Thursday, 4 February 2021

మన పురాణములు తెలియజేసిన శ్రేష్ఠ భక్తుల పట్టిక:

 

మన పురాణములు తెలియజేసిన శ్రేష్ఠ భక్తుల పట్టిక:

ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక   భీష్మ దాల్భ్యాన్

రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణానీన్

పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి.

భగవంతుడు

ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః l

జ్ఞాన విజ్ఞానయోశ్చాపి షణ్ణాం భగయితీరణ ll

సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైన శక్తి,, కీర్తి, శ్రేయస్సు అనగా సకల విధములగు సంపద, జ్ఞానము, విజ్ఞానము,  ఈ ఆరు గుణములు 'భగ' అన్న శబ్దము కలిగివుంటుంది. ఆ భగము కలిగినవాడు భగవంతుడు.

సంస్కృతములో ప్రపంచము అన్నమాటకు వంచన అన్న అర్థము ఉన్నదని శలాక రఘునాథ శర్మగారు చెప్పగా విన్నాను.

ఎండ మావులు= మావులు అనగా గుర్రములు.

అన్నేన భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం  ప్రయంచభిసంధిసంతి

అంటే అన్నము ప్రాణము నిలుపుటకే కాదు ప్రాణము తీయుటకు కూడా శక్తి కలిగినది. ఇది వేద వాక్కు. కావున ఎపుడూ శరీరమునకు ఆరోగ్యమును చేకూర్చే ఆహారమే తీసుకొనవలెను.

సత్యము అనగా త్రికాల అభాధ్యము

లలాట లిఖితా రేఖా పమార్ష్టుం నశక్యతే (పమార్ష్టుం = అతిక్రమించుట)-



No comments:

Post a Comment