Monday, 20 November 2017

జగపతి వెంకట రమణా

జగపతి వెంకట రమణా

జగపతి వెంకట రమణా
బుధజన వందిత చరణా
మరువను నీపద స్మరణ
చూపుము నాపై కరుణ
          పరమ దయామయ కిరణా
          పాదార్చక హృదయాదరణా
         శ్రితవత్సల హృదయాభరణా
         శాంతాసుఖ వాతావరణా
నీలీలావళి స్ఫురణ
నీసేవాంకిత ప్రేరణ
నిలుపును స్వార్థ ప్రదూషణ

నిజమిది కలుష విదారణ

No comments:

Post a Comment