స్నేహం
చాలా కాలం క్రితము San Francisco లో పెద్ద భూకంపం వస్తే ఒక తోట (Garden) మాత్రం ఆ బీభత్సము నుండి తప్పించుకొనింది. అది California లో వున్న Santa Rosa. అక్కడ Luther Burbank అనే ఒక వ్యక్తి, ఛలము చలము కలిగిన మనుష్యులకంటే నిశ్చలమైన చెట్లు మేలని తలచి, నిరంతరం మొక్కలతోనే జీవిస్తూ, వాటితో మైత్రిని పెంపొందించుకుంటూ వుండేవాడు. దాని ఫలితంగా జన్యుపరమైన విచిత్రాలుకూడా జరగటం సంభవించింది. శ్రీ పరమహంస యోగానంద (ఓక యోగి ఆత్మకథ) ప్రత్యేకంగా Luther Burbankను చూసేందుకు రావటం తటస్తించింది. ప్రకృతితో నిష్కల్మషమైన ప్రేమ మైత్రి నేరపితే ఎంత చక్కటి ఫలితములు రాబట్టవచ్చునో వారు బర్ బాంక్ గారి అనుభవము ద్వారా తెలుసుకొన్నారు. హృదయపూర్వకమైన ఆదరము చూపించి మొక్కలలో ఎలాంటి మార్పులు రాబత్తవచ్చునో వారికి అవగతమైనది. ఆయన ఒక నాగాజెమ్ముడు చెట్టును ఎంతో వింతగా చూచుట గమనించి Luther Burbank ఆయనతో ఈవిధముగా అన్నారు, "నేను రోజూ ఈ మొక్కతో మాట్లాడే వాడిని. నీకు ముళ్ళు అక్కర్లేదు నేను నిన్ను చూసుకుంటున్నాను అని. ఆ విధముగా ఆప్యాయతతో ఆ చెట్టును స్ప్రుశించుతూ మాట్లాడుతూ ఉండుట మూలాన ముళ్ళులేని Cactus తయారయింది." అని చెప్పగాసనే విస్తుపోవుట పరమహంస గారి వంతయింది.

No comments:
Post a Comment