నేటి
బ్రాహ్మణ యువత పోకడ
ఉపనయన
కార్యమ్ములొనరించుటయెగాని
జంధ్యముల్
గూటమ్ము జతను గూడె
భుజము
పై జంధ్యంపు ప్రొవులుండినగూడ
సంధ్య
వార్చుట మలి సంధ్య జేరె
మంత్రముల్
గొణుగుట మాత్రముండినగూడ
మనసంత
మగువలే మసలుచుండె
తర్పణంబులకెల్ల
తర్పణము గావించి
తనదైన
సుఖముకై తపన బడియెఁ
రెంటికింజెడు రేవడ రీతి గాను
నడచుచుండగ
బ్రాహ్మణ నవత యువత
నలువ
తలలకు నెనరుతో నయముగాను
అమృతాంజన
మునుబూని యలదె వాణి
చెరుకు
రామ మోహన్ రావు
No comments:
Post a Comment