Friday, 7 July 2017

వసుదేవ సుతం దేవం

వసుదేవ సుతం దేవం

వయసు వచ్చెనుగాని వలసినదౌ భక్తి
వచ్చు నమ్మకమేమో వడల దొడగె
సుఖసంపదలదాత చూపించు నినుజేరు
సులభమౌ  మార్గమ్ము సూక్ష్మముగను
దేవదేవా నాకు దిక్కు తోచగలేదు
దేహబాధల ముందు దీర్చుమయ్య
వద్దునాకొద్దయ్య వాసనా భరితమౌ
వపుషమానసములు వరదరాజ
                  సుగుణ సుమమాల సురపాల సుజనలోల
                  తండ్రివైజూపు కరుణను తంపుమీర
                  దేనికీనేను కొరగాను దేహినయ్యు
                  వందనములివె కావుమా వందలాది

ఈ సీసపద్యము నేను వ్రాసినది. దీనికి ఒక ప్రత్యేకత వుంది. క్రిందికి 1,3,5,7పాదములలోని మొదటి అక్షరములు 

మరియు  తదుపరి వచ్చు తేట గీతి లోని ప్రతి పాదము యొక్క మొదటి అక్షరములు తీసుకొంటే వసుదేవ సుతం 

దేవంఅన్న వాక్యముతయారవుతుంది. అదే పద్ధతిలోనే 2,4,6,8 పాదాలలోని మొదటి అక్షరములు మరియు 

తేటగీతిలోని యతిస్తానములోని అక్షరములు తీసుకొంటే కూడా అదే వాక్యము వస్తుంది. తేట గీతికి నాలుగు పాదములే 

కాబట్టి ఒకే విధమగు వాక్యము వచ్చుటకు యతి స్థానములోని అక్షరములు తీసుకొనుట జరిగినది. చదివిన పిదప మీకు 

నచ్చితే అభిప్రాయము తెలుపండి. 

No comments:

Post a Comment