పార్వతీప రమేశ్వరుడు
హస్తమభయంకరమ్ అరికుల భయంకరం
ఆప్త జన రక్షణం అగ్నిభర వీక్షణం
రుచిర పీతాంబరం రుద్రాక్ష కంధరం
పాహి శ్రీ హరి హరం పార్వతీప రమేశ్వరం
ఈ ఛాయా చిత్రమెవరిదో గాని ఆ మోము లో నాకు హరిహరులే కన్పట్టు చున్నారు . నా
ప్రమేయము లేకనే ఈ భావము బహిర్గతమైనది. నేను వ్రాసిన పై నాల్గు పంక్తులకు నేనే
అర్థము వివరించుకొంటే మంచిదనిపించి వ్రాయుచున్నాను. నమ్ముకొన్న వారికా చేయి అభయహస్తము
. శత్రు మూకకకు భయసమస్తము. ఆ వీక్షణము తనవారికి రక్షణము. శత్రు శలభ తీక్షణము. అమిత ప్రకాశము గల పీతాంబరాన్ని దాల్చి
విష్ణువైనాడు. ఱుద్రాక్షలు మెడలో దాల్చి ఈశ్వరుడైనాడు. అట్టి హరిహర మూర్తి యైన
పార్వతీ నాధుణ్ణి రమాపతిని శరణు వేడు చున్నాను.
చెరుకు రామ మొహన్ రావు

No comments:
Post a Comment