కొనకుండా నవ్వుకొనండి
కొనకుండా నవ్వుకొనండి -- 1
బాల భీముడు
పప్పు పచ్చడి బహురుచి పటిమతోడ
ఆకు విలసిల్ల కూరల అప్పడముల
మనసు చూపుల నొకటిగా మసలజేసి
బాలభీముడు లంఘించె పరవశమున

కొనకుండా నవ్వుకొనండి -- 2
కొన్ని దశాబ్దాల క్రితం రెండు హిందీ సినిమాలు ఈ క్రింది పేర్లతో వచ్చియుండినవి.
1.సావన్ కో ఆనేదో 2. ఆయా సావన్ ఝూం కె . సావన్ అంటే శ్రావణమాసమని మీకు తెలిసే వుంటుంది .
అంటే 1. శ్రావణ మాసము రానీ 2.శ్రావణము ఊపుతో వచ్చింది అని మనము తెలుగులో అర్థము చేసుకోవచ్చు.
ఒక ఆటోకు వెనకల 'సావన్ కో ఆనేదో' వ్రాయబడి వుండినది. ఆటో వెనకాల ఒక లారీ అమిత వేగంగా వచ్చి దానిని బలంగా గుద్దినది. ఆ లారీ ముందు వైపు చూస్తే 'ఆయా సావన్ ఝూం కె' అని వుండినది.
అంతే.
కొనకుండా నవ్వుకొనండి -- 3
ఒకసారి హిందూ మహా సాగరములో పడవషికారుకు రాహుల్,కేజ్రేవాల్ ,మోదీ పొయినారు .
ఉన్నట్లుంది ఒక భూతము దర్శనమిచ్చింది వారికి . 'మీరు నన్నుదాటి పోలేరు నాషరతును అంగీకరించకుండా' అన్నది ఆ భూతం . వాళ్ళూ వేరే దారిలేక 'ఆ షరతు ఏమిటి'అని అడిగినారు . భూతము వెంటనే 'మీరీ సముద్రములోపడవేసిన యేవస్తువైనా నేను వెదకి తెస్తే మీకు దెబ్బలు పడుతాయి లేక నేను తేలేకపోతే అల్లా ఉద్దీన్ కు మల్లె మీరు నాయజమానులౌతారు' అన్నది చెప్పిన వెంటనే ఒక సూది సముద్రములోనికి వేసినాడు మన రాహులుడు . వెదకి తెచ్చింది భూతము . ఆ పై విషయము నేను చెప్పనవసరము లేదు. కేజ్రేవాలు తనతెలివిని ఉపయోగించి తన చెల్లు లోని సింకార్డును తీసి నీల్లపాలు చేసినాడు . భూతము అది కూడా తెచ్చుట జరిగింది . తరువాత విషయం సరేసరి . ఇక మోడీ వంతు వచ్చింది . ఒక తెల్లటి గుండ్రటి వస్తువు చూపి సముద్రము లోనికి విసరినాడు మోదీ. భూతము ఎంత వెదకినా దొరకలేదు . వెంటనే భూతము వంగి నమస్కరించి నీ బానిసను అనింది . అంటే పద డిల్లీకి పనిచాలా వుంది అన్నాడు మోదీ.
మిగిలిన యిద్దరికీ శారీరిక బాధకన్నా మానసిక బాధ బలమై ఏమి విసరినావని మోదీని అడిగినారు. అతను వెంటనే ఒక desprin tablet అన్నాడు .
కొనకుండా నవ్వుకొనండి -- 4
క్రికెటు బేటు పట్టి క్రీసున నిలబడి
నెల దంచుచుండె నెల యనగ
తనకు వచ్చు 'డక్కు' తిన క్రిముల నతండు
ఎరుచుందే నంటి తీరుబడిగ
కొనకుండా నవ్వుకొనండి -- 5
నా భార్యతో ప్రక్క ఇంటి ఆవిడ ఈ విధంగా అనింది. ఆమాటకు నేనిచ్చిన జవాబు చదవగలరు.
'నీ సెలక్ షనమ్మ నిజ మెపుడు బాగుండు
కొనకుండా నవ్వుకొనండి -- 6
కొంటె శిష్యుడు :'గురువు గారూ ప్రకృతి అంటే ఏమిటి వికృతి అంటే ఏమిటి.
గురువు : ' మీ అమ్మ ప్రక్రుతి,నీవు వికృతి ' కొనకుండా నవ్వుకొనండి -- 7
మేస్త్రీ : అదేమిటి నీవు మాత్రమె ఒక రాయి పట్టుకొని పోతున్నావు. మిగత వారిని చూడు.వాళ్ళంతా రెండు రాళ్ళను పట్టుకొని పోతున్నారు చూడు.
కూలి : వాళ్ళంతా బద్ధకస్తులండీ. పని ముగించి విశ్రమించవలె ననుకొంటున్నారు. నేను వారిలాగాక కాక నా పనిని నిలుపు నిదానం గా వలుపు వైనంగా అలుపు ఆయాసము లేకుండా చేయవలె ననుకొంటున్నాను.
కొనకుండా నవ్వుకొనండి -- 8
స్నేహితుల బిల్లు కూడా తానే చెల్లించ వలసి వస్తూవుందన్న బాధతో cash counter వద్దకు పొతే అక్కడ వినిపిస్తూ వున్నా పాట " ఇచ్చుటలో వున్నా హాయి వేరేచ్చతను లేనే లేదని ... నిజాము నాకు తెలిసింది "
కొనకుండా నవ్వుకొనండి -- 9
మార్కెటింగు బ్రాంచి మానేజరొక్కడు
కాలు లోన బెట్టు కష్టమరును
చెప్పుడేమి సేవ చేయుదు నేనన్న
సుస్సుకెళ్ళు దారి చూపమనెను
కొనకుండా నవ్వుకొనండి -- 10
రైల్వే గార్డు తో అతని స్నేహితుడు: ఎందుకండీ మీ ఆవిడ ఆకు పచ్చ లిప్ స్టిక్ పెట్టుకొంటుంది"
గార్డు : ఎరుపు చూస్తే నేనేపనీ చేయనుగా ?"
కొనకుండా నవ్వుకొనండి -- 11
శిష్యుడు : గురువుగారూ మీకన్నా వయసులో పెద్దవారు కూడా తలకు రంగు వేస్తారు మీరెందుకు వేయరు ?
గురువు : ఏ బస్సు రైలు ప్రయాణాలలో నేను సీటు లేక నిలబడి వుంటే అయ్యోపాపమని తలచి సీటిచ్చి మాట కలుపుతారని "
కొనకుండా నవ్వుకొనండి -- 12
"నేను అమెరికా ప్రెసిడెంటును కావాలనుకొంటున్నాను "
"నీకసలు బుద్ధుందా"
"ఏం బుద్ధున్నవాళ్ళు పనికిరారా"
కొనకుండా నవ్వుకొనండి -- 13
ఒక స్త్రీ ఒక పురుషుడు తమ తమ వాహనాలను, పెద్దగా సంచారములేని రోడ్డుపై, వ్యతిరేక దిశలో నడుపుకొంటూ వస్తున్నారు.అతడు చాలా rash గా వస్తున్నాడు. ఏమైందో ఏమో పెద్ద accident జరిగి పోయింది. రెండు కార్లు ఎందుకూ పనికిరాకుండా పోయినాయి. స్త్రీ వెంటనే స్పందించి " ఇంత accident జరిగినా కార్లకు తప్ప మనకేమీ హాని జరుగలే"దన్నది అతనితో. అందంగా వున్న యాఅతివ ఆమాట అంటూనే ఆలోచనే లేకుండా "అవునవును మనము చాలా అదృష్టవంతుల"మన్నాడు అతను. ఆమె వెంటనే "మీరెంతో సరళ హృదయులు" అని ప్రశంసించింది. అతను కూడా స్పందించి "మీకన్నానా" అన్నాడు. ఒక నిముసం మాట్లాడుకొన్న తరువాత ఆమె అతనితో " ఇంత accident జరిగినా చూడండి నాకిష్టమైన విస్కీ బాటిలు మాత్రం పగలలేదు. బహుశా అది కూడా మన సహవాసాన్ని కోరుకొంటూవుందేమో" అన్నది. అతను కూడా ఉత్సాహంగా "అవును" అని తల వూపినాడు. వెంటనే ఆమె "ఈ సందర్భాన్ని ఇక్కడే చిరస్మరణీయమ్ ఎందుకు చేసుకోకూడదు" అని అన్నది. అతనూ ఉత్సాహంతో "అవును' అన్నాడు . ఆమె మూత తీసి విస్కీ సీసా అతని చేతికిచ్చింది. అతను ఆనందంగా ముప్పాతిక సీసా ముగించి ఆమె చేతికిచ్చినాడు . ఆమె సీసాకు మూతపెట్టి తిరిగి అతని చేతికే ఇచ్చింది. "మీరు పుచ్చుకోరా" అన్నాడతడు.
ఆవిడ నింపాదిగా "నాకు వద్దు నేనిప్పుడు పోలీసులకోరకు wait చేస్తున్నాను"అన్నది.
మీకర్తమై పోయివుంటుంది, మరి ఆలస్యమెండు నవ్వండి
కొనకుండా నవ్వుకొనండి -- 14
కొనకుండా నవ్వుకొనండి -- 15
కొనకుండా నవ్వుకొనండి -- 16
కొనకుండా నవ్వుకొనండి -- 17
కొనకుండా నవ్వుకొనండి -- 18
కొనకుండా నవ్వుకొనండి -- 19
కొనకుండా నవ్వుకొనండి -- 20

అన్న
పడతి తోడ నంటి నేను
'అమ్మ తానూ నన్ను అందుకే మనువాడె'
అట్లు
కాక నైతినామె పతిని

No comments:
Post a Comment