నారి-ఇల్లాలు యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః l
వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వ జగన్మయీ ll
అంటున్నది అమ్మవారు, ‘లక్ష్మీతంత్రం’లో. అంటే,
‘నేను ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యముతో బాటు పురుషోత్తముడు’
కూడా ఉంటాడు. నేను ఆడవాళ్లందరిలో ఉన్నాను. కాబట్టి వారిని
నా రూపంగా గౌరవించితే చాలు పుణ్యము పురుషార్థము దక్కుతాయి.
అదే విధముగా ఇల్లాలి గొప్పదనమును గమనించండి, దయతో నేను వ్రాసిన ఈ పద్యము చదివి.
ఇల్లది విల్లుగాగ తన
ఇంటికి నారియె నారియౌచు తా
నుల్లము ఉల్లసిల్ల బహు
ఓరిమి జీవిత లక్ష్యమెప్పుడున్
కల్లగ జేయబోక కడు
కచ్చితమౌ గురి గల్గి యల్గులన్
మెల్లగ తాకజేయు కడు మేలిమి
వల్లరి భార్యయన్నచో
స్వస్తి
No comments:
Post a Comment