Thursday, 6 April 2023


జగద్గురు శంకరాచార్య విరచిత గణేశ రత్న పంచకం 

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_6.html

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని యుండు 

మహానుభావుడు, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే మహనీయుడు

శిరస్సున చంద్రుని ధరించుచు, లోకాన్ని కాపాడే వాడగు, నాయకులకే 

నాయకుడై అసురులను మరియు అన్ని ఆశుభములను నశింప జేసే ఆ 

విఘ్నేశునికి నా నమస్కారములు.

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం

భక్తుల శత్రువులకు భయం కలిగించే వాడగు , అప్పుడే ఉదయిస్తున్న 

సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికిదేవతలు, అసురులచే 

నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే 

దేవునికిసర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల 

గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ

 నా నమస్కారములు.

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి 

కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను 

ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి

శుభముయశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ 

శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి

నా నమస్కారములు.

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషనం ధనంజయాది భూషణం

కపోల దాన వారణం భజే పురాణ వారణం

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన 

వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని 

అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి,

సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా 

ఉన్నవానికి, పురాతనమైన వానికి నా వందనములు.

నితాంతికాంత దంతకాంతిమంతకాంతకాత్మజం

అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం

తమేకదంతమేవతం విచింతయామి సంతతం

ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ 

కారకుడైన శివుని కుమారునికివర్ణనకు, ఊహకు అందని ఆకారము 

కలవానికి, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే

వానికి, వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి 

ఎల్లప్పుడూ నా నమస్కృతులు.

స్వస్తి.

 

 

 

 

 

 

Wednesday, 5 April 2023

గోపాలక పాలక బాలక

 

గోపాలక పాలక బాలక 

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_5.html

పల్లవి: గోపాలక పాలక బాలక శరణం తవ పద్మపాద ద్వయి నిరతం llగోపాలకll

అనుపల్లవి: నిర్మల నిగ్రహ నిశ్చల  గుణ వితతం సతతం llగోపాలకll

చరణము 1.

మధురాధిప మదహారా మనోరమాధర మధుర సుధాపానవరా

మంజు మృదుల మురళీరవ విరళీ మాయుత వినతా సుత రథ సరళీ llగోపాలకll

చరణము 2.

పీతాంబర పీయూష వితరిణీ ప్రీణకారి సుర నికర హితాగ్రణి

వసుదేవసుతం వాసవ వినుతం రసమయ చరితం రాధికాయుతం llగోపాలకll

చరణము 3.

శ్రేయో దీక్షం పాండవ పక్షం కౌరవ శిక్షం మునిజన రక్షం

సురనుత దక్షం దుష్టవిపక్షం రామమోహనాద్యంత కటాక్షం llగోపాలకll

Tuesday, 4 April 2023

ఆహారము – ఆర్యవాక్కు

 

ఆహారము ఆర్యవాక్కు

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post.html

రుచి లేని తిండి తినకుము

శుచి శుభ్రత లేని వంట చూడకు తినగా

విచలింపనీకు మనసును 

పచనము సరిలేనివంట పారణ రామా!

రుచి శుచి శుభ్రత లేనిది ,వుడికీ ఉడకని వంట ఆతురతతో భోజనము చేసి ఆరోగ్యమును పాడు చేసుకోవద్దు.జీవరాసులలో తినుటలో చపలత చూపేది మానవుడు మాత్రమే! మిగత ప్రాణులకు అది కానరాదు. మనకు కడుపు నిండినా కూడా ఏ కారాబూందియో వేయించిన వేరుసేనగపప్పో  మరేదో మరేదో నోట వేసుకొనే ఆతురత చూపుతారు. మన భోజనమును గూర్చి, దాని విధానమును గూర్చి ఋగ్వేద యజుర్వేదములలోని అన్న సూక్తములో చెప్పబడినాయి. ఎక్కడేమి చెప్పినా అన్నము పరబ్రహ్మ స్వరూపమనియే చెప్పినారు. మానవునికి తినుటకు యోగ్యమైన ప్రతి పదార్థమూ అన్నమే! అన్నము వండినవాడు వడ్డించినవాడు తినువాడు అందరూ బ్రహ్మ స్వరూపులే. ‘అందుకే అన్నం బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ...’ అంటారు సముచిత సందర్భాలలో! అన్నానికి శుచి శుభ్రత అత్యంత అవసరమని చెబుతున్నవి వేదములు. పదే పదే అదే అదే చెబుతున్నది వేదము. ఆ అది ఏమిటం టే ‘హితము-మితము. ఈ శాస్త్ర వచనమును గమనించండి.

గృహములో తల్లి లీక ఇల్లాలు చేసే వంటలో ఆయా పదార్థములలో వేసే వస్తువులుగాక అందులో ఒక అవ్యాజమైన అభిమానము కలిసిఉంటుంది. బయటి తిండ్లలో ఆ అవకాశము ఉండదు. పెద్ద పెద్ద brands మనకు అమ్మే Pockets లో ఉన్న మూలకములు (Ingradients) మంచివి వేస్తూఉన్నారో లేదో మనకు తెలియదు. ఇటీవల నేను విన్న విషయము ఒకటి మీకు తెలియజేస్తాను. ఒక ప్రముఖ Ice cream Company తాము తయారుచేసే Ice cream లో ఆలివ్ నూనె పిట్టు అనగా Extract పాలకు బదులుగా వాడుచున్నారని తెలిపినారు . మరి అటువంటి Ice cream కు అర్రులుసాచుట ఆరోగ్యమునకు ఆటంకము కాదా! పిజ్జా బర్గర్లలో వేసే ప్రతి మూలకము మనకు తెలిసే అవకాశము లేదుకదా! ‘ఆరోగ్యము మహాభాభాగ్యము’ అన్నది మన అతి ప్రాచీనమైన మన నానుడి. అనారోగ్యము అన్నీ పనులకూ అవరోధమే! మనకు కావలసిన రుచి మన ఇంట్లోనే దొరుకుతుంది, పెద్ద పెద్ద హోటళ్లలో కాదు. వంట చేతకాని నేటి కొంతమంది యువత నేర్చుకొనియైనాసరే తంటా లేని ఇంటి వంటకు అలవాటు పడితే ఆరోగ్యము ఘంటా పథమై ఉంటుంది. 

హితమైన తిండిలో ఆరోగ్యము ఉన్నదని మితము మీరీ తినకూడదు. పిల్లగాలిలో ఉన్న హాయి పెనుగాలిలో ఉండదు కదా! అందుకే పెద్దలు మనము అంచనావేయలేని కాలములోనే ఈ విధముగా చెప్పినారు.

హితం మితంచ భుంజీతా న భుంజీతాzమితం హితం l 

హితమిష్టంచ భుంజీతే ఏష ధర్మః సనాతనఃll

మిష కొరకు వెదుకబోవకు 

విషాసాదృశ వంటకముల విదడువుము తినకన్ 

ఋషి వాక్యములను మరువకు 

భీషకును తలపొయ్యకుండ భేషుగ బ్రతుకన్ 

హితమయిన ఆహారమును గుర్తించుట. ఏవిధముగా గుర్తించవలెనన్నది అనూచానముగా మనపూర్వులు చేయుచున్న వంటలు వంటకాలు శుచి శుభ్రత కలిగియుంటాయి. అసలు వానిలో ఒక అవ్యాజమైన ప్రేమ, మమకారము కలిసి ఉంటాయి. అందుకే హితమైనది ఇష్టాపూర్వకముగా అవసరమునకు మించకుండా ‘ఇక దొరకదేమో’ అన్నట్లు తినకూడదు అంటున్నది మన సనాతన ధర్మము.

ఇక ఈ విషయమును గమనించండి

భుక్త్వా శతపదం గచ్ఛేత్ క్షణైః స్తేనతు జాయతే

అన్నసంఘాత శైథిల్యం గ్రీవాజాను కటీ సుఖంl

భుక్తోప విషత స్తుందం శయానస్తుతు పుష్టకాః

ఆయుశ్చంక్రమమాణస్యమృత్యర్ధావతి ధావతఃll

భోజనము చేసిన తరువాత ఇంట్లోనే వంద అడుగులు వేస్తే తిన్న ఆహారము వంట పడుతుంది. మెడనడుము మోకాళ్ళకు ఈ విధముగా చేయుటవల్ల మెడ మోకాళ్ళు నడుమునకు స్వస్థత సమకూరుతుంది. తాను కదలకుండా కూర్చుంటే పొట్ట పెరుగుతుంది. తింటూనే పండుకొంటే కొవ్వు పెరుగుతుంది.  మెల్లగా అటు ఇటు తిరిగితే చురుకు గావుంటారు. అన్నముతిన్న తరువాత పరిగెత్తినా, పరిగెత్తినట్లు నడచినా ఆయుక్షీణమే!

ధీయోయోనః ప్రచోదయాత్.

అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృతీవ్రమయ అమృతం గమయ

ఓం శాంతి శాంతి శాంతిః 

స్వస్తి.