Monday, 18 April 2022

కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

 కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష 

https://cherukuramamohanrao.blogspot.com/2022/04/blog-post.html

కేకయాత్మజ తాను కేకల కెరజేయ

తాంతుడై వనికంపె దశరథుండు 

రాక రాక నడుమ రామ చంద్రుడ నిన్ను

పదునాల్గు ముగియగా బడసి నట్టి

క్రూర రాక్షస హంత, కుంఠనము విడదీసి

గూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

నానామునీన మాన నమన మనమున

నీనామ మననము నేను మాన

హీర హార విహార హే హేయ హార

వైరివీరాళి సంహార  వాసవేశ  

శ్రావ్య యశ సూర్య వైహాళి  సారసార

సూరి సారస సుర సేవ్య శూర వర్య                                                                                                                                                                                                  భావము: 

కైకేయి అలకబూని కేకలు వేసి దశరథుని నొప్పించి ఒప్పించ మిక్కిలి కలత  జెందినవాడయిన (తాంతుడు) దశరథుడు అరణ్యమునకు రాముని పంపినాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము నెరపి రావణుని కూల్చి సీతను తోడుకొని రాక రాక వచ్చినాడు రాముడు అయోధ్యకు. ఈ పద్యపాదమునకు తరచి జూచినచో మరొక గోప్యార్థము ప్రకటిత మగుచున్నది. ‘రాక’ అన్న మాటకు పున్నమి అని ఒక అర్థము. రాముడు అయోధ్యలో ఉన్నపుడు అయోధ్యావాసులకు అది పున్నమియే! ఆయన 14 సంవత్సరముల అరణ్యవాస ప్రారంభము వారికి అమావాస్య. అదే 14 సంవత్సరములు ముగించుకొని అయోధ్యకు వచ్చుట వారికి తిరిగీ పున్నమి. ‘రాక’ అన్నమాటకు భూమి పైకి రాక,  అనగా అయోధ్య లో ఆయన పుట్టిపెరిగి పెళ్ళయి సుఖముగా ఉన్నంతవరకు వారికి పున్నమి. ఆయన లేని అయోధ్య వారికి అమావాస్య. 14 సంవత్సరములు ముగియగానే ఆయన సీతాలక్ష్మణ సహితుడై అయోధ్య చేరుట వారికి పౌర్ణిమ. అమావాస్యనుండి పున్నమి బడయుటకు 14 రోజులు. అప్పుడు చంద్రుడు రామచంద్రునిగా అంటే అత్యంత మొహనాకారుడై అగుపించుచున్నాడు. మరి రామచంద్రుడు కూడా 14 వత్సరముల కాలములో సకల రాక్షస సంహారము చేసి , గడువు పూర్తి అయినవెంటనే రెట్టించిన మొహనాకారముతో అయోధ్యావాసులకు అగుపించినాడు. అట్టి శ్రీరామచంద్రుడు మాయందలి అలసత్వమును (కుంఠనమును) ఎడబాపి సద్బుద్ధిని ప్రసాదించమని వేడికోలు. ఎందరెందరో మహా మహా మహర్షులు తమ మనోవానములో నిన్ను ప్రతిష్ఠించుకొని తపమాచారించుకొనుచున్నారు కదా  అట్టి నీవు నా మనసును ఆవహింపగా , మానకుండా నీ నామ మననము చేసుకొను విధి విధానమును నేను మానను  తండ్రీ! ఇందు మూడవ పాదము నందు పదములు కేవలము 'న, మ' అన్న రెండక్షరముల సంయోగము చేత ఏర్పడిన పదములను మాత్రమే ఉపయోగించుట జరిగినది.

పై సీసపద్యమునకు అనుబంధముగా రచింపబడిన తేటగీతికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందు వాడిన పదములలోని అక్షరములు అన్నీ వర్గ రహితములు. అనగా ‘క, చ, ట, త, ప ’ వర్గములకు చెందని ‘య, ర, ల,ళ, వ, శ, ష, స. హ’ లను ఉపయోగించి మాత్రమే వ్రాయుట జరిగినది. ఇక భావమును ఒక పరి పరికింతము.

‘హీర’ అన్న మాటకు వజ్రము, మణి, రవ్వ అని అర్థము. ఒకవ్యక్తి సుగుణ సంపన్నుడయితే అతనిని వజ్రమునకు, మణికి. మనము పోల్చుట కద్దు. అటువంటి సుగుణ మణుల మాలను ధరించి విహరించు, నీచమగు ఆలోచనలను హరించునట్టి, మరియు సన్మతుల విరోధుల ఆట కట్టించు మహనీయుడు మరియు వాసవాదులు అనగా ఇంద్రాది దేవ పూజితుడు, వినుటకు ఎంతయో శ్రావ్యమగు సంభాషణ చేయువాడు,  యశస్సు అను కిరణములను జగద్వ్యాప్తముగా ప్రకటించుచూ విహరించువాడు,  ప్రతిపదార్థ సారమునకు సారమైనవాడు, అగు మహా పండితుడు, సరసమతులగు సకల దేవతలచే సేవింపబడు శూరవర్యుడు శ్రీరాముడు సద్బుద్ధిని ప్రసాదించుగాక!

స్వస్తి.

Tuesday, 22 March 2022

ఆర్య-ద్రావిడసమస్య

 

ఆర్య-ద్రావిడసమస్య

 https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_22.html

అనేకయుగాలుగా భారతీయులకు ఇలాంటి సమస్యయే లేదు. ఆర్య ద్రావిడ రెండూ 

సంస్కృతపదాలే. ఆర్య అంటే శ్రేష్ఠుడు,పూజ్యుడు,మాన్యుడు,ఉదారచరితుడు

శాంతచిత్తుడు (శబ్ద కల్పద్రుమం) ద్రవిడ (ద్రావిడ)అంటే దక్షిణ భారతం. కారణము అది 

మూడువైపులా నీటిచే (ద్రవముచే) ఆవరించబడియున్నది. అందుచే ఆ ప్రాంత 

నివాసులను ద్రావిడులు అనవచ్చును. ద్రావిడ శబ్దమునకు తమిళులకు ఎటువంటి 

స్వామ్యమూ లేదు. స్కాందపురాణము ప్రకారము పంచ ద్రావిడులు అంటే 

గుజరాత,మరాఠా, కర్ణాట, తమిళ, ఆంధ్ర దేశములకు చెందిన వారు. మరి 

ఈప్రాంతములన్నీ పారావార పరివేష్ఠితములే కదా! ఇక అనార్యుడు అంటే 

మర్యాదహీనుడు. దాసుడంటే సేవకుడు. దస్యుడు అన్నది ఋగ్వేద పదము. అర్థం 

అసురుడు. (దస్యోర్హంతా ఇన్ద్రః) . మన చరిత్ర పాఠ్య పుస్తకాలలో, క్రీ.పూ.1500 

ప్రాంతాలలో ఇక్కడకు గుంపులుగా వచ్చిన ఆర్యజాతులు ఆదిభారతీయులైన 

ద్రావిడులను జయించి వారిని అనార్యులు, దాసులు, దస్యులు అనివ్యవహరించి దక్షిణాదికి తరిమివేశారనే కట్టుకథ చదువుతాము. ఈ కపట, కుటిల, అనృతమయ విషయ సృష్టికర్తలు ఆంగ్లేయులు.  కారణము ఉత్తర భారతీయులు కూడా తమవలెనే దోపిడీదారులు అన్న అవాస్తవమును, ఆస్తావము అన్న రంగుటద్దమున జూప చాలా వరకూ కృతకృత్యులైనారు. రాను రానూ ఇది భాషోత్పత్తి శాస్త్ర (philology) సమస్య గా రూపుదిద్దుకొన్నది.

మనకు ఇటలీ వాసులతో ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లుంది. 15 వశతాబ్దములో 

గోవా వచ్చి అక్కడ 5 సంవత్సరాలు నివసించిన ఇటలీ యాత్రికుడు ఫిలిప్పో సాసెట్టి, 

అనేక ఇటాలియన్ మరియు సంస్కృతం భాషా పదాల సారూప్యత చూచి ఆశ్చర్య 

పడినాడు. అదేశతాబ్దంలో హంపీ విజయనగరం దర్శించిన మరొక ఇటలీయాత్రికుడు 

నికోలో కొంటీ తెలుగు వాచ్యభాషను " ప్రాచ్యదేశాల ఇటాలియన్ " (Italian of the East 

అన్నాడని మనంనేటికీ మురిసి పోతున్నాము. అసలు అతను తన ఇటాలియన్ భాషలో 

ఏమన్నాడో మనకు తెలియదు. ఈ ప్రసంగం తరువాత 18వ శతాబ్దంలో కలకత్తాలో 

కంపెనీ న్యాయాధికారి ఐన సర్ విలియం జోన్సు గ్రీకు, లాటిన్, సంస్కృతాల మధ్య నున్న 

సారూప్యతను ఏషియాటిక్ సొసైటి పత్రికలో (1786) ప్రస్తావించినాడు. 

ఆర్యదండయాత్రలు (Aryan Invasion Theory - AIT) అనే కట్టుకథ 200 సంవత్సరాలు 

భారత చరిత్రలో ముఖ్య స్థానం ఆక్రమించడానికి ఇది మూలకారణము. అప్పుడు ఆర్యులు 

భారతదేశముపై దండెత్తి ఉత్తర భారతాన్ని ఆక్రమించియుండినారు. ఇండో-

యూరపియన్ మూలభాషనుండి సంస్కృతము పుట్టినదన్న సందేశమును మన నెత్తిన 

రుద్ది దేశీయభాషలపై స్వారీ చేసి, చేయించినారు. వారి ఉపదేశ సారాంశము ఏమింటే 

అప్పుడు సంస్కృతం ఎంతో, ఇప్పుడు ఆంగ్లమూ అంతే! ఇంగ్లీషే మీకు జ్ఞానాన్ని 

ప్రసాదించేది. భారతదేశానికి జ్ఞానోదయం నాడూనేడూ ఐరోపానుండే రావాలి అన్న 

వారి విషపూరిత భావనను అలవంతముగా మన మెదడు లోఇకి చొప్పించినారు.

బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ (1814 - 1891) తిరునల్వేలి ఎవాంజలిస్టు చర్చి బిషప్. క్రైస్తవ 

మతప్రచారానికి తాను తమిళం నేర్చుకోవడం తప్పనిసరి అని అర్థము చేసుకొన్నాడు. 

ముఖ్యంగా నిమ్నకులాలవారిని క్రైస్తావము లోనికి అట్లు చేసినచో మార్చుట తెలిక అని 

గ్రహించినాడు. కృష్ణరాయల కాలంవరకు "జనని సంస్కృతము సకలభాషలకును" అనే 

అబిప్రాయం ఉండేది. దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు, కన్నడ,మళయాళాలలో అనేక 

సంస్కృతపదాలున్నప్పటికీ, ఇవి సంస్కృతంనుండి ఉద్భవించలేదని, బహుశా సంస్కృతం 

కంటె ప్రాచీనమైనవనీ, స్థానికమైనవనీ ప్రతిపాదించినాడు Uncalled . దక్షణ దేశాన్ని 

సూచించే ద్రవిడ అనే సంస్కృత పదాన్నే ఈ భాషలకు ఉపయోగించాడు. బ్రాహ్మణులు 

ఉత్తరాది వారు. ఆర్యభాషలు ఐరోపానుండి వచ్చినవి. వారు వర్ణ వ్యవస్థను 

ఉపయోగించుకొని మిమ్ములను అణగద్రొక్కుతున్నారు వంటి వాదన అంతర్లీనంగా 

ఆయన పరిశోధనల వెనక ఆంతర్యం.

కాల్డ్‌వెల్ తిరునెల్వేలి జిల్లా లోని నిమ్న-జాతి చానార్ తెగకు  చెందినవారు కేవలం 

తమిళం మాట్లాడేవారు మాత్రమె కాక, "స్వదేశీ ద్రావిడ" ప్రజలుగా, వారిని చిత్రీకరించి 

జాతిపరంగా మరియు  మతపరంగా, వారిని ఉన్నత-కుల అణచివేతదారుల నుండి 

అనగా "బ్రాహ్మణీయ ఆర్యులు"గా పేర్కొన్నాడు. భాషాశాస్త్రం యొక్క పరిధికి వెలుపల 

ఉన్న ఈ విపరీతమైన ఊహాజనిత వాదనలు "స్వదేశీ ద్రావిడులను  బ్రాహ్మణ ఆర్యులు 

అణచివేసినారని నొక్కిచెప్పే చరిత్రను అభివృద్ధి చేసి కృతకృత్యుడైనాడు. . ఏది 

ఏమైనప్పటికీ, కాల్డ్‌వెల్ యొక్క వ్యాకరణం యొక్క మొదటి ప్రకాశనమునకు, చానార్‌లు 

"ధృఢమైన ప్రతిఘటనను చూపించినారు" ఎందుకంటే వారు "బ్రాహ్మణ నాగరికత 

నుండి విడిపడు  ఆలోచనను ఇష్టపడలేదు". పట్టుదల కలిగిన ఆ ఆంగ్లేయుడు ఎట్టకేలకు, కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరికి, కృతకృత్యుడైనాడు.

ఏమయితేనేం భాషా శాస్త్రంతో మొదలైన ఆర్య-ద్రావిడ పదాలు జాతిరంగు 

సంతరించుకున్నాయి.150 సంవత్సరాల దేశరాజకీయాలను ప్రభావితం చేసినాయి. 

ఎక్కడో మధ్య ఆశియా, ఐరోపానుండి వచ్చినవారగు ఆర్యులు, సింధునాగరికత కంటె 

ముందునుండీ ఉన్న ద్రావిడులను వారి సంస్కృతిని ధ్వంసంచేసినారు అనే వాదనలు 

మత ప్రచారానికి, ద్రవిడ వేర్పాటువాదానికి బాగా పనికి వచ్చు విధముగా వాడుకొన్నారు. ఇది శ్రీలంక చరిత్రనుకూడా నేటికీ ప్రభావితము చేస్తూనే ఉన్నది.

 రామాయణంలో రామ రావణ యుద్ధం ఉత్తర దక్షిణ దేశాల సంబంధాలను కొంతవరకు ప్రభావితంచేసినది. అయోధ్యరాజు లంకాధిపతిని ఓడించి లంకలో తన భక్తుని సింహాసనం పై కూర్చోబెట్టడం దాక్షిణాత్యులకు నచ్చలేదు. పెరియార్ రామస్వామినాయకర్ నుండి కరుణానిధి వరకుగల రామునిపైగల విద్వేషపు మూలం ఇదే. కాని అప్పుడు అగస్త్యమహర్షి కాశీ నుండి తెంకాశీకి రావడం, ఆయన తమిళభాషకు చేసిన సేవ, రావణుని వలె శివభక్తిని దక్షణాన ప్రొత్సహించడం ఆద్వేషాని తగ్గించి సాంస్కృతికంగా దేశ ఏకతను ప్రోత్సహించినాయి. రావణునిది వైదిక సాంప్రదాయమే. ఆయన దేవతకూడా! శ్రీచక్రంలో ఆయనను అర్చిస్తారు. నెల్లూరులో రావణునికి గుడి ఉందని విన్నాను. రామరావణ వైరం జన్మాంతర సంబంధము. అంగ్లేయుల ఆలోచనలు వేరు.

For other arguments in this direction, you might also read this thought provoking book by Rajiv Malhotra and Aravindan Neelakandan “Breaking India - Western Interventions in Dravidian and Dalit Fault Lines” (Amaryllis, 2011)”.

స్వస్తి.

Monday, 14 March 2022

విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం)

విశ్వనిర్మాణ శిల్పం (వైదిక విశ్వరూప దర్శనం)

Structure of the Universe (Vedic) - Viswaroopa

By Dr. (MM) K. Sivananda Murty

https://cherukuramamohanrao.blogspot.com/2014/01/structure-of-universe-vedic-viswaroopa.html

సద్గురు శివానందమూర్తిగారిచేత రచింపబడి 20 డిసెంబరు 2013 న వరంగల్లు లో ఆవిష్కరింపబడిన ఈ పుస్తకానికి సమీక్ష వ్రాద్దామని సంకల్పం. మొదలు పెట్టాక అది ఎంతకష్టమో నాకు అవగాహనకు వస్తూంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పుస్తకంపేరు Structure of the Universe. ఒక భౌతిక శాస్త్రవేత్త దృష్టిలో విశ్వమంటే ఏమిటో ఊహించడం కష్టంకాదు. ఆ శీర్షికకు వైదిక, విశ్వరూపాలనే పదాలు జోడిస్తే వచ్చినది గురువుగారి పుస్తకం. ఈ రెండు పదాలు పుస్తకం యొక్క పరిధిని, పరిమాణాన్ని బహుముఖాలుగా విస్తరిస్తాయి. విశ్వరూపమనే పదం శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప దర్శనమును గుర్తుకు తెస్తుంది. ఆయన కురుక్షేత్రంలో అర్జునునికి విశ్వరూపం చూపిస్తాడు. "కాలోస్మి" అని చెబుతూ, జరగబోయే లోక క్షయాన్ని చూపిస్తాడు. మొదట యశోదకు తన నోటిలో "పదునాలుగు భువనములు" చూపిస్తాడు. కౌరవ సభలో రాయబార సమయంలో దుర్యోధనాదులకు చూపిస్తాడు. భారత భాగవతాలలో వర్ణించిన ఈ సంఘటనలు వైదిక వాఙ్మయములోని విశ్వ వర్ణనకు ప్రత్యక్ష నిదర్శనాలు. "విశ్వం విష్ణు" అనే విష్ణునామాలకు వివరణ.

ఆధునిక మానవుడు ఆధునిక విజ్ఞానము సృష్టించిన ప్రపంచములో బ్రతుకు తున్నాడు. కుజ గ్రహం మీద వసతియేర్పరచుకోవలనే ప్రయత్నంలో ఉన్నాడు (మార్స్ వన్ ప్రాజెక్ట్) . గ్రహాంతర వాసులను గురించి కథలు కల్పించి, చలన చిత్రాలు నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడు మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకుండా ఒక్క రోజు బ్రతకలేని స్థితికి వచ్చాడు. వేద పురాణాలలో ఈ విశ్వాన్ని, సృష్టిని గురించి ఉన్న విశేషాలు, నేటి భౌతిక శాస్త్ర పరిశోధనలో తెలిసిన విశ్వ విజ్ఞాన విశేషాలు ఒకే చిత్రము (frame, చట్రము) లో చూపిస్తే ఎలాఉంటుంది? - ఇది ఈ పుస్తకంలో శ్రీ గురువుగారి ప్రయత్నం. మొదట తెలుసుకోవలసినది వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిషము వంటి వేదాంగాలు, శాస్త్రాలు, బ్రహ్మాండాది పురాణాలు విశ్వరచన గురించి ఏమిచెప్పాయనేది. ప్రాచీన ఋషులు వైదిక విజ్ఞానాన్ని ఎలా సంపాదించారు? ఆధునికులు భౌతిక, రసాయన జీవ శాస్త్రాల విజ్ఞానాన్ని ఎలా సంపాదిస్తున్నారు అనేది రెండవ ప్రశ్న. ఈ రెండు విధానాలలో భేదములు ఏమిటి? రెండు మార్గాలూ విభిన్నమైనవి. రెండు మార్గాల్లలో లభించే విజ్ఞానముకూడా భిన్నమైనది. ఈ రెండిటినీ ఎలా సమన్వయము చేసుకోవాలి? మనం ఈ రెండు విధాలయిన సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలి?

ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాలు మన విద్యావిధానంలో అందరూ నేర్చుకుంటూనే ఉన్నారు. దీని వలన వీళ్ళకి వైజ్ఞానిక దృక్పథం అలవడినదా? సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటి? ఈ మాట అమెరికాలో వినబడదు. దీని ప్రచారం నెహ్రూ గారి "డిస్కవరీ ఆఫ్ ఇండియా" నుండి వచ్చినది.

నెహ్రూ ఉవాచ

ఈ ఆధునిక యుగంలో మనకు కావలసినది వైజ్ఞానిక దృక్పథం. ఇదే సైంటిఫిక్ టెంపర్. దీని అర్థం - నూతన విజ్ఞాన సాధనకు, సత్యాన్వేషణకు నిరంతర పరిశ్రమ, ఏ సిద్దాంతాన్నీ పరీక్షకు గురిచేయకుండా అంగీకరించక పోవడం, క్రొత్త ఆధారాలూ, సాక్ష్యాలూ లభిస్తే మన పాత ఊహలను, విశ్వాసాలను సరిదిద్దుకోవడం, ప్రత్యక్షముగా లభించిన యదార్థజ్ఞానాన్ని యదార్థముగా స్వీకరించడం, మేధస్సును, హేతువాదాన్నీ ఉపయోగించడం --- ఇదంతా కేవలం వైజ్ఞానిక విషయాలకే కాదు, జీవితగమనంలో ఎదురయ్యే సమస్యలకు కూడా ఇదే మార్గం.

నెహ్రూగారు చెప్పింది ఒక వైజ్ఞానిక పద్దతి వలెనే కనుపిస్తుంది. కాని అది ఆచరణయోగ్యమూకాదు, ఆమోద యోగ్యమూకాదు, సత్యాన్వేషణకు మార్గమూకాదు, ఆయన అనుకున్నట్లు అది ఆధునికమూకాదు. ఆయన కుమార్తె ఇందిరాగాంధి కాలములో 1976లో జరిగిన 46వ రాజ్యాంగ సవరణ ఈ సైంటిఫిక్ టెంపర్ ను అలవరచుకోవడం భారతపౌరుల విధులలో ఒకటనిచెప్పబడినది. (దీని ఆధారంగా మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాలు అంధ విశ్వాసాల నిర్మూలన చట్టాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇదొక విష వలయం. ఈ పుస్తకముతో ప్రత్యక్ష సంబంధములేనిది.)

నెహ్రూ తర్కం ఎందుకు దోషపూరితం? ఆయన తర్కం ప్రకారం వేద పురాణ విషయాలు అంధ విశ్వాసాలు అవుతాయి. ఒక మహర్షికి తపస్సులో లభించిన అనుభవం, విజ్ఞానం సామాన్యునికి ప్రయోగ శాలలో లభించే, నిరూపించే అవకాశంలేదు. అసలు విషయం ఆయనకు తర్క శాస్త్ర పరిజ్ఞానంలేదు, ఆధునిక విజ్ఞాన విధానాల అవగాహనాలేదు. అనేక తర్కాలున్నాయి. గణితంలో ఉపయోగించే తర్కం (deductive logic), భౌతిక శాస్త్రంలో పనికిరాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది భూమిపైనున్న వారికి ప్రత్యక్ష అనుభవం. భూమి తనచుట్టూ తాను తిరుగుట వలన మనకు సూర్యుడు ఉదయించినట్లు కనబడతాడు అనేది ఎక్కువ సత్యం. సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు? ధనూరాశివైపు వెడుతున్నట్లు అగుపిస్తాడు. నిజానికి వియత్పధం (మిల్కీవే గెలాక్సీ) లోని కృష్ణబిలం (బ్లాక్ హోల్)చుట్టూ సర్పిల (స్పైరల్) ఆకారంలో పరిభ్రమిస్తాడు అనేది ఇంకా సత్యం. ఈ పరిణామం చెందే సత్యాలు inductive, abductive reasoning ద్వారా లభిస్తాయి. విజ్ఞాన శాస్త్ర విషయాలన్నీ తాత్కాలిక సత్యాలు. భారతీయ తర్కం ప్రమాణాలమీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు సైన్స్ లో చెప్పేవే. కాని జ్ఞాన సముపార్జనకు ఇతర ప్రమాణాలున్నాయి. నెహ్రూ, గాంధీ ఇలా అన్నారు అంటే వారి వాక్యాలు ప్రమాణాలు కావు అని చెప్పుకోవాలి. అవి తర్క పరిభాషలో హేత్వాభాసలు (fallacies). వేదంలో వాక్యాన్ని శబ్ద ప్రమాణం అంటారు. అది స్వీకరించని వారు నాస్తికులు. వారితో చర్చ వితండ వాదానికి దారితీస్తుంది.

రచయిత మొదటి అధ్యాయం ఆధునిక విశ్వనిర్మాణ శాస్త్రముతోనే ప్రారంభిస్తారు. విజ్ఞాన శాస్త్రముతో వచ్చే విజ్ఞాన లక్షణాలను పేర్కొంటారు. విజ్ఞాన శాస్త్రముతో లభించే విజ్ఞానము ఎప్పుడూ అసంపూర్ణమే. దీని మూలకారణము సైన్స్ పద్ధతిలోనే ఉన్నది. వైదిక సాహిత్యములో చెప్పబడిన విషయాలు అనేక మహర్షుల తపః ఫలముగా లభించినవి. ఆదినుండీ వారికి తెలిసిన మార్గము తపస్సు, ఏకాగ్రత, ధ్యానము మొదలైనవి. వారికి వారు చెప్పిన విషయాలవలన లభించిన స్వార్థ ప్రయోజనాలు లేవు. అనేకుల తపస్సుల వలన తెలిసిన విశేషాలలో ముఖ్య విషయాల విషయంలో ఏకాభిప్రాయమే ఉన్నది. ఊర్ధ్వలోకాలు మొదలైనవి వారు తమ తపస్సులో దర్శించారు. దీనినే శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు యౌగిక ప్రత్యక్షమన్నారు. వేద పురాణాలలో చెప్పిన విషయాలు పరిశీలించి ప్రయోగాల ద్వారా వానిని నిరూపించడం విజ్ఞాన శాస్త్రజ్ఞులకు ప్రస్తుతం అసాధ్యం. కాని విజ్ఞానశాస్త్రము యొక్క పరిమితులను గ్రహించడం వారికి సాధ్యమే.

నేను చెప్పిన విషయాలపై ఈ పుస్తకం అలోచింపచేస్తుంది. "విజ్ఞాన శాస్త్రం మనుష్యుల సమస్యలకు సమాధానాలు ఇస్తుంది" అనే ఆధునిక భావములోని సత్యాసత్యాలను గుర్తింపచేస్తుంది.

By vvs Sarma

Sunday, 13 March 2022

మరణము-పునర్జన్మ

 

మరణము-పునర్జన్మ

https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_2.html

నిన్నటిరోజు ఒక పాఠకురాలు ఒక సందేహము వేలిబుచ్చినది. ఆత్మ ఒక చొక్కావిడిచి వేరొక చొక్కా తోడుగుకోనేటపుడు ఈ కర్మ కాండ అవసరము లేదుకదా అని. నాకు తెలిసినమేరకు , అందుకు సమాధానముగా ఈ మాట వ్రాస్తూవున్నాను. నాలోని అజ్ఞత ఏదయినా వుంటే మన్నిప వేడ్కోలు.

 అమ్మా ఒక విధముగా చూస్తే మరణానికి మరణానికి మధ్యగల విరామసమయమే జీవితము. చాలాకాలం పాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలము. చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు.

ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాము. చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాము. కానీ అది పొరపాటు. నాలుగువైపులనుండి వచ్చే చైతన్యము ముడుచుకుపోయి మస్తిష్కంలో ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ, మనస్సునూ, బుద్ధిని కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" అది వాయువులో లీనమవుతున్నది కావున  దేనినీ  ఆశ్రయించకుండా కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది .   అటుపిమ్మట దాన్ని నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వుంటుంది. కొందరు పుణ్య పురుషులు మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకమును తమ ఆత్మా చేరుటకు మునుపే చూడగలుగుతారు.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది. మొదటినుండియే ఈ శరీరాన్ని ఒక ఆవరణ కప్పియుంచి వుంటుంది. అది తేజోమయ శరీరము. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరముగా కూడా 'కిర్లియన్ ఫోటోగ్రఫి' లో చూడ వచ్చును.'రేకీ' ని అనుసరించువారు కూడా ఈ 'ఔరా(aura)' ను చూడగలుగుతారు. దానికి  స్థూలశరీరంతో సంబంధము ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి. ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి ఈ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జన్మకు నాకా అదృష్టము లేదు.

లోకాలు క్రిందికి ఏడు పైకి ఏడు ఉన్నాయి. అవి వరుసగా  అతల, వితల, సుతల, తలాతల, రసాతలములని, భూ,భువ,సువ,మహత్, జన, తప,సత్య లోకములు. మన కర్మ ఫలాలు వానికి వేసే దారులుగా పోల్చుకొనవచ్చును.

ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి 'స్థర'లు(పొరలు అని అనుకొందాము)ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళి కూడా కర్మానుసారంగా ఒక్కొక్క స్థరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్థరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడేడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మ పైకి లేవనూ వచ్చు క్రిందకు పడనూ వచ్చు. అందుకే యమ నియమ నిష్ఠల నేర్పరచినారు పెద్దలు. మహర్లోకంలో అనుభవించవలసిన కారణము ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది. వీటికికూడా పైన ఒకలోకం ఉంటుంది.

ఇన్ని అవరోధాలు అధిగమించిన పిదపనే పునర్జన్మ. కావున శ్రాద్ధ కర్మలు అత్యవసరము. మనసున మంచి నింపుకొనుట కూడా అంతే అవసరము.

నేను నాకు తెలిసిన మేరకు విషయమును అతి క్లుప్తముగా చెప్పినాను.

స్వస్తి.

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స

https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_13.html

సంశయం , సందేహం అన్నవి వేరు వేరు ధాతువులు. సంశయం న్యాయ తర్కాలలో పారిభాషిక పదం. ప్రమాణ,ప్రమేయ, సంశయ, దృష్టాంత, సిద్ధాంత... ఇలా పదహారు తత్త్వాలున్నాయి. భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి అని వస్తుంది. భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకము చూడండి.

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః|| 4-40 ||

అజ్ఞాని, శ్రద్ధలేనివాడు, సంశయ చిత్తుడు వినాశమునే పొందును. అట్టివానికి ఇహలోకమందుకాని, పరలోకమందుకాని శాంతిసౌఖ్యములుండవు.

సంశయము అన్నది  ఆత్మ గతము. సందేహము, విచికిత్స అన్నవి మనోబుద్ధులకు సంబంధించినవి. సందేహాత్ముడు ఎన్నటికీ సంశాయాత్ముడు కాలేడు. ఎందుకంటే దేహానికి, ఆత్మకు పొసగదు. సందేహము కలవాడు తన కళ్ళారా చూచి దానిని తీర్చుకొంటాడు. కానీ అతడు సంశాయాత్ముడు కాలేడు. అదే సంశాయాత్ముడు తన తర్కము వల్లనో గురు బోధన వల్లనో నిస్సంశయుడు కాగలడు. నిస్సంశయుడైతే అతను ఆత్మా సాక్షాత్కారానికి అడుగు దూరములో ఉన్నట్లే!

ఆంద్ర భాగవతమున ప్రహ్లాద చరిత్ర ఘట్టమందు ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికి జూచిన అందందే కలడు” నా శ్రీహరి - అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని అజ్ఞానం మనోబుద్ధుల స్థాయిది. హరి ఈ స్తంభంలో ఉంటాడా అన్న ఆయన ప్రశ్న ఆయనకు వచ్చిన సందేహం. ఒక విధముగా ఈ సందేహము ధర్మబద్ధమైనదే! విష్ణువు అనేపదానికి అర్థం తెలియని అజ్ఞానం. అందుచేత ఇక్కడ సందేహమే కానీ, సంశయము, విచికిత్సకు  లేదు.

సందిగ్ధము అన్నది కూడా ఇలాటిదే ఇంకో పదం, Dubious, doubtful, uncertain; as in संदिग्धमति. సందిగ్ధ స్థితి, ఒక విధమగు డోలాయమానము.

విచికిత్స Vicikitsa विचिकित्सा 1 Doubt, hesitation, uncertainty.

सन्देहःइत्य-मरः ॥ (यथा, भागवते३६

तुभ्यं मद्विचिकित्सायामात्मा मे दर्शितोऽवहिः

नालेन सलिले मूलं पुष्करस्य विचिन्वतः ॥”) విష్ణువు నాభీకమలంలో సృష్టింప బడిన బ్రహ్మగారికి తానెవరు? తన కర్తవ్యంఏమిటి? ఈ పద్మము యొక్క మూలమేమిటి? అనే విషయాలపై విచికిత్స ప్రారంభించాడు. అదే తపస్సు. అదే contemplation to resolve doubt.

సంశయము, సందేహము, సందిగ్ధత, విచికిత్స వీని ప్రయోగాలలో ఇన్ని సున్నితమైన వ్యత్యాసాలున్నాయి. దానికి షడంగముల న్యాయ తర్క పారిభాషిక నిర్వచనాలు అవసరమౌతాయి. దీనినే శబ్దబోధ, మీమాంస అంటారు.

స్వస్తి.ధ మీమాంస అంటారు

Friday, 4 March 2022

కాంచీపురం

కాంచీపురం

https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post.html

''పుష్పేషు జాతీ పురుషేషు విష్ణుః నారీషు రంభా నగరేషు కాంచీ'

 అన్నది మహాకవి కాళీ దాసు చెప్పిన మాట. .

కాంచి' అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము. ఈ పట్టణము అతి ప్రాచీనమైనది. 

ఇది వేగావతీ నది యోడ్డున వుంది. చాలాకాలమీ పట్టణము పల్లవుల చోళుల తదనంతరం పాండ్యుల ఆపైన విజయ నగర రాజుల పరిపాలన లో ఉండినది. వారి తరువాత ముస్లిం క్రైస్తవ ప్రభుత ఏలుబడిలోకి పోయింది. ఇంకాంచీపురం

కాంచి అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము. ఈ పట్టణము అతి ప్రాచీనమైనది. ఇది వేగావతీ నది యొడ్డున వుంది. చాలాకాలమీ పట్టణము పల్లవుల చోళుల తదనంతరం పాండ్యుల ఆపైన విజయ నగర రాజులు పరిపాలించినారు . వారి తరువాత ముస్లిం క్రైస్తవ ప్రభుత ఏలుబడిలోకి (788–820)పోయినది. ఇందులో 'ఘటికాస్థానము' లనబడు గురుకులములుండేవి .(ఘటికా స్థానమని ఎందుకంటారు అన్నవిషయాన్ని వేరోకసారి ముచ్చటించు కొందాము).

ఇక్కడ వుండే దేవాలయాలు లెక్కకు మిక్కుటములు. అందుకే 'కంచి లోని గుళ్ళు తిరుపతి లోని గుండ్లు లెక్కించలేమంటారు.' ఒకప్పుడిది జైన బౌద్ధ ధర్మములకు ఆలవాలము. 4 నుండి 9వ శతాబ్దము వరకు ఇది పల్లవుల రాజధాని.

4. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి కాలము క్రీ.పూ.509-477 అని నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ విషయము వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ గలిగిన చాలు. వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను. వారి చేతనే స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది. ఈ పీఠమును వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే దేవునిగా కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప నక్కర లేదు.

కంచి పట్టుకు తుది మెట్టు. ఇప్పటికీ అక్కడి నేతపనివారు (సాలె వారు) చాలామంది తెలుగువారే. ఒకప్పుడు అంతా తెలుగు వారే. ఆరోజుల్లో ఈ నగరము అత్యుత్తమమైనదిగా పేరుగాంచి యుండినది. అందుకే 'నగరేషు కాంచి' అన్నారు కాళీదాస మహాకవి గారు. యువాన్ త్సువాంగ్ అన్న చైనా బౌద్ధ భిక్షువు ఈ పట్టణాన్ని 7వ శతాబ్దములో సందర్శించినపుడు ఇది 6 మైళ్ళ (అంటే ఇంచుమించు 10 కి. మీ.) పరిధి కలిగియుండినదని తన పుస్తకములో వ్రాసుకొన్నాడు. ఇక్కడి ప్రజలు ధైర్యమూ నీతి న్యాయము ధర్మమునకు నిజాయితీకి కట్టుబడిన వాళ్ళని తన పుస్తకములో తెలియబరచినాడు.

చైనాకు బౌద్ధ ధర్మమును గొనిపోవుటయేగాక షావోలిన్ సన్యాసి మఠమున ‘కుంగ్ ఫూ’ 

ను ప్రవేశపెట్టిన బోదిధర్మ ఇక్కడివాడు .

'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతికాపురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్ష 

దాయకాః' అన్న ఈ ఆర్యవాక్కు ననుసరించి ఈ క్షేత్రము (అంటే దేవాలయములు కాక ఈ 

పట్టణ భూమియే) మోక్ష దాయకమయిన 7 క్షేత్రములలో ఒకటి. కంచి రెండు గా 

విభజింప బడినది

వైష్ణవములో ముఖ్యమైన రెండు శాఖలు 1.వడఘలై 2.తేంఘలై . మొదటి తెగకు 

శ్రీరంగము, అహోబిలము రెండవదానికి కాంచీపురము తిరుమల ముఖ్య మఠములు 

కలిగియున్నవి. కంచి లోని తిరుకోయిలూర్ లో వీరి మఠము గలదు.

ఇక్కడి అనేక ముఖ్యమైన ప్రాంతములలో అతిముఖ్యమైనవి నాలుగు.

1. కంచి వరద రాజ పెరుమాళ్ : ఇక్కడ ఈయన ఆది లోనే వెలసినస్వామి. వీరి అతి 

పురాతన దేవాలయము విష్ణుకంచి లో గలదు. ప్రసిద్ధి చెందిన బంగారు,వెండి బల్లులుండేది ఇక్కడే.

విష్ణుకంచి కాంచీపురంలో ఆగ్నేయం వైపు ఉంటుంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి 

వరదరాజస్వామి ఆలయం. అంతేకాక కామాక్షీ మందిరంలో చోరవిష్ణువు అని ఉన్నాడు. 

ఆయన కూడ 108దివ్యక్షేత్రములలో ఒకడు. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని విష్ణుకోటి

పుణ్యకోటి అని పిలుస్తారు. ఇంద్రుడు ఒకానొక శాపానికి గురై ఏనుగు రూపం ధరించి

తపస్సు చేసి శాపవిమోచనం పొందిన చోటు విష్ణుకంచి. ఏనుగు రూపాన్ని ఇక్కడ వదిలి 

దేవతగా మారి వెళ్ళి పోయిన ఆఏనుగు శరీరమే హస్తిగిరి అన్న కొండగా మారింది. 

ఆగిరిపై నారాయణుడు వెలిసినాడు. నరసింహ మంత్ర ఉపాసన చేసినాడు కనుక 

ఇంద్రుని గుండెల్లోనుంచి నరసింహస్వామి వెలికి వచ్చినాడు. అందుకే హస్తిగిరి 

నరసింహస్వామి లోపల ఉంటాడు. పైన వరదరాజస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే 

బ్రహ్మ, మహాయజ్ఞము చేసినాడు. అక్కడ శుక్లుడు, హేముడు అనే వేదవేత్తలైన 

బ్రహ్మచారులుండేవారు. వీరిద్దరూ గౌతమ మహర్షి శిష్యులు. వారుభయులూ ఒకసారి 

గౌతమ మహర్షి ఆజ్ఞమేరకు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళి అభిషేకం కోసం నదీ 

జలాలను కూడా తెచ్చుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒకచోట జలపాత్రను పెట్టి 

ఎండు కట్టెలు ఏరుతున్నారట. వారికి తెలియకుండా ఆచెట్టుమీద ఉన్న బల్లి ఈనీటిలో 

పడిందట. ఆనీటిని చూసి గౌతమమహర్షి మీరిద్దరూ బల్లులుగా పుట్టండి అని 

శపించారట. ఇంద్రుడు హస్తిరూపంలో తొండంతో వీరు ఉన్న కొమ్మని విరిచాడు. 

వీరిద్దరూ ఇంద్రునిపై పడ్డారు. ఇంద్రుని తపస్సు వల్ల వారిద్దరూ పవిత్రులై వారి దేహాన్ని 

విడిచిపెట్టి వారి వారి రూపాలను పొంది మోక్షమును అందుకొన్నారు కాంచీపురంలో 

ఉన్న బల్లులు. మానవశరీరం హస్తిగిరి, ఇంద్రియాలు ఇంద్రుడు, బల్లులు ఇడ, పింగళ 

నాడులు. ఇక్కడ విష్ణ్వారాధన చేస్తే కోటి పుణ్యములు లభిస్తాయి అన్నది ఆర్య వాక్కు.

మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి వధించి, వేదాలను కాపాడిన శ్రీమహావిష్ణువు... సప్త 

మోక్షపురాలలో ఒకటైన తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామిగా నీటి కొలనులో 

విశ్రమిస్తాడు. 

నాలుగు దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు. వివిధ అలంకారాల్లో అర్చనలు అందుకుంటాడు. మళ్ళీ 

జలగర్భంలోకి చేరుకుంటాడు. ఏ ఆలయంలోనూ కనిపించని ఈ విశేషానికి కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్‌ 

ఆలయం ప్రసిద్ది. 2019 లో దర్శనమిచ్చిన స్వామీ తిరిగీ 2059 లోనే దర్శనమిచ్చుట జరుగుతుంది.పురాణ 

కాలంలో ఛతుర్మఖ బ్రహ్మ దివ్వమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచేత అత్తి చెట్టు 

కాండంతో శ్రీవరదరాజ స్వామి(వరములను ఇచ్చేటి శ్రీ నారాయణుని)విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించినారు. 

అత్తిని తెలుగులో కూడా అత్తి అని లేక మేడి అని అంటారు. మేడి లో బ్రహ్మ మేడి అన్నది ఒక వృక్షవిశేషము.

తరుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చివేసి , దేవాలయ సంపదను దోపిడి చేస్తున్న సమయంలో 

శ్రీవారి మూర్తికి హాని కలుగకుండా ఉండేదుంకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం 

పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. PC:YOU TUBE శ్రీవారి మూర్తి 

విగ్రహంలోపలికి నీళ్ళు చేరని విధంగా జాగ్రత్తలు శ్రీవారి మూర్తి విగ్రహంలోపలికి నీళ్ళు చేరని విధంగా 

జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంతర కాలంలో పరిస్థితులు 

చక్కబడిన తర్వాత కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్వ మూర్తిని ప్రతిష్టించారు. అత్తి 

వరదరరాజ విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు.
ఇపుడు కంచి గరుడసేవను గూర్చి క్లుప్తముగా చెప్పుకొందాము.

108 దివ్యదేశాల్లో ఒకటైన కంచిలో  వరదరాజ పెరుమాళ్‌గా ఆ వైకుంఠనాథుడు భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో గరుడ విగ్రహం చాలా చాలా భారీగా ఉంటుంది.  ఇంతటి లోహపు విగ్రహము ఆ కాలములో ఇతర ప్రసిద్ధ విష్ణ్వాలయములలో ఉండేవి కాదు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                ఈ 

విగ్రహంపైనే వరదరాజస్వామి ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులు ఎప్పటికీ 

చిన్నవిగా ఉంటాయి. వీనిని సాధారణముగ పంచలోహాలతో తయారుచేస్తారు. ప్రతి సంవత్సరం 

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడ సేవకు సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ 

వాహనాన్ని ఉప్పు చింతపండుతో తోముటయే కాక ఇప్పటి బజారులో లభ్యమయ్యే కొన్ని మెరుగులు దిద్దే 

వస్తువులను కూడా వాడుతారు. ఇది నతో శ్రమతో కూడిన పని. ఈ పనికి, నాఅంచనా తప్పు కావచ్చు, 

దాదాపు 15, 20 మందిని పురమాయించుతారు. దాన్ని శుభ్రం చేసే క్రమంలో వారు ఎంతో అలసిపోతారు. 

‘ఈ గరుడ వాహనానికి మెరుగులు దిద్దుట అంతా ఊరేగింపుకే! ఇంత చేసి అలసిపోయిన ఆ పనివారు 

అనుకునేవారట “ఈయనేమన్నా వరాలు ఇస్తాడా ఏమన్నానా?, అదేదో స్వామి వారికి చేస్తే కోరికలూ 

తీరుతాయి, పుణ్యమూ దక్కుతుంది”.  ఆవిధముగా  “కంచి గరుడ సేవ”  అన్న జాతీయము 

రూపుదిద్దుకోనింది. ఎప్పుడైనా మనం చేసిన పనులు వృథా అయినప్పుడు ఈ గరుడ సేవతో పోలుస్తూ ‘ 

కంచి గరుడ సేవ’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.


మనదేశమును తన శక్తికి మించి దోచుకొన్న రాబర్ట్ క్లైవు, స్వామి దయ కోసమేమో, వజ్రాలహారాన్ని ఆయనకు చేయించినట్లు చెబుతారు.

2.కామాక్షీ దేవి: కంచి లో తల్లి లీలలు అనూహ్యములు అనంతములు. ఈమె విగ్రహములోని తీక్షణతను తగ్గించి శాంతింప జేసినవారు శంకరాచార్యులవారు. అమ్మవారి ఎదుట శ్రీ చక్రమును ప్రతిష్ఠించి పూజలు చేయ ,వారు నిర్దేశించినారు. వారిమాట నేటికి అమలు జరుగుచున్నది. అమ్మనుఆరాధించిన ఒక మూగకు మాటలు వచ్చుటే గాక ఆ మహానుభావుడు మూక పంచశతి తి అను మహాకావ్యము అమ్మవారి దయాపరాయణత్వమును గూర్చి వ్రాసి మూకకవిగా అమ్మవారి భక్తకోటి హృదయాలలో చెరగని ముద్ర తో నిలచిపోయినాడు. ఆ మహనీయుని పాదదోయికి శతసహస్ర వందనములు.

3. ఎకామ్ర నాధుడు : స్వామి స్వాయంభు లింగము. ఈ లింగము పంచ భూత లింగములలో మొదటిది. దీనిని పృథివీ లింగము అంటారు. జంబుకేశ్వరము (తిరువానిక్కావిల్) ఆపో లింగము. ఇక్కడ గర్భ గుడిలో దేవుని వద్ద ఎప్పుడూ తడిగానే వుంటుంది. అరుణాచలము తేజోలింగము. తమిళము లో తిరువణ్ణామలై అంటారు. కాళహస్తి వాయు లింగము. గర్భ గుడిలోని దీపము,గాలి వచ్చే అవకాశము లేకుండానే 

ఎప్పుడూ రెపరెపలాడుతూనే వుంటుంది. మిగిలింది ఆకాశ లింగం. స్వామి అమ్మవారితో 

ఒక తెరలోపల వుంటారు. ఈ తెరనే మాయ అంటారు. తెర తీస్తే అక్కడ చర్మ 

చక్షువులకేమీ కనిపించదు. 'ఆకాశం గగనం శూన్యం' అన్నది అందరికీ తెలిసిన 

విషయమే కదా. ఇదే  చిదంబర రహస్యము . ఇచ్చట నటరాజ విగ్రహము మనము 

చూడవచ్చు. ఆయన ఈ జగన్నాటక సూత్ర ధారి.

ఇక ఈ ఎకామ్రనాధ దేవాలయము 23 ఎకరముల విస్తీర్ణములో వుంది. ఫాల్గుణ మాస 

బహుళ పక్షంలో అంటే మార్చి చివర ఏప్రిల్ మొదటి వారములో 3 దినములు స్వామీ 

పాదాలమీద సూర్యకిరణములు పడతాయి.

ఇక్కడి ఆమ్ర వృక్షము దాదాపు 3500 సం.ల వయసు కలిగినదని చెబుతారు. అంత 

విస్తీర్ణములో ఇది ఒకటే మామిడి చెట్టు. దీని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఫలము మాత్రమె 

కాస్తుందని జనశ్రుతి . చెట్టును చూస్తూనే ఎన్నో వేల యేళ్ళదని మనకు ఇట్టే తెలిసి 

పోతుంది.

4. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారి కాలము క్రీ.పూ.509-477 అని 

నిర్ద్వంద్వముగా పండిత కోట వెంకటాచలం గారు నిరూపించినారు. ఆ విషయము 

వేరొకసారి ప్రస్తావించుతాను. ప్రస్తుతానికి క్రీ.శ.788–820 కాదని గ్రహించ గలిగిన 

చాలు. వారి కాల నిర్ణయమును గూర్చి వేరోకసారి ప్రస్తావించుతాను. వారి చేతనే 

స్థాపించబడి వారే మొదటి గురువై విలసిల్లిన గురు పీఠము కల్గిన పట్టణమిది. ఈ 

పీఠమును వారు 6 సం. మాత్రమే అలంకరించినారు.ఇక ఈ పీఠము నధిష్ఠించి నడిచే 

దేవునిగా కొనియాడబడిన చంద్ర శేఖర సరస్వతీ స్వామివారిని గూర్చినే నెక్కువగా చెప్ప 

నక్కర లేదు.

ఇప్పటికే చాలా వ్రాసినానేమో. పైన తెలిపిన విషయాలు నాల్గింటినీ కలిపి ఒక సీస 

పద్యము వ్రాసినాను. ఈ పద్యమును 'ముక్త పద గ్రస్త' ముతో అలంకరించినాను . ప్రీతితో 

చదువ ప్రార్థన .

వారించి మహిమచే వాంఛితాల వరద

వరదరాజులు బ్రోచు '' '' '' యనుచు

కామాక్షి కన్నులు కామకోటిని చేర్చు

కామకోటినిచేర్చు కడలి యడుగు

ఏకామ్రనాథుని ఎన్ని మదిన గొల్వ

కొల్వ వీలే లేని కోర్కెలడచు

కామకోటీ పీఠ కరుణా సుధా ధారి

దారి చూపు తనదు దరినిజేర

అన్న చెల్లి బావ ఆదిశంకర పీఠ

పీఠ మయ్యి కంచి పేరుగాంచ

కాంచ పుడమి తల్లి కటికి నయ్యెను కాంచి

కాంచి నిలుప భక్తి కలుగు ముక్తి

తమిళములో '' అంటే 'రా'అని, ఇక తెలుగులో ''అన్నా '' అన్నా 'రా' అనే. అంటే 

వరదరాజస్వామి భక్తులను రా రా రా అని పిలిచి కోర్కెలు తీర్చి మనల బ్రోచుటకు సిద్ధము 

గా వున్నాడు.

కోట్లకొలది వున్నా కామములను అంటే కోర్కెలను తీర్చి మనలను కామకోటికి అనగా మోక్షమునకు అనగా కామితార్థముల అంచుకు (కోటి) చేర్చుటకు కామాక్షి తల్లి సిద్దముగా వున్నది .(కోటి అంటే అంచు, కొస, కొన, అని అర్థము). కామమునకు అంచు మోక్షము. 

ఎందుకంటే చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షములు. మూడవదైన 

కామము పిదప వచ్చేది (అంటే కామమునకంచు ) మోక్షమే.

ఇక ఎకామ్ర నాథుని మనసారా కొలిస్తే అంటే స్వామిని సేవిస్తే కొలుచుటకు వీలేలేని కోర్కెలను అణచుతాడు.

కామ కోటి పీఠ కరుణా సుధా ధారి అంటే కంచి కామకోటి పీఠ అధిపతి అనగా 

చంద్రమౌళీశ్వరుడు, ఇంకొక విధంగా ఆలోచిస్తే నడచే దేవుడైన చంద్ర శేఖర సరస్వతి 

స్వాములవారు తన వద్దకు చేరేదారిని చూపుతాడని కూడా అనవయించుకొన వచ్చును.

కావున ఆవిధమైన అన్న (వరద రాజులవారు అంటే విష్ణువు) ఆయన చెల్లెలు కామాక్షీ 

దేవిఆమె భర్త యగుటవల్ల విష్ణువుకు బావయైన ఏకామ్రేశ్వరుడు, ఆ పైన చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖర సరస్వతీ సంయమీంద్రుల పీఠములకు పీఠమై పేరుగాంచిన కంచి భూమికి వఢ్యాణ్ణమై చేలగగా అట్టి కంచి ని గాంచి అంటే చూసి, (తిలకించి) భక్తి నిలిపిన ముక్తి కలుగును .

స్వస్తి.

Wednesday, 8 December 2021

ధర్మము

ధర్మము
https://cherukuramamohanrao.blogspot.com/2016/03/blog-post.html
ధర్మము అన్నది మన మతములో మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. దీనిని ఇంకే భాషలోనికీ  అనువదించుట సాధ్యము కాదు.

నిజానికి ధర్మము అన్న పదము ఒకటే అయినా దాని ప్రకృతి ఆపాదించిన వస్తువును బట్టి మారుతూ ఉంటుంది.

వేదము సనాతన ధర్మమును గూర్చి, వర్ణాశ్రమధర్మముములగూర్చి, రాజ ధర్మమును గూర్చి, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, ఈ విధముగా అనేకమయిన ధర్మములను గూర్చి మనకు తెలుపుతుంది. వీటన్నింటినీ కలిపి పురుషార్థములలో ధర్మము అన్న ఒక అంచులు తెలియని గొడుగు క్రింద ఉంచింది. నిజానికి, ధర్మ శాస్త్రమన్నది, ఇలా, అనేక సందర్భాలలో అనేక అర్థాలు సంతరించుకుంటుంది. శ్రీరామ శ్రీ కృష్ణులు ఆయా యుగ ధర్మమునకు  ఉదాహరణలు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’, శ్రీరాముడు సామాన్య జనులకు మూర్తీభవించిన ధర్మమే కాకుండా ఆచరణ, అనుసరణ యోగ్యము. ఆయన వాలిని చంపినా, తాటకను చంపినా, రావణుని చంపినా, శంబూకుని చంపినా, నిండు చూలాలైన సీతను అరణ్యవాసానికి పంపినా, సీతను అగ్నిప్రవేశము చేయమనినా,  అంతా ధర్మబద్ధమే! అది తెలుసుకొనే చేతగానితనముచే, ఆయన చేసిఅవి ధర్మబద్ధములు కాదు అంటే దాని మనకు ధర్మమంటే  ఏమిటో అవగాహనకు రాలేదనే!

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

 

ఎప్పుడు ధర్మ గ్లాని సంభవిస్తుందో అప్పుడు యుగయుగమున  అవతరిస్తానని కృష్ణపరమాత్మ చెబుతున్నాడు. మానవాకృతి రూపముననే కాక జలచర, ఉభయచర, భూచర, మానవ-మృగ రూపములను దాల్చి, పూర్ణావతారములగు  రామునిగా, కృష్ణునిగా ఇంకా అనేకానేక రూపములను దాల్చి ధర్మ సంస్థాపన చేసినవాడు పరమాత్మ. 
ధర్మ మంటే ఏమిటి? धरति लोकान् ध्रियते पुण्यात्मभिरिति वा లోకములో అన్నిటిచేత ధరింపబడేది ధర్మము. పుణ్యం, శ్రేయస్సు, సుకృతఉ - ధర్మానికి పర్యాయ పదాలని అమర కోశం చెబుతుంది. ఆచారము, స్వభావము, క్రతువు ధర్మమని ధర్మ శాస్త్రం చెబుతుంది. అహింస పరమ ధర్మమని ఉపనిషద్ వాక్యము. దీనినే జైన , బౌద్ధాలుకూడా స్వీకరించినాయి. దానము, ధర్మము చేయదగిన కర్మలని యోగ సారం చెబుతుంది.

प्राणायामस्तथा ध्यानं प्रत्याहारोऽथ धारणा

स्मरणञ्चैव योगेऽस्मिन् पञ्च धर्म्माः प्रकीर्त्तिताः ll

ధర్మ దేవత అన్నది యమునికి మరోపేరు. ధర్మ పత్ని ధర్మా చరణలో సహధర్మ చారిణి. ధర్మాధికారి అంటే న్యాయ మూర్తి. ధర్మాసనం - Seat of Justice, Bench 
1. Dharma varies from context to context from person to person, Yuga to Yuga. Dharma is not like a steel rod which is not flexible. Dharma is highly flexible. For example to kill somebody in some context may be Dharma. In the same way in another context to save somebody may be Dharma. Both are Dharma. ధర్మం సందర్భానుసారము మారుతుంది. (not a rigid rule) యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి మారుతుంది. ఒక సమయంలో చంపడం ధర్మం. ఒక సందర్భంలో రక్షించడం ధర్మము. 
2. Dharma is appropriateness in thought, action, attitude and judgment to a thing or a happening or a desire or an incident in life. ధర్మమంటే సందర్భోచితమైన ఆలోచన, క్రియ, దృక్పథం, నిర్ణయం, అది అప్పటి పరిస్థితి, సమయం, లక్ష్యం, మొదలైన వానిపై ఆధార పడుతుంది 
3. Unless Dharma is protected all around, we will not get the ideal atmosphere to live in. Unless we abide by Dharma, we cannot contribute to it. So, for the sake of the society or the country, we should live in Dharma and only when it is protected all around, it is possible. Unless Dharma is protected all around, we will not get the ideal atmosphere to live in. Unless we abide by Dharma, we cannot contribute to it. So, for the sake of the society or the country, we should live in Dharma and only when it is protected all around, it is possible. ధర్మ సంరక్షణ జరిగితేగాని మనం నివసించే వాతావరణము పరిశుభ్రముగా ఉండదు. మనము వ్యక్తిగతముగా ధర్మ మార్గంలో ఉంటే తప్ప మనము ధర్మ సంరక్షణకు తోడుపడలేము. సమాజ హితం, దేశహితంకోసము ప్రతివ్యక్తి ధర్మ మార్గంలో నడవాలి. 
4. Adharma must be totally avoided. Dharma is a positive direction. You may or may not be able to follow that path. Not indulging in Adharma is the primary responsibility for one and all. If Adharma is practiced it does not kill you alone. It is the poison in the air, water and kills anyone. 
అధర్మమును పూర్తిగా పరిహరించాలి. ధర్మాచరణ అనేది ఒక మార్గం, నడవ వలసిన ఒక దిశ. అధర్మ వర్తన ఆ వ్యక్తినే కాక చుట్టూ ఉన్న వాతావరణాన్ని, సమాజాన్ని కూడాదహిస్తుంది. 

అసలు మహాభారతము నందలి విదురనీతి లోని ఈ పద్యము సర్వకాల సర్వావస్థల యందును శిరౌధార్యము.
తిక్కన మహాభారతంలో ఉటంకించిన నీతి, ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రతిరోజూ కనిపించిన పద్యమిది.

ఒరులేయవి యొనరించిన

నరవర! యప్రియము తన మనంబునకగు తా

నొరలకవి సేయకునికియె

పరాయణము పరమధర్మపథముల కెల్లన్.
The English quotes are from talks of Sadguru K. Sivananda Murty garu