విభీషణ నీతి
ఈ పద్యము చిన్న ఆటవెలదే! కానీ భావము ఎంత గంభీరమో చూడండి. పైపెచ్చు ఇది మనకు తెలియని విషయమూ కాదు. అయినా సమయోచితముగా సందర్భానుసారముగా మనకు తెలిసిన విషయమును చెప్పవలసిన మాట లేక ఉపదేశమునకు జోడించి చెప్పుట అగరు బత్తి ని వెలిగించినట్లుంటుంది. వెలిగించకున్నా దాని వాసన దానికుంటుంది, కానీ వెలిగిస్తే సువాసన చుట్టుప్రక్కలకు ప్రసరిస్తుంది.
అష్ట దిగ్గజములలో ఒకడైన అయ్యలరాజు రామభద్రకవి వ్రాసిన 'రామాభ్యుదయము నుండి గ్రహింపబడిన ఈ పద్యము విభీషణుడు రావణునికి బుద్ధిజేప్పు సందర్భము లోనిది.
పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖమ్ముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు,
పెరిగిన తెవులడగ జూడు పెద్దతనానన్!
ముదిరిన వ్యాధిని అణచుటకు మందు చెడు కదా అని త్రావుటకు సంశయిస్తే రోగము ప్రాణాంతకము కావచ్చును. మంచి మాట యొక్క కటవుదనమును చూసి ఈసడించుకొని, పెడ చెవిన పెడితే అది ప్రాణాంతకమే కావచ్చును.

No comments:
Post a Comment