Sunday, 21 August 2022


ముప్పై మూడు కోటి దేవతలు

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post_21.html

ఈ సనాతన ధర్మమూ వేద చోదితమైనది. వేదము శాస్త్ర యుక్తము. శాసించునది శాస్త్రము. కావున వేద ప్రతిపాదితమైన ఏవిషయమైనా మనకు శిరౌధార్యము.  కొన్ని వేద ప్రతిపాదిత సూత్రములకు, లేక వాక్యములకు, లేక శ్లోకములకు ఎన్నో అర్థాంతరములు ఉంటాయి. సంస్కృత మరియు వేద పండితులు మాత్రమే అట్టి విషయములను విశదీకరించగలరు. మిడిమిడి జ్ఞానముతో ఆ విషయముల అర్థమును గ్రహించుట అనర్థము. అటు వేదమునకు ఇటు వైదిక ధర్మమునకు అపహాస్యమును ఆపాదించినవారమౌతాము.  ఆవిధముగా సనాతన ధర్మం పట్ల ప్రజలకు సందేహము కలిగించిన వారమౌతాము. నేను కూడా పెద్దలవద్ద నా యౌవ్వనదశలో తెలుసుకొన్నది మీ ముందు ఉంచుచున్నాను.

మనము ఈ సమస్యను చాలా క్లుప్తంగా పరిశీలిస్తాము. నేను Stephen Knapp గారి నుండి కొన్ని ఆలోచనలను తీసుకున్నాను.

నాలుగు వేదములూ మన అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు ప్రతీకలు.

సనాతన ధర్మ పథ చారులుగా మనము ఈ సామాజిక వ్యవస్థను ఏర్పరచుకొన్నాము. సాంసారిక జీవనములో కొన్ని భౌతికమైన ఆవసరాలు కోరికలు, కొన్ని చిన్నచిన్న ఆశలు తీర్చుకొనవలసి వస్తుంది. అవి పరిమితముగా ఉంటే వ్యక్తి ధర్మ పథము పై నడువగలడు. అసలు ఆ కోరికలలో కూడా  కొన్ని దైవానుగ్రహముము చేతనే తీరగలవు. భౌతిక వాంఛల సాఫల్యము సంతృప్తిని ప్రోత్సహిస్తుంది.

దేవుడు ఒకడే అన్నది వేద వాక్యము. ఒక రాజుకు మంత్రి సామంత దండనాథులున్నట్లు

వేరు వేరు దేవతలకు వేరు వేరు బాధ్యతలు అప్పగించాబడియుంటాయి. ఉదాహరణకు అంబిక శక్తికి, లక్ష్మి సంపాదకు, వాణి సకల విద్యలకు, ఇంద్రుడు వర్షమునకు కుబేరుడు ధనమునకు, ఈ విధముగా ప్రతినిధిత్వమును కలిగియుంటారు. ఆయా దేవతల పూజ భక్తుల ఆశయ సిద్ధికి దోహదము చేస్తాయి. అంతే కాకుండా గ్రామదేవతలు ఉంటారు. వారు సర్వ కామితార్థ ప్రదాతలు. వారికి వేద మంత్రములకన్నా చిత్తశుద్ధి కల్గిన మూఢభక్తి ఉంటె చాలును.

ఒక కార్యాలయముతో పైన తెలిపిన  ఈ విధానము పోల్చుటకు చక్కగా సరిపోతుంది కదా! కార్యాలయములో అడుగుపెట్టినవాడు తన పని నెరవేర్చుకొనుటకు చప్రాసీ తో మొదలుపెట్టి చివరకు అత్యున్నతాధికారిని చేరుతాడు. ఇదీ అంతే! ఈ సనాతన ధర్మపరులు అనేక దేవతల పూజించుటకు కారణమిదే! ఎందఱో ఋషులు మునులు రాజులు రాకాసులు తమ అబీప్సిత సిద్ధి కొరకు ఒకదేవత కొరకు తపమాచరించి, ఆదేవత ప్రత్యక్షమై వేరొక దేవత ఆగ్రహము పొందవలెనని సూచించితే అట్లు ఆ భక్తుడు చేసి తన మనోభీష్టమును సిద్ధింపజేసుకొనుట మనకు తెలిసిన విషయమే!

ఇక్కడ మరొక విషయము చెప్పవలసి ఉంది. మనము శివ లేక విష్ణువిగ్రహములు వేరువేరు క్షేత్రనులలో వేరు వేరు రూపములలో కలిగియున్నాము. పురాతన దేవాలయములలో ప్రతిష్ఠిప బడిన విగ్రహములలో కొన్ని స్వయభువములు. కొన్ని దేవతలు, దైవజ్ఞులగు మహర్షులు ఆగమశాస్త్ర విధానముతో ప్రతిష్ఠింప బడినవి ఉన్నాయి. అందుచే అవి అలౌకిక మహత్తును కలిగియుంటాయి. అవి కూడా భక్తాభీష్టములను నేరవేర్చుతాయి. ఈ మూర్తి పూజ యొక్క సౌలభ్యము ఏమిటంటే దేవుని ఎప్పుడైనా ఎక్కడయినా చిత్తశుద్ధితో పూజించుకొనవచ్చును. ఏ ధర్మము లేక మతము నందు కూడా ఈ సౌలభ్యము కనిపించదు.

ఇప్పుడు ౩౩ కోటి దేవతలు అన్న మాటకు సంగ్రహమగు అర్థమును ప్రతిపాదించే ప్రయత్నము చేద్దాము. కోటి అన్న మాటకు అర్థమును శబ్ద కోశమున పరిశీలించితే ‘100 లక్షలు,అంచు, సమూహము అన్న అర్థములు కనిపిస్తాయి. అసలు కోటిగాడు అంటే కాపలాదారుడు అనికూడా అర్థము ఉన్నది.

 కోటి అన్న మాటను ‘వర్గము’ సమూహమునకు ప్రతీకగా బంధుకోటి, జీవకోటి కి  వాడుతాము. ఉచ్ఛకోటి అంటే ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థము.

 వేదపురాణములు తెలుపునవి త్రయత్రింశతి కోటి (33 కోటి ) దేవతలు అంటే ముప్పది ముగ్గురు దేవతల సమూహము అని అర్థము. సంస్కృతమున సంఖ్యా ముందు సంఖ్యా వాచకమున ఏకవచన ప్రయోగము కద్దు. యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను తెలియజేయుట జరిగినది.

హిందూ గ్రంధములేకాదు  బౌద్ధ, పార్శీ మొదలైన గ్రంధములలో కూడా ఈ  33 దేవతావర్గముల ప్రసక్తియున్నది. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు ఈ విషయప్రస్తావన ఉన్నది.

ఇపుడు ఈ 33 గురు దేవతల పేర్లను వారు ఏఏ సమూహములకు చెందినవారో చూద్దాము.

ఆ వర్గములు:- వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి (బ్రహ్మ) అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది. కొందరు ఇద్ర బ్రాహ్మలకు బదులుగా అశ్వినీ దేవతలను కలుపుతారు. అపుడు ప్రముఖులగు బ్రహ్మేంద్రులను విడువ వలసి వస్తుంది. నిజానికి వారు ప్రధాన దేవతలు కదా!

 వసువులకు ప్రాతినిధ్యము విష్ణువు వహించితే రుద్రులకు శివుడు ప్రాతినిధ్యము వహించుతాడు. అట్లే ఆదిత్యులకు సూర్యుడు. అంటే ఈ 33 మంది 3+2=5 మంది అగుచున్నారు. 

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే l

శివష్య హృదయం విష్ణుః విశ్నిశ్చ హృదయం శివంll

కావున ఇద్దరూ ఒకటయితే  మనకు నిజానికి 1+2 అనగా హరిహర బ్రహ్మ ఇంద్ర అన్న ముగ్గురు దేవతలౌతారు. దేవాధిపతి ఇంద్రుడు. అతని ఆవాసము స్వర్గము. పుణ్యాత్ములు వారి పుణ్య ఫలము తీరేవరకూ స్వర్గ వాసము చేస్తారు. ఆయనకు ఊర్ధ్వ లోకము బ్రహ్మ విష్ణు మహేశ్వరులది.ఈ ముగ్గురి ప్రతిరూపమే పరబ్రహ్మము. ఆయనే విశ్వాత్మ, పరమాత్మ. అంటే దేవుడు ఒక్కడే! వర్గీకరణ అంతా భక్తజన సౌలభ్యము కొరకే!

ఇపుడు ద్వాదశాదిత్యులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ఎవరెవరో చూదాము.

ద్వాదశాదిత్యులు :-  1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణువు 7. భగ

8. వరుణ  \9. సవిత 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.

ఏకాదశ రుద్రులు :- 1. మన్యు  2.  మను  3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ

7. ఉగ్రరేతా, 8 . భవ 9. కాల 10. వామదేవ 11. ధృతవృత. 

అష్టవసువులు :- 1. ధరా 2. పావక 3. అనిల 4. ఆప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8.  ధృవ.

మిగిలిన ఇరువురు :- 1. ఇంద్ర,  2. ప్రజాపతి.

 వీరే త్రయత్రింశతి 33 కోటి దేవతలు.

మిగిలినది మరొకమారు.........

దైవము అంటే దివ్యత్వము కలిగిన వాడని అర్థము. అంటే ఆయనకు మనలాగ భౌతికముగా కనిపించే రూపాలు వుండవు. అయన దివ్యశక్తి సంపన్నుడు. ఈ చరాచర జీవ వస్తు సముదాయమునకు సృష్టికర్త ఆయనే! ఆ శక్తుల మూలమున సృష్టిలోని సమస్తాన్ని రక్షించుటయే కాదు తనలో లీనము

చేసుకొనుట కూడా ఆయన కర్తవ్యమే! అదేకదా పోతన తన ఆంధ్రభాగవతములో ఈ విధముగా తెలిపినాడు:

ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మబూని అర్చి భజింతున్

సృష్టికాలమున సమస్త లోకములను దర్పణ ప్రతిబింబితము లైనటులు వెలికి జూపి ప్రళయకాల మందు తన లోనికి  లయము చేసుకొనుచు ఉభయము దానై, సకలవిషయములకు సాక్షియై, శుద్ధసత్వస్వరూపుడై, ఆత్మ స్వరూపుడగు ఆ పరమాత్ముని ధ్యానించెదను.

ఇందుగల గూఢార్థమును ఒకపరి పరికింతము.  ఒకపరిజగముల వెలినిడి అనగా "ముఖాభాసకోదర్పణేదృశ్యమానో ఖత్వాత్ప్రుధక్త్వే నైవాస్తివస్తుణతాదర్పణ" ప్రతిబింబము, తన ముఖముకంటె వేరువస్తువు కానటుల, “యథాదర్పణాభావ, ఆభాసహానౌ ముఖం విద్యతే కల్పనా హీనమేకం" దర్పణము పాయినచో ఆ అభాసము ఏవిధముగా మనకు కానరాదో, అదేవిధముగా భావాభావముభయము దానే యగుచున్నాడో, అట్టి సర్వసాక్షి "మనసః సాక్షీ బుద్థేః సాక్షీ - ప్రాణస్యద్రష్టాతమసోద్రష్టా" అను శ్రుతి ప్రకారము సూర్యునివలె సర్వసాక్షి యగుచున్నాడో ఆ పరమాత్మ ఏ జగత్ సృష్టి కర్త భర్త, హర్త. అది ఆయన కర్తవ్యము.

సరస్వతీ దేవి వాక్కునకు అధిష్ఠాన దేవతయై సమస్త వాఙ్మయమును రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి, శక్తికి రక్షణకు అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరిని అధిష్ఠాన దేవతలుగా తనను తాను విభజించుకొని మనకు ఆరాధనా సౌలభ్యమును ఏర్పరచినాడు ఆ ప్రత్యగాత్మ.  ఈఆరాధనా విధానమునే సనాతన ధర్మము మనకు నిర్దేశించినది. నిజానికివి వేరు రూపాలు కాదు. ఆవిధముగా ఏర్పరచి మనకు అనుష్ఠాన

ప్రదాన దేవతలుగా ఏర్పరచి సాధనా సౌలభ్యము కలిగించినారు. వేదాలు మనకు దేవతలు, ఊహాజనిత లేదా పౌరాణిక రూపములు కాదు. సార్వత్రిక వ్యవహారాల యొక్క వివిధ అంశాలను నిర్వహించే పరమ సంకల్పశీలురు వారు. వారు ప్రకృతి యొక్క వివిధ శక్తులను మనకు ఆరాధింప  సూచించుటయే కాక  వానిని నియంత్రిస్తారు. అందువల్ల, అవి మన ఉనికి యొక్క భౌతిక, సూక్ష్మ లేదా మానసిక స్థాయిలలో లోపల మరియు వెలుపల కనిపిస్తాయి. ఈ విధంగా, ఒక అతీంద్రియుడు ప్రతి అంశం వెనుక ఉన్న దానిని చూస్తాడు

ఈ దేవతల పేర్లు వారి నెలవు లేదా మన సౌలభ్యము కొరకు కార్యాలయము అనుకొందాము, దానికి అధిదేవత ను ఆపేరుతో పిలుస్తాము. ఉదాహరన్స్కు చంద్రుడు,. చంద్రుడు చంద్రలోకమునకు అధిదేవత అంతేకానీ మనకు కనిపించే చంద్రగ్రహము చంద్రుడు కాదు. ఒక దేశమునకు అధ్యక్షుడు, ప్రధాని (Premiar) ఇతనో అట్లు. ఈ పసవికి కొన్ని అధికారాలు, కొన్ని అనుగ్రహాలు చేతిలో ఉంటాయి. ఆయా ఈప్సిత సిద్ధులకు ఆయా దేవతలను పూజించుట జరుగుతుంది. ఒక కార్యాలయమును తీసుకోనా అంతే కదా! అన్నే ప్రధాన అధికారే చేయదు కదా!

కావున అవసరానుకూలముగా ఈ అధిదేవతా విభజన జరిగి వారివారి కి ప్రసాదించిన శక్తులను భక్తులకు ఉపయోగించుచుంటారు. వారు సార్వత్రిక వ్యవహారాల యొక్క వివిధ అంశాలను నిర్వహించే పరమ సంకల్పం యొక్క ప్రతినిధులు. వారు ప్రకృతి యొక్క వివిధ శక్తులను కూడా సూచిస్తారు మరియు నియంత్రిస్తారు. అందువల్ల, అవి మన ఉనికి యొక్క భౌతిక, సూక్ష్మ లేదా మానసిక స్థాయిలలో లోపల మరియు వెలుపల కనిపిస్తాయి. ఈ విధంగా, ఒక అతీంద్రియుడు ప్రతి అంశము వెనుక ఉన్న దానిని చూస్తాడు

మరొక ఉదాహరణ ఏమిటంటే, మీరు ఒక పెద్ద కర్మాగారంలోకి వెళ్లినప్పుడు, మీరు చాలా మంది కార్మికులు మరియు వారు చేస్తున్నదంతా చూస్తారు. ఫ్యాక్టరీలో ఏం జరిగినా ఈ కార్మికులే కారణమని మీరు మొదట్లో అనుకోవచ్చు. అయితే, కార్మికుల కంటే ఫోర్‌మెన్, మేనేజర్లు, ఆపై ఎగ్జిక్యూటివ్‌లు చాలా ముఖ్యమైన కార్య నిర్వాహక బృందము. వీరిలో మీరు వివిధ స్థాయిలలో అధికారము ఉన్న వ్యక్తులను కనుగొంటారు. ఉత్పత్తుల రూపకల్పనకు ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. మరొకరు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లేదా ప్రధాన అకౌంటెంట్ కావచ్చు. మరొకరు సిబ్బందికి బాధ్యత వహించవచ్చు, మరొకరు నిర్వహణ బాధ్యతను కలిగి ఉండవచ్చు.

మిగిలినది ఇంకొకసారి.........

No comments:

Post a Comment