బసవా!బసవా!
వృషాధిపా!
తొలి
శతకకర్తగా పేరుగాంచిన శివకవి పాల్కురికి సోమనాథ కవీంద్రుని వృషాధిపశతకంలోని ఈ
పద్యరత్నమును గమనించండి. ఇందు మకుటమైన వృషాధిపా! అన్న పదము తప్ప పద్యమంతా జాను
తెనుగులో నడచినది.పద్యము తెనుగుదయినా దురదృష్టకరమగు విషయమేమిటంటే అందు ఒక పదమునకు
కూడా అర్థము మనకు తెలియదు. ఏమీ తెలుసుకోకుండా చదువుతూ ఉన్నాకూడా మనసులో ఎదో ఒక
ఆనందము. ఆ గొప్పదనము భాస్ధడైనా ఉండాలి లేక భక్తిదయినా వుండాలి. ప్రస్తుతానికి ఆ
రెండూ వున్నా సోమనకు మనకు తెలిసిన రీతి మనసా నమస్సులను సమర్పించి ముందునకు
సాగుదాము.
శివకవులు
నాటి శుద్ధ తెనుగును వ్యవహారములో ఉపయోగించుతూ దానినే గ్రంథరచనకు తగినదిగా ఎన్నుకొని
పెద్ద పీత వేసినారు.
బలుపొడతోలు
సీరయును బాపసరుల్ గిరుపారుకన్ను, వె
న్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ
సలుగల
ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్
వలపు
మదిందలిర్ప బసవా!బసవా! వృషాధిపా!
ప్రతి
పదార్ధములు ఈ దిగువన గమనించగలరు:
బలుపొడతోలుసీర
= అనేక మచ్చలుగల చర్మాంబరము.
పాపసరులు
= సర్పభూషణములు
కిరుపాఱు
= మండుచున్న
కన్ను=
కన్నులు
వెన్నెలతల
=తలపై గల చంద్రవంక
చేదు
కుత్తుక = విషపూరిత కంఠము
బన్నిన
– చిక్కగా కట్టిన
వేల్పుటేఱు
= గంగ
నల్గుపూసలు-పుర్రెలనుపూసలపేరు
(గల్గిన)
ఱేని-రాజుయొక్క
లెంకనని-సేవకుడనని
జాను
తెనుంగున = జాను తెనుగులో
వలపు
మది దలర్ప = ప్రేమ అనగా భక్తి తో కూడిన మనస్సుతో
విన్నవించెదన్ = తెలుపుకొనెదను
బసవా!
బసవా! = బసవేశ్వరా బసవేశ్వరాఅని ఆర్తితోకూడిన స్వరముతో పిలుస్తున్నాడు.
ఈ
పద్యమున “వృషాధిపా!” అన్న ఒక్క మాట తప్ప తక్కినవి దేశ్యములే!
పులితోలు
ధరించినవాడు పాములను ఆభరణములుగా కలిగినవాడు, నిప్పుకంటిని గలిగినవాడు,చందమామను
తలదాల్చినవాడు, విషమును గోతున కలిగినవాడు, పుర్రెల మాలను మెడకు వేసుకొన్నవాడు, నగు నాపమేశ్వరుని బంటునై
మరులుగొన్న మనసుతో విన్నవించెదను అని భావము.
స్వస్తి.
No comments:
Post a Comment