తు చ
తప్పకుండా ...
https://cherukuramamohanrao.blogspot.com/2022/12/blog-post_11.html
రాజవత్ , తాడవత్ ,ప్రాప్తేతు,.....
ధర్మేచ, అర్థేచ, కామేచ
...
పై సంస్కృత
పదాలలోని చివరి అక్షరాలు తు తో కానీ చ తో కానీ అంతమవుతున్నాయి. సంస్కృత శ్లోకాలలో
ఈ రెండు అక్షరాల ఉపయోగము ఎక్కువ .ఈ అక్షరాలను ముఖ్యంగా శ్లోక పూరణమునకు వాడుతారు.
అచ్చు
యంత్రములు లేని కాలములో, చెప్పినది చెప్పినట్లుగా, ఒక తాళ పత్ర గ్రంథమునుండి చూసి వేరొకటి, ఉన్నది
ఉన్నట్లుగా వ్రాసేవారు కావున, ఈ తు,చ,లు ఎక్కువగా వచ్చేవి
కావున ఈ తు,చ తప్పకుండ అనే మాట మన నుడి లోనికి వచ్చినది .
అంటే ఏది వదలకుండా అంతా ఎత్తివ్రాయుటకు, విన్నది విన్నట్లుగా,
ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటకు ఇది వాడుతారు .
స్వస్తి.
No comments:
Post a Comment