జగదీశ మహాదేవా రచన: చెరుకు రామ
మోహన్ రావు
జగదీశ మహాదేవ చూపించుమయా త్రోవ
కైలాసమె నాగమ్యం నిను పొందినచో ధన్యం
1.విషనాగులు నగలయ్యా కంధరమున గరళమయా
తల నిండా జడలయ్యా
తడియారక వుండునయా
ఇడుములు నీ సుఖమయ్యా
నా యిడుములు బడయుమయా ll ll
2.నాదమునకు ఆదివయా వేదాల పునాదివయా
మందస్మిత వదన, దయా పరిపూరిత వపుషమయా
నే బాధల బందినయా నీ
బాదర బందినయా ll ll
3.అమావాస్య విభావరిలో ఆక్రందన కలయికలో
నా ఆత్మ నివేదనలో నిను
చేరిచి హృదయములో
అర్చించే గీతికలో
అనుపల్లవి నీవయ్యా ll ll
No comments:
Post a Comment