Showing posts with label సుయోధనుడు - దుర్యోధనుడు అర్థము. Show all posts
Showing posts with label సుయోధనుడు - దుర్యోధనుడు అర్థము. Show all posts

Friday, 12 September 2014

సుయోధనుడు - దుర్యోధనుడు అర్థము

Gunturu Ramarao మహాశయా నమ�స్కారములు. నా దొక చిన్న సందేహం:- ఈ గాంధారాగ్రజునికి దుర్ - యోధనుడు 

మరియు సు- యోధనుడు అన్నపేరెట్లా పొసగుతుంది. ఒకరికే పేరులో మంచి-చెడు రెండూ గుణాలు వ్యక్తమయ్యేటట్లు 

ఆపాదింపబడిందే అని. తెలియజేయగలరని మనవి.

రామారావు గారూ, యుద్ధము చేయ గలవాడు యోధుడు.ఇతను సుయోధనుడు అంటే ఈ యుద్ధ విద్యలో ఆరితేరినవాడు 

.నైపుణ్యముతో యుద్ధము చేయగలవాడు. కానీ ఇతను మితిమీరిన స్వాభిమాని, అహంకారి. అందుకే తనపేరును 

'దుర్యోధనునిగా' ఎక్కువ ప్రాచుర్యములోనికి తెచ్చుకొని ఉంటాడు. 'దుర్యోధనుడు' అంటే 'జయింప లేనివాడు' అని అర్థము. ఇది 

మంచి అర్థమే కానీ అతని అహంభావాన్ని చూపుతుంది.ఇక 'దుశ్శాసనుడు' అన్నా శాసింప వీలు కాని వాడు అంటే, మంచో చెడ్డో 

అన్నగారి మాట తప్ప ఆతను ఇతరులను లెక్క చేసినవాడు కాదు.కావున ఇవి చెడుగును సూచించవు.

ఈ పేర్లు వారి దుర్ధర్శత్వాన్ని సూచించుతాయి, అంటే వారు 'తిరస్కరింప దగనివారు' అని అర్థము.

కొన్ని పేర్లు శ్రావ్యము గా లేకున్నను, వారు భూమిపై బ్రతికితే చాలని కూడా పెట్టుట కద్దు. అష్టావక్ర,శునక,కుబ్జ అని వారి 

ఆకృతిని బట్టి కూడా పేర్లు పెట్టుట కద్దు. నేటికి కూడా ధర్మ భిక్షం,పెంటయ్య ,పుల్లమ్మ మొదలైన పేర్లు వింటూనే ఉంటాము కదా.

ఒక సందర్భములో దుర్యోధనుడు ఈ విధంగా అంటాడు:

జానామి ధర్మం న చ మే ప్రవృత్తి

జానామ్యధర్మం న చ మే నివృత్తి

ధర్మమూ, నీతి మొదలగు వానిని గూర్చి నాకు బాగా తెలుసు కానీ వానిపై నాకు అభిరుచి లేదు, అని అంటాడు. దీనివల్ల ఏమి 

తెలుస్తుందంటే 'ఆకాలములో తమకు నచ్చినదారిన పోతూవున్నా మనసులోని మాట దాచుకొనేవారు కాదు ,ఏ 

యుద్ధ తంత్రాలలోనో తప్ప.నా జవాబు మీకు నచ్చితే కృతజ్ఞుణ్ణి.

తత్సత్