జగద్గురు శంకర ప్రణీత
గుర్వష్టకం
శరీరం
సురూపం తథా వా కళత్రం
యశశ్చారు
చిత్రం ధనం మేరుతుల్యమ్ |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
అందమైన
శరీరము , సుందరియగు భార్య , గొప్ప కీర్తి , మేరుపర్వత సమాన ధనము ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో
ఏమి ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి
ప్రయోజనము?
షడంగాదివేదో
ముఖే శాస్త్రవిద్యా
కళత్రం
ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం
బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||
భార్య
, ధనము ,
పుత్రులు , పౌత్రులు , ఇల్లు
, బంధువులు మొదలైనవి ఎన్ని ఉన్ననూ గురువు యొక్క
పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో
ఏమి
ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
షడంగాదివేదో
ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది
గద్యం సుపద్యం కరోతి |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||
ఆరు
అంగములు గల వేదములు , శాస్త్రములు , కవిత్వ ప్రసూనములగు గద్య-పద్యములను రచించగల
శక్తి ముఖమునందున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి
ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి
ప్రయోజనము?
విదేశేషు
మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు
మత్తో న చాన్యః |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||
విదేశములలో
మాన్యత్వము లభించినది ,
స్వదేశమున ధన్యత సమకూరినది, నాకన్నా సదాచార
సంపన్నుడు వేరొకడు లేడు ఐ తలపోయువాడయినా గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము
కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి
ప్రయోజనము?
క్షమామండలే
భూపభూపాలబృందైః
సదా
సేవితం యస్య పాదారవిందమ్ |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||
భూమండలమునందలి
రాజులందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడైననూ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు
మనస్సు లగ్నము కానిచో
ఏమి
ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
యశో
మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు
సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||
తాను
చేయు దానముల ప్రభావము వలన ఈ జగత్తు సర్వమూ కీర్తి వ్యాపించి యుండవచ్చు. గురువు
అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు చేతికి వచ్చి యుండవచ్చు. కానీ మనస్సు
గురువు యొక్క పాదపద్మములందు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
ఏమి ప్రయోజనము?
న
భోగే న యోగే న వా వాజిరాజౌ
న
కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||
భోగమునందు,
యోగమునందు, శ్రేష్ఠమైన ఆశ్వములయందుకాంతాకనకముల యందు అమితమగు ఆసక్తితో
సంపాదిన్చియున్ననూ, గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి
ప్రయోజనము?
ఏమి
ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
అరణ్యే
న వా స్వస్య గేహే న కార్యే
న
దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనశ్చేన్న
లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః
కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||
అరణ్య నివాసమునందు కానీ, స్వగృహనివాసమునందు
కానీ, అర్ఘ్యాది కార్యములందునూ ఆసక్తి లేనివాడై, అమూల్యమైన పరమేశ్వర సన్నిధానమును కోరుచున్ననూ
గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము లేనియెడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?
గురోరష్టకం
యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ
చ గేహీ |
లభేద్వాంఛితార్థం
పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే
మనో యస్య లగ్నమ్ ||
సన్యాసి-రాజు-బ్రహ్మచారి-గృహస్థుడు
మొదలగు వారిలో ఎవరు ఈ గుర్వష్టకమును పఠించిననూ, గురూపదేశముల మనసును మగ్నము చేయుచో పరబ్రహ్మమును పొందును.
ఇతి
శ్రీ శంకరాచార్య కృత గుర్వష్టకం సంపూర్ణం.
స్వస్తి.
No comments:
Post a Comment