పురుష ధర్మములు
పురుష ధర్మములను గమనించండి . మనకూ బాధ్యతలు వున్నాయని తెలుసుకొందాం .పాటించుదాం పదిమందికీ పంచుదాం.
పురుష ధర్మమును కూడా బోధించింది శాస్త్రము. ఎందుచేతో ఈ శ్లోకము జన బాహుళ్యానికి చేర లేదు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చేయుటలో యోగి వలె, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి
--> కరణేషు దక్షః
, కార్యనిర్వహణలో దక్షత అంటే నాయకత్వ లక్షణము, సమర్ధత కలిగి యుండవలెను.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె అందగాడై వుండాలి.
--> క్షమయా తు రామః.
ఓర్పులో రామునిలాగా ఉండాలి. క్షమ అన్న సంస్కృత పదమునకు అసలయిన అర్థము ఆంగ్లములో tolerance, తెలుగులో 'సహనము'. ఏదయినా తప్పు చేసి క్షమించండి అనింటే సహించండి అని అర్థము.
--> భోజ్యేషు తృప్తః
వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో, మంచి చెడ్డలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండి, పాలు పంచుకోవాలి.
ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా కొనియాడబడతాడు.

No comments:
Post a Comment