని మొదటి నామమే అమ్మను, ‘విశ్వమునే గర్భము నందు దాల్చినది’ గా చెప్పబడినది. కావున ఆ జన్మాత వేరొక గర్భమున ప్రవేశించదు కదా! దీనినే మూల ప్రకృతి అంటారు.

ఇక్కడ ఒక ధర్మసూక్ష్మమును గమనించండి. జనకునికి ఇద్దరు కుమార్తెలు. వారు సీత, ఊర్మిళ. వారువురు రామలక్ష్మణులను పెళ్ళి చేసుకొన్నారు. కానీ ఇక్కడ గమనించవలససిన విషయము ఏమిటంటే సీతకు మాత్రమే  శివధనుర్భంగము. ఊర్మిళ విషయములో అవేమీ లేవు. మరి సీత విషయములో మాత్రమే జనకుడు ఈ ఆంక్షలను ఎందుకు పెట్టినట్లు? ఇక్కడ కూడా ఒకవిషయమును ప్రస్తావించవలసియున్నది. నేను తెలుపబోయే రామాయణపరమైన సీతమ్మ తల్లికి సంబంధించిన ఈ విషయము జనబాహుళ్యములో అధికముగా ప్రచారములో ఉండేది. సీతాదేవి తన చెలికత్తెలతో బాల్యమున ఒక కందుకము అనగా బంతి తో ఆటలాడుకొంటూ ఉండగా అది శివధనుస్సును ఉంచిన, కొందరు చేరి లాగుటకు వీలుగా చక్రములు కలిగిన ఒక బృహత్ పేటిక క్రిందకు దొరలిపోతే సీతమ్మ ఒక్కటే దానిని తోసి బంతిని తీసినదట. ఆమె శక్తిస్వరూపిణి అనుటకు ఈ ఉదంతము చాలదా! ఈ విషయమును గుర్తెరిగినవాడు జనకుడు. అందుకే ఆ ధనస్సును ఎక్కుపెట్టిన పురుశోత్తమునికే సీతను ఇవ్వదలచినాడు. 

విశ్వామిత్రుని యజ్ఞము ముగిసిన తరువాత తన కర్తవ్యమేమిటి అని శ్రీరాముడు విశ్వామిత్రుని అడిగినాడు. వాల్మీకి రామాయణము ప్రకారము జనకుడు ఒక యజ్ఞమును తలపెట్టినాడు. దానికి విశ్వామిత్రుడు ఆహ్వానితుడు. ఆయన తనవెంట రామలక్ష్మణులను రమ్మన్నాడు. సీతా స్వయంవరమ, వాల్మీకి రామాయణము ప్రకారము జరుగలేదు. యజ్ఞము మాత్రమే జనకుడు ఆచరించ దలచినాడు.

అసలు విశ్వామిత్రుని  లక్ష్యము , ఆమాటకొస్తే ఋషులు అందరు తలచిన లక్ష్యము రాక్షస సంహారము. అది జరుగవలెనంటే అది సీతమ్మతో పాణిగ్రహణము జరిగితేనే సాధ్యము.. మరి రామలక్ష్మణులు ఎందుకు పోయినట్లు అన్న మాటకు విశ్వామిత్రుని ఈ జవాబు తెలియజేస్తుంది. ఆయన ‘మనము ఇపుడు జనకుని యజ్ఞమునకు పోవుచున్నాము’ అంటూ ఈ మాట అంటాడు.

అద్భుతంచ ధనుర్రత్నం’  అంటే ‘ అద్భుతం,ధనుర్రత్నం’ అని రెండుగా విడదీసి చదివితే ‘అద్భుతం’ సీతమ్మతల్లి, ధనుస్సులలో రత్నము శివధనుస్సు. జగన్మాత పాణిగ్రహణము చేయగలవాడు పరమ పురుషుడే! మరి ఆ పరమపురుశాత్వమును తెలుసుకొనేది ఏవిధముగా, అంటే సాధారణ మానవులకు అసాధ్యమైన శివధనుర్భంగము చేయగలవాడే ఆతల్లి కరగ్రహనమునకు అర్హుడు అని అర్థము చేసుకొన్న జనకుడు దానిని వరుని పాటవముగా నిర్ణయించుతాడు.

ఇక శివ ధనుర్భంగమునకుగల ఆధ్యాత్మిక కొణమును పరిశీలించుదాము,

 మిగిలినది మరొకమారు.....

సీతామాత శ్రీలలిత -సుందర కాండ - 2

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ l

మణిపూరాంత రుదితా విశ్నుగ్రంది విభేదినీll

ఆజ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంధి విభేదినీl

సహస్రారంబుజా రూఢా సుదాసారాభివర్షిణీll

మన సందర్భమునకు తగిన రుద్రగ్రంధిని గూర్చి మాట్లాడుదాసుందరకాండను ము. మూలాధార, స్వాధిష్ఠాన,మణిపూరక,అనాహత,విశుద్ధ,ఆజ్ఞా చక్రములను షట్చక్రములంటారు.  ఆజ్ఞా చక్రము దాటితే ఇక సహస్రారమే! ఈ విషయమును గమనించండి. రెండు కనుబొమలు ధనుస్సు యొక్క రెండు పార్శ్వములైతే ఆజ్ఞా చక్రము ఆరెంటికీ స్కంభము (Fulcrum). ఈ రుద్రగ్రంధి ని భేదించితే శివశక్తి సంగమము జరుగుతుంది. అంటే ఈ శివధనుస్సు విరిచితే సీతారామకల్యాణము జరుగుతుంది. ఆపై కథనంతా ఆతల్లే నడుపుతుంది. ఇక ఇక్కడినుండి సీతమ్మ, కథను తెరముందు తెరవెనుక నడుపుతూ వస్తుంది.

ఇప్పుడు సుందర కాండను గూర్చి కాస్త మాట్లాడుకొందాము. వాల్మీకి శ్రీ మద్రామాయణము నందు మొత్తం 7 కాండలు. అవి బాల,అయోధ్య,అరణ్య,కిష్కింధ,సుందర, యుద్ధ మరియు ఉత్తర కాండ. ఒక్క సుందర కాండ తప్పించి మిగత కాండలు అన్నీ కథా గమనమును సూచించుతూ ఉంటాయి. కథాగమనము ప్రకారమే అయితే ఈ కాండకు హనుమత్ కాండ అనిగానీ, లంకా కాండ అనిగానీ, సీతా జ్ఞాత కాండ అనిగానీ, లంకా దహన కాండ అనిగానీ పెట్టియుండవచ్చును. మరి సుందరకాండ అన్న పేరే ఎందుకు?

కొందరు విద్వద్వరేణ్యులు ఈ కాండలో సుందర హనుమద్మంత్రము నిక్షిప్తమై యున్నది కావున ఇది సుందర కాండ అయినదని చెబుతారు.

సుందరకాండ పారాయణము మూడు విధముల చేయుట కద్దు. మొదాటి విధమునకు సంకల్పములో ‘అస్య శ్రీ సుందరకాండ మహా మంత్రస్య శ్రీసీతారమచంద్రో దేవతా...’ ఆంజనేయుని పరముగానైతే ‘అస్య శ్రీ సుందరకాండ మహా మంత్రస్య శ్రీ ఆంజనేయ స్వామీ దేవతా...’ ఇక అతి ముఖ్యమైనది ‘అస్య శ్రీ సుందరకాండ మహా మంత్రస్య శ్రీ సీతామహాత్రిపుర సుందరీ దేవతా...’ అని మొదలౌతుంది. ఇక సుందరకాండ లోని మొదటి శ్లోకము నుండీనే సీతా హనుమంతు ల వారి సంబంధము దూతా మాట సంబంధముగా కాక త్రిపురసుందరికీ సాధకునకు గల సంబంధముగానే నడుస్తుంది. హనుమంతుడు లంకా నగరమున ప్రవేశించిన తరువాత అత్యంత సుందరమగు అశోకవనిలోనికి ప్రవేశించుటకు ఒక్కొక్క ఆవరణ దాటుకొంటూ సాగర మధ్యమున గల లంకలోని అత్యన్తఃపుర ఉద్యానవనములలో అత్యంత శ్రేష్ఠమైన అశోక వాటిక చేరుతాడు. వర్ణనాతీతమగు ఆ వనశోభను వాల్మీకి ఎంత సుందరముగా మనముందు ఉంచినాడంటే అటువంటి వర్ణసూచిన్చుతాయి. న మల్లె మనము ఆది శంకరులవారి సౌందర్యలహరి ;లో చూస్తాము. ఈ రెండు వర్ణనలూ ఎంతో దగ్గరి పోలికగాలిగి అమ్మవారి త్రిపురసుందరీ తత్వమును ప్రగాఢముగా సూచించుతాయి.

ఆదిశంకరులు మనకందించిన అనర్ఘ రత్నమగు సౌందర్యలహరి లోని ఈ శ్లోకరత్నమును గమనించుదాము.

సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే l

శివాఽకారే మంచే పరమశివపర్యంకనిలయాం

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ll

సుధ అంటే అమృతం అని మనకు తెలుసు. సింధువు అంటే సముద్రము. కాబట్టి సుధాసింధువు అంటే అమృతసముద్రం.  సుధాసింధోః మధ్యే అంటే ఆ అమృతసముద్రం మధ్యలో అని. ఆ అమృతసముద్రం మధ్యలో ఒక మణిద్వీపం ఉందట.సురలు అంటే దేవతలు. విటపి అంటే చెట్టు.  సురవిటపి అదే దేవతల చెట్టు అంటే కల్పవృక్షం. వాటి అంటే తోట. కాబట్టి సురవిటపివాటీ అంటే కల్పవృక్షాలతోట అన్నమాట.  అంటే ఇప్పటి వరకూ మనకు ఆచార్యులవారు చెప్పినది ఆ ద్వీపంలో కల్పవృక్షాలతోట ఒకటి ఉందని.  కొంత చిరునామా తెలిసింది కదా.

చింతామణి అంటే ఇంద్రుడి దగ్గర ఉండే గొప్ప మణి. అదికూడా అడిగిందల్లా ప్రసాదిస్తుంది.దాన్ని మించిన మణి ముల్లోకాల్లోనూ ఉండదు. చింతామణిగృహము.  దీని అంటే కొల్లలుగా చింతామణులున్న గది లేక చింతామణులతో కట్టిన ఒక గృహము ఉన్నదని అంటున్నారు.  ఇంద్రుడి దగ్గర  ఒక్కటంటే ఒక్క చింతామణికే అంత విర్రవీగుతూ ఉంటే మరి ఈ మహాభవనాన్ని చింతామణుల్నే వాడి కట్టినారంటే ఆ అమృతసముద్రం మధ్యలో కల్పవృక్షాలతోటగల దీవి వైభవం ఊహించుకోవలసిందే!

ఆ చింతామణిగృహం నీపోపవనవతి అన్నారు. నీపం అంటే కడిమి చెట్టు. ఆ భవనం చుట్టు కడిమి పూల తోట ఒకటి ఉందట.

ఆ పిమ్మట ఆ యింటిలోనికి ప్రవేశిస్తే అందులో సంగతి ఎలా ఉండేదీ చెబుతున్నారు.

మంచె అంటే మంచము.మంచము అనేది ఈ మంచె అనే సంస్కృతపదము నుండి వచ్చినదే! దాన్ని శివాకారే అన్నారు - అంటే అది శివా (శక్తి) ఆకారం కల మంచం అట.  ఆక్కడ అమ్మ ఉంది. ఎలా? అక్కడ ఉన్నది ఆ చిదానంద రూపిణి. ఇక్కడ కూడా అశోక వానిలో ఉన్నది. అంటే శోకము అన్నది కూర్చనట్టి వనము. అమ్మ ఈ వనములో శిశుపా వృక్షము క్రింద తన రాముని తలచుకొంటూ కూర్చున్నదే కానీ కంటతడితో ఉండలేదు. అందుకే సీతా అష్టోత్తరములో ‘ ‘అశోకవన మధ్యస్థ రావణాదిక మోహిని’ అని చెప్పబడినది. అట్టి తల్లిని లంకలోని ఎన్నో చోట్ల వెదకుచున్నాడు హనుమంతుడు. ఆ వెదకుటనే అన్వేషణ అని సాధనలో అంటారు. సుందరకాండ లోని 13వ సర్గ ప్రారంభములో సీతమ్మ తల్లిని కనిపెట్టలేక పోయినందుకు హనుమ ఎంతగానో  క్రున్గిపోతాడు, సాధకునునికి కూడా ఇష్టదేవతా ప్రత్యక్షము కలుగకపొతే విహ్వాలుడు లేక ఉద్విగ్నుడైపోతాడు. ఆ దశలో ఆత్మార్పణము చేసుకోను సంకల్పము ప్రబలుతుంది. శివభక్త తత్పరులైన రావణాది అసురులు ఆపని చేసినవారే! కానీ హనుమంతుడు సత్వగుణ సంపన్నుడు. తానూ ప్రాయోపవేషమే చేస్తే ఇటు సూర్య వంశము అటు కపి కులము సంమూలముగా నశించిపోతుందని గ్రహించగలిగినాడు. అందుకే అన్వేషణ కొనసాగించినాడు. అదే సత్వగుణసంపన్నుడైన సాధకుడు చేసేపని. ఆయన వినాశ హేతువాగు ఆత్మార్పణముకన్నా సీతాసాధ్వి అన్వేషణ సఫలీకృతము చేసి విజయమును వారించెదగాక! అని తలచి ఈ విధముగా ప్రార్థించినాడు.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై l

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యఃll

అని రామ లక్ష్మణ సీతామాతలకు మరియు రుద్రెంద్రాది దేవతలకు నమస్కరించి   తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరుచూ తన అన్వేషణ కొనసాగించినాడు.

మిగిలినది మరొకమారు.....

సీతామాత శ్రీలలిత -సుందర కాండ 3

అదే సత్వగుణసంపన్నుడైన సాధకుడు చేసేపని. ఆయన వినాశ హేతువాగు ఆత్మార్పణముకన్నా సీతాసాధ్వి అన్వేషణ సఫలీకృతము చేసి విజయమును వారించెదగాక! అని తలచి ఈ విధముగా ప్రార్థించినాడు.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై l

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యఃll

అని రామ లక్ష్మణ సీతామాతలకు మరియు రుద్రెంద్రాది దేవతలకు నమస్కరించి   తనకు  కార్య సాఫల్యత కూర్చవలెనని కోరుచూ తన అన్వేషణ కొనసాగించినాడు. జనకాత్మజ అంటే జనకుని కుమార్తె అని స్థూలముగా అర్థమును తీసుకొనవచ్చును.తరచితే జనకుని హృత్తటిలో నివసించుచున్న జగన్మాత అని అన్వయిన్చుకోనవచ్చును. ఇంకొకమాట, చావా వలెనాన్న భయము, చావకూడదన్న ధైర్యము రెండూ పదమూడవ సర్గాలోనే జరిగినాయి. ఆ ధైర్యము రామ త్రయోదశాక్షరీ మంత్రమగు విజయమునకు సంకేతము. ఆ మంత్రము మనకందరకూ తెలిసినదే! అదే 'శ్రీరామ జయ రామ జయ జయ రామ'. అదే వాల్మీకిగారి గొప్పదనము ఆ మంత్రపఠనము చేసి తన సీతామాత అన్వేషణకు గడంగి విజయము సాధించినాడు. కారణము ఏమిటంటే ఇపుడు సీతమ్మను కనుగొనవలెనంటే రాముని సహకారము కావలె. అందుకే రామ త్రయోదశి మంత్రము. హనుమంతుడు మంత్రసిద్ధి కలిగినవాడు కాబట్టి వెంటనే రాముని దయతో అశోకవనమును గుర్తుచేసుకొన్నాడు. వెంటనే ఆయన అడుగులు అశోకవాతిక వైపు పడినాయి. ఆతరువాత 15వ సర్గ. ఈ సర్గలోనే హనుమంతుడు సీతా త్రిపుర సుందరిని చూస్తాడు. మరి 14వ సర్గ వదిలి 15 లోనే ఎందుకు చూస్తాడు. శ్రీ విద్యా ఉపాసనలో పంచదశీ మంత్రము అత్యుత్తమము అత్యున్నతము అయింది. ఈ మంత్రము 15 బీజాక్షరముల సమూహము. దీనిని ఇష్టము వచ్చినట్లు బహిర్గతము చేయలేము. ఈ మంత్రోపాసకునికి తల్లి ప్రత్యక్షమై తీరవలసినదే! అందుకే హనుమంతులవారికి ఆ తల్లి దివ్య దర్శనము. హనుమంతుడు ఆ తల్లిని పొగచేత ఆవరించబడిన అగ్నిగానూ, సందేహములు కలిగిన స్మృతులు గానూ, పౌర్ణమ తరువాత బుద్ధి అదోగతమగు రీతిగా ఉన్నాడని భావించుతాడు. పౌర్ణమి\అమావాస్య తరువాత వచ్చేకృష్ణపాడ్యమి నుండి బుద్ధి మందగించుతుంది అన్నది శాస్త్ర వచనము. అందుకే శాస్త్రములోనే ‘పాడ్యమీ పాఠనాశనం’ అంటారు.  ఇక్కడ ఉపమానములోని పొగ, అనుమానాలు, కృష్ణపక్షము తీసివేస్తే  బుద్ధి, శ్రద్ధ, ప్రజ్ఞ, స్మృతి మిగులుతాయి. ప్రజ్ఞ జ్ఞానము వల్లనే కలుగుతుంది. శ్రద్ధ కలిగితేనే జ్ఞాన సముపార్జన జరుగుతుంది. కావున వెనుక తెలిపిన నాలుగు గునములూ ఆ త్రిపుర సుందరీ స్వరూపములే! అందుకే

యాదేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా l

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమఃll

యాదేవీ సర్వభూతేషు  విద్య రూపేణ సంస్థితాl

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమఃll

యాదేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితాl

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమఃll

యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాl

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమఃllబాహిరముగా కిష్కింద కానదములో శ్రీరాముడు సీత తన అన్గాన్గాములకు ధరించిన ఆభారముల

మొదట ఇక్కడ ఈ విషయమును గమనించండి. మొదట మనము గ్రహించుటకు ఒక వస్తువు ఉండవలెను. ఆ వస్తువే స్నృతి. దానిని పొందుటకు కావలసినది విద్య. విద్యకు అవసరము సద్గురువు. మరి గురువు దొరికిన తరువాత ఆయన ఉపదేశములను గ్రహించుటకు కావలసినది బుద్ధి. ఈ బుద్ధి చురుకుదనము , విమర్శ, నియమనిష్ఠలు తప్పక ఉండవలెను. ఆతరువాత కావలసినది శక్తి. శక్తి యందు ధారణాపటిమ, విశ్లేషణ మరియు విమర్శనాత్మకముగా తెలుపగలుగటను కలిగి యుండవలెను. పైన చెప్పినవన్నీ ఇవ్వగలిగినది  శ్రీలలితా త్రిపురసుందరి మాత్రమే! అట్టి చరుర్దశ భువన మాతృక యగు తల్లిని చూసినాడు హనుమంతుడు. కిష్కింద కాండలో శ్రీ రాముడు వర్ణించిన ఆభరణములను, మూటకట్టి దిగవిచిన నగలు అవి కట్టిన చీర పీలిక తప్ప, అన్నింటినీ చూస్తాడు, మూటకట్టిన ఆతల్లి చీర యొక్క చిరుగుతో సహా!

అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవమ్l

రామస్యచ యథా రూపం తస్యేయమసితేక్షణాll

ఆంజనేయుడు తనలో తాను, రామునితో సరిసమాన,ఉగా అంగ ప్రత్యంగ సౌష్ఠవాము కలిగియుండుటయే గాక. ఆయన ప్రతిరూపమైయోప్పారుచున్న  ఈ

సాధ్వి సీతామాతయే అనుకొంటాడు. ఇక్కడ ఈ శ్ల్ప్కసారము ప్రకారమూ ఇది అర్ధనారీశ్వర తత్వము.

శ్రీశివా శివశక్త్యైకరూపిణి’ అని లలియాసహస్రనామము చివర వస్తుంది. 

అస్యా దేవ్యా మానస్తస్మిన్స్తస్యచాస్యాం ప్రతిష్ఠితమ్l

తెనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతిll

సీతమ్మ పరపురుషుని బందీగా అశోకవనములో ఎందుకున్నదంటే ఆమె మనసులు శ్రీరాముడు స్థిరముగా నిలచియున్నాడు. అదేవిధముగా ఆయన మబస్సులో సీతమమ నిలచియుంది. ఆమె అందుకే జీవించి యుంది.ఇది ప్రకృతి పురుష తత్వము. ఇరువురిలో ఏ ఒక్కరు మరొకరిని వదులుకొన్నా అంతా విలయమే! అంటే సంసారము ఉండదు. పాటి పత్నులు ఉంటేనే కదా సంసారము, పరమాత్మ పరదేవతల అనుబంధమే సంసారము. కావున ఈ సకల చరాచర సృష్టి అంతా వారి సంసారము. అందుకే. ప్రపంచాన్ని హిందీలో సంసార్ అంటారు.

పాన్చాభౌతికమగు శరీరముతో ఉన్న అమ్మవారు శోకముతో కూదియున్నా అశోకములోనే యున్నది. కారణం అశోకంలో రాముడు తప్ప రావణమూక అగుపించదు. ఇక కథలోకి ఒకసారి తొంగి చూద్దాము. సీతమ్మ తల్లితో వార్తాలాపాము ముగిసిన తరువాత తల్లీ ఒక చిన్నపని ఉన్నది అది ముగించుకొని  శ్రీరాముని వద్దకు చేరుతాను అంటాడు. అది లంకా దహనమే వేరుకాదు. కథ అందరకూ విదితమే కావున కథ లోతులకు వేళ్ళుటలేదు. హనుమంతులవారి తోకకు బట్టలు చుట్టి నిప్పంటించిన తరువాత. ఆ విషయమును ఒక రాక్షసి ద్వారా విన్న వెంటనే సీతామహాసాధ్వి  ఈ క్రింద కనబరచిన 5 శ్లోకములలో హనుమంతునికి ఆగ్నివల్ల  ఏ ఇబ్బంది జరుగకుండా చల్లగా ఉండవలెనని కోరుకొంటుంది. గమనించండి ఏ ఏ విషయముల పణముగా ఒడ్డి అడుగుతుందో!

మిగిలినది మరొకమారు......

సీతామాత శ్రీలలిత -సుందర కాండ 4

53 28 యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపఃl

యది చాస్త్యైకపత్నీత్వం శీతోభవ హనూమతఃll

నేను పతిసేవా పారాయణనే అయినచో, తపమాచరించి యున్నచో,

నేను నిష్కళంక పతివ్రతనైనచో, ఓ అగ్నిదేవా! హనుమంతుని

చల్లగా చూడుము.

యదికించయకించిదమక్రోశః తస్యంయ్యస్తి ధీమతఃl

యది వా భాగ్యశేషో మే శీతో భవ హనూమతఃll

హే అగ్నిదేవా!నేను ఎమాత్రమైననూదీమంతుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువుయొక్క దయకు నోచుకోని యున్నచో, నా పుణ్యఫలము ఎ కొంచమైననూ మిగిలియున్నచో మారుతిని చల్లగా చూడుము.

పైరెండు శ్లోకములు ప్రాపంచిక ధర్మానిష్ఠను గూర్చి తెలుపుతూ హనుమ చల్లగా ఉండవలెనని కోరుకొంటూ ఉన్నది తల్లి.

యదిమాం వృత్తసంపన్నాం తత్సమాగమ లాలసాంl

సవిజానాతి ధర్మాత్మా శీతోభవ హనూమతఃll

నేను నా పతివ్రతమును చిత్తశుద్ధితో అనుష్ఠించుదాననైతే, అన్యమగు హీనమైన ఆలోచనలు లేక శ్రీరామ సమాగమమునకై నేను ఎదురు చూచుచున్నట్లు ఎఱింగినచో  ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్ఛీల సంపన్నగా భావించినచో, ఆధర్మమే 

అప్రతిహతమైనచో, ఓ హవ్యవాహనా! వాయుసూనుని చల్లగా చూడుము. ఈ శ్లోకము సీతమ్మ సర్వతోముఖ తత్వము మనకు ప్రస్పుటము చేయుచున్నది. ఇక్కడ మనకు సీతారాముల అర్ధనారీశ్వరతత్వము గోచరమగుచున్నది. ఇచట అమ్మవారు, నేను ధర్మమూ తప్పనిదాననైతే అని చెప్పడము లేదు, బదులుగా ఆ ధర్మమూ విశిష్ఠమైనడైతే అని అంటూ ఉంది. కారణము ఆమెయే స్వతహాగా ధర్మస్వరూపిణి. అది ఈ శ్లోకము యొక్క ప్రత్యేకత.

యదిమాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరఃL

అస్మాదుఃఖాంబుసంరోధాత్ శీతోభవ హనూమతఃll

పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసముద్రమునుండి గట్టేక్కించగలడేని ఓ వైశ్వానరా! ఆంజనేయుని చల్లగా చూడుము.

ఈ శ్లోకములో సూర్య పుత్రుడగు సుగ్రీవుడు సూర్యవంశాజుడగు శ్రీరామునికి చేదోడు వాదోడై ఉంటూ ఉన్నవాడైతే హనుమంతుని చల్లగా ఉండవలెనని కోరుకొంటూ ఉంది.

సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా? యన్నట్లుగా తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్ష్నపూర్వకముగా ప్రజ్వలింప సాగెను.

హనుమంతుని తండ్రియైన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడియుండి, సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరునట్లు మంచుగాలి వలెచల్లగా వీచెను. తనతోక మండక పోవుట జూచి ‘రామ ప్రభావాదాశ్చర్యమ్’ అనుకొంటాడు. అందుకే తెలుగునాట ‘శ్రీరమ రక్షా సర్వ జగద్రక్ష’ అని అనుకొంటారు. హనుమంతులవారు అంతా తన గొప్పదనమే అని అనుకోవచ్చు. మహనీయులు అటువంటి హీనమైన తలపులు మదిలోనికి రానివ్వరు. పైగా సీతామాతయే తానాత్మన నిలుపుకొన్న త్రిపుర సుందరి గావున ఆ తల్లి నిరతమూ తనను కాపాడుతుందన్న నమ్మకము కలిగి యుంటాడు.

అనేక చోట్ల, సుందరాకాండలో హనుమంతుడు సీతమ్మను అగ్ని రూపిణిగా తలుస్తాడు. దుర్గా సూక్తములో ఇదే మాట ఈ విధముగా చెప్పబడింది. 'తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం తాం వైరోచనీం  కర్మఫలేషు జుష్టాంl

దుర్గాం దేవీగ్ం  శరనమాహం ప్రపద్యే సుతరసి తరసే నమఃll

అగ్నివరణము కలిగినది మరియు కర్మఫల ప్రదాయిని అయిన ఆ తల్లి శరణు కోరుకొంటున్నాను అని చెప్పబడింది. అసలు ఈఅగ్ని ధర్మాగ్నిగా తలువవలేనా లేక సీతమ్మ క్రోదాగ్నిగా తలువవలెనా!లేదులేదు రెండూ అనితలువవలేనేమో!

ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది సీతమ్మ త్రిపురసుందరి స్వరూపమే! అని.

మిగిలినది మతోమారు. .......

సీతామాత శ్రీలలిత -సుందర కాండ 5 (చివరి భాగము)

ఇక రాముడు విష్ణు రూపుడు అని తలచితే ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవేl

శివస్య హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంll’

అని చెప్పనే చెప్పినారు.

ధరాధర సుతా ధన్యా ధర్మిణీ ధర్మ వర్ధినీl

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికాll 76 ll

పై శ్లోకము లోని ఒక గొప్ప విశేషము ‘ధరాధర సుతా’ అన్న పాదములో ఉన్నది. సామాన్యమైన అర్థము ధర అనగా భూమి ‘ధర’ అనగా ధరించినది అనగా పర్వతముయోక్క ‘సుత’ పుత్రిక, అనగా లలితా త్రిపురసుందరి అని అభివరించినారు. ధరసుతయే కదా!’ కానీ భాస్కరా చార్యులవారు ఆ పదమును ధర, ధరసుతగా విడదీసి, ధరసుతను అనగా సీతమ్మను కలిగినది అని చెప్పినారు.

ఈ విధముగా త్రిపుర సుందరీ మూర్తియగు సీతమ్మ వలన కూడా ఈ కాండ ‘సుందర కాండ’  అయినదని నా మనసు తెలిపే మాట!

ఇప్పుడు ఈ కాండకు 'సుందర కాండ' అన్నపేరు వాల్మీకి ఎందుకు ఉంచినారు అన్న విషయముపై కొందరు అజ్ఞాత పండితులు కొందరు ఆధునిక పండితులు తెలిపిన అభిప్రాయములను మీ ముందుంచి స్వస్తి పలుకుతాను.

సుందర కాండ నామకరణము

వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టినారు. కాని ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికి పండితులు అనేకముగా  వ్యాఖ్యానాలు చేసినారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది.

 

సుందరే సుందరో రామ:

సుందరే సుందరీ కథ:

సుందరే సుందరీ సీత

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపి:

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?

 

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

 

మరొక అభిప్రాయం: వజ్రాయుధము వల్ల హనువు అనగా దవడకు దెబ్బ తగిలినవాడు కావున హనుమ, అంజనీ పుత్రుడు కావున ఆంజనేయ, వాయుదేవుని కొడుకు కావున మారుతి అను పేర్లు ఈ చిరంజీవికి జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చినాయి. అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టినట్లు చెబుతారు.

 

గుంటూరు శేషేంద్ర శర్మ రచన షోడశి - రామాయణ రహస్యములు అనే పుస్తకం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ ఈవిధముగా వ్రాసినారు- "రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా "సుందరకాండము" అను పేరు ఏల .. అను సంశయము పలుమందికి ఉంది. నేను సుమారు ముప్పది యేండ్లక్రింద కీ.శే.కాశీకృష్ణాచార్యులవారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి".

 

అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధములో వసించును. ఆమెయే త్రిపుర సుందరి కనుక ఇది సుందరకాండము. ఆది శంకరుని ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడింది. బ్రహ్మాండ పురాణములో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడింది.

స్వస్తి.