నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)
https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post_19.html
ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కం సంస్కృతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పరమార్థ సౌలభ్య బోధనా సంపుటి. నిర్వాణమునకు మోక్షము అన్న అర్థమును అన్వైన్చుకోన వచ్చును. అప్పుడు మోక్షము అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిన్చుతుంది. తన అనిర్వచనీయమైన ఆత్మయే పరమాత్మ. ఆతాదాత్మ్యమే శివము. అడికలిగినవాడే శివుడు. ఈ జటిలమైన విషయమును ఎంత సుబోధకముగా కలితుగమున పరమ గురువు, ఆదిగురువు, జగద్ద్గురువాగు శంకరులవారు ఎంత సులభ హ్రాహ్యముగా చెప్పినాడో చూడండి.
మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వాన చ ఘ్రాణనేత్రం
నచార్వ్యోమ భోమిర్నతెజోనవాయుః
చిదానందరూపః శివోహం శివోహం
మనసు,
బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను.పృథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. సచ్చితానందానికి సులభమైన నిర్వచనము ' సత్ అంటే సత్యము – చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.
నచ ప్రాణ సంగో నవి పంచ వాయుః
నవా సప్తధాతుర్నవా పంచ కోశః
నవాక్పాణిపాదౌ నచోపస్థ పాయుః
చిదానందరూపః శివోహం శివోహం
పంచవాయువులు:
ప్రాణ : శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
అపాన : ఊపిరితిత్తులు,
విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
వ్యాన: శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు
సమాన: జీర్ణమవటానికి ఉపయోగపడే వాయువు
ఉప ప్రాణములు:
నాగ : త్రేన్పు గా వచ్చే గాలి
కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి
కృకల : తుమ్ము
నంజయ: హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
దేవదత్తము : ఆవులింత లోని గాలి
ఈ ఐదు వాయువులు,ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము. ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.
సప్త ధాతువులు: రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు (రక్తము, మాంసము, మేధ, అస్తి,
కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మిగతావి ఆయుర్వేదపరముగా ఈ విధముగా విశ్లేశిన్చుకోనవచ్చును.
మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు,
దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. పూర్వము 'నీ తస్సదీయ'
అనేమాట సాధారణంగానూ సినిమాలలోనూ (రేలంగి వాడినట్లు గుర్తు) వాడేవారు. 'తస్స'
అంటే ఈ 'మజ్జ'యే. రసము అనగా మిక్కిలి పలుచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును. మేధస్సు అన్న మాటకు బుద్ధి, అసాధారణ ధారణా మొదలగు అర్థములు మనకు తెలిసినవే! ఆయుర్వదపరముగా సప్త దాతువులలోని మేధకు అర్థము ఈ విధముగా ఉన్నది ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . ఆయుర్వేదము ప్రకారము అస్థి మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధా
తువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . శక్రము అనగా
తెల్లనిది. దీనినే శుక్రము అని కూడా అంటారు. ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును .
పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు- కాళ్ళు,ఉపస్థ-అనగా, జననేంద్రియము, పాయువు-గుదము, ఉపస్థాపాయువు(గుదము)లు అంటే పురీష శౌచ ద్వారములు. నేను, పైన తెలిపినవేవీ కాను. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.
రేపు మరి రెండు శ్లోకములథిఒ.....
నపుణ్యం నపాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో నతీర్థం నవేదా నయజ్ఞ్యాః
అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా
చిదానందరూప శ్శివోహం శ్శివోహం
నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఃఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ ,భోజనమునుగానీ,బుజించేవాడినిగానీ కాదు. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. చిట్ అన్న మాటకు నేను జ్ఞానము అన్న మాతకనా ప్రజ్ఞానము అన్న అన్వర్తమును చెప్పుకొంటాను.ఆ ‘చిత్’ అన్న పదమునకు రూపమునిస్తే ఆ రూపమే శివుడు. ఈ ఆరు శ్లోకముల సారమును గ్రహించి తదనుగుణముగా
ఎంత త్వరగా శివోన్ముఖులమైతే నిర్వాణమును అంత త్వరగా చేరువౌటాము. అసలు జనన మరణ రాహిత్యమే కదా నిర్వాణము.
నమేద్వేష రాగౌ నమేలోభ మోహౌ
మదోనైవ మేనైవ మాత్సర్యభావః
నధర్మోనచార్థోనాకామోనమోక్షాః
చిదానంద రూపం శివోహం శివోహం
నాకు రాగ ద్వేషములు లేవు.లోభమోహములు లేవు. మదమాత్సర్యములు లేవు.ధర్మార్థకామ మోక్షాలు లేవు. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. నేను శివుడను
అనగా నేనే చైతన్యము. ఆనంద స్వభావము యొక్క సర్వోన్నతమైన ఐశ్వర్యాన్ని. నేనే శివుడను అనగా ఐశ్వర్యవంతుడను. నిజానికి ఐశ్వర్యము అన్న మాటను నేటి వాడుక భాషలో సిరి అనగా ధాన్యధనకనకవస్తువాహనసస్యకేదారాలకు
వాడుతారు. ఐ సరికాదు. ఈ జగత్తున నిండియున్న సకల చరాహర సంపత్తియంతా ఐశ్వర్యమే! అసలు
ఐశ్వర్యమంటే ఈశ్వరీయమే! దానికి అధిపతే ఈశ్వరుడు లేక శివుడు.
రేపు చివరి రెండు శ్లోకములు.......
నమృత్యుర్నశంకానమే జాతిభేదః
పితానైవమేనైవ మాతానజన్మాః
నబంధుర్నమిత్రంగురుర్నైవశిష్యః
చిదానంద రూపం శివోహం శివోహం
మృత్యువు,భయము లేక సందిగ్ధత,జాతిరీతులు,తల్లిదండ్రులు,అసలు జన్మమే, బంధువులు మిత్రులు,గురువు,శిష్యులు ఏమీ లేవు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.
మరి నేనెవరు ?
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
నవాబంధనం నైవ ముక్తిర్నబంధః
చిదానంద రూపం శివోహం శివోహం
వికల్పము : మతి భ్రమ,
ఉల్లంఘనం జ్ఞాపకశక్తి,
ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి
అస్తవ్యస్తం, తారుమారు.
నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు.నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని).నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు.నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.
ఆత్మ ను గూర్చి ఇంత వివవరంగా విశదంగా విపులంగా విలేవారీగా విజ్ఞతతో అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన ఆది శంకరులకు అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తుడను.
భావము నందు దోషమును భాషన గల్గిన నాదులోటులున్
కేవలమంచునెంచి బహు కూరిమి తోడ పఠించి ప్రేమతో
దీవనలిచ్చుచున్ నిగుల దివ్యము భవ్యము దీప్తివంతమై
జీవితధన్యతన్ గలుగ జేయు మహాత్ముల నాలకించుడీ
అజ్ఞానాత్ విస్మ్రుతే భ్రాంత్యా
యన్యూనమధికం కృతం
తత్సర్వం క్షమ్యతాం దేవ
పరమేశ్వర నమోస్తుతే
స్వస్తి.
Very good information on vitals of the body and the renunciation of the material world
ReplyDelete