వినాశ కాలే
విపరీత బుద్ధి
https://cherukuramamohanrao.blogspot.com/2022/12/blog-post_14.html
పైన తెలిపిన ఈ
మాటను పదే పదే వింటూ ఉంటాము. కానీ ఈ అర్ధపాదము యొక్క పూర్తి పాఠము మనలో చాలామందికి
తెలియకపోవచ్చును. రామాయణములో ఈ మాటను అరణ్య కాండలో వాల్మీకి తన అభిప్రాయముగా రామానుజుడగు
లక్ష్మణునితో చెప్పించుతాడు.
न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरज्ञ्गः न कदापि दृष्टः ।
तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीत बुद्धिः ।।
తథాపి తృష్ణా
రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః ॥
న భూత పూర్వం =
ఇంతకు మునుపెన్నడూ జరగలేదు, న కదా అపి వార్తా
= ఎప్పుడూ కూడా వినలేదు, హేమ్నః = బంగారపు, కురఙ్గః = లేడి, న కదా అపి దృష్టః
= ఎప్పుడూ కూడా చూడ లేదు,
తథా అపి =
అయినప్పటికీ, తృష్ణా =
కోరికచేత, రఘునన్దనస్య =
రఘునందనుడికి – రాముడికి, వినాశకాలే =
వినాశన కాలమందు, విపరీత బుద్ధిః =
విపరీతమైన ఆలోచన పుట్టింది,
ప్రత్యామ్నాయ
శ్లోకం, అదే అర్థముతో
न निर्मितः केन न दृष्टपूर्वः न श्रूयते हेममयः कुरङ्गः ।
तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः
న నిర్మితః కేన న
దృష్టపూర్వః న శ్రూయతే హేమమయః కురంగః ।
తథాపి తృష్ణా
రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః ॥
బంగారు లేడి
ఇంతకు మునుపెన్నడూ లేదు, ఎప్పుడూ కూడా
వినలేదు, ఎప్పుడూ చూడను
కూడా లేదు. అయినప్పటికీ దానిని పొందాలనే కాంక్ష, భార్య
అడిగినదానిని తీసుకొచ్చి ఇవ్వాలనే తపన, ఆమెని సంతృప్తి
పరచాలనే కోరిక, శ్రీ రామచంద్రుని
అంతటి వానిని, రాజ్యాధికారాన్ని
చేపట్టి ఉండి ఉండవలసిన వ్యక్తిని, వశిష్ఠ
విశ్వామిత్రుల వంటి మహర్షుల వద్ద విద్యనభ్యసించిన వానిని అజ్ఞానాంధకారం చుట్టి
ముట్టి వేసింది. తన స్వాభావికమైన తెలివితేటలని ఉపయోగం లేకుండా చేసింది.
శ్రీ రాముని
అంతటి వానిని, భార్య అడిగిన
దానిని తీసుకు వచ్చి ఇచ్చి ఆమెని సంతృప్తి పరచాలనే కోరిక లేదా ఆశ అనే ఒక్క విషయం
ఆతని విచక్షణని కోల్పోయేట్టుగా చేసింది.
బంగరు లేడి మానసికమగు
సుందర, సుఖద సుమధుర, ఆనంద సంతోషముల ప్రతీక. బంగారు మానవుల ధనసంపదల ప్రతీక.
నిజానికి ధన సంపదల్సయండు సంతోషము మృగ్యము. అందకే కనక మృగము భూమిపై మనకు కనిపించదు.
ఇది సీతా మాతకు
కూడా వర్తించుతుంది. బహుశ సీతా రాములకు రావణుని వినాశమునకే ఈ విపరీత బుద్ధి
కల్గినదేమో! అసలు ఈ వాక్యము వాలికి కూడా అన్వయమౌతుంది. కైకేయికి కూడా
అన్వయమౌతుంది. దశరథుని పోగొట్టుకొన్నది కదా!
అంతటి వారికే
తప్పలేదనే విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో చెప్పిన ఈ శ్లోకంలోని ఈ వాక్యం
వినాశ కాలే విపరీత బుద్ధిః అనేది లోకంలో ఒక నానుడిగా మారింది.
స్వస్తి.
Very illustrative presentation sir. Nobody can rule their fate. One can only follow the destiny and only few shall reach it.
ReplyDelete